Ban Vs Nz 1st Test 2022: Bangladesh Celebration Videos Viral On Social Media - Sakshi
Sakshi News home page

Nz Vs Ban 1st Test: ‘మేము అధిగమించాం’.. డ్రెస్సింగ్‌రూంలో బంగ్లా జట్టు సంబరాలు.. వీడియో వైరల్‌

Published Wed, Jan 5 2022 10:46 AM | Last Updated on Wed, Jan 5 2022 11:29 AM

Nz Vs Ban 1st Test: Bangladesh Celebration In Dressing Room Goes Viral Historic Win - Sakshi

Bangladesh Celebration In Dressing Room Video Viral: జనవరి 5.. 2022.. బంగ్లాదేశ్‌ టెస్టు చరిత్రలో ఇదొక మరుపురాని రోజు. న్యూజిలాండ్‌ను న్యూజిలాండ్‌లోనే ఓడించి సరికొత్త రికార్డు సృష్టించింది. తొలి టెస్టులో విజయం సాధించి కివీస్‌ గడ్డ మీద మూడు ఫార్మాట్లలోనూ ఒక్కసారి కూడా గెలవలేదన్న అపఖ్యాతిని చెరిపేసుకుంది. అంతేకాదు దాదాపు 11 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌లో విజయం సాధించిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది. మౌంట్‌ మంగనూయిలో జయకేతనం ఎగురవేసి సత్తా చాటింది.

ఈ నేపథ్యంలో మొమినల్‌ హక్‌ సారథ్యంలోని జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. డ్రెస్సింగ్‌ రూంలో విజయాన్ని ఆస్వాదిస్తూ.. ‘‘ఏదో ఒకరోజు మేము అధిగమించి తీరతాం’’ అన్న అర్థంతో కూడిన పాటను పాడారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను బంగ్లాదేశ్‌ క్రికెట్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. కాగా కివీస్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇబాదత్‌ హొసేన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

చదవండి: Nz Vs Ban: టెస్టు చాంపియన్‌ను మట్టికరిపించి.. బంగ్లాదేశ్‌ సరికొత్త రికార్డులు.. తొలిసారిగా
Shardul Thakur: ‘అంత మొనగాడివా’ అంటూ ట్రోల్స్‌.. కానీ వికెట్‌కు అవకాశమే కనిపించని సందర్భాల్లో నేనున్నానంటూ.. వచ్చేస్తాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement