బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ మోమినుల్ హక్ టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇటీవలే స్వదేశంలో లంకతో జరిగిన టెస్టు సిరీస్ ఓటమికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు మంగళవారం జరిగిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(బీసీబీ) సమావేశంలో అధ్యక్షుడు నిజాముల్ హసన్‌కు తన నిర్ణయాన్ని వెల్లడించి కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. కాగా మోమినుల్ నాయకత్వంలో బంగ్లాదేశ్ జట్టు 17 టెస్టుల్లో కేవలం మూడు మాత్రమే గెలిచి.. 12 ఓడిపోయి.. మరో రెండు మ్యాచ్‌లు డ్రా చేసుకుంది.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ''ఒక ఫెయిల్యుర్ ఆటగాడిగా జట్టును ముందుకు నడిపించలేను. నా స్థానంలో మరొకరిని కెప్టెన్‌గా నియమించడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నా. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో బ్యాటింగ్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టేందుకు దృష్టి సారిస్తా'' అని చెప్పుకొచ్చాడు.
కాగా లంకతో సిరీస్‌లో బ్యాటింగ్‌లోనూ ఘోరంగా విఫలమైన మోమినుల్ హక్ 2022లో ఆడిన ఆరు టెస్టులు కలిపి 162 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. కాగా మోమినుల్ స్థానంలో షకీబ్ అల్ హసన్ టెస్టు కెప్టెన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇక మోమినుల్ హక్ బంగ్లాదేశ్ తరపున 53 టెస్టుల్లో 11 సెంచరీల సాయంతో 3525 పరుగులు చేశాడు.
చదవండి: Ms Dhoni: ప్రేమించే వారికోసం ఎంతదూరమైనా.. అదీ ధోని అంటే!
Comments
Please login to add a commentAdd a comment