New Zealand Vs Bangladesh
-
NZ vs BAN 3rd T20: బంగ్లాపై న్యూజిలాండ్ విజయం.. సిరీస్ సమం
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను విజయంతో న్యూజిలాండ్ ముగించింది. మౌంట్ మంగ్నూయ్ వేదికగా జరిగిన మూడో టీ20లో 17 పరుగుల తేడాతో(డీఎల్ఎస్) కివీస్ విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో న్యూజిలాండ్ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. కివీస్ బౌలర్ల దాటికి 110 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 4 వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించగా.. సౌథీ, మిల్నే, సీర్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో కివీస్ ఇన్నింగ్స్ 95/5(14.4 ఓవర్లు) వద్ద మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. అయితే వర్షం తగ్గే సూచనలు కన్పించకపోవడంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 17 పరుగుల అధిక్యంలో ఉన్న కివీస్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం విజేతగా నిర్ణయించారు. న్యూజిలాండ్ కూడా స్వల్ప లక్ష్య చేధనలో కాస్త తడబడింది. 38 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఫిన్ అలెన్(38), నీషమ్(28) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. బంగ్లా బౌలర్లలో మెహది హసన్, షోర్ఫుల్ ఇస్లాం తలా రెండు వికెట్లు సాధించారు. కాగా తొలి టీ20లో బంగ్లాదేశ్ విజయం సాధించగా.. రెండో టీ20 వర్షం కారణంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. చదవండి: #Saumy Pandey: ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ మాత్రం చెలరేగాడు! 6 వికెట్లతో -
NZ Vs Ban: ఆకస్మిక వర్షంలో తడిసిముద్దైన ఆటగాళ్లు.. మ్యాచ్ రద్దు
New Zealand vs Bangladesh, 2nd T20I: న్యూజిలాండ్- బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వరణుడు అడ్డుతగిలాడు. మౌంట్ మౌంగనీయ్లో ఇరు జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన రెండో టీ20 వర్షం కారణంగా రద్దైపోయింది. ఈ క్రమంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లా 1-0తో ఆధిక్యం నిలబెట్టుకోగలిగింది. కాగా నజ్ముల్ హొసేన్ షాంటో కెప్టెన్సీలో బంగ్లాదేశ్ జట్టు కివీస్ పర్యటనకు వెళ్లింది. ఈ యువ బ్యాటర్ సారథ్యంలో మూడు వన్డేల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో అనూహ్య విజయం సాధించింది. తద్వారా క్లీన్‌స్వీప్ గండాన్ని తప్పించుకోవడమే గాకుండా.. న్యూజిలాండ్ గడ్డ మీద తొలి వన్డే గెలుపు నమోదు చేసి చరిత్ర సృష్టించింది. తొలి టీ20 గెలుపు ఇక మూడో వన్డేలో ఆతిథ్య కివీస్‌ను ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసిన బంగ్లాదేశ్.. ఊహించని రీతిలో టీ20 సిరీస్‌ను విజయంతో ఆరంభించింది. నేపియర్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో శాంట్నర్ బృందంపై ఐదు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఇక కివీస్ గడ్డ మీద బంగ్లాదేశ్‌కు ఇదే తొలి టీ20 గెలుపు కూడా కావడం విశేషం. ఆకస్మిక వర్షం.. తడిసిపోయిన ఆటగాళ్లు ఈ క్రమంలో రెండో టీ20లోనూ సత్తా చాటాలని భావించిన నజ్ముల్ షాంటో బృందం.. అందుకు తగ్గట్లుగానే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేసర్ షోరిఫుల్ ఇస్లాం.. కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్(2)ను పెవిలియన్‌కు పంపి శుభారంభం అందించాడు. అయితే, 23 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టి ప్రమాదకరంగా మారుతున్న మరో ఓపెనర్ టిమ్ సిఫార్ట్ను తంజీం హసన్ సకీబ్ అవుట్ చేశాడు. వీరి స్థానాల్లో క్రీజులోకి వచ్చిన డారిల్ మిచెల్ 18(24 బంతుల్లో), గ్లెన్ ఫిలిప్స్ 9(14 బంతుల్లో) పరుగులతో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. And that's that! Unfortunately, the 2nd @BLACKCAPS v Bangladesh T20I at Bay Oval in Tauranga has been officially called off due to the rain 😢☔ Blackcaps v Bangladesh: 3rd T20I | Sunday from 12.30pm on TVNZ 1 and TVNZ+ pic.twitter.com/TsZoLLfRJm — TVNZ+ (@TVNZ) December 29, 2023 మ్యాచ్ రద్దు అయితే, 11 ఓవర్ల ఆట ముగిసే సరికి ఆకస్మికంగా వర్షం మొదలైంది. అప్పటికి న్యూజిలాండ్ స్కోరు: 72/2. ఇక మధ్యాహ్నం రెండున్నర గంటలు దాటినా తెరిపినివ్వలేదు. ఆ తర్వాత వర్షం మరింత ఎక్కువ కావడంతో న్యూజిలాండ్- బంగ్లాదేశ్ మధ్య రెండో టీ20ని రద్దు చేస్తున్నట్లు అంపైర్లు అధికారికంగా ప్రకటించారు. ఇక ఇరు జట్ల మధ్య డిసెంబరు 31 (ఆదివారం) నిర్ణయాత్మక మూడో టీ20 జరుగనుంది. ఇందులో గనుక బంగ్లాదేశ్ గెలిస్తే కివీస్ గడ్డపై మరో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం!! Heavy rain still falling at Bay Oval. The latest time play can begin again is 10:28pm #BANvNZ pic.twitter.com/w85rLJjE7F — BLACKCAPS (@BLACKCAPS) December 29, 2023 -
న్యూజిలాండ్‌లో బంగ్లాదేశ్ సంచలనాలు: మొన్న అలా.. ఇప్పుడిలా!
New Zealand vs Bangladesh, 1st T20I: న్యూజిలాండ్ గడ్డపై బంగ్లాదేశ్ వరుస విజయాలతో సత్తా చాటుతోంది. మూడో వన్డేలో కివీస్‌ను చిత్తు చేసి చరిత్ర సృష్టించి బంగ్లా... మొదటి టీ20లో సంచలన విజయం సాధించింది. తద్వారా న్యూజిలాండ్‌లో తొలి టీ20 గెలుపు నమోదు చేసి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రస్తుతం కివీస్ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య జట్టు ఆధిపత్యాన్ని 2-1కు తగ్గిస్తూ ఆఖరి మ్యాచ్‌లో ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. గెలుపు జోష్‌లో టీ20 సిరీస్‌ను మొదలుపెట్టిన బంగ్లా.. నేపియర్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. స్పిన్నర్ మెహదీ హసన్ రెండు, షోరిఫుల్ ఇస్లాం వరుస వికెట్లు తీసి.. కివీస్‌ను ఆరంభంలోనే దెబ్బకొట్టారు. టాపార్డర్‌ను కకావికలం చేశారు. వీరిద్దరి దెబ్బకు ఓపెనర్లు ఫిన్ అలెన్(1), సీఫర్ట్(0).. డారిల్ మిచెల్(14), గ్లెన్ ఫిలిప్స్(0) పూర్తిగా విఫలమై పెవిలియన్ చేరారు. మిగిలిన వాళ్లలో జిమ్మీ నీషం 48, కెప్టెన్ మిచెల్ శాంట్నర్ 23 పరుగులతో రాణించగా.. నిర్నీత 20 ఓవర్లలో కివీస్ జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ 42 పరుగులు(నాటౌట్), నాలుగో నంబర్ బ్యాటర్ సౌమ్య సర్కార్ 22 పరుగులతో మెరుగ్గా ఆడారు. వీరిద్దరి తోడు మెహదీ హసన్ 16 బంతుల్లో 19 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో 18.4 ఓవర్లలోనే టార్గెట్‌ను పూర్తి చేసింది బంగ్లాదేశ్. తద్వారా న్యూజిలాండ్ గడ్డ మీద పొట్టి ఫార్మాట్లో తొలి విజయాన్ని నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం రెండో టీ20 జరుగనుంది. చదవండి: #Virat kohli: విరాట్ కోహ్లికి ఘోర అవమానం! మండిపడుతున్న ఫ్యాన్స్ -
NZ vs Ban: బంగ్లా సంచలన విజయం.. న్యూజిలాండ్ గడ్డపై సరికొత్త చరిత్ర
New Zealand vs Bangladesh, 3rd ODI: న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు బంగ్లాదేశ్ గట్టి షాకిచ్చింది. మూడో వన్డేలో అనూహ్య రీతిలో ఘన విజయం సాధించింది. పటిష్ట కివీస్ జట్టును సొంతగడ్డపై 98 పరుగులకే ఆలౌట్ చేసి సత్తా చాటింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొంది క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకుంది. సిరీస్ కివీస్‌దే కాగా మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ మొదలైంది. తొలి మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించిన నేపథ్యంలో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. కివీస్ బంగ్లాను 44 పరుగుల తేడాతో ఓడించింది. ఇక రెండో వన్డేలోనూ ఏడు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడో వన్డేలోనూ జోరును కొనసాగిస్తూ వైట్‌వాష్ చేయాలని భావించిన న్యూజిలాండ్ ఆశలపై పర్యాటక బంగ్లా జట్టు నీళ్లు చల్లింది. నేపియర్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. చెలరేగిన బంగ్లాదేశ్ పేసర్లు అయితే, ఆరంభం నుంచే దూకుడు పెంచిన బంగ్లా బౌలర్లు న్యూజిలాండ్ బ్యాటర్లను తిప్పలు పెట్టారు. పేసర్లు షోరిఫుల్ ఇస్లాం మూడు, తాంజిం హసన్ సకీబ్ మూడు, సౌమ్యా సర్కార్ మూడు వికెట్లతో చెలరేగగా.. ముస్తాఫిజుర్ ఒక వికెట్ పడగొట్టాడు. బంగ్లా ఫాస్ట్‌బౌలర్ల ధాటికి కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఓపెనర్ విల్ యంగ్ 26 పరుగులతో కివీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మరో ఓపెనర్, వరల్డ్‌కప్ సెంచరీల వీరుడు రచిన్ రవీంద్ర ఎనిమిది పరుగులకే పరిమితం అయ్యాడు. ఇక కెప్టెన్ టామ్ లాథం 21 పరుగులతో పర్వాలేదనిపించగా.. మిగిలిన వాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు. దీంతో 31.4 ఓవర్లలో కేవలం 98 పరుగులు మాత్రమే చేసి న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. నజ్ముల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. న్యూజిలాండ్ గడ్డపై కొత్త చరిత్ర లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. బౌలింగ్‌తో ఆకట్టుకున్న బ్యాటర్ సౌమ్యా సర్కార్ 16 బంతులు ఎదుర్కొని 4 పరుగులు మాత్రమే చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ అనముల్ హక్ 37 పరుగులతో రాణించగా.. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ నజ్ముల్ షాంటో అజేయ అర్ధ శతకం బాదాడు. మొత్తంగా 42 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కాగా బంగ్లాదేశ్‌కు న్యూజిలాండ్ గడ్డమీద ఇదే తొలి వన్డే విజయం కావడం గమనార్హం. ఈ చారిత్రాత్మక విజయంతో బంగ్లా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. చదవండి: IPL 2024-Hardik Pandya: ముంబై ఇండియన్స్ అభిమానులకు బ్యాడ్‌న్యూస్!.. కెప్టెన్ దూరం! -
న్యూజిలాండ్‌కు బిగ్ షాక్.. జట్టు నుంచి తప్పుకున్న విలియమ్సన్
స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్, స్టార్ పేసర్ కైల్ జేమీసన్ బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని శుక్రవారం న్యూజిలాండ్ క్రికెట్ దృవీకరించింది. కాగా బంగ్లాతో టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ క్రికెట్ తొలుత ప్రకటించిన జట్టులో విలియమ్సన్, జేమీసన్ ఇద్దరూ ఉన్నారు. అయితే మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న విలియమ్సన్కు మరి కొన్ని రోజులు విశ్రాంతి అవరసమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే బంగ్లాతో సిరీస్ నుంచి కేన్ మామ తప్పుకున్నాడు. జేమీసన్ కూడా తన మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఇక విలియమ్సన్ స్ధానాన్ని యువ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్రతో న్యూజిలాండ్ క్రికెట్ భర్తీ చేసిది. అదే విధంగా జమీసన్ స్ధానంలో పేసర్ ఢఫీ జట్టులో వచ్చాడు. కాగా విలయమ్సన్ తప్పుకోవడంతో మిచెల్ శాంట్నర్‌కు జట్టు పగ్గాలను కివీస్ సెలక్టర్లు అప్పగించారు. డిసెంబర్ 27న నేపియర్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ టీ20 జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, జాకబ్ డఫీ, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి, టిమ్ సౌథీ -
బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్.. సిరీస్ సొంతం
నెల్సన్ వేదికగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం అందుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో కివీస్ సొంతం చేసుకుంది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి 46.2 ఓవర్లలో ఛేదించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో విల్ యంగ్(89), నికోల్స్(95) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బంగ్లా.. 49. 5 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో సౌమ్యా సర్కార్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో 151 బంతులు ఎదుర్కొన్న సర్కార్.. 22 ఫోర్లు, 2 సిక్స్‌లతో 169 పరుగులు చేశాడు. అతడి వన్డే కెరీర్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. అతడితో పాటు ముష్పికర్ రహీం(45) పరుగులతో రాణించాడు. ఇక కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, విలియం రోర్కే తలా మూడు వికెట్లు పడగొట్టాడు. వీరితో పాటు మిల్నే, క్లార్క్సన్, ఆశోక్ చెరో వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే డిసెంబర్ 23న నేపియర్ వేదికగా జరగనుంది. చదవండి: IPL Auction: విరాట్ కోహ్లికి రూ.42 కోట్లు.. టీమిండియా మాజీ ఓపెనర్ సంచలన వ్యాఖ్యలు -
చరిత్ర సృష్టించిన బంగ్లా ఓపెనర్.. సచిన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
నెల్సన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. గత రెండేళ్లుగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సర్కార్.. ఎట్టకేలకు తన బ్యాట్‌ను ఝుళిపించాడు. ఈ మ్యాచ్‌లో 151 బంతులు ఎదుర్కొన్న సర్కార్.. 22 ఫోర్లు, 2 సిక్స్‌లతో 169 పరుగులు చేశాడు. అతడి వన్డే కెరీర్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రెండో బంగ్లా క్రికెటర్‌గా సర్కార్ నిలిచాడు. ఈ జాబితాలో లిట్టన్ దాస్(176) అగ్రస్ధానంలో ఉన్నాడు. సచిన్ రికార్డు బ్రేక్.. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సర్కార్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆసియా క్రికెటర్‌గా సర్కార్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 2009లో క్రైస్ట్ చర్చ్ వేదికగా కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ 163 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అయితే తాజా మ్యాచ్‌తో సర్కార్ 14 ఏళ్ల మాస్టర్‌బ్లాస్టర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాపై 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో కివీస్ సొంతం చేసుకుంది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్లాక్‌క్యాప్స్ 3 వికెట్లు కోల్పోయి 46.2 ఓవర్లలో ఛేదించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో విల్ యంగ్(89), నికోల్స్(95) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన బంగ్లా.. 49. 5 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో సౌమ్యా సర్కార్(169) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, విలియం రోర్కే తలా మూడు వికెట్లు పడగొట్టాడు. వీరితో పాటు మిల్నే, క్లార్క్సన్, ఆశోక్ చెరో వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే డిసెంబర్ 23న నేపియర్ వేదికగా జరగనుంది. -
న్యూజిలాండ్ ఓపెనర్ విధ్వంసకర సెంచరీ.. బంగ్లాదేశ్ ఓటమి
బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. ఆదివారం డునెడిన్ వేదికగా బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో 44 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు వర్షం పదే పదే అంతరాయం కలిగించింది. తొలుత వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. బంగ్లా కెప్టెన్ షాంటో టాస్ గెలచి తొలుత న్యూజిలాండ్‌ను బ్యాటింగ్ ఆహ్హనించాడు. అయితే కివీస్ ఇన్నింగ్స్ 19 ఓవర్లలో మళ్లీ వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. దీంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్‌ను 30 ఓవర్లకు కుదించాడు. నిర్ణీత 30 ఓవర్లలో కివీస్ 7 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్ విల్ యంగ్(84 బంతుల్లో 105, 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ లాథమ్(92) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లా బౌలర్లలో షోర్ఫుల్ ఇస్లాం రెండు, మెహది హసన్ మిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. మిగితా నాలుగు వికెట్లు కూడా రనౌట్లే కావడం గమనార్హం. అనంతం డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం బంగ్లా టార్గెట్‌ను 30 ఓవర్లలో 245 పరుగులగా నిర్ణయించారు. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా బ్యాటర్లలో అనముల్ హక్(43) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బ్లాక్ క్యాప్స్ బౌలర్లలో సోధీ, మిల్నీ, క్లార్క్సన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. చదవండి: ENG vs WI: ఎస్ఆర్హెచ్ వదిలేసింది.. అక్కడ విధ్వంసం సృష్టించాడు! కేవలం 7 బంతుల్లోనే -
మీర్పుర్ పిచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఐసీసీ
మీర్పుర్ వేదికగా బంగ్లాదేశ్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఇటీవల ముగిసిన రెండో టెస్ట్ మ్యాచ్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆసక్తికర రూలింగ్ ఇచ్చింది. మీర్పుర్ పిచ్ (షేర్ ఏ బంగ్లా స్టేడియం, ఢాకా) అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌ల పిచ్ కాదని ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పిచ్ నాసిరకంగా తయారు చేయబడిందని, పిచ్‌పై బంతి అనూహ్యంగా బౌన్స్ అయ్యిందని, దీని వల్ల ఇరు జట్ల బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మ్యాచ్ రిఫరి డేవిడ్ బూన్ తన నివేదికలో పేర్కొన్నాడు. ప్రమాదకరమైన పిచ్‌ను తయారు చేసినందుకుగాను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు అక్షింతలు వేసిన ఐసీసీ.. మీర్పుర్ పిచ్‌కు ఓ డీమెరిట్ పాయింట్ కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని రిఫరి బూన్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా మీర్పుర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో పర్యాటక న్యూజిలాండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో న్యూజిలాండ్ 1-1తో సిరీస్‌ను సమం చేసుకుంది. బ్యాటర్లకు ఏమాత్రం సహకరించని మీర్పుర్ పిచ్‌పై కివీస్ బౌలర్లు ఒకింత లబ్ది పొందారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 172, రెండో ఇన్నింగ్స్‌లో 144 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప ఆధిక్యాన్ని (180 ఆలౌట్) పొంది, రెండో ఇన్నింగ్స్‌లో (139/6) అతి కష్టంమీద బంగ్లా నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. ఈ పిచ్‌పై బంతి అనూహ్యంగా బౌన్స్ అయినప్పటికీ స్పిన్నర్లకు అత్యధిక వికెట్లు లభించడం విశేషం. -
బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్ విజయం.. సిరీస్ సమం
మిర్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో కివీస్ సమం చేసింది. 137 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బ్లాక్ కాప్స్ విజయంలో గ్లెన్ ఫిలిప్స్(40 నాటౌట్), మిచెల్ శాంట్నర్(35) కీలక పాత్ర పోషించారు. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న వికెట్‌పై ఫిలిప్స్, శాంట్నర్ అద్బుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. బంగ్లా బౌలర్లలో మెహది హసన్ మిరాజ్ మూడు వికెట్లు పడగొట్టగా.. తైజుల్ ఇస్లాం రెండు, షోర్ఫుల్ ఇస్లాం ఒక వికెట్ సాధించారు. అంతకుముందు 38/2 ఓవర్ నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ 144 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆజాజ్ పటేల్ 6 వికెట్లతో బంగ్లాపతనాన్ని శాసించాడు. అతడితో పాటు శాంట్నర్ 3 వికెట్లు సాధించాడు. కాగా కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 37.1 ఓవర్లో 180 పరుగులకు ఆలౌటైంది. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో కూడా గ్లెన్ ఫిలిప్స్ 87 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
BAN vs NZ: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు.. గ్లెన్ ఫిలిప్స్ విరోచిత పోరాటం
ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై 88 పరుగులు చేసి జట్టును అదుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి. న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఫిలిప్స్ ప్రత్యర్ఢి బౌలర్లపై ఎదురుదాడికి దిగి.. తన జట్టుకు 180 పరుగులు గౌరవప్రదమైన స్కోర్‌ను అందించాడు. కాగా కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 37.1 ఓవర్లో 180 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బ్యాటర్లలో ఫిలిప్స్‌తో పాటు జామీసన్(20), మిచెల్(18) పరుగులతో రాణించారు. బంగ్లా బౌలర్లలో స్పిన్నర్లు తైజుల్ ఇస్లాం, మెహదీ హసన్ మిరాజ్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. నయీం హసన్, షోర్ఫుల్ ఇస్లాం చెరో రెండు వికెట్లు సాధించాడు. ఇక మూడో రోజు ఆటముగిసే సమయానికి బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. వెలుతురు లేమి కారణంగా మూడో రోజు కేవలం 32 ఓవర్ల ఆటమాత్రమే సాధ్యపడింది. ప్రస్తుతం క్రీజులో జకీర్ హసన్(16), మోమినుల్ హక్(0) ఉన్నారు. చదవండి: LLC 2023: గంభీర్‌తో గొడవ.. శ్రీశాంత్‌కు లీగల్ నోటీసులు -
BAN VS NZ 2nd Test: తొలి రోజు 15 వికెట్లు.. రెండో రోజు వర్షార్పణం
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మిర్పూర్లో జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు ఆటలో ఏకంగా 15 వికెట్లు నేలకూలగా, రెండో రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. గురువారం భారీ వర్షం వల్ల స్టేడియం చిత్తడిగా మారింది. దీంతో ఒక్క బంతి కూడా పడకుండానే రెండో రోజు ఆట రద్దైంది. కాగా, ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కివీస్ బౌలర్లు చెలరేగడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌటైంది. సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ చెరో 3 వికెట్లు, అజాజ్ పటేల్ 2, కెప్టెన్ సౌథీ ఓ వికెట్ పడగొట్టి బంగ్లాదేశ్‌ను ఆలౌట్ చేశారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో ముష్ఫికర్ రహాం (35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం తొలి రోజే తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన న్యూజిలాండ్ కూడా తడబడింది. బంగ్లా స్పిన్నర్ల ధాటికి ఆ జట్టు 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. మెహిది హసన్ మీరజ్ 3, తైజుల్ ఇస్లాం 2 వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ ఆటగాడు టామ్ లాథమ్ (4), డేవాన్ కాన్వే (11), కేన్ విలియమ్సన్ (13), హెన్రీ నికోల్స్ (1), టామ్ బ్లండెల్ (0) విఫలం కాగా.. డారిల్ మిచెల్ (12), గ్లెన్ ఫిలిప్స్ (5) క్రీజ్‌లో ఉన్నారు. -
బంగ్లాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ జట్టు ప్రకటన! కేన్ మామ దూరం
వన్డే ప్రపంచకప్-2023 తర్వాత తొలి వైట్‌బాల్ సిరీస్‌కు న్యూజిలాండ్ సిద్దమైంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కివీస్ తలపడనుంది. ఈ సిరీస్ కోసం 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అతడి స్ధానంలో టామ్ లాథమ్‌ను సారధిగా సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక దేశీవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న లెగ్ స్పిన్నర్ ఆదిల్ అశోక్, జోష్ క్లార్క్సన్, విల్ ఓ'రూర్క్లకు తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. అదేవిధంగా వన్డే వరల్డ్‌ప్‌లో దుమ్మురేపిన యువ సంచలనం రచిన్ రవీంద్ర కూడా బంగ్లా సిరీస్‌కు అందుబాటులో ఉన్నాడు. డిసెంబర్ 17న డునెడిన్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. బంగ్లాతో వన్డేలకు కివీస్ జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), ఆది అశోక్, ఫిన్ అలెన్, టామ్ బ్లండెల్, మార్క్ చాప్మన్, జోష్ క్లార్క్సన్, జాకబ్ డఫీ, కైల్ జామీసన్, ఆడమ్ మిల్నే, హెన్రీ నికోల్స్, విల్ ఓ'రూర్క్, రచిన్ రవీంద్ర, ఇష్ సోధి, విల్ యంగ్. చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాకు చేరుకున్న భారత జట్టు.. వీడియో వైరల్ -
Ban vs NZ: న్యూజిలాండ్‌కు మరో షాకిచ్చిన బంగ్లాదేశ్.. తొలిరోజే..
Bangladesh vs New Zealand, 2nd Test: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులోనూ న్యూజిలాండ్‌కు శుభారంభం లభించలేదు. తొలి ఇన్నింగ్స్ ఆతిథ్య జట్టును 172 పరుగులకే కట్టడి చేశామన్న సంతోషం కివీస్ జట్టుకు ఎక్కువ సేపు నిలవలేదు. తొలి రోజు ఆట ముగిసే సరికి అనూహ్యంగా బంగ్లాదేశ్ ఆధిక్యంలోకి వచ్చింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ బంగ్లా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిల్హైట్లో జరిగిన తొలి మ్యాచ్‌లో కివీస్‌కు ఘోర పరభావం ఎదురైంది. బంగ్లాదేశ్ గడ్డపై మొదటిసారి ఆతిథ్య జట్టు చేతిలో.. అది కూడా 150 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలో రెండో టెస్టులోనైనా సత్తా చాటాలని భావిస్తోంది టిమ్ సౌథీ బృందం. ఇందులో భాగంగా ఢాకాలో బుధవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాను 172 పరుగులకు కట్టడి చేసింది. మిచెల్ సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. అజాజ్ పటేల్ రెండు, సౌథీ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఆరంభంలోనే కివీస్‌కు షాక్ ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం ఆరంభంలోనే షాకిచ్చాడు. ఓపెనర్ టామ్ లాథమ్‌ను 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపించాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(11), వన్‌డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్(13)ను మెహిది హసన్ మిరాజ.. ఆ తర్వాతి స్థానంలో వచ్చిన హెన్రీ నికోల్స్(1)ను తైజుల్ అవుట్ చేశారు. ఆరో స్థానంలో వచ్చిన వికెట్ కీపర్ టామ్ బ్లండెల్‌ను హసన్ మిరాజ్ డకౌట్ చేయగా.. వెలుతురు లేమి కారణంగా తొలి రోజు ఆట ముగిసే సరికి ఐదో నంబర్ బ్యాటర్ డారిల్ మిచెల్ 12, ఎనిమిదో స్థానంలో వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ 5 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో బుధవారం నాటి ఆట పూర్తయ్యేసరికి న్యూజిలాండ్ 12.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 55 పరుగులు మాత్రమే చేసి వెనుకబడిపోయింది. హైలైట్స్ ఇవే ఇక ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం వింతైన పద్ధతిలో అవుట్ కావడం హైలైట్‌గా నిలిచింది. జెమీసన్ బౌలింగ్‌లో వికెట్ల దిశగా వెళ్తున్న బంతిని చేతితో ఆపి రహీం హ్యాండిలింగ్ ద బాల్ నిబంధన వల్ల పెవిలియన్ చేరాడు. మరోవైపు.. తొలిరోజు ఆటలోనే మొత్తంగా 15 వికెట్లు కూలడం మరో విశేషం. మొత్తానికి ఢాకా పిచ్ స్పిన్నర్లకు బాగా అనుకూలించింది. ఇక న్యూజిలాండ్ ప్రస్తుతం బంగ్లా కంటే 117 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: కోహ్లి, రోహిత్ కాదు! నా ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టే సత్తా అతడికే ఉంది: లారా Did Mushfiqur Rahim really need to do that? He's been given out for obstructing the field! This one will be talked about for a while... . .#BANvNZ pic.twitter.com/SC7IepKRTh — FanCode (@FanCode) December 6, 2023 -
అలా ఔటైన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన ముష్ఫికర్ రహీం
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇవాళ (డిసెంబర్ 6) మొదలైన రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్ల తర్వాత ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. బంగ్లా టాపార్డర్ బ్యాటర్లంతా (హసన్ జాయ్ (14), జకీర్ హసన్ (8), షాంటో (9), మొమినుల్ హక్ (5)) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరగా.. ముష్ఫికర్ రహీం (35), షాదత్ హొసేన్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేసి జట్టును ఆదుకున్నారు. మెహిది హసన్ మీరజ్ (9 నాటౌట్), నురుల్ హసన్ (0 నాటౌట్) బంగ్లాను గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్, మిచెల్ సాంట్నర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. గ్లెన్ ఫిలిప్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. తొలి బంగ్లాదేశ్ ఆటగాడిగా.. బంగ్లాదేశ్ వెటరన్ ఆటగాడు, ఆ జట్టు వికెట్‌కీపర్ ముష్ఫికర్ రహీం ఓ అరుదైన పద్దతిలో ఔటయ్యాడు. బంతికి చేతితో అడ్డుకుని ముష్ఫికర్ పెవిలియన్‌కు చేరాడు. హ్యాండిల్ ద బాల్ నిబంధన మేరకు రహీం ఔటైనట్లు అంపైర్లు ప్రకటించారు. జేమీసన్ బౌలింగ్‌లో బ్యాటింగ్ చేస్తున్న రహాం బంతిని డిఫెన్స్ ఆడగా అది కాస్త వికెట్లను ముద్దాడే దిశగా వెళ్లింది. దీంతో అప్రమత్తమైన రహీం బంతి వికెట్లు తాకకుండా అడ్డుకున్నాడు. టెస్ట్‌ల్లో హ్యాండిల్ ద బాల్ నిబంధన ద్వారా ఔటైన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా రహీం రికార్డుల్లోకెక్కాడు. Mushfiqur Rahim becomes the first Bangladesh player to be dismissed for handling the ball.pic.twitter.com/cMdWVcNpNt— CricTracker (@Cricketracker) December 6, 2023 టెస్ట్‌ల్లో ఓవరాల్‌గా ఈ నిబంధన ద్వారా ఇప్పటివరకు 11 మంది ఔటయ్యారు. రహీం 11వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రహీంకు ముందు మైఖేల్ వాన్, మహేళ జయవర్ధనే, మర్వన్ ఆటపట్టు, స్టీవ్ వా, గ్రహం గూచ్, డెస్మండ్ హేన్స్, మొహిసిన్ ఖాన్, ఆండ్రూ హిల్డిచ్, రసెల్ ఎండీన్, లియోనార్డ్ హట్టన్ హ్యాండిల్ ద బాల్ నిబంధన ద్వారా ఔటయ్యారు. ఇదిలా ఉంటే, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న న్యూజిలాండ్ తొలి టెస్ట్‌లో ఓటమిపాలై సిరీస్‌లో వెనుకపడి ఉంది. -
న్యూజిలాండ్‌పై చారిత్రత్మక విజయం.. బంగ్లా ఆటగాళ్లకు బంపరాఫర్!?
సెల్హాట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 150 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించించిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌కు న్యూజిలాండ్‌పై ఇదే తొలి టెస్టు విజయం కావడం విశేషం. అయితే ఈ చారిత్రత్మక విజయం సాధించింనందుకు బంగ్లా జట్టు ఆటగాళ్లకు ఆ దేశక్రికెట్ బోర్డు బంపరాఫర్ ఇచ్చింది. ఈ గెలుపులో భాగమైన ఆటగాళ్లకు బోనస్ ఇవ్వనున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ క్రికెట్ ఆపరేషన్స్ ఛైర్మన్ జలాల్ యూనస్ తెలిపారు. "ఆటగాళ్లకు బంగ్లా క్రికెట్ బోర్డు నుంచి ఎల్లప్పుడూ పూర్తి మద్దతు ఉంటుంది. సొంత గడ్డపై కివీస్‌పై తొలి విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. మా బాయ్స్‌కు బోనస్ ఇవ్వాలని నేను బీసీబీ అధ్యక్షుడితో మాట్లాడాను. అది కచ్చితంగా జరుగుతోంది. మా జట్టు ఢాకాకు చేరుకున్న తర్వాత వారితో కలిసి బీసీబీ అధ్యక్షుడు డిన్నర్ చేస్తారు. అనంతరం బోనస్‌కు సంబంధించిన ప్రకటన చేయవచ్చు" అని విలేకురల సమావేశంలో జలాల్ యూనస్ పేర్కొన్నారు. కాగా డిసెంబర్ 26 నుంచి ఢాకా వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. -
WTC: టీమిండియాను ‘వెనక్కి’నెట్టిన బంగ్లాదేశ్! టాప్‌లో పాకిస్తాన్..
ICC World Test Championship 2023 - 2025: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ టాప్-2లోకి దూసుకువచ్చింది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో 150 పరుగుల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్ టీమిండియాను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని ఆక్రమించింది. కాగా బంగ్లాదేశ్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా శనివారం ముగిసిన మొదటి మ్యాచ్‌లో కివీస్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్.. న్యూజిలాండ్‌పై విజయం సాధించడం ఇదే మొదటిసారి. చారిత్మక విజయంతో బంగ్లాదేశ్ ఇక బంగ్లాదేశ్ టెస్టు జట్టు కెప్టెన్‌గా నజ్ముల్ షాంటో తొలి ప్రయత్నంలోనే చారిత్రాత్మక విజయం అందించి ప్రశంసలు అందుకుంటున్నాడు. కాగా ప్రస్తుతం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023- 25 సీజన్ నడుస్తోంది. అగ్రస్థానం ఇంకా పాకిస్తాన్‌దే తాజా సైకిల్లో భాగంగా పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచ్‌లలో రెండూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జూలైలో శ్రీలంక పర్యటనలో భాగంగా రెండు టెస్టుల్లో ఆతిథ్య జట్టును ఓడించి 24 పాయింట్లతో టాప్‌లో ఉంది. మరోవైపు.. జూలైలో వెస్టిండీస్‌లో పర్యటించిన టీమిండియా రెండింట ఒక మ్యాచ్ గెలిచి.. మరొకటి డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో 16 పాయింట్లతో రెండో స్థానం(66.67 శాతం)లో ఉండేది. అయితే, తాజాగా న్యూజిలాండ్‌పై గెలుపుతో విజయశాతం(100 శాతం) విషయంలో మెరుగ్గా ఉన్న బంగ్లా ఇప్పుడు టీమిండియాను వెనక్కినెట్టింది. PC: ICC మూడో స్థానానికి పడిపోయిన టీమిండియా ఈక్రమంలో రోహిత్ సేన ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయింది. ఇక ఈ జాబితాలో ఆస్ట్రేలియా 18 పాయింట్లు(విజయశాతం 30)తో నాలుగు, వెస్టిండీస్ 4 పాయింట్లు(16.67 శాతం)తో ఐదో స్థానంలో ఉన్నాయి. ఇక ఇంగ్లండ్ కేవలం 9 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో ఉండగా.. శ్రీలంక, న్యూజిలాండ్, సౌతాఫ్రికా తదితర జట్టు ఇంకా తాజా సైకిల్లో పాయింట్ల ఖాతా తెరవనే లేదు. రెండుసార్లు చేదు అనుభవమే కాగా డబ్ల్యూటీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ గెలిస్తే 12, డ్రా చేసుకుంటే 4 పాయింట్లు వస్తాయి. ఇక సీజన్ ముగిసే నాటికి పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్న జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ ట్రోఫీని తొలుత న్యూజిలాండ్, తర్వాత ఆస్ట్రేలియా గెలుచుకున్నాయి. ఈ రెండు పర్యాయాలు ఫైనల్ వరకు చేరిన టీమిండియాకు ఆఖరి పోరులో ఓటమి తప్పలేదు. చదవండి: టీమిండియా హెడ్‌కోచ్ అయితేనేం! కుమారుల కోసం అలా.. -
న్యూజిలాండ్‌కు భారీ షాక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. భారీ విజయంతో..
Bangladesh vs New Zealand, 1st Test: పటిష్ట న్యూజిలాండ్ జట్టుకు బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. సొంతగడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగి కివీస్‌పై భారీ విజయం సాధించింది. తొలి టెస్టులో టిమ్ సౌథీ బృందాన్ని ఏకంగా 150 పరుగుల తేడాతో చిత్తు చేసి చరిత్ర సృష్టించింది. కాగా రెండు టెస్టులు ఆడే నిమిత్తం న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం(నవంబరు 28) ఇరు జట్ల మధ్య సిల్హెట్ వేదికగా తొలి టెస్టు ఆరంభమైంది. ఇందులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య బంగ్లా 310 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ 317 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో ఇన్నింగ్స్‌ను బంగ్లాదేశ్ 338 పరుగుల వద్ద ముగించగా.. కివీస్ 181 పరుగులకే చాపచుట్టేసింది. బంగ్లాదేశ్ వెటరన్ స్పిన్నర్, తైజుల్ ఇస్లాం ఆరు వికెట్లతో చెలరేగి కివీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, టామ్ బ్లండెల్ రూపంలో కీలక వికెట్లు తీసిన తైజుల్.. కైలీ జెమీషన్, ఇష్ సోధి, టిమ్ సౌథీలను కూడా అవుట్ చేసి శనివారం నాటి ఐదోరోజు తొలి సెషన్లోనే మ్యాచ్‌ను ముగించాడు. టెస్టుల్లో షాంటో బృందం సరికొత్త చరిత్ర ఇలా బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా సొంతగడ్డపై న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి టెస్టు గెలుపు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ టెస్టు జట్టుకు తొలిసారి సారథిగా వ్యవహరించిన నజ్ముల్ షాంటో ఈ మేరకు చారిత్రాత్మక విజయం అందుకోవడం విశేషం. ఇక గత 18 టెస్టుల్లోనూ బంగ్లాదేశ్‌కు ఇదే రెండో విజయం కావడం గమనార్హం. నాలుగో రోజు ఆట ముగిసిందిలా కాగా.. 332 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. డరైల్ మిచెల్ (44 నాటౌట్) మినహా ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ (4/24) నాలుగు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 212/3తో శుక్రవారం ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది. ముష్ఫికర్ రహీమ్ (67), మెహదీ హసన్ మిరాజ్ (50 నాటౌట్) అర్ధసెంచరీలు చేశారు. ఇక ఐదో రోజు ఆటలో భాగంగా విజయానికి కివీస్ మరో 219 పరుగులు చేయాల్సి ఉండగా.. స్పిన్నర్ నయీం హసన్ తొలి వికెట్ తీయగా.. తైజుల్ మరో రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్ ఓటమిని ఖరారు చేశాడు. చదవండి: అదొక్కటే కలిసి రాలేదు.. అతడిని ఒత్తిడిలోకి నెట్టడం ఇష్టం: సూర్య టీమిండియా హెడ్‌కోచ్ అయితేనేం! కుమారుల కోసం అలా.. -
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. ఓటమి అంచుల్లో న్యూజిలాండ్
సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ ఓటమి అంచున నిలిచింది. 332 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. నాలుగో రోజు ఆటముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేసింది. కివీస్ విజయానికి ఇంకా 219 పరుగులు అవసరమ్వగా.. బంగ్లా విజయానికి కేవలం 3 వికెట్ల దూరంలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో న్యూజిలాండ్ బ్యాటర్లు డార్లీ మిచెల్(44), ఇష్ సోధి(7) పరుగులతో ఉన్నారు. తొలి టెస్టులో కివీస్ ఓటమి నుంచి గట్టుఎక్కాలంటే ఏవైనా అద్బుతాలు జరిగాలి. కాగా సెకెండ్ ఇన్సింగ్స్‌లో బంగ్లా స్పిన్వలలో కివీస్ బ్యాటర్లు చిక్కుకున్నారు. బంగ్లా స్పిన్నర్ తైజుల్ ఇస్లాం 4 వికెట్లతో కివీస్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. తైజుల్ ఇస్లాంతో పాటు షార్ఫుల్ ఇస్లాం, మెహాది హసన్, నయీం హసన్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బంగ్లాదేశ్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ షాంటో(105) సెంచరీతో మెరిశాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఆజాజ్ పటేల్ 4 వికెట్లు, ఇష్ సోధి రెండు వికెట్లు సాధించారు. అదే విధంగా బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 310 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ 317 పరుగులు మాత్రమే చేసింది. చదవండి: VHT 2023: దినేష్ కార్తీక్ విధ్వంసం.. 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో! అయినా పాపం -
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ కెప్టెన్.. విరాట్ కోహ్లి, స్మిత్ సరసన
సిల్హెట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శాంటో సెంచరీతో మెరిశాడు. 192 బంతుల్లో 10 ఫోర్లతో శాంటో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. క్రీజులో శాంటో(104), ముస్తిఫిజర్ రహీం(43) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన షాంటో ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో కెప్టెన్‌గా అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా షాంటో నిలిచాడు. ఓవరాల్‌గా టెస్టు కెప్టెన్సీ అరంగేట్రంలో సెంచరీ చేసిన 32వ క్రికెటర్‌గా షాంటో ఈ రికార్డులకెక్కాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్ వంటి దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. చదవండి: టీ20 వరల్డ్‌కప్‌లో రోహిత్, కోహ్లి ఆడుతారా? ఇంగ్లండ్ లెజెండ్ సమాధానమిదే -
కేన్ విలియమ్సన్ అద్భుత సెంచరీ.. విరాట్ కోహ్లి అరుదైన రికార్డు సమం
సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ వైట్‌బాల్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. 189 బంతుల్లో 11 ఫోర్లతో విలియమ్సన్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. టెస్టుల్లో విలియమ్సన్కు ఇది 29వ సెంచరీ. తద్వారా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి, ఆసీస్ దిగ్గజం బ్రాడ్‌మన్ రికార్డును విలియమ్సన్ సమం చేశాడు. విరాట్ కోహ్లి తన టెస్టు కెరీర్లో ఇప్పటివరకు 29 సెంచరీలు సాధించగా.. బ్రాడ్‌మన్ పేరిట కూడా 29 టెస్టు సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా మరో అరుదైన రికార్డును కేన్ మామ తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో వరుసగా మూడు సెంచరీలు చేసిన తొలి కివీస్ క్రికెటర్‌గా విలియమ్సన్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంకపై కూడా కేన్ రెండు టెస్టుల్లో వరుసగా రెండు సార్లు సాధించాడు. కాగా విలియమ్సన్కు ఓవరాల్‌గా ఇది 42వ అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. ఇక బంగ్లాతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో విలియమ్సన్ 104 పరుగులు చేశాడు. 81 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కివీస్ 262 పరుగులు చేసింది. -
WC 2023: ఎదురులేని న్యూజిలాండ్..బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి హ్యాట్రిక్ కొట్టిన కివీస్
వన్డే వరల్డ్‌కప్-2023లో న్యూజిలాండ్ హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన కివీస్.. రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. తాజాగా బంగ్లాదేశ్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది. చెలరేగిన ఫెర్గూసన్ చెన్నైలోని చెపాక్ వేదికగా టాస్ గెలిచిన న్యూజిలాండ్.. షకీబ్ అల్ హసన్ బృందాన్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలి బంతికే కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్.. ఓపెనర్ లిటన్ దాస్‌ను డకౌట్ చేశాడు. మరో ఓపెనర్ తాంజిద్ హసన్ 16 పరుగులకే నిష్క్రమించగా.. మెహిదీ హసన్ మిరాజ్ 30, షకీబ్ 40, ముష్ఫికర్ రహీం 66 పరుగులతో రాణించారు. ఆఖర్లో మహ్మదుల్లా 41 పరుగులతో అజేయంగా నిలవడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 2, మ్యాట్ హెన్రీ 2, లాకీ ఫెర్గూసన్ 3, సాంట్నర్, గ్లెన్ ఫిలిప్స్ ఒక్కో వికెట్ తీశారు. సమిష్టిగా రాణించి ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడింది కివీస్. ఓపెనర్‌గా వచ్చిన రచిన్ రవీంద్ర 9 పరుగులకే అవుట్ కాగా.. డెవాన్ కాన్వే(45)తో కలిసి కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. వచ్చీ రాగానే కేన్ మామ మళ్లీ నాలుగో స్థానంలో వచ్చిన డారిల్ మిచెల్ 67 బంతుల్లో 89 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ మ్యాచ్‌తో వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలో అడుగుపెట్టిన కేన్ మామ.. 78 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్‌లో 42.5 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేజ్ చేసిన కివీస్ 2 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. 8 వికెట్ల తేడాతో గెలుపొంది హ్యాట్రిక్ కొట్టింది. లాకీ ఫెర్గూసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. -
WC 2023: ముష్ఫికర్- షకీబ్ సరికొత్త చరిత్ర.. సెహ్వాగ్- సచిన్ రికార్డు బ్రేక్
ICC Cricket World Cup 2023- New Zealand vs Bangladesh: బంగ్లాదేశ్ బ్యాటర్లు ముష్ఫికర్ రహీం- షకీబ్ అల్ హసన్ చరిత్ర సృష్టించారు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అరుదైన ఘనత సాధించారు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ జోడీ వీరేంద్ర సెహ్వాగ్- సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టారు. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా బంగ్లాదేశ్.. తమ మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడుతోంది. చెన్నైలోని చెపాక్(ఎంఏ చిదంబరం స్టేడియం) వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుని.. బంగ్లాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సెంచరీ భాగస్వామ్యంతో.. ఈ క్రమంలో తొలి బంతికే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఓపెనర్ లిటన్ దాస్ డకౌట్‌గా వెనుదిరగగా.. మరో ఓపెనర్ తాంజిద్ హసన్ 16 పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ మెహిదీ హసన్ మిరాజ్ 30 పరుగులతో రాణించగా.. నాలుగో స్థానంలో వచ్చిన నజ్ముల్ హొసేన్ షాంటో(7) పూర్తిగా నిరాశపరిచాడు. ఇలా 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన జట్టును కెప్టెన్ షకీబ్ అల్ హసన్, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం ఆదుకున్నారు. అద్భుత భాగస్వామ్యంతో బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోరు చేసేందుకు బాటలు వేశారు. షకీబ్ 51 బంతుల్లో 40 రన్స్ తీయగా.. ముష్ఫికర్ రహీం 75 బంతులు ఎదుర్కొని 66 పరుగులు సాధించాడు. అత్యధిక పార్ట్నర్షిప్ నమోదు చేసిన జోడీగా.. ఈ క్రమంలో వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో అరుదైన భాగస్వామ్య రికార్డు నెలకొల్పారు. ఇద్దరూ కలిపి 19 ఇన్నింగ్స్‌లో 972 పరుగుల పార్ట్నర్షిప్ సాధించారు. తద్వారా సెహ్వాగ్- సచిన్‌ల రికార్డును అధిగమించారు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్- సచిన్ టెండుల్కర్ కలిపి 20 ఇన్నింగ్స్‌లో 971 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఈ జాబితాలో 20 ఇన్నింగ్స్‌లో 1220 పరుగుల భాగస్వామ్యంతో ఆస్ట్రేలియా మాజీ స్టార్లు ఆడం గిల్‌క్రిస్ట్- మాథ్యూ హెడెన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. బంగ్లా, టీమిండియా జోడీలు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మరో రికార్డు.. ఇది సమంగా.. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక 50+ పార్ట్నర్షిప్స్ నమోదు చేసిన జోడీలు ఆడం గిల్‌క్రిస్ట్- మాథ్యూ హెడెన్- 12 వీరేంద్ర సెహ్వాగ్- సచిన్ టెండుల్కర్- 8 ముష్ఫికర్ రహీం- షకీబ్ అల్ హసన్- 8. కాగా కివీస్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు స్కోరు చేసింది. చదవండి: ‘శార్దూల్ ఎందుకు? సిరాజ్‌ను ఎందుకు ఆడిస్తున్నారు?.. అసలేంటి ఇదంతా?’ View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. కెప్టెన్ వచ్చేశాడు
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా చెన్నై వేదికగా న్యూజిలాండ్- బంగ్లాదేశ్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రీ ఎంట్రీ ఇచ్చాడు. విల్‌యంగ్ స్ధానంలో విలియమ్సన్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు బంగ్లాదేశ్ కూడా ఓ మార్పుతో బరిలోకి దిగింది. మెహది హసన్ స్ధానంలో మహ్మదుల్లా జట్టులోకి వచ్చాడు. కాగా ఈ మెగా టోర్నీలో కివీస్ వరుస విజయాలతో దూసుకుపోతుంటే.. బంగ్లాదేశ్ ఇంకా బోణీ కొట్టలేదు. తుది జట్లు బంగ్లాదేశ్: లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, మెహిదీ హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్(సి), ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్ న్యూజిలాండ్ : డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్‌కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్ -
న్యూజిలాండ్‌కు గుడ్‌న్యూస్.. కేన్ మామ వచ్చేసాడు!
వన్డే ప్రపంచకప్-2023లో వరుసగా మూడో విజయంపై న్యూజిలాండ్ కన్నేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శుక్రవారం చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో కివీస్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు రెగ్యూలర్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు బరిలో దిగనున్నాడు. ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లకు గాయం కారణంగా విలియమ్సన్ దూరమయ్యాడు. అయితే ఇప్పుడు కేన్ మామ పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. విలియమ్సన్ రాకతో కివీస్ జట్టు మరింత బలంగా తయారుకానుంది. కాగా ఐపీఎల్-2023 సీజన్ సందర్భంగా గాయపడిన విలియమ్సన్ అప్పటినుంచి కివీస్ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు రెండు వామప్ మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్ చేసిన కేన్.. మ్యాచ్ మధ్యలోనే రిటైర్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇప్పడు తన ఫిట్నెస్ను నిరూపించుకోవడంతో రిఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. మరోవైపు స్టార్ పేసర్ టిమ్ సౌథీ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించనట్లు తెలుస్తోంది. సౌథీ చేతివేలి గాయంతో బాధపడతున్నాడు. ఈ క్రమంలో బంగ్లాతో మ్యాచ్‌కు కూడా సౌథీ దూరమయ్యే ఛాన్స్ ఉంది. వరల్డ్‌కప్‌కు న్యూజిలాండ్ జట్టు: డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్, విల్ యంగ్, టిమ్ సౌతీ, జేమ్స్ నీషమ్, ఇష్ సోధి చదవండి: SMT 2023: తిలక్ వర్మకు బంపరాఫర్.. ఏకంగా జట్టు కెప్టెన్‌గా ప్రమోషన్