న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మైఖేల్‌ బ్రేస్‌వెల్‌కు జాక్‌పాట్‌ | Noor, Bracewell And Voll Secure Top Deals In The Hundred League 2025 Draft, Check All Team Squads Details | Sakshi
Sakshi News home page

Hundred League 2025: న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మైఖేల్‌ బ్రేస్‌వెల్‌కు జాక్‌పాట్‌

Published Thu, Mar 13 2025 9:08 AM | Last Updated on Thu, Mar 13 2025 9:33 AM

Noor, Bracewell Secure Top Deals In The Hundred Draft

నిన్న (మార్చి 12) జరిగిన హండ్రెడ్‌ లీగ్‌-2025 డ్రాఫ్ట్‌లో (వేలం) న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, ఆఫ్ఘనిస్తాన్‌ యువ స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ జాక్‌పాట్‌ కొట్టారు. ఈ ఇద్దరు ఊహించని ధర 2 లక్షల పౌండ్లకు (రూ. 2.26 కోట్లు) అమ్ముడుపోయారు. బ్రేస్‌వెల్‌ను గత సీజన్‌ రన్నరప్‌ సధరన్‌ బ్రేవ్‌ దక్కించుకోగా.. నూర్‌ అహ్మద్‌ను మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ సొంతం చేసుకుంది. బ్రేస్‌వెల్‌ త్వరలో స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 

ఈసారి డ్రాఫ్ట్‌లో బ్రేస్‌వెల్‌, నూర్‌ అహ్మద్‌తో పాటు మరో ఇద్దరు ఇంగ్లండ్‌ ఆటగాళ్లు కూడా 2 లక్షల పౌండ్లకు (రూ. 2.26 కోట్లు) అమ్ముడుపోయారు. ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్‌ను లండన్‌ స్పిరిట్‌.. మరో ఆల్‌రౌండర్‌ డేవిడ్‌ విల్లేను ట్రెంట్‌ రాకెట్స్‌ సొంతం చేసుకున్నాయి. నిన్నటి డ్రాఫ్ట్‌లో మరో మేజర్‌ సైనింగ్‌ ఆసీస్‌ వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ది. గతేడాది డ్రాఫ్ట్‌లో అమ్ముడుపోని వార్నర్‌ను ఈసారి లండన్‌ స్పిరిట్‌ 1.2 లక్షల పౌండ్లకు (రూ. 1.35 కోట్లు) సొంతం చేసుకుంది. 

న్యూజిలాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ హీరో రచిన్‌ రవీంద్రను మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ ఇదే ధరకు (1.2 లక్షల పౌండ్లు) దక్కించుకుంది. ఈసారి డ్రాఫ్ట్‌కు అందుబాటులో ఉండిన ఇంగ్లండ్‌ మాజీ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌కు చుక్కెదురైంది. ఆండర్సన్‌ను డ్రాఫ్ట్‌లో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. 

మహిళల డ్రాఫ్ట్‌ విషయానికొస్తే.. సోఫి డివైన్‌, జార్జియా వాల్‌, పెయిజ్‌ స్కోల్‌ఫీల్డ్‌ మంచి ధరలు దక్కించుకున్నారు. పురుషులు, మహిళల డ్రాఫ్ట్‌లో మొత్తం 66 మంది ప్లేయర్లు అమ్ముడుపోయారు. ఈ డ్రాఫ్ట్‌ తర్వాత కూడా ఫ్రాంచైజీలకు వైల్డ్‌కార్డ్‌ డ్రాఫ్ట్‌ ద్వారా ప్లేయర్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ద హండ్రెడ్‌ లీగ్‌-2025 (పురుషులు, మహిళలు) ఆగస్ట్‌ 5 నుంచి ప్రారంభం కానుంది. లార్డ్స్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో లండన్‌ స్పిరిట్‌, ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌ తలపడతాయి.

హండ్రెల్‌ లీగ్‌లో పాల్గొనే అన్ని ఫ్రాంచైజీల జట్లు..

బర్మింగ్హమ్ ఫీనిక్స్

పురుషుల విభాగం: లియామ్ లివింగ్‌స్టోన్, బెన్ డకెట్, ట్రెంట్ బౌల్ట్*, జాకబ్ బెథెల్, బెన్నీ హోవెల్, ఆడమ్ మిల్నే*, డాన్ మౌస్లీ, టిమ్ సౌథీ*, విల్ స్మీడ్, క్రిస్ వుడ్, అనేరిన్ డోనాల్డ్, జో క్లార్క్, హ్యారీ మూర్, టామ్ హెల్మ్.

మహిళలు: ఎల్లీస్ పెర్రీ*, అమీ జోన్స్, ఎమిలీ ఆర్లాట్, మేగాన్ షుట్*, హన్నా బేకర్, చారిస్ పావెలీ, స్టెర్ కాలిస్, ఐల్సా లిస్టర్, జార్జియా వాల్*, ఎమ్మా లాంబ్, జార్జీ బోయ్స్, మేరీ కెల్లీ, బెథాన్ ఎల్లిస్.

లండన్ స్పిరిట్

పురుషుల విభాగం: జామీ స్మిత్, లియామ్ డాసన్, డేనియల్ వొరాల్, కేన్ విలియమ్సన్*, రిచర్డ్ గ్లీసన్, ఓల్లీ స్టోన్, ఓల్లీ పోప్, కీటన్ జెన్నింగ్స్, జేమీ ఓవర్టన్, డేవిడ్ వార్నర్*, ల్యూక్ వుడ్, ఆష్టన్ టర్నర్*, జాఫర్ చోహన్, వేన్ మాడ్సెన్.

మహిళలు: గ్రేస్ హారిస్*, డేనియల్ గిబ్సన్, సారా గ్లెన్, చార్లీ డీన్, దీప్తి శర్మ*, జార్జియా రెడ్‌మైన్*, ఎవా గ్రే, కార్డెలియా గ్రిఫిత్, తారా నోరిస్, సోఫీ మున్రో, హీథర్ నైట్, ఇస్సీ వాంగ్, రెబెక్కా టైసన్.

మాంచెస్టర్ ఒరిజినల్స్

పురుషులు: జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, హెన్రిచ్ క్లాసెన్*, మాథ్యూ హర్స్ట్, స్కాట్ క్యూరీ, జోష్ టంగ్, టామ్ హార్ట్లీ, సోనీ బేకర్, టామ్ ఆస్పిన్‌వాల్, నూర్ అహ్మద్*, రాచిన్ రవీంద్ర*, లూయిస్ గ్రెగొరీ, బెన్ మెక్‌కిన్నీ, జార్జ్ గార్టన్.

మహిళలు: అమేలియా కెర్*, సోఫీ ఎక్లెస్టోన్, బెత్ మూనీ*, లారెన్ ఫైలర్, మహికా గౌర్, ఈవ్ జోన్స్, కాథరిన్ బ్రైస్, ఫై మోరిస్, డేనియల్ గ్రెగొరీ, డియాండ్రా డాటిన్*, సెరెన్ స్మాల్, ఎల్లా మెక్‌కాఘన్, ఆలిస్ మోనాఘన్.

నార్తర్న్ సూపర్‌చార్జర్స్

పురుషుల విభాగం: హ్యారీ బ్రూక్, ఆదిల్ రషీద్, డేవిడ్ మిల్లర్*, మిచెల్ సాంట్నర్*, బ్రైడాన్ కార్స్, మాథ్యూ పాట్స్, బెన్ డ్వార్షుయిస్*, గ్రాహం క్లార్క్, పాట్ బ్రౌన్, టామ్ లావెస్, జాక్ క్రాలే, డాన్ లారెన్స్, మైఖేల్ పెప్పర్, డేవిడ్ మలన్.

మహిళలు: ఫోబ్ లిచ్‌ఫీల్డ్*, అన్నాబెల్ సదర్లాండ్*, జార్జియా వేర్‌హామ్*, కేట్ క్రాస్, బెస్ హీత్, లిన్సే స్మిత్, హోలీ ఆర్మిటేజ్, ఆలిస్ డేవిడ్సన్-రిచర్డ్స్, గ్రేస్ బలింగర్, డేవినా పెర్రిన్, గ్రేస్ పాట్స్, లూసీ హిఘం, ఎల్లా క్లారిడ్జ్.

