
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 236 పరుగులకే పరిమితమైంది.
కివీస్ బౌలర్లలో స్పిన్నర్ మైఖల్ బ్రేస్‌వెల్ నాలుగు వికెట్లు పడగొట్టి బంగ్లా టాపర్డర్‌ను దెబ్బతీశాడు. బ్రేస్‌వెల్‌ను ఎదుర్కోలేక బంగ్లా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ కివీ స్టార్ స్పిన్నర్ తన 10 ఓవర్ల కోటాలో 26 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
అతడితో పాటు విలియమ్ ఓ రూర్క్ రెండు, హెన్రీ, జామీసన్ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హూస్సేన్ శాంటో(110 బంతుల్లో 9 ఫోర్లతో 77) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జాకర్ అలీ(45), రిషద్ హొస్సేన్(26) రాణించారు. కాగా ఈ మ్యాచ్‌లో కివీస్ విజయం సాధిస్తే సెమీస్‌కు ఆర్హత సాధిస్తుంది.
న్యూజిలాండ్‌తో పాటు భారత్ కూడా అధికారికంగా గ్రూపు-ఎ నుంచి సెమీస్ అడుగుపెడుతోంది. భారత్ ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్స్ టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో బంగ్లా ఓడిపోతే, పాకిస్తాన్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసిన పాకిస్తాన్.. తమ సెమీస్ ఆశలను బంగ్లాపైనే పెట్టుకుంది. అయితే కివీస్ ముందు స్వల్ప లక్ష్యం ఉండడంతో పాక్ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టేట్లే కన్పిస్తోంది.
చదవండి: అతడు ఫామ్‌లో లేడన్నారు.. కానీ మాకు చుక్కలు చూపించాడు: పాక్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment