Mominul Haque
-
546 పరుగులతో బంగ్లా గెలుపు.. 21వ శతాబ్దంలో అతిపెద్ద విజయం
బంగ్లాదేశ్ తమ టెస్టు క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. అప్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో 546 పరుగుల తేడాతో అత్యంత భారీ విజయాన్ని మూటగట్టుకుంది. 662 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గన్ జట్టు 115 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్గన్ చివరి బ్యాటర్ జహీర్ ఖాన్ రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ నాలుగు వికెట్లు తీయగా.. షోరిఫుల్ ఇస్లామ్ మూడు, మెమదీ హసన్ మిరాజ్, ఎబాదత్ హొసెన్‌లు చెరొక వికెట్ పడగొట్టారు. ఇక టెస్టు క్రికెట్లో పరుగుల పరంగా బంగ్లాదేశ్ జట్టుకు తొలి అతిపెద్ద విజయం కాగా.. ఓవరాల్‌గా మూడో అతిపెద్ద విజయం. కాగా 21వ శతాబ్దంలో బంగ్లాదేశ్‌దే అతిపెద్ద విజయం కావడం విశేషం. ఇంతకముందు 1928లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 675 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో ఆస్ట్రేలియా 562 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను(1932లో) ఓడించి రెండో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. తాజాగా బంగ్లాదేశ్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల తర్వాత పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసి మూడో స్థానంలో నిలిచింది. అంతకముందు బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 425 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో(146 పరుగులు) మెరిసిన నజ్ముల్ హొసెన్ షాంటో రెండో ఇన్నింగ్స్‌లోనూ(124 పరుగులు) సెంచరీతో మెరవగా.. మోమినుల్ హక్ కూడా సెంచరీ(121 పరుగులు నాటౌట్) మార్క్ అందుకున్నాడు. అంతకముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 382 పరుగులకు ఆలౌట్ కాగా.. అఫ్గానిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. అఫ్గానిస్తాన్: తొలి ఇన్నింగ్స్ : 146 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్: 115 ఆలౌట్ బంగ్లాదేశ్: తొలి ఇన్నింగ్స్: 382 ఆలౌట్ రెండో ఇన్నింగ్స్: 425/4 డిక్లేర్ ఫలితం: 546 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం Walton Test Match: Bangladesh vs Afghanistan | Only Test | Day 04 Bangladesh won by 546 runs. Full Match Details: https://t.co/MDvtIwN35K#BCB | #Cricket | #BANvAFG pic.twitter.com/sk24j4tteZ — Bangladesh Cricket (@BCBtigers) June 17, 2023 చదవండి: 'వరల్డ్‌కప్ ఆడతామో లేదో'.. పూటకో మాట మారిస్తే ఎలా? -
బౌలర్ల విజృంభణ.. తొలి రోజు టీమిండియా ఆధిపత్యం
ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు (డిసెంబర్ 22) టీమిండియా ఆధిపత్యం చలాయించింది. టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. ఉమేశ్ యాదవ్ (4/25), రవిచంద్రన్ అశ్విన్ (4/71), జయదేవ్ ఉనద్కత్ (2/50) చెలరేగడంతో బంగ్లాదేశ్‌ను 227 పరుగులకే (73.5 ఓవర్లలో) కట్టడి చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో మొమినుల్ హాక్ (84) టాప్ స్కోరర్‌గా నిలువగా.. నజ్ముల్ షాంటో (24), జకీర్ హసన్ (15), షకీబ్ (16), ముష్ఫికర్ రహీమ్ (26), లిటన్ దాస్ (25), మెహిది హసన్ (15), నురుల్ హసన్ (6), తస్కిన్ అహ్మద్ (1), ఖలీద్ అహ్మద్ (0) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు (8 ఓవర్లలో) చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (20 బంతుల్లో 14 నాటౌట్; ఫోర్, సిక్స్), కేఎల్ రాహుల్ (30 బంతుల్లో 3 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్ కోసం టీమిండియా మేనేజ్మెంట్ ఓ అనూహ్యమైన మార్పు చేసింది. తొలి టెస్ట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కకు పెట్టి సంచలన నిర్ణయం తీసుకుంది. అతని స్థానంలో 31 ఏళ్ల సౌరాష్ట్ర పేసర్ జయదేవ్ ఉనద్కత్‌కు అవకాశం కల్పించింది. 12 ఏళ్ల తర్వాత జట్టులో చోటు దక్కించుకున్న ఉనద్కత్.. మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 2 వికెట్లతో రాణించాడు. ఇదిలా ఉంటే, 2 మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 188 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఇదే బంగ్లా పర్యటనలో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. దీంతో టెస్ట్ సిరీస్‌ను ఎలాగైనా క్లీన్‌స్వీప్ చేసి, వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. -
మొమినల్ గుడ్ బై.. బంగ్లాదేశ్ కెప్టెన్‌గా వెటరన్ ఆల్‌రౌండర్!
Bangladesh New Test Captain: వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అతడికి డిప్యూటీగా లిటన్ దాస్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కాగా ఇటీవల స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఓటమికి బాధ్యత వహిస్తూ మొమినల్ హక్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షకీబ్ మరోసారి బంగ్లాదేశ్ టెస్టు పగ్గాలు చేపట్టాడు. కాగా 2019లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ ఆల్‌రౌండర్‌పై ఐసీసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఓ ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు ముందు బుకీలు అతడిని సంప్రదించినా ఆ విషయాన్ని అతడు దాచిపెట్టాడు. అవినీతి నిరోధక భద్రత విభాగానికి, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు దృష్టికి తీసుకెళ్లలేదు. దీంతో అతడిపై రెండేళ్ల పాటు వేటు పడింది. కాగా గతంలో షకీబ్ రెండుసార్లు బంగ్లా టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2009లొ వెస్టిండీస్ పర్యటనలో మొర్తజా గాయపడగా.. షకీబ్ అల్ హసన్ కెప్టెన్సీ చేశాడు. ఆ తర్వాత 2017లో సారథిగా ముష్ఫికర్ రహీమ్ స్థానాన్ని భర్తీ చేశాడు. ఇక మొమినల్ సారథ్యంలో బంగ్లాదేశ్ మూడు టెస్టుల్లో మూడు విజయాలు సాధించగా.. రెండింటిని డ్రా చేసుకుంది. ఏకంగా 12 మ్యాచ్‌లలో పరాజయం చవిచూసింది. కాగా కెప్టెన్సీ భారాన్ని దించుకున్న మొమినల్ ఇకపై బ్యాటింగ్‌పై దృష్టి సారిస్తానని పేర్కొన్నాడు. చదవండి 👇 Eng Vs NZ 1st Test: మాథ్యూ పాట్స్ అరంగేట్రం.. ఇంగ్లండ్ తరఫున 704వ ఆటగాడిగా! IPL 2023: ఏడు కోట్లా! అంత సీన్ లేదు! సిరాజ్‌ను వదిలేస్తే.. చీప్‌గానే కొనుక్కోవచ్చు! -
బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్ మోమినుల్ హక్ సంచలన నిర్ణయం
బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ మోమినుల్ హక్ టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇటీవలే స్వదేశంలో లంకతో జరిగిన టెస్టు సిరీస్ ఓటమికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు మంగళవారం జరిగిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(బీసీబీ) సమావేశంలో అధ్యక్షుడు నిజాముల్ హసన్‌కు తన నిర్ణయాన్ని వెల్లడించి కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. కాగా మోమినుల్ నాయకత్వంలో బంగ్లాదేశ్ జట్టు 17 టెస్టుల్లో కేవలం మూడు మాత్రమే గెలిచి.. 12 ఓడిపోయి.. మరో రెండు మ్యాచ్‌లు డ్రా చేసుకుంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ''ఒక ఫెయిల్యుర్ ఆటగాడిగా జట్టును ముందుకు నడిపించలేను. నా స్థానంలో మరొకరిని కెప్టెన్‌గా నియమించడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నా. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో బ్యాటింగ్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టేందుకు దృష్టి సారిస్తా'' అని చెప్పుకొచ్చాడు. కాగా లంకతో సిరీస్‌లో బ్యాటింగ్‌లోనూ ఘోరంగా విఫలమైన మోమినుల్ హక్ 2022లో ఆడిన ఆరు టెస్టులు కలిపి 162 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. కాగా మోమినుల్ స్థానంలో షకీబ్ అల్ హసన్ టెస్టు కెప్టెన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇక మోమినుల్ హక్ బంగ్లాదేశ్ తరపున 53 టెస్టుల్లో 11 సెంచరీల సాయంతో 3525 పరుగులు చేశాడు. చదవండి: Ms Dhoni: ప్రేమించే వారికోసం ఎంతదూరమైనా.. అదీ ధోని అంటే! -
‘మేము అధిగమించాం’.. డ్రెస్సింగ్‌రూంలో బంగ్లా జట్టు సంబరాలు.. వైరల్
Bangladesh Celebration In Dressing Room Video Viral: జనవరి 5.. 2022.. బంగ్లాదేశ్ టెస్టు చరిత్రలో ఇదొక మరుపురాని రోజు. న్యూజిలాండ్‌ను న్యూజిలాండ్‌లోనే ఓడించి సరికొత్త రికార్డు సృష్టించింది. తొలి టెస్టులో విజయం సాధించి కివీస్ గడ్డ మీద మూడు ఫార్మాట్లలోనూ ఒక్కసారి కూడా గెలవలేదన్న అపఖ్యాతిని చెరిపేసుకుంది. అంతేకాదు దాదాపు 11 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌లో విజయం సాధించిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది. మౌంట్ మంగనూయిలో జయకేతనం ఎగురవేసి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో మొమినల్ హక్ సారథ్యంలోని జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. డ్రెస్సింగ్ రూంలో విజయాన్ని ఆస్వాదిస్తూ.. ‘‘ఏదో ఒకరోజు మేము అధిగమించి తీరతాం’’ అన్న అర్థంతో కూడిన పాటను పాడారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను బంగ్లాదేశ్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. కాగా కివీస్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇబాదత్ హొసేన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: Nz Vs Ban: టెస్టు చాంపియన్‌ను మట్టికరిపించి.. బంగ్లాదేశ్ సరికొత్త రికార్డులు.. తొలిసారిగా Shardul Thakur: ‘అంత మొనగాడివా’ అంటూ ట్రోల్స్.. కానీ వికెట్‌కు అవకాశమే కనిపించని సందర్భాల్లో నేనున్నానంటూ.. వచ్చేస్తాడు! Bangladesh Team dressing room celebrations following the historic win at Mount Maunganui.#BCB #cricket #BANvsNZ pic.twitter.com/78pGFQ30wP — Bangladesh Cricket (@BCBtigers) January 5, 2022 -
Nz Vs Ban: టెస్టు చాంపియన్‌ను మట్టికరిపించి.. బంగ్లాదేశ్ సరికొత్త రికార్డులు
Nz Vs Ban 1st Test: Bangladesh Historic Win Records: గతేడాది టెస్టుల్లో వరుస పరజయాలతో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కొత్త సంవత్సరంలో అద్భుతమైన గెలుపుతో విజయగర్జన చేసింది. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా తొలి టెస్టులో ఆతిథ్య జట్టును ఓడించి సరికొత్త చరిత్ర లిఖించింది. కివీస్ గడ్డపై తమ మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసి సగర్వంగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆరంభించింది. ఈ విజయంపై స్పందించిన బంగ్లాదేశ్ కెప్టెన్ మొమినల్ హక్ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఇది సమష్టి విజయం. జట్టులోని ప్రతి ఒక్కరు గెలుపు కోసం తమ వంతు ప్రయత్నం చేశారు. మూడు విభాగాల్లోనూ అద్భుతంగా రాణించారు. నిజానికి ఈ విజయానికి కారణం మా బౌలర్లే. మ్యాచ్ ఆసాంతం అత్యద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇబాదత్ నిజంగా అద్భుతమే చేశాడు. గత రెండు టెస్టు మ్యాచ్‌లలో మా ప్రదర్శన బాగా లేదు. కానీ ఇక్కడ మంచి ఆరంభం లభించింది. అయితే, ఈ గెలుపును ఇక్కడితో మర్చిపోయి.. క్రైస్ట్‌చర్చ్ టెస్టులో మరింత ఉత్తమంగా రాణించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి’’ అని చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో విజయంతో బంగ్లా సాధించిన రికార్డులు: ►కివీస్ గడ్డపై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి టెస్టు విజయం. 16 ఓటముల తర్వాత ఈ గెలుపు బంగ్లా సొంతమైంది. ►అన్ని ఫార్మాట్లలోనూ ఇదే మొట్టమొదటి గెలుపు. 2001 నుంచి ఇప్పటి వరకు మూడు ఫార్మాట్లు కలిపి 32 మ్యాచ్‌లు ఆడిన బంగ్లాను అన్నింటిలోనే పరాజయమే వెక్కిరించింది. తాజా విజయంతో గెలుపులేదనే లోటు తీరిపోయింది. ►అంతేగాక ప్రపంచ టెస్టు చాంపియన్ కివీస్‌ను ఓడించడం ద్వారా విదేశీ గడ్డ మీద మేటి జట్టు(టాప్-5)ను మట్టికరిపించడం కూడా బంగ్లాకు ఇదే తొలిసారి. ►2011 జనవరి (హామిల్టన్‌లో పాకిస్తాన్ విజయం) తర్వాత న్యూజిలాండ్‌లో ఆ జట్టును ఓడించిన తొలి ఆసియా జట్టుగా మొమినల్ బృందం నిలిచింది. చదవండి: Shardul Thakur: ‘అంత మొనగాడివా’ అంటూ ట్రోల్స్.. కానీ వికెట్‌కు అవకాశమే కనిపించని సందర్భాల్లో నేనున్నానంటూ.. వచ్చేస్తాడు! Congratulations @BCBtigers. Well played on all fronts. #NZvBAN pic.twitter.com/EYCU1CpQWV — BLACKCAPS (@BLACKCAPS) January 5, 2022 -
బంగ్లాదేశ్ సంచలనం.. న్యూజిలాండ్‌పై ఘన విజయం.. సరికొత్త చరిత్ర
Bangladesh Beat New Zealand By 8 Wickets In 1st Test: మౌంట్ మాంగనుయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ సంచలన విజయం సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో సొంత గడ్డపై ఆతిథ్య కివీస్‌ను మట్టి కరిపించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మొట్టమొదటి వరల్డ్ టెస్టు చాంపియన్‌ను ఓడించి కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0 తేడాతో ముందంజలో నిలిచింది. కాగా కివీస్ గడ్డపై బంగ్లాకు ఏ ఫార్మాట్లోనైనా ఇదే తొలి విజయం కావడం గమనార్హం. మొమినల్ హక్ సారథ్యంలోని జట్టు బంగ్లాకు ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఈ రికార్డును సాధించింది. దీంతో ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. వైవిధ్యమైన పేస్ బౌలింగ్‌తో న్యూజిలాండ్ వెన్ను విరిచిన ఇబాదత్ హొస్సేన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఏడు వికెట్లతో మెరిసి అవార్డు అందుకున్నాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 328 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్ల విజృంభణతో 169 పరుగులకే చాపచుట్టేసింది. పర్యాటక బంగ్లా 458 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించగా... రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. చదవండి: Shardul Thakur: ‘అంత మొనగాడివా’ అంటూ ట్రోల్స్.. కానీ వికెట్‌కు అవకాశమే కనిపించని సందర్భాల్లో.. Rassie van der Dussen Dismissal: శార్దూల్ బౌలింగ్‌లో ప్రొటిస్ ఆటగాడు అవుట్.. వివాదం! Bangladesh have made cricket history with their first Test win over the @BLACKCAPS Always great to see our lads in action on home soil, don’t miss Test 2 starting 9 Jan on Spark Sport#SparkSport #NZvBAN pic.twitter.com/5qv4GmxGN3 — Spark Sport (@sparknzsport) January 5, 2022 Congratulations @BCBtigers. Well played on all fronts. #NZvBAN pic.twitter.com/EYCU1CpQWV — BLACKCAPS (@BLACKCAPS) January 5, 2022 -
Nz Vs Ban 1st Test: అత్యంత చెత్త రివ్యూ ఇదే... అనవసరంగా..
Nz Vs Ban 1st Test: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో నాలుగో రోజు కూడా మెరుగ్గా రాణించింది ఆతిథ్య బంగ్లాదేశ్. అంతకు ముందు బ్యాటర్ల విజృంభణతో 458 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించిన బంగ్లా... కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా 5 వికెట్లు కూల్చింది. కానీ, క్యాచ్‌లు డ్రాప్ చేయడం, రనౌట్లు మిస్ చేయడం వంటి తప్పిదాల కారణంగా మరింత పటిష్ట స్థితిలో నిలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. ముఖ్యంగా 37వ ఓవర్లో టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో ఆఖరి నిమిషంలో రివ్యూ కోరి వేస్ట్ చేసుకుంది. టస్కిన్ వేసిన బంతిని కవర్స్ దిశగా ఆడేందుకు రాస్ టేలర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో టేలర్ ఎల్బీడబ్ల్యూ అయినట్లు భావించిన బంగ్లా కెప్టెన్ మొమినల్ అప్పీలు చేయగా నెగటివ్ ఫలితం వచ్చింది. దీంతో అతడు రివ్యూకు వెళ్లగా అక్కడా చేదు అనుభవమే ఎదురైంది. బ్యాటర్‌ను నాటౌట్‌గా ప్రకటించారు. అంతేగాక బంగ్లాకున్న రివ్యూ అవకాశాలు అన్నీ ఊడ్చుకుపోయాయి. కాగా బంతి రాస్ టేలర్ బ్యాట్‌ను తాకినట్లు స్పష్టంగా కనిపించినప్పటికీ మొమినల్ రివ్యూకు వెళ్లడాన్ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ‘‘ఇప్పటి వరకు చూసిన అత్యంత చెత్త రివ్యూ ఇదే’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. చదవండి: Rohit Sharma: 5-6 కిలోలు తగ్గాలి రోహిత్.. అప్పుడే ఉపశమనం; ఫొటో షేర్ చేసిన ధావన్ WORST REVIEW EVER??! Bangladesh lost their last remaining review when THIS was given 'not out' for LBW! FOLLOW #NZvBAN LIVE: 👉 https://t.co/vIAFgN1IK7 👈 pic.twitter.com/f8CmxEKkpk — 🏏FlashScore Cricket Commentators (@FlashCric) January 4, 2022 -
ఆ విషయంపై సీరియస్‌గా దృష్టి పెట్టాం: బంగ్లా కెప్టెన్
ఇండోర్: టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయం చెందడం పట్ల బంగ్లా కెప్టెన్ మోమినుల్ హక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత్ చేతిలో ఇన్నింగ్స్ పరాజయాన్ని మూటగట్టుకోవడానికి బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణమన్నాడు. తమ బ్యాటింగ్ సరిగా లేకపోవడంతో దారుణమైన ఓటమిని ఖాతాలో వేసుకోవాల్సి వచ్చిందన్నాడు. ఈ విషయంలో సీరియస్‌గా దృష్టి సారించాల్సి ఉందన్నాడు. భారత్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత తమ టెస్టు జట్టు గురించి కోచ్‌తో కలిసి కార్యచరణకు రూపొందిస్తామన్నాడు. ‘ మా టెస్టు జట్టు కూర్పుపై ప్రధానం చర్చించాలి. ఇప్పటికిప్పుడే ఫలితాలు ఉండకపోవచ్చు. కనీసం రెండు-మూడు సంవత్సరాల్లోనైనా మా టెస్టు జట్టును పటిష్టం చేయాలి. మళ్లీ భారత్ పర్యటనకు వచ్చేసరికి టెస్టు జట్టు బలంగా చేయడమే మా తదుపరి లక్ష్యం. మనం మానసికంగా సిద్ధమైతే సానుకూలంగా ఆలోచిస్తాం. మనం ఎప్పుడైతే టెస్టు క్రికెట్ ఆడుతున్నామో అందుకు మైండ్‌సెట్‌ను కూడా మార్చుకోవాలి. అప్పుడే ఇది టెస్టు క్రికెట్ అనే విషయం గురించి ఆలోచిస్తాం. మేము చాలా టెస్టు క్రికెట్ ఆడాల్సి ఉంది. గత ఏడు నెలల్లో మేము ఆడిన టెస్టుల సంఖ్య రెండే. అందుచేతే మిగతా జట్లు తరహాలో టెస్టు క్రికెట్ ఆడలేకపోతున్నాం. ఇదే ముఖ్యమైన తేడా’ అని మోమినుల్ తెలిపాడు. భారత్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైతే, రెండో ఇన్నింగ్స్‌లో 213 పరుగులకు చాపచుట్టేసి ఇన్నింగ్స్ పరాజయాన్ని చవిచూసింది. శుక్రవారం ఈడెన్ గార్డెన్లో భారత్-బంగ్లాల మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది. ఇది డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌గా నిర్వహిస్తున్నారు. -
నేను కెప్టెన్సీకి సిద్ధంగా లేకపోయినా..
ఢాకా: ఇటీవల బంగ్లాదేశ్ రెగ్యులర్ కెప్టెన్ షకిబుల్ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) రెండేళ్లు నిషేధం విధించడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తమ జట్టును ఇప్పటివరకూ షకిబుల్ సమర్ధవంతంగా నడిపించగా, ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసే వారి కోసం ప్రయోగాలు చేస్తోంది. టీ20 ఫార్మాట్‌కు మహ్మదుల్లాను కెప్టెన్‌గా నియమించిన బీసీబీ.. టెస్టులకు మాత్రం మోమినల్ హక్‌ను సారథిగా నియమించింది. దీనిపై మోమినల్ హక్ మాట్లాడుతూ.. ఇదొక ఊహించని పరిణామంగా పేర్కొన్నాడు. తనకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. ‘నేను ఎప్పుడూ కెప్టెన్సీ కోసం ఆలోచించలేదు. కెప్టెన్సీ చేయాలనే ఆలోచన కూడా లేదు. అసలు బంగ్లాదేశ్ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా చేస్తారని ఏ రోజూ ఊహించలేదు. నేను కెప్టెన్సీకి సిద్ధంగా లేకపోయినా ఆ బాధ్యతను నాకు అప్పచెప్పారు. కాస్త బలవంతంగానే ఆ పాత్రను నాకు కట్టబెట్టారు. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం జట్టును సమర్ధవంతంగా నడిపించడమే. అల్లా దయవల్ల నేను కెప్టెన్సీ చేసే అవకాశం లభించింది. కెప్టెన్సీ కారణంగా అదనపు ఒత్తిడి ఉంటుందని నేను అనుకోను. ఒకవేళ మనం అలా అనుకుంటే మాత్రం కచ్చితంగా ఒత్తిడి పడుతుంది. నేను గతంలో ఏ రకంగా స్వేచ్ఛగా ఆడానో, అదే తరహా ప్రదర్శనను ఇవ్వడానికి యత్నిస్తా’ అని మోమినల్ హక్ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌కు కెప్టెన్‌గా చేయడం ఒక గొప్ప అవకాశం అయితే, భారత్‌తో డే అండ్ నైట్ టెస్టులో ఆడటం ఇంకా గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. -
మళ్లీ ‘శత’క్కొట్టిన మోమినుల్
చిట్టగాంగ్: మోమినుల్ హక్ (105; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత సెంచరీ సాయంతో... శ్రీలంకతో జరిగిన తొలి టెస్టును బంగ్లాదేశ్ ‘డ్రా’గా ముగించింది. ఓవర్‌నైట్ స్కోరు 81/3తో చివరి రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం బాదిన మోమినుల్ హక్ రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో చెలరేగడంతో శ్రీలంక విజయంపై ఆశలు వదులుకుంది. మోమినుల్తోపాటు లిటన్ దాస్ (94; 11 ఫోర్లు) కూడా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 180 పరుగులు జోడించారు. మోమినుల్ హక్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. బంగ్లా తరఫున ఓ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు నమోదు చేసిన తొలి ఆటగాడిగా మోమినుల్ హక్ రికార్డు సృష్టించాడు. -
పాక్‌దే సిరీస్
రెండో టెస్టులో బంగ్లాపై విజయం మిర్పూర్ : లెగ్ స్పిన్నర్ యాసిర్ షా (4/73) సుడులు తిరిగే బంతులకు బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తారు. ఫలితంగా షేరే బంగ్లా స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో పాక్ 328 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. తద్వారా రెండు టెస్టుల ఈ సిరీస్‌ను పాకిస్తాన్ 1-0తో గెలుచుకుంది. సిరీస్‌లో తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఈ పర్యటనలో పాక్‌కు ఇదే తొలి విజయం. 550 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా ఆట నాలుగో రోజు శనివారం 56.5 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సూపర్ ఫామ్‌లో ఉన్న మోమినుల్ హక్ (68; 9 ఫోర్లు), తమీమ్ (42; 7 ఫోర్లు) మాత్రమే రాణించారు. ఈ మ్యాచ్ ద్వారా వరుసగా 11 టెస్టుల్లో 50 అంతకన్నా ఎక్కువ పరుగులు సాధించిన రిచర్డ్స్, సెహ్వాగ్, గంభీర్ సరసన మోమినుల్ నిలిచాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ పురస్కారం అజహర్ అలీకి దక్కింది. -
మోమినుల్ హక్ సెంచరీ
చిట్టగాంగ్: యువ బ్యాట్స్‌మన్ మోమినుల్ హక్ (274 బంతుల్లో 181; 27 ఫోర్లు) సెంచరీ సాధించడంతో బంగ్లాదేశ్ జట్టు న్యూజిలాండ్‌కు దీటైన జవాబిచ్చింది. ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఆటముగిసే సమయానికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 116 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 380 పరుగులు చేసింది. కివీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు కేవలం 89 పరుగుల దూరంలోనే నిలిచింది. మూడో రోజు శుక్రవారం 103/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను మోమినుల్ నడిపించాడు. 77 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఆట కొనసాగించిన 22 ఏళ్ల హక్ 98 బంతుల్లోనే 18 ఫోర్లతో కెరీర్ తొలి సెంచరీ నమోదు చేశాడు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బ్యాటింగ్ శైలిని పోలినట్లు ఉండటంతో సహచరులంతా అతన్ని ‘సౌరవ్’గా పిలుచుకుంటారు. కెప్టెన్ ముష్ఫీకర్ రహీం (67) అర్ధసెంచరీ చేయగా, నాసిర్ హొస్సేన్ 46 పరుగులు చేశాడు. ఆట ముగిసే సమయానికి సొహాగ్ గజి (28), అబ్దుర్ రజాక్ (1) క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్లలో బ్రాస్‌వెల్, కొరే అండర్సన్ చెరో 2 వికెట్లు తీశారు.