Steve Smith 32nd Test-Century Vs ENG 2nd Test Lord's Joins-Steve-Waugh - Sakshi
Sakshi News home page

#SteveSmith: టెస్టుల్లో 32వ సెంచరీ.. ఆస్ట్రేలియన్‌ దిగ్గజం సరసన 

Published Thu, Jun 29 2023 4:35 PM | Last Updated on Thu, Jun 29 2023 5:12 PM

Steve Smith 32nd Test-Century Vs ENG 2nd Test Lords Joins-Steve-Waugh  - Sakshi

ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ శతకంతో మెరిశాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో స్మిత్‌ 169 బంతుల్లో శతకం మార్క్‌ అందుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా తాను మాత్రం ఓపికతో ఆడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు ఉన్నాయి.

కాగా స్మిత్‌కు తన టెస్టు కెరీర్‌లో ఇది 32వ శతకం కావడం విశేషం. ఈ నేపథ్యంలో టెస్టుల్లో అత్యధిక సెంచరీల విషయంలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్‌ స్టీవ్‌ వాతో(32 టెస్టు సెంచరీలు) కలిసి సంయుక్తంగా ఉన్నాడు. ఈ జాబితాలో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ (51 సెంచరీలు) తొలి స్థానంలో ఉండగా.. జాక్‌ కలీస్‌(45 సెంచరీలు) రెండో స్థానంలో, రికీ పాంటింగ్‌(41 సెంచరీలు) మూడో స్థానంలో ఉన్నాడు.

ఆస్ట్రేలియా తరపున అత్యధిక టెస్టు సెంచరీలు బాదిన క్రికెటర్లలో స్మిత్‌.. స్టీవ్‌ వాతో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ప్రస్తుత తరంలో టెస్టుల్లో యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు స్మిత్‌వే కావడం విశేషం. ఈ క్రమంలో టెస్టుల్లో అత్యంత వేగంగా 32 సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా స్మిత్‌ చరిత్ర సృష్టించాడు.

తొలిరోజు ఆట ముగిసే సమయానికి 85 పరుగులతో ఆడుతున్న స్మిత్‌ సెంచరీకి చేరువగా వచ్చిన సమయంలో ఒత్తిడికి గురయ్యాడు. మరోవైపు ఆసీస్‌ కూడా వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో స్మిత్‌ సెంచరీ చేస్తాడా అన్న అనుమానం వచ్చింది. కానీ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ ఒక ఎండ్‌లో నిలబడి స్మిత్‌ సెంచరీ అయ్యేలా చూశాడు. ప్రస్తుతం ఏడు వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసిది. స్మిత్‌ 110 పరుగులు, పాట్‌ కమిన్స్‌ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.

చదవండి: సీన్‌ రివర్స్‌ అయినట్టుందే!.. ఇంగ్లండ్‌కు దిమ్మతిరిగే షాక్‌ 

హ్యాట్రిక్‌ సెంచరీ.. వరల్డ్‌కప్‌కు చేర్చడమే ధ్యేయంగా పెట్టుకున్నాడా!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement