Ex-India Star Shares Video Evidence-Calls Out English Cricket Hypocrisy - Sakshi
Sakshi News home page

'ఎదుటోళ్లను విమర్శించే ముందు మీ కపటత్వం తెలుసుకోండి'

Published Tue, Jul 4 2023 6:00 PM | Last Updated on Tue, Jul 4 2023 7:33 PM

Ex India Star Shares Video Evidence-Calls Out English Cricket Hypocrisy - Sakshi

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో బెయిర్‌ స్టో ఔటైన తీరు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆసీస్‌ జట్టు వ్యవహరించిన తీరుపై పలువురు మాజీలు సహా చాలా మంది విమర్శలు గుప్పించారు. ''ఆస్ట్రేలియా జట్టుది కపట బుద్ది అని.. గెలుపు కోసం ఎంతకైనా తెగిస్తారంటూ'' ఇంగ్లండ్‌ అభిమానులు ట్విటర్‌లో పేర్కొన్నారు. దీనిపై 'ద వెస్ట్ ఆస్ట్రేలియన్' అనే పత్రిక బెన్ స్టోక్స్ ఫోటోను మార్ఫింగ్‌ చేసి  'క్రైబేబీస్' అనే శీర్షికతో ఓ కథనాన్ని ప్రచురించింది. 

క్రీడాస్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించారంటూ ఆసీస్‌పై మండిపడుతున్నారు. కానీ ఆస్ట్రేలియా కంటే ముందే ఇంగ్లండ్‌ కపటత్వం అంటే ఏంటో చూపించిందని కొంతమంది ఆసీస్‌ అభిమానులు పాత వీడియోలను షేర్‌ చేశారు. 2022లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో ఇంగ్లండ్‌ చూపిన కపట బుద్ధిని బయటపెట్టింది. క్రీడాస్పూర్తికి ఉప్పుపాతరేశారు.

ఒక అభిమాని షేర్‌ చేసిన వీడియోలో అప్పటి ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ వేసిన బంతిని హెన్రీ నికోల్స్‌ స్ట్రెయిట్‌ షాట్‌ ఆడాడు. అయితే దురదృష్టవశాత్తూ బంతి నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న డారిల్‌ మిచెల్‌ బ్యాట్‌ను తాకి ఫీల్డర్‌ చేతుల్లోకి వెళ్లింది. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు అప్పీల్‌ చేయడంతో అంపైర్‌ ఔటిచ్చాడు. చేసేదేం లేక హెన్రీ నికోల్స్‌ నిరాశగా పెవిలియన్‌ చేరాడు. అయితే ఇక్కడ ఇంగ్లండ్‌ ఆటగాళ్లు అప్పీల్‌ను వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నప్పటికి వాళ్లు గెలవడానికే మొగ్గు చూపారు.

అభిమాని షేర్‌ చేసిన వీడియోపై ఆకాశ్‌ చోప్రా స్పందించాడు. ''క్రీడాస్పూర్తి అనే పదాన్ని భుజాలపై ఎత్తుకొని వాదిస్తున్న ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఈ వీడియోపై స్పందించండి. ఇప్పుడు ఆసీస్‌ చీటింగ్‌ చేసిందని అంటున్నారు.. న్యాయంగా మీరు ఆరోజు చేసింది కూడా చీటింగ్‌ కిందే వస్తుంది. మీ కపటత్వాన్ని చాటిచెప్పే పలు వీడియోలు ఇక్కడ ఉన్నాయి.అందులో ప్రస్తుత ఆటగాళ్లలో కొందరు భాగస్వాములుగా ఉన్నారు. ఇంగ్లీష్ క్రికెట్‌ కపటత్వం, అర్హత యొక్క భావం నా దృష్టిలో వేరే విషయం.'' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: #Chahal: 'మిస్టరీ గర్ల్‌'తో యజ్వేంద్ర చహల్‌.. ధనశ్రీ చూస్తే అంతే!

ధోనిని చూసి నేర్చుకోండి?.. ఆసీస్‌కు ఇంగ్లండ్‌ ఫ్యాన్స్‌ చురకలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement