బంగ్లాదేశ్ క్రికెట్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్సీకి నజ్ముల్ హొస్సేన్ శాంటో రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ అధికారికంగా ధ్రువీకరించింది. కాగా దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ తర్వాత అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి షాంటో వైదొలగాలని నిర్ణయించుకున్నాడు.
కానీ ఆ సమయంలో బీసీబీ అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ విదేశాల్లో ఉండడంతో షాంటో రాజీనామాపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఆ తర్వాత ఫరూక్ అహ్మద్‌తో చర్చలు జరిపిన అనంతరం షాంటో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. బీసీబీ చీఫ్ సూచన మెరకు కెప్టెన్‌గా కొనసాగేందుకు అతడు ఒప్పుకున్నాడు.
ఈ క్రమంలో గత నవంబరలో యూఏఈ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో బంగ్లా కెప్టెన్‌గా వ్యవహరించిన షాంటో దురదృష్టవశాత్తూ గాయపడ్డాడు. దీంతో ఆ సిరీస్ మధ్యలోనే వైదొలిగిన నజ్ముల్ హొస్సేన్.. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు.
షాంటో తన గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతడు త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు నజ్ముల్ హొస్సేన్ శాంటో మరోసారి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. వర్క్‌లోడ్ కారణంగా టీ20 నుంచి కెప్టెన్సీ నుంచి అతడు వైదొలగాలని ఫిక్స్ అయ్యాడు.
"నజ్ముల్ హొస్సేన్ శాంటో తన తుది నిర్ణయాన్ని వెల్లడించాడు. బంగ్లా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. అతడి రాజీనామాను మేము అంగీకరించాము. ప్రస్తుతం మా షెడ్యూల్ ఎటువంటి టీ20 సిరీస్‌లు లేవు. ఈ నేపథ్యంలో మా కొత్త కెప్టెన్ కోసం వెతకడం లేదు. షాంటో గాయం నుంచి త్వరగా కోలుకుంటే అతడే వన్డేలు, టెస్టుల్లో మా జట్టుకు నాయకత్వం వహిస్తాడు. ఈ విషయం ఇప్పటికే అతడితో చర్చించాము" అని బీసీబీ అధికారి ఒకరు పేర్కొన్నారు.
చదవండి: IND vs AUS 5th Test: రోహిత్ శర్మపై వేటు.. భారత కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!?
Comments
Please login to add a commentAdd a comment