
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో రావల్పిండి వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పోరాడుతోంది. 237 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు బంగ్లా బౌలర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బంగ్లా స్పీడ్ స్టార్ టాస్కిన్ అహ్మద్ తొలి ఓవర్‌లోనే తన జట్టుకు ఘనమైన ఆరంభాన్ని ఇచ్చాడు. టాస్కిన్ సంచలన బంతితో న్యూజిలాండ్ ఓపెనర్ విల్ యంగ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన టాస్కిన్.. ఆఖరి బంతిని యంగ్‌కు అద్బుతమైన లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని యంగ్ స్ట్రైట్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్-ప్యాడ్ గ్యాప్ మధ్య నుంచి దూసుకెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో యంగ్ ఒక్కసారిగా బిత్తరపోయాడు.
టాస్కిన్ దెబ్బకు కివీ ఓపెనర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ తర్వాత ఓవర్‌లోనే కేన్ విలియమ్సన్(5) సైతం ఔటయ్యాడు. అయితే రచిన్ రవీంద్ర(59) నిలకడగా ఆడుతుండడంతో కివీస్ 25 ఓవర్లకు ముగిసేసరికి 111 పరుగులు చేసింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 236 పరుగులకే పరిమితమైంది.
కివీస్ బౌలర్లలో స్పిన్నర్ మైఖల్ బ్రేస్‌వెల్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు విలియమ్ ఓ రూర్క్ రెండు, హెన్రీ, జామీసన్ తలా వికెట్ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హూస్సేన్ శాంటో(110 బంతుల్లో 9 ఫోర్లతో 77) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జాకర్ అలీ(45), రిషద్ హొస్సేన్(26) రాణించారు.
𝗧𝗔𝗦𝗞ed him! 🔥
A peach of a delivery by #TaskinAhmed sends Will Young packing on a duck! 👌#ChampionsTrophyOnJioStar 👉 #BANvNZ | LIVE NOW on Star Sports 2 & Sports 18-1
📺📱 Start Watching FREE on JioHotstar! pic.twitter.com/Jl6nwTn5rh— Star Sports (@StarSportsIndia) February 24, 2025
Comments
Please login to add a commentAdd a comment