PC: AP
Nz Vs Ban 1st Test: Bangladesh Historic Win Records: గతేడాది టెస్టుల్లో వరుస పరజయాలతో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కొత్త సంవత్సరంలో అద్భుతమైన గెలుపుతో విజయగర్జన చేసింది. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టును ఓడించి సరికొత్త చరిత్ర లిఖించింది. కివీస్ గడ్డపై తమ మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసి సగర్వంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆరంభించింది. ఈ విజయంపై స్పందించిన బంగ్లాదేశ్ కెప్టెన్ మొమినల్ హక్ హర్షం వ్యక్తం చేశాడు.
‘‘ఇది సమష్టి విజయం. జట్టులోని ప్రతి ఒక్కరు గెలుపు కోసం తమ వంతు ప్రయత్నం చేశారు. మూడు విభాగాల్లోనూ అద్భుతంగా రాణించారు. నిజానికి ఈ విజయానికి కారణం మా బౌలర్లే. మ్యాచ్ ఆసాంతం అత్యద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇబాదత్ నిజంగా అద్భుతమే చేశాడు. గత రెండు టెస్టు మ్యాచ్‌లలో మా ప్రదర్శన బాగా లేదు. కానీ ఇక్కడ మంచి ఆరంభం లభించింది. అయితే, ఈ గెలుపును ఇక్కడితో మర్చిపోయి.. క్రైస్ట్‌చర్చ్ టెస్టులో మరింత ఉత్తమంగా రాణించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి’’ అని చెప్పుకొచ్చాడు.
న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో విజయంతో బంగ్లా సాధించిన రికార్డులు:
►కివీస్ గడ్డపై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి టెస్టు విజయం. 16 ఓటముల తర్వాత ఈ గెలుపు బంగ్లా సొంతమైంది.
►అన్ని ఫార్మాట్లలోనూ ఇదే మొట్టమొదటి గెలుపు. 2001 నుంచి ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లు కలిపి 32 మ్యాచ్‌లు ఆడిన బంగ్లాను అన్నింటిలోనే పరాజయమే వెక్కిరించింది. తాజా విజయంతో గెలుపులేదనే లోటు తీరిపోయింది.
►అంతేగాక ప్రపంచ టెస్టు చాంపియన్ కివీస్‌ను ఓడించడం ద్వారా విదేశీ గడ్డ మీద మేటి జట్టు(టాప్-5)ను మట్టికరిపించడం కూడా బంగ్లాకు ఇదే తొలిసారి.
►2011 జనవరి (హామిల్టన్‌లో పాకిస్తాన్ విజయం) తర్వాత న్యూజిలాండ్‌లో ఆ జట్టును ఓడించిన తొలి ఆసియా జట్టుగా మొమినల్ బృందం నిలిచింది.
Congratulations @BCBtigers. Well played on all fronts. #NZvBAN pic.twitter.com/EYCU1CpQWV
— BLACKCAPS (@BLACKCAPS) January 5, 2022
Comments
Please login to add a commentAdd a comment