hypocrisy
-
కాసింత కపటం
‘నిజాన్ని పోలిన అబద్ధమాడి డబ్బు సంపాదించాలి’ అంటాడు ‘కన్యాశుల్కం’లో రామప్ప పంతులు. అందుకు ‘నమ్మినచోట మోసం, నమ్మని చోట లౌక్యం’ ప్రదర్శించాలంటాడు. కన్యాశుల్కం మలికూర్పు 1909లో జరిగింది కనుక రచనాకాలం ఇదమిత్థంగా తెలియకపోయినా ఇందులోని పాత్రలన్నీ 1880– 1910 కాలం నాటివి. అంటే నాటి మనుషుల జీవనాన్ని తెలిపేవి. వారు పాటించిన విలువలు, తొక్కగల పాతాళాలు, చూపిన చిత్తవృత్తులు, చేసిన టక్కుటమారాలు, హీనత్వాలు, అల్పత్వాలు... ఇవి తెలియాలంటే కన్యాశుల్కానికి మించిన ఆనవాలు లేదు. వందేళ్ల కాలం తర్వాత కూడా గురజాడ, ఆయన రచించిన ‘కన్యాశుల్కం’ వర్తమాన విలువను కలిగి ఉండటానికి నాటకంలో గురజాడ ఎంచుకున్న సాంఘిక సమస్య గాంభీర్యం ఎంత మాత్రం కారణం కాదు. సాంఘిక సంస్కరణ కూడా కాదు. పసిపిల్లలను వృద్ధులకిచ్చి పెళ్లి చేయడం, వితంతువుల పెళ్ళిళ్లు నిరాకరించడం, వేశ్యావృత్తి ప్రబలంగా ఉండటం... వీటి నిరసనగా గురజాడ కన్యాశుల్కాన్ని రాసినా కేవలం ఈ కారణం చేతనైతే నాటకం అవసరం ఏ పదేళ్లకో తీరిపోయి కనుమరుగైపోయేది. కన్యాశుల్కం బతికి ఉన్నదీ... ఇక మీదటా బతికి ఉండేదీ... అది కేవలం మనుషుల నిజ ప్రవర్తనల విశ్వరూపం చూపడం వల్లే! అగ్నిహోత్రావధాన్లకు మెరకపొలం ఉంది. భార్య వెంకమ్మ పసుపూ కుంకాలతో తెచ్చిన పొలమూ ఉంది. ఇరుగింటి గోడ, పొరుగింటి గోడ తనదేనని దబాయించి కలుపుకుంటున్నాడు. పెద్ద కూతురు బుచ్చమ్మను పదిహేను వందలకు అమ్మి, ఆమె విధవగా మారగా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. బుచ్చమ్మ (చనిపోయిన) మొగుడి భూముల్లో వాటా కోసం దావా కూడా తెచ్చాడు. ఇన్ని ఉన్నా బంగారం లాంటి, పసిమొగ్గ వంటి చిన్నకూతురు సుబ్బిని పద్దెనిమిది వందలకు అమ్మడానికి సిద్ధమయ్యాడు– అరవై దాటిన, కాటికి కాళ్లుజాపుకున్న లుబ్ధావధాన్లకు! కొడుకు వెంకటేశం పెళ్లి జరగాలంటే చంటిదాన్ని అమ్మాల్సిందేనట. ఈ కాఠిన్యం, కపటత్వం ఎంత వెలపరం! ఇక కపటుల వరుస చూడండి. డబ్బుపై యావ తప్ప వేరే ఏ లిటిగేషన్ ఎరగని ముసలి లుబ్ధావధాన్లను పెళ్లికి ఎగదోసి, అతగాడు పిల్లకు పుస్తె గట్టి ఇంటికి తెచ్చుకుంటే గనక తన ఇలాకా చేసుకుందామని ఆరాటçపడుతుంటాడు ఉమనైజర్ రామప్పపంతులు. అప్పటికే అతడు లుబ్ధావధాన్ల పెద్ద కూతురు మీనాక్షిని లొంగదీసుకున్నాడు. మధురవాణిని ఉంచుకున్నాడు. చాలక అన్నెం పున్నెం ఎరగని పసిపిల్లను కబళించేందుకు లుబ్ధావధాన్ల హితం పలుకుతుంటాడు. గిరీశం ఇంతకన్నా దిగదుడుపు. స్త్రీలపై పడి బతుకుతాడు. పూటకూళ్లమ్మను ఉంచుకుని, ఆమె సరుకుల కోసం దాచుకున్న 20 రూపాయలను కాజేసి మధురవాణికిచ్చి ఆమెను ఉంచుకుంటాడు. సరైన పెద్దమనిషి దొరికితే ‘మధురవాణి లాంటి ఇరవై మందిని సపై్ల చేస్తానంటా’డు. బుచ్చమ్మ మీద కన్నేసి, విడో మేరేజీ పేరుతో ఆమెను నగానట్రాతో ఉడాయించుకు పోవాలని చూస్తాడు. గిరీశానికి ఇంగ్లిష్ వచ్చు. శ్రమ రాదు. చదువు ఉంది. నీతి లేదు. మేనకోడలైన సుబ్బిని కాపాడటానికి రంగంలో దిగిన కరటక శాస్త్రికి ఎన్ని సదుద్దేశాలున్నా అతడు మధురవాణికి పాత గిరాకీ. ‘ఎవరూ లభ్యం కాకపోతే నేను యాంటీ నాచే’ అంటాడు. ఇక ఆవు నైయ్యెనా ఇస్తాగానీ ఖూనీ కేసులో చిక్కుకున్న లుబ్ధావధాన్ల తరఫున సాక్ష్యం చెప్పననే పొలిశెట్టి, లేని దెయ్యాలను సీసాలో బంధించే గవరయ్య, హరిద్వార్‌లో మఠం కడతానని చిల్లర చందాలతో సాయంత్రాలు సారా కొట్లో గడిపే బైరాగి, కేసుంది అనగానే ఎంతొస్తది అనే కానిస్టేబు, చదవక తండ్రిని మోసం చేసే వెంకటేశం... కపటులు. మనుషులు బతకాలి. బతకడం ముఖ్యమే. అందుకై కాస్తో కూస్తో కపటత్వం అవసరం కావచ్చుగాని అందులోనే సోయి మరిచి కొట్టుకుపోవడమా? తెల్లారి లేస్తే కుత్సితాలు చేస్తూ, ఎదుటి వారి నెత్తిన చేయి పెడ్తూ, ఇతరుల కీడు కోరుతూ, బాగా గడుస్తూ ఉన్నా అత్యాశకొద్దీ విలువలు కాలరాస్తూ, పై అంతస్తుకు చేరేందుకు అయినవారిని కాలదంతూ, కేసులూ కోర్టులని తిరుగుతూ... ఆ కాలం మనుషులను తలుచుకుని గురజాడ– సౌజన్యారావు పంతులు రూపంలో కాసింత చింతిస్తూ ‘చెడ్డలో కూడా మంచి ఉండదా’ అంటాడు. ‘ఉన్నవారు వీరే. వీరిలో మంచి వెతికి సర్దుకుపోక తప్పదు’ అనే అర్థంలో! కాని నేటి రోజులు చూస్తుంటే ఆనాటి కపటులంతా మహానుభావులు అనిపించక మానదు. నేటి మనుషులకు కిందా మీదా పడి బతకడం రావడం లేదు. కపట జీవన సౌందర్యం తెలియడం లేదు. అసలు అంత ఓర్పు లేదు. చెడి బతికినా, బతికి చెడినా... బతకడం ముఖ్యం అనుకోవడం లేదు. చంపు లేదా చావు... అని క్షణాల్లో క్రూరత్వానికి తెగబడుతున్నారు. గురజాడ నేడు ‘కన్యాశుల్కం’ రాస్తే బుచ్చమ్మ, వెంకమ్మ కలిసి అగ్నిహోత్రావధాన్లకు విషం పెడతారు. లుబ్ధావధాన్ల పీక నొక్కి మీనాక్షి ఆస్తిపత్రాలతో పారిపోతుంది. చీటికి మాటికి తార్చి బతుకుతున్నాడని గిరీశం నిద్రలో ఉండగా మధురవాణి ఖూనీ చేస్తుంది. రామప్ప పంతులు ‘పోక్సో’ కింద అరెస్ట్ అవుతాడు. వెంకటేశం డ్రగ్స్ కేసులో పట్టుబడతాడు. దారుణం అనిపించవచ్చుగాని పేర్లను మారిస్తే ఇవాళ్టి వార్తలు ఇవే! ఆగస్టు – ‘కన్యాశుల్కం’ మొదటిసారి ప్రదర్శించిన మాసం. సినిమాగా రిలీజైన మాసం. మనుషులు పరిహాసం ఆడదగ్గ అల్పత్వాలతోనే జీవించాలని, ఈసడించుకునే స్థాయి కపటత్వంతోనే బతకాలని, భీతి కలిగించే రాక్షస మనస్తత్వాలకు ఎన్నటికీ చేరకూడదని కోరుకునేందుకు ఈ మాసం కంటే మించిన శుభతిథి ఏముంది – నెలాఖరైనా? -
'ఎదుటోళ్లను విమర్శించే ముందు మీ కపటత్వం తెలుసుకోండి'
యాషెస్ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బెయిర్ స్టో ఔటైన తీరు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆసీస్ జట్టు వ్యవహరించిన తీరుపై పలువురు మాజీలు సహా చాలా మంది విమర్శలు గుప్పించారు. ''ఆస్ట్రేలియా జట్టుది కపట బుద్ది అని.. గెలుపు కోసం ఎంతకైనా తెగిస్తారంటూ'' ఇంగ్లండ్ అభిమానులు ట్విటర్లో పేర్కొన్నారు. దీనిపై 'ద వెస్ట్ ఆస్ట్రేలియన్' అనే పత్రిక బెన్ స్టోక్స్ ఫోటోను మార్ఫింగ్ చేసి 'క్రైబేబీస్' అనే శీర్షికతో ఓ కథనాన్ని ప్రచురించింది. క్రీడాస్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించారంటూ ఆసీస్‌పై మండిపడుతున్నారు. కానీ ఆస్ట్రేలియా కంటే ముందే ఇంగ్లండ్ కపటత్వం అంటే ఏంటో చూపించిందని కొంతమంది ఆసీస్ అభిమానులు పాత వీడియోలను షేర్ చేశారు. 2022లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో ఇంగ్లండ్ చూపిన కపట బుద్ధిని బయటపెట్టింది. క్రీడాస్పూర్తికి ఉప్పుపాతరేశారు. ఒక అభిమాని షేర్ చేసిన వీడియోలో అప్పటి ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ వేసిన బంతిని హెన్రీ నికోల్స్ స్ట్రెయిట్ షాట్ ఆడాడు. అయితే దురదృష్టవశాత్తూ బంతి నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న డారిల్ మిచెల్ బ్యాట్‌ను తాకి ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో అంపైర్ ఔటిచ్చాడు. చేసేదేం లేక హెన్రీ నికోల్స్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అయితే ఇక్కడ ఇంగ్లండ్ ఆటగాళ్లు అప్పీల్‌ను వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నప్పటికి వాళ్లు గెలవడానికే మొగ్గు చూపారు. అభిమాని షేర్ చేసిన వీడియోపై ఆకాశ్ చోప్రా స్పందించాడు. ''క్రీడాస్పూర్తి అనే పదాన్ని భుజాలపై ఎత్తుకొని వాదిస్తున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు ఈ వీడియోపై స్పందించండి. ఇప్పుడు ఆసీస్ చీటింగ్ చేసిందని అంటున్నారు.. న్యాయంగా మీరు ఆరోజు చేసింది కూడా చీటింగ్ కిందే వస్తుంది. మీ కపటత్వాన్ని చాటిచెప్పే పలు వీడియోలు ఇక్కడ ఉన్నాయి.అందులో ప్రస్తుత ఆటగాళ్లలో కొందరు భాగస్వాములుగా ఉన్నారు. ఇంగ్లీష్ క్రికెట్ కపటత్వం, అర్హత యొక్క భావం నా దృష్టిలో వేరే విషయం.'' అని చెప్పుకొచ్చాడు. Ouch. You can even see the torchbearer of ‘The Spirit of the Game’ shrugging his shoulders instead of initiating the process to withdraw the appeal. After all, you wouldn’t want to be remembered for things like these 🤣🫣🤪 Also, there are multiple videos circulating calling out… https://t.co/yR8Nq2UeVd — Aakash Chopra (@cricketaakash) July 4, 2023 చదవండి: #Chahal: 'మిస్టరీ గర్ల్'తో యజ్వేంద్ర చహల్.. ధనశ్రీ చూస్తే అంతే! ధోనిని చూసి నేర్చుకోండి?.. ఆసీస్‌కు ఇంగ్లండ్ ఫ్యాన్స్ చురకలు -
గెస్ట్ ‘హౌస్’ బాబు.. కుప్పంపై చంద్రబాబు కపటప్రేమ
వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యే.. 1989 నుంచి 2024 వరకు.. అంటే దాదాపుగా 35ఏళ్ల పాటు ప్రజా ప్రతినిధిగా అవకాశం కల్పించిన ఊరు.. వాస్తవానికి సొంతూరు పొమ్మన్నా.. ఊరి కాని ఊరు ఆదరించింది. అలాంటి ఊరి కోసం ఎవరైనా ప్రాణం పెట్టేస్తారు. ఏమైనా చేసేస్తారు. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు.. చంద్రబాబునాయుడు.. అదే టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు.. ఆయన గురించి చెప్పేదేముంది.. ఆ పేరు ప్రస్తావన వస్తేనే పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచారని, వెన్నుపోటుకు పేటెంట్ హక్కని విపక్ష నేతల విమర్శలు ఎదుర్కొనే ఆయన ఇప్పుడు తనను మూడు దశాబ్దాలకుపైగా ఆదరించిన కుప్పం పట్ల కూడా అదే రీతిన వెన్నుపోటు పొడిచారనే చెప్పాలి. కుప్పానికి ఇన్నేళ్లలో నేను ఇది చేశాను.. అని చెప్పుకోవడమే తప్ప ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదంటే బాబు గారికి ఈ ప్రాంతం పట్ల.. ఇక్కడి ప్రజల పట్ల ఏ మేరకు ‘‘కృతజ్ఞత’’ ఉందో అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి పక్కనపెడితే కనీసం ఇన్నేళ్లలో అక్కడ సొంతిల్లు కూడా లేకుండానే నెట్టుకొచ్చిన వైనం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. (చదవండి: ఇజ్రాయెల్ ‘ఎగ’సాయం: బాబు ‘షో’కు.. నష్టాల సాగు) సాక్షి ప్రతినిధి, తిరుపతి: ముప్పై ఏళ్ల పాటు ఒకే నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధిగా గెలవడం.. ప్రజలు గెలిపించడం అంటే.. నిజంగా సామాన్యమైన విషయమేమీ కాదు. సగటు జీవితకాలంలో సగ భాగానికి పైగా ప్రజాప్రతినిధిగా అవకాశం కల్పించిన, ఆదరించిన ఆ ప్రాంతంపై ఎవరికైనా అనుబంధం ఏర్పడుతుంది. అక్కడే ఇల్లు కట్టుకుని ఆ ఊరితో విడదీయరాని బంధం పెనవేసుకుంటారు. కానీ చంద్రబాబు రూటే సపరేటు కదా.. తనను మూడు దశాబ్దాలకుపైగా ఆదరిస్తున్న కుప్పంలో బాబు కనీసం ఇప్పటివరకు సొంతిల్లు కూడా కట్టుకోలేకపోయారు. దేశంలోనే అత్యంత సంపన్న రాజకీయ నేతగా దశాబ్దాల కిందటే పేరు మార్మోగిన బాబుకి కుప్పంలో చిన్నపాటి ఇల్లు కొనుగోలు చేయడం, లేదా నిర్మించుకోవడం అంటే వెంట్రుకవాసి పని. అసలు ఇంటి వ్యవహారం ఆయన కూడా దగ్గరుండి చూసుకోవాల్సిన పనిలేదు. బాబు ఆదేశిస్తే చాలు.. తెలుగుదేశం నాయకులే కాదు ఓ సామాన్య కార్యకర్త సైతం కుప్పంలో ఇల్లు చూసే పరిస్థితి ఉంది. కానీ బాబుకి ఈ ప్రాంతం మీద ఇక్కడి ప్రజల మీద కనీస ప్రేమాభిమానాలు లేవు. అందుకే ఈ ముప్పైరెండున్నరేళ్ళలో చుట్టపుచూపుగా ఆర్నెల్లకో ఏడాదికో వచ్చి.. ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్‌లో రెండు రోజులు ఉండి వెళ్ళిపోవడం మినహా సొంతిల్లు కూడా ఏర్పాటు చేసుకోలేకపోయారు. కేవలం ఇక్కడి ప్రజలను ఓటర్లుగా మాత్రమే బాబు పరిగణిస్తున్నారనే వాదనకు ఇన్నేళ్ళలో కనీసం ఇల్లు కాదు కదా.. క్యాంపు కార్యాలయం కూడా లేకపోవడమే ప్రబల నిదర్శనం. జిల్లాలోని ఇన్ని నియోజకవర్గాలు ఉండగా.. బాబు ఈ కుప్పం ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారో కూడా ఒక్కసారి పరిశీలిద్దాం. కుప్పం ఎందుకంటే.. 1978లో చంద్రగిరి నుంచి తొలిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అయిన బాబు 1983లో అదే నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. వెనువెంటనే టీడీపీలో చేరిన బాబు 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. 1989 ఎన్నికలు వచ్చేసరికి సురక్షిత నియోజకవర్గం వేటలో పడ్డారు. అప్పుడే ఆయన దృష్టి కుప్పంపై పడింది. ఈ ప్రాంతంలో సైకిల్ గుర్తు ప్రభావం టీడీపీ ఆవిర్భావం ముందు నుంచే ఉంది. 1983కి ముందే కుప్పం పంచాయతీ సమితి అధ్యక్షుడు డి.వెంకటేష్ సైకిల్ గుర్తుపై ఇండిపెండెంట్‌గా రెండుమార్లు గెలిచారు. ఇక టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983, 1985ల్లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి ఎన్.రంగస్వామి నాయుడు వరుసగా రెండుసార్లు కాంగ్రెస్ అభ్యర్థులపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే బాబు కుప్పంపై కన్నేశారు. (చదవండి: బాబు ఆస్థానం.. అవినీతి ప్రస్థానం: కుప్పంలో అడ్డగోలు దోపిడీ) రంగస్వామి నాయుడుకి వెన్నుపోటు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉండి.. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించాలనే ఊపు మీద ఉన్న రంగస్వామి నాయుడుకి చంద్రబాబునాయుడు రూపంలో ఊహించని షాక్ తగిలింది. అక్కడి ప్రజలకు సైకిల్ గుర్తు మీద ఉన్న సెంటిమెంట్, టీడీపీ మీద ఉన్న అభిమానం చూసి.. బాబు కుప్పంకు షిఫ్ట్ అయిపోయారు. దరిమిలా రంగస్వామి నాయుడుని తొక్కేసి.. చివరికి కన్నుమూసే వరకు రాజకీయ తెరపై లేకుండా చేసేశారు. ఇన్నేళ్లలో గంగమ్మ జాతర చూడని బాబు కుప్పం ప్రజల పట్లనే చిన్నచూపు ఉన్న చంద్రబాబుకి ఆ ప్రజల ఆరాధ్య దైవం గంగమ్మ తల్లి పైనా కనీస భక్తిభావం లేదు. నిర్లక్ష్యం.. లెక్కలేనితనం ఉందనేందుకు నిదర్శనం ఇంతవరకు ఆయన ఒక్కసారిగా కూడా గంగమ్మ జాతరకు రాకపోవడమే. కుప్పంలో కొలువైన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థానంకి మన రాష్ట్రం నుంచే కాకుండా పొరుగునే ఉన్న తమిళాడు, కర్ణాటకల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక ప్రతి ఏడాది మే మూడో మంగళవారం అత్యంత వైభవంగా.. ఘనంగా నిర్వహించే తిరుపతి గంగమ్మ జాతరకు లక్షలాదిమంది భక్తులు పోటెత్తుతారు. ఇంతటి విశేషమైన పర్వదినానికి ఇప్పటివరకు ఒక్కసారి కూడా చంద్రబాబు రాలేదంటే.. కుప్పం పట్ల, ఇక్కడి ప్రజల మనోభావాల పట్ల బాబుకు ఎంతటి గౌరవాభిమానం ఉందో అర్థమవుతోంది. పీఏకి ప్యాలెస్ ఉంది కానీ.. చంద్రబాబు పీఏ, ఓ రకంగా చెప్పాలంటే చాలాకాలంగా కుప్పం ‘అనధికార’ ఎమ్మెల్యే మనోహర్‌కి మాత్రం ఇక్కడ ప్యాలెస్ తరహా ఇల్లు ఉంది. సకలసౌకర్యాలతో అధునాతన ఇంటిని ఆయన నిర్మించుకున్నారు. కానీ బాబు బస మాత్రం ఎప్పుడొచ్చినా ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌసే కావడం గమనార్హం. లోకేష్ పెళ్లికి వస్తామన్నా పిలుపు లేదు.. ఈ ప్రాంతంపై నారా వారికున్న చిన్నచూపునకు ఇంత కంటే ఉదాహరణ అక్కరలేదు. లోకేష్, బ్రాహ్మణి వివాహానికి కుప్పం ప్రజల మాట అటుంచి కనీసం ఇక్కడి టీడీపీ నేతలకు కూడా ఆహ్వానాలు అందలేదు. దీంతో టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రెండు బస్సులు వేసుకుని పెళ్లికొస్తామని అడిగినా అటు నుంచి పక్కాగా అనుమతి గానీ ఆహ్వానం గానీ రాకపోవడంతో మిన్నకుండిపోయారు. అయినా సరే నొచ్చుకోని టీడీపీ నేతలు లోకేష్, బ్రాహ్మణిల జంటను కుప్పం తీసుకువచ్చి ఫంక్షన్ చేయాల్సిందిగా అభ్యర్థిచారు. కానీ బాబు ఆ అభ్యర్థనను అస్సలు పట్టించుకోలేదు. పెళ్లయిన కొత్తలో ఆ జంటను మామ గారి ఊరు కృష్ణాజిల్లా నిమ్మకూరుకు తీసుకువెళ్లి బ్యాండ్ బాజా మోగించిన చంద్రబాబు తనను ఇన్నేళ్లుగా గెలిపించిన కుప్పంలో మాత్రం అడుగుపెట్టనీయలేదు. ఈ ఒక్క ఉదాహరణ చాలు.. కుప్పంపై బాబు కపట ప్రేమకు! ఈ ప్రాంతంపై ఎంత చిన్నచూపంటే... కుటుంబసభ్యులు కూడా ఎప్పుడూ రాలేదు.. కేవలం తనను గెలిపించే నియోజకవర్గంగానే కుప్పంను బాబు చూస్తూ వచ్చారు.. సెంటిమెంట్ డైలాగులు వల్లె వేసి ఇక్కడి ప్రజలను ఏమార్చడం తప్పించి మరే ఇతర అనుబంధం కూడా ఈ ప్రాంతంతో పెట్టుకోలేదు. సంక్రాంతి పండుగలకు, పబ్బాలకు సొంతూరు నారావారిపల్లెకు వచ్చి సేద తీరే బాబు కుటుంబం ఆయనను ఇన్నేళ్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తున్న కుప్పంకు మాత్రం ఒక్కసారి కూడా రాలేదు. కుప్పంలోనే ఉన్న హెరిటేజ్ ఫ్యాక్టరీకి బాబు సతీమణి భువనేశ్వరి ఒకటి రెండుసార్లు ఎవరికీ తెలియకుండా గోప్యంగా వచ్చి వెళ్లిన దాఖలాలు ఉన్నాయి.. కానీ కుప్పం సందర్శన గానీ.. ఇక్కడి ప్రజలతో మాటామంతీ గానీ పొరపాటున కూడా లేవంటే ఈ ప్రాంతంపై వారికి నిజమైన అనుబంధం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. -
పేదలపై కాంగ్రెస్ కపట ప్రేమ!
భోపాల్: కాంగ్రెస్ గత ప్రభుత్వాలన్నీ పేదలపై కపట ప్రేమ చూపాయని, రోజుకు వందసార్లు పేదలంటూ పాట పాడడమే కానీ, వారికి చేసింది శూన్యమని ప్రధాని మోదీ తీవ్రంగా విమర్శించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన పీఎంజీకేఏవై లబ్దిదారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గత ప్రభుత్వాల కారణంగా వ్యవస్థ వక్రగతి పట్టిందని దుయ్యబట్టారు. తమ పాలనలో ప్రభుత్వ పనితీరు మారిందని, పలు పథకాల ప్రయోజనాలు నిజంగా లబ్ధిదారులకు చేరుతున్నాయని ఆయన చెప్పారు. నిరుద్యోగిత సమస్యను నివారించేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. ‘ప్రభుత్వ పనితీరులో మార్పు వల్ల ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయికి చేరుతున్నాయి. గత ప్రభుత్వాల హయంలో పాలన అపమార్గం పట్టింది. పేదలపై ప్రశ్నలు, జవాబులు వారే ఇచ్చుకునేవారు’అని ఆయన విమర్శించారు. పేదలపై కేవలం కపట సానుభూతిని మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాలు చూపాయని ఆరోపించారు. తమ ప్రభుత్వ చర్యలతో కరోనా సమయంలో దాదాపు 80 కోట్ల మంది భారతీయులకు ఉచిత రేషన్ సదుపాయం అందిందని, వీరిలో ఐదు కోట్ల మంది మధ్యప్రదేశ్‌కు చెందినవారిని మోదీ చెప్పారు. కరోనా మహమ్మారిలాంటి ప్రమాదాన్ని మానవాళి గత వందేళ్లలో చూడలేదని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. భారీ జనాభా ఉన్న భారత్‌లో కరోనా నియంత్రణ ఇతర దేశాలతో పోలిస్తే కష్టతరమైందన్నారు. నిరుద్యోగితను ఎదుర్కొంటాం దేశంలో కరోనా కారణంగా ఏర్పడిన నిరుద్యోగితను ఎదుర్కోవడంపై దృష్టి సారించామని ప్రధాని తెలిపారు. ఇందులో భాగంగా మౌలిక వసతులు, నిర్మాణ రంగాలపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నామని, వీటి కారణంగా పెద్ద సంఖ్యలో ఉపాధి లభిస్తుందని ఆయన వివరించారు. అదేవిధంగా చిన్నపరిశ్రమలకు సాయం అందిస్తున్నామని, రైతులకు ఊరటనిచ్చే చర్యలు చేపట్టామని తెలిపారు. వోకల్ ఫర్ లోకల్‌ను ప్రమోట్ చేసే క్రమంలో భారతీయులు స్వదేశీ కళాకృతులను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు. టోక్యో ఒలంపిక్స్‌లో పతకాలు సాధించిన పలువురు పేద కుటుంబాలకు చెందినవారని, వారంతా అద్భుత ప్రదర్శన చూపారని చెప్పారు. ఒకప్పుడు బీమారు రాష్ట్రాల్లో(దేశంలో అత్యంత అల్పాదాయం కలిగిన రాష్ట్రాలు)ఒకటిగా ఉన్న మధ్యప్రదేశ్ ఇటీవల కాలంలో మంచి పురోగతి సాధించిందని ప్రశంసించారు. -
నయవంచన వీడని ‘నారా’గణం
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ ప్రజాతీర్పు పొందిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీని కలిసి తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావలసిందిగా మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంలోనే ఏపీ ప్రజలు అత్యవసరంగా భావిస్తున్న ప్రత్యేక హోదాతోపాటు విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన తదితర హామీలు, కేంద్రం నెరవేర్చాల్సిన బాధ్యత ఆవశ్యకతపై దాదాపు గంట పాటు వివరించి, వినతిపత్రం కూడా అందచేశారు. తర్వాత ఢిల్లీలోనే జాతీయ మీడియాతో భేటీలో తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. ‘మన దురదృష్టం కొద్దీ కేంద్రంలో మనం కోరుకున్నట్లు ఎన్డీఏ 250 స్థానాలకు పరిమితం కాకుండా బీజేపీ కూటమికి 300 స్థానాలకు పైగా వచ్చాయి. మన అవసరం కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి లేదు. అయినా ఏపీకి ప్రత్యేక హోదా, తదితర హక్కుల సాధన కోసం మన కృషిని సాగిస్తాం. నేను మోదీజీని కలిసిన ప్రతిసారీ ఆ విషయమై ప్రస్తావిస్తూనే ఉంటాను’ అని జగన్ చెప్పారు. ఒక మార్క్సిస్టుగా నా దృష్టిలో దేశం విషయంలో ప్రస్తుత ప్రధాన వైరుధ్యం కేంద్రంలో బీజేపీ కూటమికి ప్రజలకు మధ్యనే! నావంటివారికి జగన్మోహన్రెడ్డి ఢిల్లీ జాతీయ మీడియా ముందు, ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే ‘మన దురదృష్టం కొద్దీ మోదీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ వచ్చింది’ అని చెప్పడం ఒక సాహసమే అనిపించింది. ఏపీ ప్రజల ప్రయోజనాల పట్ల మొహమాటపడకుండా తన నిబద్ధతను, కర్తవ్యాన్ని స్పష్టంగా చెప్పడం అవసరమనే భావించి, అలా చెప్పారనిపించింది! ఇంకేం! వెన్నుపోట్ల పార్టీ అయిన చంద్రబాబు టీడీపీ అనుకూల మీడియా చానల్ ఒకటి ‘ప్రత్యేక హోదాపై జగన్ చేతులెత్తేసినట్లేనా? మన ఖర్మ అనుకోవలసిందేనా?’ అనే రీతిలో చర్చపెట్టింది. ఇంకో చానల్ మోదీని ఢీకొనేది ఎవరు? అది జగనా, చంద్రబాబా అన్న రీతిలో వారిరువురి ఫొటోలతో మరో ప్రోగ్రాం నిర్వహించింది. ఎన్నికల్లో చంద్రబాబు పార్టీ అస్తిత్వమే ప్రశ్నార్థకం అవనున్నదన్న రీతిలో, తనకూ, తన పాలనకూ ప్రజలు కనీవినీ ఎరుగని ఘోరపరాజయం కట్టబెట్టారు. ఆ ఆత్మన్యూనతా భావన నుంచి ఇంకా బాబు తేరుకోలేదు. మీడియా ముందుకు వచ్చి రాజకీయ కామెంట్ స్పష్టంగా ఇంతవరకూ చెప్పిందీ లేదు. ఇక ఆయన మోదీని ఢీకొనే ప్రశ్న ఎక్కడిది? అయినా ఢీకొనగల శక్తి ఏమి మిగిలింది కనుక? ఆయన పార్టీకి లోక్‌సభలో వచ్చిన స్థానాలే ముచ్చటగా మూడంటే మూడే. అందులోనూ గుంటూరునుంచి ఎన్నికైనట్లు ఈసీ ప్రకటించిన గల్లా జయదేవ్ సీటు ఐదేళ్లూ పూర్తి కాకుండానే ఎన్నడైనా గల్లంతయ్యే అవకాశం ఉంది. ఆ పార్లమెంటరీ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు పదివేలు ఉండగా, వాటిని లెక్కించకుండానే అయిదువేల మెజారిటీతో జయదేవ్ జయించినట్లు చట్టవ్యతిరేకంగా ఆ నియోజకవర్గ ఎన్నికల అధికారి ఒకవైపు తాను వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రకటించారన్న అంశంపై రుజువులతోసహా అక్కడ పోటీచేసిన వైఎస్సా ర్సీపీ అభ్యర్థి కోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. విజయవాడ నుంచి చంద్రబాబు టీడీపీ తరపున వాస్తవంగా గెలిచిన కేశినేని నాని వంటి సాపేక్షికంగా అనుభవజ్ఞుడు ఉండగా ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్‌నే చంద్రబాబు ప్రకటించారు. సహజంగానే ధర్మాగ్రహంతోనే తాను అవమానానికి గురైనట్లుగా భావించిన కేశినేని ట్విట్టర్లో చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే చంద్రబాబు, పుండుమీద కారం చల్లినట్లు ఆ జయదేవ్‌నే కేశినేని వద్దకు రాయబారం పంపారు. అయినా కేశినేని లొంగలేదు. పైగా పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస బంధనాలు తప్ప అంటూ ట్వీట్ చేశారు. ఎవరిమీద పోరాటమో వేరే చెప్పాలా? ఇకపై ఆయన ఎలా వ్యవహరిస్తారో చూడాలి. ఇలాంటి స్థితిలో ఉన్న తన పార్టీ తరపున చంద్రబాబు మోదీని ఢీకొట్టడమా? ఆ ఛానల్ వారిది ఎంత కమ్మని కల? ఇలాంటి మీడియాలే జగన్‌కి, బీజేపీకి లోపాయికారీ ఒప్పందం ఉందని ప్రచారం చేశాయి. చేస్తున్నాయి. కనుకనే ఢిల్లీ పత్రికాగోష్టిలో అలా మెత్తగా మాట్లాడారట జగన్. మోదీతో సమరశీల పోరాటం చేస్తామని జగన్ చెప్పాలని అనుకుంటున్నాయి కాబోలు. నాలుగేళ్లు నిర్లజ్జగా మోదీతో సహజీవనం చేసిన చంద్రబాబు విషయం వారెత్తరు. అయినా తన ప్రమాణ స్వీకారోత్సవానికి రమ్మని మోదీని ఆహ్వానించేందుకు వెళ్లిన జగన్ పెళ్లికి వెళ్లి తద్దినం మంత్రాలు చదివినట్లు అప్పుడే శరభా శరభా దశ్సరభశరభా అంటూ బాలకృష్ణ వలే తొడగొట్టాలా? ఇలా కుంటి సవాళ్లు విసిరే చానళ్లకు కొంచమైనా ఇంగితజ్ఞానం ఉండాలి! ఇంతెందుకు, తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తూ చేసిన ప్రసంగంలో ఒక్కసారైనా ప్రశంసాపూర్వకంగా అన్న సంగతి అటుంచి, మామూలుగానైనా మోదీ ప్రస్తావనను జగన్ తెచ్చారా? పైగా వైఎస్ జగన్ ఆదినుంచి తన వైఎస్సార్సీపీని తెలుగు ప్రజల ప్రయోజనాలు, పురోగమనం, శ్రేయస్సు ఇవే ధ్యేయంగా దిశానిర్దేశన చేస్తూ వచ్చారు. జగన్ సర్వమత సమానత్వానికి చిహ్నంగా తన ప్రమాణ స్వీకరణ సందర్భంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దల ఆశీర్వాదం బహిరంగ వేదికపై స్వీకరించారు. ఒక సందర్భంలో తాను రోజూ బైబిల్ చదువుతాననీ చెప్పారు. కడపలో దర్గాకు వెళ్లారు. బీజేపీ వారు ఆనందించి, అభినందించే చర్యలేనా ఇవి? ముస్లిం మైనారిటీల పట్ల, దళితుల పట్ల, మహిళల పట్ల, వెనుకబడిన కులాలవారి పట్ల తనకున్న గౌరవాదరాభిమానాలు ప్రజలకు స్పష్టంగా తెలియాలనే వారిలో 5 గురికి ఉప ముఖ్యమంత్రి పదవులిచ్చారు. తన మంత్రి వర్గంలో సైతం వారికి దాదాపు 60 శాతం మేరకు అమాత్య పదవులనిచ్చి ఆదరించారు. భారతదేశ వైవిధ్యాన్ని వివిధ జాతుల సముదాయంగా అంగీకరించలేని ఆరెస్సెస్, బీజేపీ వారికి జగన్ పాటిస్తున్న సర్వమత సమభావం, సామాజిక న్యాయం, సౌమ్యత నచ్చుతాయా? ఒకవేళ, మన తెలుగు జాతి మన సంస్కృతి మన సాంప్రదాయాలను మన మాతృభాష తెలుగును రోడ్డురోలరుతో, అఖండభారత్ పేరిట చదును చేయాలని, మతతత్వ శక్తులు యత్నిస్తే, జగన్ మన జాతి ప్రజల తరపున పోరాడనని చెప్పాడా? పైగా ఈ మోదీ ప్రభుత్వంపైనే అవిశ్వాస తీర్మానం పెట్టిన చరిత్ర వైఎస్సార్ సీపీకి ఉంది. ఇలా కాకుండా తమ నేత బాబులానే మనపార్టీ విజయం నూటికి వెయ్యిసార్లు నిజమని ఉత్తర కుమార ప్రతినలు చేయాలా? ‘సామాజిక న్యాయం పాటించారు మంచిదే కానీ ఆయా మంత్రిత్వ శాఖలను నిర్వహించే అనుభవమూ, సామర్థ్యమూ వారికి ఉండాలి కదా’ అని వెన్నుపోట్ల పార్టీ విశ్లేషకులు కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అయ్యా, తమ నేత 40 ఏళ్ల అనుభవం, అంతకుతగ్గ సామర్థ్యం ఉందని తామంతా భజన చేసిన వారే కదా! ఆయనగారి నిర్వాకం వల్లే కదా.. గత 55 ఏళ్ల పాలనలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నడూ ఎరుగనంతటి అవి నీతిని, ఆశ్రితపక్షపాతాన్ని పాలక పార్టీ నేతల అహంకారాన్ని, నయవంచనను చవిచూసి అధోగతి పాలైంది. చివరకు అనుభవం, సామర్థ్యం అనే పదాలు వినగానే చంద్రబాబు ప్రగల్భాలు గుర్తుకొచ్చి జనాలు భయపడిపోతున్నారు! మరోవైపున అంబటి రాంబాబు, భూమన కరుణాకరరెడ్డి, రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి పార్టీ ముఖ్యులకు మంత్రిపదవులు దక్కనందుకు చాలా మథనపడుతూ ఒక చానల్లో వెన్నుపోట్ల పార్టీ నేత ఒకరు మహా ఆవేదన చెందుతున్నారు? వారు పదవులు ఆశించేవారే అయితే ఆ స్థాయికి ఎదిగేవారు కాదు. ఇప్పుడున్న మంత్రివర్గంలో 90 శాతం మందిని రెండున్నర సంవత్సరాల తర్వాత మార్చి, పార్టీని పటిష్టపరిచే పనికి పంపుతానని జగన్ చేసిన ప్రకటనను కూడా ఈ చానల్స్ వక్రీకరించి, 2024 ఎన్నికలలో అవసరాల రీత్యా పైన పేర్కొన్నటువంటివారిని అప్పటి మంత్రివర్గంలోకి జగన్ తీసుకుంటారని వ్యాఖ్యానిస్తున్నాయి. నిజానికి, మంత్రివర్గం ఎర్పర్చే సమయంలోనే తమకున్న పదివీకాలమెంతో చెప్పి పదవి అనేది గతంలోవలే వ్యక్తిగత అనుభవానికి కాదు, ప్రజలకు సేవ చేసి వారికి చేరువయ్యేందుకు మాత్రమేనని స్పష్టం చేసిన సీఎం వైఎస్ జగన్ తప్ప మరెవరైనా ఉన్నారా? అయినా అంబటి, భూమన, రోజా, ఆర్కే వంటివారి ప్రతిభ గురించి జగన్ కంటే ఈ చానల్స్‌కే ఎక్కువ తెలుసా? ఇలాంటి అసత్య ప్రచారాలతోటే మీడియా శివాజీ వంటి వృద్ధిలోకి రావలసిన సినీనటుడిని భ్రష్టుపట్టిం చింది. లగడపాటివంటి చంద్రబాబు నిగూఢ మిత్రులను గొప్ప మేధావులని పైకెత్తేసి ఆ క్రమంలో తమ అనుకూల పార్టీవారినే ముంచేశారు. ఇది ఏ స్థాయికి చేరిందంటే, చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రయి, మిగిలిన రాజధాని, పోలవరం, పారిశ్రామిక ప్రగతి కొనసాగించేందుకు తగిన సమర్థులు అని ప్రజలు డిసైడ్ అయిపోయారని చెప్పించే చెప్పి బాబునే మునగచెట్టు ఎక్కించేశారు. చివరకు ఆ మునగ కొమ్మ విరిగిపడిన ఫలితంగా ఆ పార్టీ కూసాలే కదిలిపోయాయి. అంతకుమించి చంద్రబాబు ఇంతవరకు జనాలకు ముఖం చూపించలేకపోతున్నారు. కమ్యూనిస్టులు వాస్తవాన్ని దాచేందుకు అంగీకరించని చందాన, సాక్షి పత్రిక తాను వైఎస్సార్ ఆశయసాధనకు కృషి చేస్తానని స్పష్టం చేస్తూ, ఆ దివంగత నేత ఫొటోను తొలిపేజీలోనే ముద్రిస్తూనే, ప్రాముఖ్యమైన ఇతర వార్తలనూ అందిస్తోంది. మిగతా చానళ్లు కూడా అలా స్పష్టం చేస్తే బాగుంటుంది కదా! ఒకప్పుడు ప్రజాశక్తి పత్రికపై సుత్తీకొడవలి గుర్తు ఉండేది. అందువల్ల పత్రిక సర్క్యులేషన్ తగ్గుతోందని తర్వాత ఆ గుర్తును తీసేశారు. కానీ వైఎస్సార్ ఫోటోతో ప్రచురితమయ్యే సాక్షికి ప్రజాదరణ తగ్గిందా? పైగా పెరిగింది కూడా! ఇలాంటి పైపై మార్పులపై పార్టీల, పత్రికల పాఠకుల సంఖ్య, ప్రతిష్ట ఉండదు. ప్రజల మనోభావాలకు దూరంగా, స్వీయమానసిక దృక్పథంతో వ్యవహరిస్తే, ఏ పార్టీ అయినా ఏ సంస్థ అయినా క్రమేపీ ప్రజలకు దూరమై కనుమరుగవుతుంది. మార్క్సిజాన్ని అన్వయించడం అప్పటి భౌతిక వాస్తవికతకు అనువుగా ఉండాలి. మార్క్స్ చెప్పిందీ అదే. మన రాష్ట్ర పరిస్థితిలో చంద్రబాబు నయవంచక పాలనను ఓడిం చడం.. అలాగే కేంద్రంలో జాతీయోన్మాద, మతతత్వ పార్టీ రాకుండా నిరోధించే యత్నం చేయడం.. ఇదే మార్క్సిస్టుల దిశగా ఉండాలి. ప్రజానుకూల, సామాజిక న్యాయసాధనా దిశగా పురోగమించే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. ప్రజల్లో ఎన్నో ఆశలు, తమ భవిష్యత్తు మెరుగ్గా ఉంటున్న భరోసా ఉంది. కావలసింది మన కమ్యూనిస్టులం ఐక్యమై ఆ భరోసా నిలబడేటట్లు, ఆ పురోగమనం దిశ మార్చుకోకుండా, తిరోగమనం చెందకుండా ప్రజలకు అన్నివేళలా, అండగా నిలబడటం! వర్గ దృష్టితోపాటు సామాజిక న్యాయాన్ని నిలబెట్టాలి. చివరగా మన ఏపీ ప్రజానీకానికి వారు చూపించిన చైతన్యానికి, వైఎస్ జగన్ రూపంలో వారు ప్రస్తుతం సాధించిన అద్భుత విజయానికి కృతజ్ఞతాభివందనలు. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్ : 98480 69720 -
నవనిర్మాణ దీక్ష ఓ వంచన
► రాష్ట్ర విభజనకు లేఖలిచ్చి ఇప్పుడు అశాస్త్రీయంగా విభజించారంటారా..? ► రెండేళ్ల పాలనలో అన్నింటా వైఫల్యం ► రాజధాని నిర్మాణం పేరుతో రూ.కోట్ల కుంభకోణం ► చంద్రబాబు సర్కారు పాలనపై ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల విజయనగరం మున్సిపాలిటీ : ఓట్లేసి గెలిపించిన ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం.. వారిని వంచించేందుకు నవ నిర్మాణ దీక్ష చేస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గురువారం ఆ పార్టీ జిల్లా కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార యంత్రాంగంతో పార్టీ నాయకులనే ప్రజలుగా చూపిస్త్తూ మొక్కుబడి దీక్షలు చేపడుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దీక్షలకు హాజరైన వారి సంఖ్య చూస్తే ఇదే విషయం తేటతెల్లం చేస్తోందని ధ్వజమెత్తారు. విభజన తరువాత అన్ని విధాలుగా నష్టపోయామంటూ ప్రతిజ్ఞ చేయిస్తున్న చంద్రబాబు.. ఏ ఆలోచనతో రాష్ట్ర విభజనకు అంగీకారం తెలుపుతూ లేఖలు ఇచ్చారో తెలియజెప్పాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల పాలనలో మంత్రులు, ఎమ్మెల్యే లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నా యకులు అభివృద్ధి చెందారే తప్పా ప్రజ లు కాదన్నారు. వ్యవసాయ రం గాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసుకు భయపడి కృష్ణా, గోదావరి జలాలపై హక్కులు కోల్పోవటం ద్వారా వ్యవసా యం మరింతగా కుంటుపడుతుందన్నారు. జూట్ పరిశ్రమలు మూతపడితే ఏం చేస్తున్నారు? జూట్, ఫెర్రో తదితర పరిశ్రమలు మూతపడతుండగా.. వాటిని తెరిపిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గానీ, జిల్లాకు చెందిన మంత్రులు గానీ కనీసం ప్రయత్నించకపోవడం దారుణమని కోలగట్ల అన్నారు. దీంతో ఆయా పరిశ్రమల్లో పని చేసే వేలాది కార్మికులు, వారిని నమ్ముకుని బతుకుతున్న లక్షలాది మంది కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు డబ్బులు ఎక్కడివి? రాజ్యాంగానికి విరుద్ధంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న చంద్రబాబుకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పాలని కోలగట్ల డిమాండ్ చేశారు. ప్రపంచం ఆశ్చర్యపోయేలా రాజధాని నిర్మిస్తామని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి.. అంతర్జాతీయ స్థాయిలో రూ.కోట్లాది కుంభకోణం చేస్తున్నారని ఆరోపించారు. పేదవాడికి ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి అధిక సంఖ్యలో లారీల ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ఘనత ఈ సర్కారుకే దక్కుతుందన్నారు. నిరుద్యోగులను సైతం నమ్మించి మోసం చేశారని ధ్వజమెత్తారు. బలం లేకున్నా రాజసభ్యకు మరో అభ్యర్థిని నిలబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న పాలనపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ విజయనగరం పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు, నాయకులు మామిడి అప్పలనాయుడు, బొద్దాన అప్పారావు, కెల్ల త్రినాథ్, సత్తిరాజు, సంగంరెడ్డి బంగారునాయుడు, అల్లు చాణక్య, భోగి రమణ, జీవీ రంగారావు, సత్తరపు శంకరరావు, మజ్జి త్రినాథ్, రెడ్డి గురుమూర్తి, మారోజు శ్రీను, బోడసింగి ఈశ్వరరావు, గాదం మురళి, గండ్రేటి సన్యాసిరావు, పూసర్ల అప్పారావు, ఇసరపు రామకృష్ణ, అనిల్, రెడ్డి వెంకటేష్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు. -
తారాస్వరం : ప్రేమకోసం ఏం చేసినా తప్పులేదు - నయనతార
ఆత్మవిశ్వాసం, నిజాయతీ ఉన్నవాళ్లకు త్వరగా దగ్గరవుతాను. అబద్ధాలాడేవాళ్లంటే అస్సలు ఇష్టముండదు. హిపోక్రసీకి దూరంగా పారిపోతాను. హీరోయిన్ అనగానే అందం గురించే మాట్లాడుతుంటారంతా. ఇంటర్వ్యూల్లో కూడా... మీ గ్లామర్ సీక్రెట్ ఏంటి అని తప్పక అడుగుతుంటారు. మిగిలినవాళ్ల సంగతేమో గానీ అందం కోసం అతిగా కష్టపడటం నావల్ల కాదు. ఆహారం దగ్గర్నుంచి వ్యాయామం వరకూ ఏదీ ప్రత్యేకంగా పాటించను నేను. కాకపోతే ఒంటికి చెడు చేసేవాటికి దూరంగా ఉంటాను... అంతే. నాకు భక్తి కాస్త ఎక్కువే. క్రమం తప్పకుండా చర్చికి వెళ్తాను. వీలు చిక్కినప్పుడల్లా హిందూ దేవాలయాలను కూడా సందర్శిస్తుంటాను. నమ్మకమే దేవుడు. అందుకే అందరు దేవుళ్లూ ఒకటే అనుకుంటాను! జీవితంలో ఊహించనివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఒకరితో బంధం ఏర్పడటం, అదే బంధం ఉన్నట్టుండి విచ్ఛిన్నమవడం కూడా అలానే జరుగుతాయి. ఏది జరిగినా దాని వెనుక బోలెడన్ని కారణాలు ఉంటాయి. అందుకే ఏది ఎలా జరిగినా స్వీకరించక తప్పదు. దానికి అనుగుణంగా ముందుకు సాగిపోకా తప్పదు. మనం ఎంతో కావాలనుకున్నవాళ్లు, జీవితాంతం మనతోనే ఉంటారని, ఉండాలని కోరుకున్నవాళ్లు దూరమైతే జీవితం ఒక్కసారిగా తలకిందులైపోతుంది. ఆ పరిస్థితికి ఎదురీదడం అంత తేలిక కాదు. కానీ ఎదురీదక తప్పదని నా అనుభవం నాకు నేర్పింది. నా వరకూ నేను ప్రేమకు చాలా విలువిస్తాను. ఆ మాటను ఎంతో గౌరవిస్తాను. ప్రేమ కోసం ఏం చేసినా, ఎంత చేసినా తప్పు లేదని భావిస్తాను. నిజాల కన్నా అబద్ధాలే ఎక్కువ వేగంగా అందరికీ చేరిపోతుంటాయి. నన్నే తీసుకోండి. నేనెప్పుడూ ఓపెన్‌గా ఉంటాను. మంచయినా చెడయినా ముఖమ్మీదే మాట్లాడేస్తాను. దాచిపెట్టాలని అస్సలు ప్రయత్నించను. అయినా నా గురించి ఏవేవో పుట్టిస్తారు, పత్రికల్లో రాసేస్తారు. నేనలాంటి వాటిని పట్టించుకోను. నమ్మేవాళ్లు కూడా అలాంటి వాటిని కాస్త ఆలోచించి నమ్మితే బాగుంటుంది. ఎందుకంటే, అందరూ నిజాలే రాయరు కదా! నాకు స్వతహాగానే ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇష్టం ఉండదు. అలాగని అస్సలు ఇవ్వనని కాదు. కాస్త తక్కువగా ఇస్తాను. ఎందుకంటే, వృత్తి వేరుగా వ్యక్తిగత జీవితం వేరుగా ఉండాలని ఆశపడతాను నేను. వృత్తిపరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలిసిపోతూనే ఉంటాయి. ఇక వ్యక్తిగత విషయాలను ఇంటర్వ్యూల ద్వారా అందరికీ చెప్పుకోవడం నాకంత నచ్చదు. అందుకే కొన్నిసార్లు వాటిని అవాయిడ్ చేస్తుంటాను. నేను తక్కువగా మాట్లాడతానని నాది యాటిట్యూడ్ ప్రాబ్లెమ్ అనుకుంటారు కొందరు. అది నిజం కాదు. నేను అందరితోనూ స్నేహంగానే ఉంటాను. కాకపోతే నా పరిధుల్లో నేను ఉంటాను. వీలైనంతవరకూ నా సమయాన్ని నేను గడుపుడుతుంటాను. సినిమాలు చూస్తాను. పుస్తకాలు చదువుతాను. సరదాగా ఫ్రెండ్స్‌తో చాట్ చేస్తుంటాను. కెరీర్ ప్రారంభించినప్పుడు కమర్షియల్ సినిమాల వైపే మొగ్గు చూపాను. నిలదొక్కుకోవాలంటే అవి చేయడం తప్పనిసరి. అందుకే అలాంటి చిత్రాలు, పాత్రలనే ఎంపిక చేసుకున్నాను. కానీ ఇప్పుడు నాకంటూ ఓ స్థానం ఏర్పడింది. ఓ ఇమేజ్ ఏర్పడింది. అందుకే మనసుకు నచ్చిన పాత్రల కోసం వెతుకుతున్నాను. నా కెరీర్లో ‘అనామిక’ ఓ ప్రత్యేకమైన సినిమాగా మిగిలిపోతుందని అనుకుంటున్నాను. ‘కహానీ’లో విద్యాబాలన్ అద్భుతంగా పోషించిన పాత్ర అది. దాన్ని చేసి మెప్పించడం అంత తేలిక కాదు. అందుకే నా శాయశక్తులా కృషి చేస్తున్నాను. విద్య నుంచి స్ఫూర్తి పొందానే తప్ప అనుకరించేందుకు ప్రయత్నించలేదు. నా శైలిలో నేను చేస్తున్నాను. కచ్చితంగా నూరుశాతం న్యాయం చేయగలనన్న నమ్మకం నాకుంది! నవంబర్ 18 నయనతార పుట్టినరోజు అసలు పేరు : డయానా కురియన్ ముద్దు పేరు : మణి జన్మస్థలం : తిరువల్ల, కేరళ చదువు : ఇంగ్లిష్ లిటరేచర్‌లో డిగ్రీ నచ్చే రంగు : నలుపు నచ్చే ఆహారం : నార్త్ ఇండియన్ నచ్చే హీరో : రజనీకాంత్