వెస్టిండీస్ పర్యటనలో టెస్టు, వన్డే సిరీస్‌లను ముగించుకున్న టీమిండియా ఇక టి20 సిరీస్‌పై దృష్టి పెట్టింది. రోహిత్, కోహ్లి సహా సీనియర్లకు విశ్రాంతి ఇవ్వడంతో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యువ జట్టు విండీస్‌తో తలపడనుంది. గురువారం ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో విండీస్, భారత్‌ల మధ్య తొలి టి20 మొదలైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది.
టెస్టు సిరీస్‌లో సెంచరీతో రాణించిన యశస్వి జైశ్వాల్‌కు తొలి టి20లో చోటు దక్కలేదు. దీంతో తొలి టి20లో ఓపెనర్లుగా గిల్, ఇషాన్ కిషన్ రానున్నారు. వన్‌డౌన్‌లో సంజూ శాంసన్, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలు మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు రానున్నారు. చివర్లో హార్దిక్ పాండ్యా , అక్షర్ పటేల్‌లు రానున్నారు. ఇక బౌలింగ్‌లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగింది. స్పిన్నర్లుగా చహల్, కుల్దీప్, అక్షర్ పటేల్‌లు ఉండగా.. ముకేశ్ కుమార్ టి20ల్లో అరంగేట్రం చేయనుండగా.. అర్ష్‌దీప్ సింగ్ ప్రధాన పేసర్‌గా ఉన్నాడు. ఇక నికోలస్ పూరన్, అల్జారీ జోసెఫ్‌ల రాకతో విండీస్ టి20 జట్టు బలంగా కనిపిస్తోంది.
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ (w), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్ (సి), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్
భారత్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment