
PC: ACB Media
అఫ్గనిస్తాన్ అద్భుత విజయం.. పాపం నెదర్లాండ్స్ వైట్‌వాష్.. 0-3 తేడాతో క్లీన్‌స్వీప్
Afg vs Ned ODI Series: నెదర్లాండ్స్‌తో జరిగిన మూడో వన్డేలో అఫ్గనిస్తాన్ అదరగొట్టింది. దోహా వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్‌లో 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపు ద్వారా సిరీస్ విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో వైట్‌వాష్ చేసింది. కాగా మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
బ్యాటర్లు రియాజ్ హుసాన్(50 పరుగులు), నజీబుల్లా(71 పరుగులు) అర్ధ సెంచరీలతో రాణించడంతో మంచి స్కోరు నమోదు చేయగలిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన నెదర్లాండ్స్‌కు ఓపెనర్లు స్కాట్ ఎడ్‌వర్డ్స్(54 పరుగులు), కొలిన్ ఆక్‌మన్(81) అద్భుత ఆరంభం అందించినా.. మిడిలార్డర్ మాత్రం ఘోరంగా విఫలమైంది.
వీరిద్దరు అవుట్ కాగానే.. వరుసగా 0, 3,8, 13,4,2,1,0,1 స్కోర్లకే బ్యాటర్లు పెవిలియన్ చేరడంతో అఫ్గనిస్తాన్ చేతిలో ఓటమి తప్పలేదు. ఇక అఫ్గన్ బ్యాటర్ నజీబుల్లాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా మొదటి వన్డేలో 36 పరుగులు, రెండో వన్డేలో 48 పరుగులతో గెలుపొందిన అఫ్గనిస్తాన్ మూడో వన్డేలో 75 పరుగుల తేడాతో విజయం సాధించి నెదర్లాండ్స్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.
Video: AfghanAtalan have always conveyed a message of love, spirit, and determination. Watch them celebrate their series win over the Netherlands. #AfghanAtalan | #AFGvNED pic.twitter.com/84f5U4xBD9
— Afghanistan Cricket Board (@ACBofficials) January 26, 2022