ఓవల్ ఇన్విన్సిబుల్స్

పురుషుల విభాగం: సామ్ కర్రాన్, విల్ జాక్స్, టామ్ కర్రాన్, జోర్డాన్ కాక్స్, రషీద్ ఖాన్*, సాకిబ్ మహమూద్, సామ్ బిల్లింగ్స్, గస్ అట్కిన్సన్, నాథన్ సౌటర్, డోనోవన్ ఫెర్రీరా*, తవాండా ముయేయ్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్*, మైల్స్ హామండ్.

మహిళలు: మారిజాన్ కాప్*, ఆలిస్ కాప్సే, లారెన్ విన్‌ఫీల్డ్-హిల్, అమాండా-జేడ్ వెల్లింగ్టన్*, మెగ్ లాన్నింగ్*, టాష్ ఫారెంట్, రైనా మెక్‌డోనాల్డ్-గే, సోఫియా స్మాల్, జో గార్డ్నర్, రాచెల్ స్లేటర్, పైజ్ స్కోల్‌ఫీల్డ్, ఫోబ్ ఫ్రాంక్లిన్, కలియా మూర్.

సదరన్ బ్రేవ్

పురుషులు: జేమ్స్ విన్స్, జోఫ్రా ఆర్చర్, టైమల్ మిల్స్, క్రిస్ జోర్డాన్, ఫాఫ్ డు ప్లెసిస్*, ల్యూస్ డు ప్లూయ్, క్రెయిగ్ ఓవర్టన్, లారీ ఎవాన్స్, ఫిన్ అల్లెన్*, డానీ బ్రిగ్స్, జేమ్స్ కోల్స్, మైఖేల్ బ్రేస్‌వెల్*, రీస్ టోప్లీ, జోర్డాన్ థాంప్సన్.

మహిళలు: లారా వోల్వార్డ్*, డానీ వ్యాట్-హాడ్జ్, మైయా బౌచియర్, లారెన్ బెల్, ఫ్రెయా కెంప్, జార్జియా ఆడమ్స్, టిల్లీ కోర్టీన్-కోల్‌మన్, రియానా సౌత్‌బై, సోఫీ డెవిన్*, క్లోయ్ ట్రయాన్*, మాడీ విలియర్స్, జోసీ గ్రోవ్స్, ఫోబ్ గ్రాహం.

ట్రెంట్ రాకెట్స్

పురుషుల విభాగం: జో రూట్, మార్కస్ స్టోయినిస్*, టామ్ బాంటన్, జాన్ టర్నర్, సామ్ కుక్, సామ్ హైన్, టామ్ అల్సోప్, కాల్విన్ హారిసన్, డేవిడ్ విల్లీ, లాకీ ఫెర్గూసన్*, మాక్స్ హోల్డెన్, జార్జ్ లిండే*, ఆడమ్ హోస్, రెహాన్ అహ్మద్.

మహిళలు: ఆష్ గార్డ్నర్*, నాట్ స్కైవర్-బ్రంట్, అలానా కింగ్*, హీథర్ గ్రాహం*, బ్రయోనీ స్మిత్, గ్రేస్ స్క్రీవెన్స్, కిర్స్టీ గోర్డాన్, అలెక్సా స్టోన్‌హౌస్, నటాషా వ్రైత్, కాసిడీ మెక్‌కార్తీ, జోడి గ్రూకాక్, ఎమ్మా జోన్స్, ఎల్లీ థ్రెల్‌కెల్డ్.

వెల్ష్ ఫైర్

పురుషుల విభాగం: క్రిస్ వోక్స్, స్టీవ్ స్మిత్*, జానీ బెయిర్‌స్టో, టామ్ కోహ్లర్-కాడ్మోర్, టామ్ అబెల్, ల్యూక్ వెల్స్, స్టీఫెన్ ఎస్కినాజీ, డేవిడ్ పేన్, పాల్ వాల్టర్, రిలే మెరెడిత్*, క్రిస్ గ్రీన్*, సైఫ్ జైబ్, జోష్ హల్, మాసన్ క్రేన్.

మహిళలు: హేలీ మాథ్యూస్*, టామీ బ్యూమాంట్, జెస్ జోనాసెన్*, షబ్నిమ్ ఇస్మాయిల్*, సారా బ్రైస్, జార్జియా ఎల్విస్, ఫ్రెయా డేవిస్, జార్జియా డేవిస్, ఎమిలీ విండ్సర్, బెత్ లాంగ్‌స్టన్, సోఫియా డంక్లీ, కేటీ జార్జ్, కేటీ లెవిక్.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement