దంచికొట్టిన డేవిడ్‌ మలాన్‌.. దూసుకుపోతున్న ట్రెంట్‌ రాకెట్స్‌ | Dawid Malan Blitz Gives Trent Rockets Two Wins In Two Matches | Sakshi
Sakshi News home page

The Hundred League 2022: దంచికొట్టిన డేవిడ్‌ మలాన్‌.. దూసుకుపోతున్న ట్రెంట్‌ రాకెట్స్‌

Published Wed, Aug 10 2022 1:03 PM | Last Updated on Wed, Aug 10 2022 1:03 PM

Dawid Malan Blitz Gives Trent Rockets Two Wins In Two Matches - Sakshi

హండ్రెడ్‌ లీగ్‌ 2022లో ట్రెంట్‌ రాకెట్స్‌ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. తొలి మ్యాచ్‌లో బర్మింగ్‌హామ్‌ ఫీనిక్స్‌ను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించిన ఆ జట్టు.. నిన్న (ఆగస్ట్‌ 9) నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే తరహాలో రెచ్చిపోయి మరో ఘన విజయం నమోదు చేసింది. ఆ జట్టు ఓపెనర్‌ డేవిడ్‌ మలాన్‌ (49 బంతుల్లో 88 నాటౌట్‌; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి రాకెట్స్‌ ప్రత్యర్ధిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

డేనియల్‌ సామ్స్‌ (3/31), ఫ్లెచర్‌ (2/22), లూక్‌ వుడ్‌ (2/30) విజృంభించడంతో సూపర్‌ ఛార్జర్స్‌ నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన డేవిడ్‌ వీస్‌ 27 బంతుల్లో 5 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 50 పరుగులు చేసి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. ఛేదనలో ట్రెంట్‌ రాకెట్స్‌ మలాన్‌ సహా అలెక్స్‌ హేల్స్‌ (27 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో మరో 6 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ విజయంతో ట్రెంట్‌ రాకెట్స్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 
చదవండి: న్యూజిలాండ్‌ క్రికెట్‌కు భారీ షాక్‌.. వైదొలిగిన స్టార్‌ బౌలర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement