
50 పరుగులతో పంజాబ్ చిత్తు
రాణించిన జైస్వాల్, ఆర్చర్
మూల్లన్‌పూర్: తొలి రెండు మ్యాచ్‌లలో చక్కటి ఆటతో విజయాలు సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్‌కు సొంత మైదానంలో ఆడిన మొదటి పోరులో ఓటమి ఎదురైంది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన రాజస్తాన్ రాయల్స్ 50 పరుగుల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (45 బంతుల్లో 67; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... రియాన్ పరాగ్ (25 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ సంజు సామ్సన్ (26 బంతుల్లో 38; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
జైస్వాల్, సామ్సన్ తొలి వికెట్‌కు 62 బంతుల్లోనే 89 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు. ఫెర్గూసన్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. నేహల్ వధేరా (41 బంతుల్లో 62; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ఆర్చర్ వేసిన తొలి ఓవర్లోనే 2 వికెట్లు సహా 43 పరుగులకే 4 వికెట్లు చేజార్చుకున్న పంజాబ్ ఆ తర్వాత కోలుకోలేకపోయింది. వధేరా, మ్యాక్స్‌వెల్ ఐదో వికెట్‌కు 52 బంతుల్లో 88 పరుగులు జత చేసి ఆశలు రేపినా... విజయానికి అది సరిపోలేదు.
స్కోరు వివరాలు
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) ఫెర్గూసన్ 67; సామ్సన్ (సి) అయ్యర్ (బి) ఫెర్గూసన్ 38; పరాగ్ (నాటౌట్) 43; నితీశ్ రాణా (సి) మ్యాక్స్‌వెల్ (బి) యాన్సెన్ 12; హెట్‌మైర్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) అర్ష దీప్ 20; జురేల్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 205. వికెట్ల పతనం: 1–89, 2–123, 3–138, 4–185. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–35–1, యాన్సెన్ 4–0–45–1, ఫెర్గూసన్ 4–0–37–2, మ్యాక్స్‌వెల్ 1–0–6–0, చహల్ 3–0–32–0, స్టొయినిస్ 4–0–48–0.

పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్షి (బి) ఆర్చర్ 0; ప్రభ్‌సిమ్రన్ (సి) హసరంగ (బి) కార్తికేయ 17; శ్రేయస్ అయ్యర్ (బి) ఆర్చర్ 10; స్టొయినిస్ (సి) అండ్ (బి) సందీప్ 1; వధేరా (సి) జురేల్ (బి) హసరంగ 62; మ్యాక్స్‌వెల్ (సి) జైస్వాల్ (బి) తీక్షణ 30; శశాంక్ సింగ్ (నాటౌట్) 10; సూర్యాంశ్ (సి) హెట్‌మైర్ (బి) సందీప్ 2; యాన్సెన్ (సి) హెట్‌మైర్ (బి) తీక్షణ 3; అర్ష దీప్ (సి) హసరంగ (బి) ఆర్చర్ 1; ఫెర్గూసన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–0, 2–11, 3–26, 4–43, 5–131, 6–131, 7–136, 8–145, 9–151. బౌలింగ్: ఆర్చర్ 4–0–25–3, యు«ద్‌వీర్ 2–0–20–0, సందీప్ శర్మ 4–0–21–2, తీక్షణ 4–0–26–2, కార్తికేయ 2–0–21–1, హసరంగ 4–0–36–1.