టీమిండియాతో ముగిసిన మూడో వన్డేలోనూ వెస్టిండీస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఏ దశలోనూ పోరాడలేకపోయింది. చివర్లో ఓడియన్ స్మిత్ కాసేపు మెరుపులు మెరిపించినప్పటికి అవి వినోదానికే పరిమితమయ్యాయి. టీమిండియా ఈ విజయంతో సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
ఇదిలా ఉండగా సిరీస్‌లో వైట్‌వాష్ అయిన వెస్టిండీస్ ఈ దశాబ్దంలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది. 2019-22 మధ్య కాలంలో విండీస్ విదేశాల్లో క్లీన్‌స్వీప్ కావడం ఇది 11వ సారి. ఇక 1999-20 మధ్య కాలంలో 9 సిరీస్‌ల్లో వైట్‌వాష్ అయిన విండీస్.. 2009-10 మధ్య కాలంలో 8 సిరీస్‌ల్లో వైట్‌వాష్ అయింది. ఇందులో విచిత్రమేంటంటే.. 2019-22 మధ్య కేవలం మూడేళ్ల కాలంలోనే.. 11 సిరీస్‌ల్లో వైట్‌వాష్ కావడం గమనార్హం. వారి ఆటతీరు ఎంత దారుణంగా ఉందనేది దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు.
ఇక మ్యాచ్‌లో 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 37.1 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ అయింది.వెస్టిండీస్ బ్యాటింగ్‌లో ఓడియన్ స్మిత్ 36 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ నికోలస్ పూరన్ 34, అల్జారీ జోసెఫ్ 29 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ , సిరాజ్, ప్రసిధ్ కృష్ణ తలా మూడు వికెట్లు తీయగా.. కుల్దీప్, దీపక్ చహర్ చెరో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు.అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. శ్రేయాస్ అయ్యర్ 80 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. రిషబ్ పంత్ 56 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక చివర్లో దీపక్ చహర్ 38, వాషింగ్టన్ సుందర్ 33 పరుగులు చేయడంతో టీమిండియా 250 ప్లస్ స్కోరు దాటింది.
Comments
Please login to add a commentAdd a comment