India tour of West Indies, 2023 - West Indies vs India, 4th T20I:
టీమిండియాతో నాలుగో టీ20లో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్‌కు 3, కుల్దీప్ యాదవ్‌కు రెండు, అక్షర్ పటేల్, యజువేంద్ర చహల్, ముకేశ్ కుమార్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.
19.2: అర్ష్‌దీప్ మరోసారి
అర్ష్‌దీప్ బౌలింగ్‌లో హెట్మైర్ అవుట్. 61 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించిన హిట్టర్. విండీస్ స్కోరు 171/8 (19.3)
ఏడో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్
15.3: ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో బౌల్డ్ అయిన జేసన్ హోల్డర్. స్కోరు: 132-7
14.2: అక్షర్ పటేల్‌కు తొలి వికెట్
షెపర్డ్(9) రూపంలో వెస్టిండీస్ ఆరో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో షెపర్డ్ ఇచ్చిన క్యాచ్‌ను సంజూ ఒడిసిపట్టాడు. స్కోరు: 119/6 (14.3)
ఐదో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్
12.5: టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్ వెస్టిండీస్‌కు షాకిచ్చాడు. అర్ధ శతకం దిశగా వెళ్తున్న షాయీ హోప్[45(29)]ను పెవిలియన్‌కు పంపాడు. 109/5 (13.3)
12 ఓవర్లలో విండీస్ స్కోరు: 102/4
నిలకడగా ఆడుతున్న షాయీ హోప్(43), హెట్‌మెయిర్(22)
10 ఓవర్లలో వెస్టిండీస్ స్కోరు: 79/4
6.5: మళ్లీ దెబ్బేసిన కుల్దీప్
టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన ఖాతాలో రెండో వికెట్ జమచేసుకున్నాడు. ఏడో ఓవర్ మొదటి బంతికి పూరన్‌ను అవుట్ చేసిన ఈ స్టార్ స్పిన్నర్.. ఐదో బంతికి విండీస్ సారథి పావెల్(1)ను అవుట్ చేశాడు. స్కోరు: 57-4(7)
6.1: మూడో వికెట్ కోల్పోయిన విండీస్
కుల్దీప్ యాదవ్ వెస్టిండీస్‌కు భారీ షాకిచ్చాడు. బిగ్ హిట్టర్ నికోలస్ పూరన్(1)ను పెవిలియన్‌కు పంపాడు. విండీస్ స్కోరు: 55/3 (6.1)
5.4: విండీస్‌ను దెబ్బకొట్టిన అర్ష్‌దీప్
బ్రాండన్ కింగ్[18(16)] రూపంలో రెండో వికెట్ కోల్పోయిన వెస్టిండీస్.
5 ఓవర్లలో వెస్టిండీస్ స్కోరు: 48-1
1.4: తొలి వికెట్ కోల్పోయిన విండీస్
అర్ష్‌దీప్ బౌలింగ్‌లో మేయర్స్ [17(7)] అవుట్. కింగ్, షాయీ హోప్ క్రీజులో ఉన్నారు.
Arshdeep loves making these mini comebacks!#WIvIND #INDvWIAdFreeonFanCode pic.twitter.com/ksPeRQB4c2
— FanCode (@FanCode) August 12, 2023
టాస్ గెలిచిన వెస్టిండీస్
వెస్టిండీస్ మరో కీలక మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య శనివారం నాటి నాలుగో టీ20కి అమెరికాలోని ఫ్లోరిడా వేదికైంది. రీజినల్ పార్క్ స్టేడియంలో హార్దిక్ సేన.. రోవ్‌మన్ పావెల్ బృందంతో తలపడేందుకు సిద్ధమైంది. టాస్ గెలిచిన విండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్‌లో భారత్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగించగా.. వెస్టిండీస్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. కాగా ఫ్లోరిడా పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన 13 టి20 మ్యాచ్‌లలో 11 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టే గెలవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య విండీస్ ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నాలుగో టీ20లో విజయం సాధిస్తేనే భారత జట్టు సిరీస్ సాధించే దిశగా అడుగులు వేసే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకున్న టీమిండియా.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది.
తుది జట్లు
టీమిండియా:
యశస్వి జైశ్వాల్, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజూ శాంసన్( వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముకేష్ కుమార్.
వెస్టిండీస్
బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, షాయ్ హోప్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్(కెప్టెన్), షిమ్రన్ హెట్మైర్, జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, ఒడియన్ స్మిత్, అకీల్ హోసిన్, ఒబెడ్ మెకాయ్.
చదవండి: టీమిండియాతో మ్యాచ్.. మనకు ఎవరూ సపోర్ట్ చేయరు: షాదాబ్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment