
ఇంగ్లండ్ జట్టు టెస్టుల్లో ఈ ఏడాది చెత్త రికార్డు నమోదు చేసింది. ఈ ఏడాది ఆడిన 28 ఇన్నింగ్స్‌ల్లో 13 సార్లు 200లోపూ ఆలౌట్ అయింది. ఇక తాజాగా యాషెస్ సిరీస్‌లో భాగంగా మూడో టెస్టులో డేవిడ్ మలాన్ డకౌట్ కావడం ద్వారా మరో చెత్త రికార్డు నమోదు చేసింది. ఇంగ్లండ్ తరపున టెస్టుల్లో ఈ ఏడాది గోల్డెన్ డక్ లేదా డకౌట్ అయిన 20వ ఆటగాడిగా నిలిచాడు. మలాన్ కంటే ముందు 19 మంది ఉంటే అందులో ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ సహా బెన్‌స్టోక్స్, ఇతర క్రికెటర్లు ఉన్నారు.
చదవండి: Pat Cummins: బంతులతో భయపెట్టాడు.. చివరికి డకౌట్ చేశాడు
ఇక మూడో టెస్టులో ఇంగ్లండ్ మరో ఓటమి దిశగా పయనిస్తోంది. ఆస్ట్రేలియాను 267 పరుగులకు ఆలౌట్ చేశామన్న ఆనందం ఎక్కువసేపు నిలవకుండానే పోయింది. 82 పరుగులు తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 31 పరుగులకే నాలుగో వికెట్లు కోల్పోయి రెండోరోజు ఆటను ముగించింది. ఇంకా 51 పరుగులు వెనుకబడి ఉన్న ఇంగ్లండ్ ఓటమినుంచి తప్పించుకోవడం కష్టమే.
చదవండి: James Anderson: అరె అండర్సన్.. పట్టి ఉంటే స్టన్నింగ్ క్యాచ్ అయ్యేది!