
టీమిండియాతో జరుగుతున్న తొలి టి20లో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. రోవ్‌మెన్ పావెల్ 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. నికోలస్ పూరన్ 34 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఓపెనర్ బ్రాండన్ కింగ్ 19 బంతుల్లో 28 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో యజ్వేంద్ర చహల్, అర్ష్‌దీప్ సింగ్‌లు చెరో రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్‌లు చెరొక వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న విండీస్‌ను యజువేంద్ర చాహల్ దెబ్బకొట్టాడు. ఆదిలోనే కీలకమైన కైల్ మేయర్స్(1) బ్రాండన్ కింగ్(28)లను వెనక్కి పంపాడు. ఆ తర్వాత వచ్చిన జాన్సన్ చార్లెస్(3)ను కుల్దీప్ యాదవ్ బోల్తా కొట్టించాడు. కష్టాల్లో పడిన విండీస్‌ను కెప్టెన్ పావెల్, పూరన్ ఆదుకున్నారు. వీళ్లు వికెట్‌కు పరుగులు జోడించారు. దాంతో, ఆతిథ్య జట్టు పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది.
చదవండి: Tilak Varma: స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిసిన తిలక్ వర్మ
Comments
Please login to add a commentAdd a comment