ఇంగ్లండ్ జట్టు బజ్‌బాల్ ఆటతీరుతో వరుసగా సిరీస్‌లు గెలిచిన సంగతి తెలిసిందే. స్టోక్స్ కెప్టెన్‌గా.. మెక్‌కల్లమ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంగ్లండ్ జట్టు 13 టెస్టుల్లో 11 విజయాలు సాధించింది. అన్నింటిలోనూ బజ్‌బాల్ ఆట దూకుడునే ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లను మట్టికరిపించి సిరీస్ విజయాలను సొంతం చేసుకుంది. ఇక యాషెస్ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు కూడా ఇంగ్లండ్ జట్టు తమ బజ్‌బాల్ దూకుడు కొనసాగుతుందని స్పష్టం చేసింది.
అందుకు తగ్గట్టుగానే ఆసీస్‌తో తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌ను ఒక్కరోజులోనే డిక్లేర్ చేసింది. అయితే ప్రతీసారి మనది కాదని తెలుసుకోని ఇంగ్లండ్ ప్రపంచ టెస్టు చాంపియన్ అయిన ఆస్ట్రేలియాకు తలవంచింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. అయితే ఇంగ్లండ్ బౌలర్లు ఐదోరోజు సూపర్‌గా బౌలింగ్ చేసినప్పటికి పాట్ కమిన్స్, నాథన్ లయోన్‌ల అద్బుత పోరాటం ఇంగ్లండ్‌కు విజయాన్ని దూరం చేసింది. కానీ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం బజ్‌బాల్ ఆటను సమర్థించుకున్నాడు. ఒక్క టెస్టులో ఓడిపోయినంత మాత్రానా బజ్‌బాల్‌ను పక్కనపెట్టేదే లేదని కుండబద్దలు కొట్టాడు.
సీన్ మొత్తం రివర్స్..
అయితే బుధవారం(జూన్ 28న) లార్డ్స్ వేదికగా మొదలైన రెండో టెస్టులో సీన్ మొత్తం రివర్స్ అయింది. బజ్‌బాల్ ఆటతో దూకుడు కనబరుస్తామనుకున్న ఇంగ్లండ్‌కు ఆసీస్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఎందుకంటే తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియా వేగంగా ఆడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఇలాగే ఆడుతామంటూ బజ్‌బాల్ ఆటను ఇంగ్లండ్‌కు చూపించింది.
డేవిడ్ వార్నర్, ట్రెవిస్ హెడ్‌లు వన్డే స్టైల్లో వేగంగా ఆడితే.. స్మిత్ ఎప్పటిలాగే తన నిలకడైన ఆటను ప్రదర్శిస్తూ 85 పరుగులతో నాటౌట్‌గా నిలిచి సెంచరీకి దగ్గరయ్యాడు. ఓవర్‌కు 4.08 రన్‌రేట్‌తో 83 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఒక దశలో వార్నర్-లబుషేన్, ట్రెవిస్ హెడ్- స్మిత్ జోడి ఓవర్‌కు ఐదు పరుగుల చొప్పున జోడించారు. నిజంగా ఇది ఇంగ్లండ్ ఇది ఊహించలేదు.
ఇక రెండోరోజు ఆటలో స్మిత్ సెంచరీ నుంచి డబుల్ సెంచరీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలెక్స్ క్యారీ, లాస్ట్ మ్యాచ్ హీరో పాట్ కమిన్స్ ఇంకా బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. తొలి సెషన్‌లో వీరిని ఎంత త్వరగా ఔట్ చేస్తే ఇంగ్లండ్‌కు అంత మంచిది. రెండు సెషన్ల పాటు ఆసీస్ బ్యాటింగ్ చేస్తే మాత్రం 500 స్కోరు దాటే అవకాశం ఉంది. అప్పుడు ఇంగ్లండ్‌కు కష్టాలు మొదలైనట్లే. బజ్‌బాల్‌తో ప్రత్యర్థికి చుక్కలు చూపిద్దామనుకున్న ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియానే ముచ్చెమటలు పట్టించేలా కనిపిస్తోంది.
చదవండి: రూట్ అరుదైన ఘనత.. యాషెస్ చరిత్రలో మూడో ఆటగాడిగా
భారత్ చేతిలో ఓడినా సరే.. మాకు అదే ముఖ్యం: పాక్ స్టార్ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment