Bangladesh Cricket Board
-
బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో రాజీనామా..
బంగ్లాదేశ్ క్రికెట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్సీకి నజ్ముల్ హొస్సేన్ శాంటో రాజీనామా చేశాడు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ అధికారికంగా ధ్రువీకరించింది. కాగా దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ తర్వాత అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి షాంటో వైదొలగాలని నిర్ణయించుకున్నాడు.కానీ ఆ సమయంలో బీసీబీ అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ విదేశాల్లో ఉండడంతో షాంటో రాజీనామాపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఆ తర్వాత ఫరూక్ అహ్మద్‌తో చర్చలు జరిపిన అనంతరం షాంటో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. బీసీబీ చీఫ్ సూచన మెరకు కెప్టెన్‌గా కొనసాగేందుకు అతడు ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో గత నవంబరలో యూఏఈ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో బంగ్లా కెప్టెన్‌గా వ్యవహరించిన షాంటో దురదృష్టవశాత్తూ గాయపడ్డాడు. దీంతో ఆ సిరీస్ మధ్యలోనే వైదొలిగిన నజ్ముల్ హొస్సేన్.. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు.షాంటో తన గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతడు త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు నజ్ముల్ హొస్సేన్ శాంటో మరోసారి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. వర్క్‌లోడ్ కారణంగా టీ20 నుంచి కెప్టెన్సీ నుంచి అతడు వైదొలగాలని ఫిక్స్ అయ్యాడు."నజ్ముల్ హొస్సేన్ శాంటో తన తుది నిర్ణయాన్ని వెల్లడించాడు. బంగ్లా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. అతడి రాజీనామాను మేము అంగీకరించాము. ప్రస్తుతం మా షెడ్యూల్ ఎటువంటి టీ20 సిరీస్‌లు లేవు. ఈ నేపథ్యంలో మా కొత్త కెప్టెన్ కోసం వెతకడం లేదు. షాంటో గాయం నుంచి త్వరగా కోలుకుంటే అతడే వన్డేలు, టెస్టుల్లో మా జట్టుకు నాయకత్వం వహిస్తాడు. ఈ విషయం ఇప్పటికే అతడితో చర్చించాము" అని బీసీబీ అధికారి ఒకరు పేర్కొన్నారు.చదవండి: IND vs AUS 5th Test: రోహిత్ శర్మపై వేటు.. భారత కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!? -
షకీబ్ భద్రత మా చేతుల్లో లేదు: బీసీబీ చైర్మెన్
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ అంతర్జాతీయ టీ20లకు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాన్పూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షకీబ్ తన భద్రత గురుంచి కీలక వ్యాఖ్యలు చేశాడు. "బంగ్లాలో నా చివరి టెస్టు ఆడాలని ఉంది. భారత్ నుంచి అక్కడకు వెళ్లేందకు నాకు ఎలాంటి సమస్య ఎదురుకాకపోవచ్చు. కానీ అక్కడ వెళ్తే బయటకు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. నా స్నేహితులు, కుటుంబసభ్యులు నా భద్రతపై ఆందోళనతో ఉన్నారు అని షకీబ్ పేర్కొన్నాడు. తాజాగా ఇదే విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ స్పందించాడు. షకీబ్ భద్రతకు బోర్డు ఎటువంటి హామీ ఇవ్వలేదని ఫరూక్ అహ్మద్ స్పష్టం చేశాడు."షకీబ్ భద్రత ఆంశం మా చేతుల్లో లేదు. బోర్డు ఎవరికీ వ్యక్తిగతంగా భద్రతను అందించదు. అతడు తన నిర్ణయాన్ని వెల్లడించాడు. అతడి భద్రత విషయంపై ప్రభుత్వ అత్యున్నత స్థాయి వర్గాలు స్పందిస్తాయి. బీసీబీ.. పోలీసు లేదా రాపిడ్ యాక్షన్ బెటాలియన్ వంటి భద్రతా ఏజెన్సీ కాదు. మేము ఈ విషయం గురించి ప్రభుత్వంలో ఎవరితోనూ చర్చించలేదు. స్వదేశంలో తన చివరి టెస్టు అతడు ఆడవచ్చు. అందుకు ఎటువంటి సమస్య లేదు. షకీబ్ తన జీవితంలో ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అతడితో తన రిటైర్మెంట్ విషయం గురించి ఇంకా మాట్లాడలేదు. రిటైరయ్యేందుకు ఇదే సరైన సమయమని భావించాడు. అతడి నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాము" అని ఫరూక్ పేర్కొన్నారు -
టీమిండియాతో సిరీస్.. బంగ్లా క్రికెట్లో కీలక పరిణామం
టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) డైరెక్టర్ పదవికి మాజీ కెప్టెన్ ఖలీద్ మహమూద్ రాజీనామా చేశాడు. దేశంలో రాజకీయ మార్పుల కారణంగా అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే బంగ్లాలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బీసీబీ ప్రెసిడెంట్ పదవి నుంచి నజ్ముల్ హసన్ సైతం వైదొలిగాడు. అతడి స్ధానంలో మాజీ క్రికెటర్ ఫరూఖ్ అహ్మద్ బాధ్యతలు చేపట్టాడు. ఇప్పుడు ఖలీద్ వంతు వచ్చింది. కాగా 2013లో గాజీ అష్రఫ్ హుస్సేన్‌ను ఓడించి తొలిసారిగా డైరెక్టర్‌గా ఎన్నికైన మహమూద్.. వరుసగా మూడు పర్యాయాలు ఆ పదవిలో కొనసాగారు. తన పదవీకాలంలో బంగ్లా క్రికెట్ అభివృద్దికి మహమూద్ ఎంతగానో కృషి చేశాడు. చాలా ఏళ్ల పాటు బీసీబీ గేమ్ డెవలప్మెంట్ కమిటీకి ఛైర్మన్‌గా పనిచేశాడు. యువ క్రికెటర్లను తయారు చేయడంలో అతడిది కీలక పాత్ర. ఖలీద్ హయాంలోనే యువ బంగ్లా జట్టు 2020లో భారత్‌ను ఓడించి అండర్19 ప్రపంచ కప్ గెలుచుకుంది. కాగా నజ్ముల్ హసన్, ఖలీద్ బాటలోనే మరికొందరు ప్రయాణించనున్నట్లు తెలుస్తోంది. బోర్డు డైరెక్టర్లు షఫియుల్ ఆలం చౌదరి, నైమూర్ రెహమాన్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక భారత్-బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.చదవండి: AUS vs ENG: హెడ్ విధ్వంసం.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్ -
షకీబ్ అల్ హసన్‌పై మర్డర్ కేసు.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు నోటీసులు
బంగ్లాదేశ్ స్టార్ ఆటగాడు షకీబ్ అల్ హసన్‌పై హత్య కేసు నమోదైంది. బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న వేళ ఆగస్టు 7న తమ కుమారుడు రూబెల్ హత్యకు గురయ్యాడని రఫీకుల్ ఇస్లాం అనే వ్యక్తి ఢాకాలోని అడబోర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో షకీబ్ 28వ నిందితుడిగా ఉన్నాడు. నిందితుల జాబితాలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పేరు కూడా ఉంది. ఈ కేసులో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు లీగల్ నోటీసులు అందాయి. బాధితుల తరఫు లాయర్లు షకీబ్‌ను తక్షణమే జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. షకీబ్‌పై కేసు విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బీసీబీ అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ తెలిపాడు. ప్రస్తుతం షకీబ్ పాకిస్తాన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా పాక్‌పై బంగ్లాదేశ్ సాధించిన సంచలన విజయంలో షకీబ్ కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో షకీబ్ నాలుగు వికెట్లు తీసి బంగ్లాదేశ్ చారిత్రక విజయానికి దోహదపడ్డాడు.కాగా, రావల్పిండి వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 565 పరుగులు చేసి ఆలౌటైంది.సెకెండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్లు చెలరేగడంతో పాక్ 146 పరుగులకే ఆలౌటైంది. 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగస్ట్ 30న ఇదే వేదికగా జరుగనుంది.స్కోర్ వివరాలు..పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 448/6 (సౌద్ షకీల్ 141, మొహమ్మద్ రిజ్వాన్ 171 నాటౌట్, హసన్ మహమూద్ 2/70)బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 565 (ముష్ఫికర్ అహ్మద్ 191, షడ్మాన్ ఇస్లాం 93, నసీం షా 3/93)పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ 146 (మొహమ్మద్ రిజ్వాన్ 51, మెహిది హసన్ 4/21)బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ 30/0 (జకీర్ హసన్ 15 నాటౌట్) -
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడి రాజీనామా.. కొత్త చీఫ్‌గా మాజీ క్రికెటర్
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్ష పదవికి నజ్ముల్ హసన్ రాజీనామా చేశాడు. కొత్త అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ ఫరూఖ్ అహ్మద్ ఎన్నికయ్యాడు. కొత్త అధ్యక్షుడు ఎన్నికైన విషయాన్ని బీసీబీ అంపైర్ల కమిటీ ప్యానెల్ చైర్మన్ ఇఫ్తికార్ అహ్మద్ ధృవీకరించాడు. దేశంలో విద్యార్థుల నిరసనల నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ దేశం విడిచి వెళ్లిపోయినట్లు ఇఫ్తికార్ తెలిపాడు. కొత్త అధ్యక్షుడు ఫరూఖ్ బంగ్లాదేశ్ తరఫున ఏడు వన్డేలు ఆడాడు. అలాగే 200-07, 2013-16 మధ్యలో రెండుసార్లు జాతీయ చీఫ్ సెలెక్టర్‌గా పని చేశాడు. కాగా, బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నిరసనల నేపథ్యంలో మాజీ అధ్యక్షురాలు షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆమె అనంతరం బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి కారణంగా టీ20 మహిళల వరల్డ్‌కప్ యూఏఈకి తరలిపోయింది. -
డిప్రెషన్‌తో బాధపడుతున్నా.. నన్ను సెలక్ట్ చేయవద్దు: స్టార్ క్రికెటర్
పాకిస్తాన్ పర్యటనకు ముందు బంగ్లాదేశ్ క్రికెట్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ సైఫుద్దీన్ మానసిక సమస్యల కారణంగా రెండు నెలల పాటు అన్ని రకాల క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.ఈ క్రమంలో తన నిర్ణయాన్ని సైఫుద్దీన్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు తెలియజేసినట్లు క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. రెండు నెలల పాటు తనని ఏ ఫార్మాట్‌కు ఎంపిక చేయవద్దని బోర్డుకు అతడు అభ్యర్ధించినట్లు సమాచారం. బీసీబీ కూడా అతడి అభ్యర్ధన పట్ల సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.కాగా ఈ నెలలో బంగ్లాదేశ్ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు పాకిస్తాన్‌కు వెళ్లనుంది. ఆగస్టు 21 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. సీనియర్ జట్టు కంటే ముందు బంగ్లాదేశ్-ఎ జట్టు పాక్ గడ్డపై అడుగుపెట్టనుంది. ఈ టూర్లో భాగంగా బంగ్లా ఎ జట్టు.. . పాకిస్తాన్ షహీన్స్‌తో రెండు నాలుగు రోజుల అనాధికారిక టెస్టులు, మూడు వన్డేలలో తలపడనుంది. అయితే ఈ టూర్‌కు ఎంపిక చేసిన బంగ్లా ఎ జట్టులో సైఫుద్దీన్‌కు సెలక్టర్లు చోటిచ్చారు. ఈ సిరీస్‌లో అతడి ప్రదర్శనను పరిగణలోకి తీసుకోని పాక్‌తో టెస్టులకు ఎంపిక చేయాలని బంగ్లా సెలక్టర్లు భావించరంట. కానీ అంతలోనే డిప్రెషన్ కారణంగా సైఫుద్దీన్ తప్పుకున్నాడు.కాగా టీ20 వరల్డ్‌కప్-2024 బంగ్లాదేశ్ జట్టులో సైఫుద్దీన్‌కు చోటు దక్కలేదు. టీ20 క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటకి సెలక్టర్లు మాత్రం అతడి స్ధానంలో తాంజిమ్ హసన్ షకీబ్‌కు ఛాన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి సైఫుద్దీన్ మానసికంగా కాస్త ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే రెండు నెలల పాటు అతడు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.చదవండి: ప్రపంచం ఏం అంతం కాదు.. నిజంగా అదో పెద్ద జోక్: రోహిత్ శర్మ -
బంగ్లాదేశ్‌కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు.. ఎవరంటే?
బంగ్లాదేశ్ పురుషల క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ నజ్ముల్ హుస్సేన్ శాంటో ఎంపికయ్యాడు. మూడు ఫార్మాట్లలో తమ జట్టు పగ్గాలను అప్పగిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కాగా టెస్టు, టీ20ల్లో కెప్టెన్‌గా ఉన్న షకీబ్ అల్ హసన్ రాజకీయాలపై దృష్టి సారించడంతో.. అతడి రీ ఎంట్రీ అనిశ్చతి నెలకొంది. షకీబ్ ప్రస్తుతం కంటి సమస్యతో కూడా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో త్వరలో జరగనున్న శ్రీలంకతో వైట్‌బాల్ సిరీస్‌కు షకీబ్ దూరమయ్యాడు. మరోవైపు స్టార్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటకి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతాడన్నది అనుమానమే. కాగా వన్డే వరల్డ్‌కప్-2023కు ముందు బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్సీ నుంచి తమీమ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షకీబ్‌ను వన్డే కెప్టెన్‌గా బీసీబీ నియమించింది. అయితే వరల్డ్‌కప్ అనంతరం షకీబ్ కూడా బంగ్లా వన్డే, టీ20 జట్టు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశాడు. కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగతానని షకీబ్ తెలిపాడు. అయితే షకీబ్ ఇప్పటిలో రీ ఎంట్రీ ఇచ్చేలా కన్పించడం లేదు. ఈ నేపథ్యంలోనే శాంటోను మూడు ఫార్మట్లలో ఏడాది పాటు కెప్టెన్‌గా బీసీబీ నియమించింది. కాగా శాంటోకు కెప్టెన్‌గా అనుభవం ఉంది. గతేడాది సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బంగ్లా జట్టుకు శాంటో సారథ్యం వహించాడు. అతడి నాయకత్వంలోని బంగ్లా జట్టు సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది. అంతకుముందు వన్డే వరల్డ్‌కప్‌లోనూ షకీబ్ గైర్హజరీలో శాంటో జట్టు పగ్గాలను చేపట్టాడు. అతని సారథ్యంలో బంగ్లాదేశ్ 11 మ్యాచ్‌లు ఆడగా.. మూడింట గెలిచింది. సొంతగడ్డపై మార్చిలో శ్రీలంకతో బంగ్లాదేశ్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్‌తో బంగ్లా ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా శాంటో ప్రయాణం ప్రారంభం కానుంది. -
'ఈ డర్టీ గేమ్‌లో నాకు ఆడాలని లేదు.. కావాలనే నన్ను తప్పించారు'
వన్డే ప్రపంచకప్-2023కు తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జట్టులో మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్భాల్‌కు చోటు దక్కపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌కు, ఇక్భాల్‌కు మధ్య విభేదాలు తారాస్ధాయికి చేరినట్లు తెలుస్తోంది. గాయంతో బాధపడుతున్న తమీమ్‌ను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేస్తే టోర్నీ నుంచి తప్పుకుంటానని బీసీబీని షకీబ్ బెదిరించినట్లు పలు రిపోర్టులు పేర్కొన్నాయి. కాగా వెన్ను గాయం నుంచి కోలుకుని న్యూజిలాండ్ సిరీస్‌తో తమీమ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. అంతకంటే ముందు అన్నిఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తమీమ్.. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా జోక్యం చేసుకోవడంతో అతడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. వరల్డ్‌కప్‌లో ఆడాలని నిర్ణయించకున్నాడు. కానీ అనుహ్యంగా అతడికి ఏకంగా వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కలేదు. అవన్నీ రూమర్సే ఇక తమీమ్- షకీబ్ విభేదాల వార్తలపై స్పందించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ సెలక్ర్ మిన్షాజుల్ అబేదిన్ అవన్నీ రూమర్సే అని కొట్టిపారేశాడు. "తమీమ్ ఇక్బాల్ చాలా కాలంగా గాయంతో సతమతమవుతున్నాడు. అతను న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ ఒకే మ్యాచ్ ఆడి, ఇబ్బంది పడుతున్నానని చెప్పాడు. అతడి గాయాన్ని దృష్టిలో పెట్టుకుని వరల్డ్‌కప్ ఎంపిక చేయలేదని అబేదిన్ తెలిపాడు. అంతేకాకుండా తమీమ్‌ను సంప్రదించే ఈ నిర్ణయం తీసుకన్నామని ఆయన అన్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై తమీమ్ ఇక్భాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ చెత్త ఆటలో తను బాగం కాకూడదనుకుంటానని తమీమ్ తెలిపాడు. కావాలనే నన్ను తప్పించారు.. "వరల్డ్‌కప్ జట్టు ఎంపిక ముందు బంగ్లా క్రికెట్ బోర్డు సీనియర్ అధికారి ఒకరి నుంచి నాకు ఫోన్ వచ్చింది. వరల్డ్‌కప్ కోసం జట్టుతో కలిసి నేను భారత్‌కు వెళ్తానని ఆయన చెప్పారు. నా ఫిట్నెస్ను మరోసారి ఆయన నిరూపించుకోమన్నారు. అదేవిధంగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు దూరంగా ఉండమని ఆయన సలహా ఇచ్చారు. అందుకు బదులుగా వరల్డ్‌కప్‌కు ఇంకా 10 నుంచి 15 రోజుల సమయం ఉంది, అయినా నేను పూర్తి ఫిట్నెస్తో ఉన్నప్పటికీ తొలి మ్యాచ్ ఎందుకు ఆడకూడదని ప్రశ్నించాను. దీంతో ఒక వేళ మీరు జట్టులో ఉంటే బ్యాటింగ్ ఆర్డర్ మార్చాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఒక్కసారిగా అతను ఏమి మాట్లాడాతున్నారో నాకు అర్ధం కాలేదు. వెంటనే నేను పూర్తిగా పాజిటివ్ మైండ్‌తో ఉన్నా. కొన్ని రోజుల తర్వాత న్యూజిలాండ్‌పై మంచి ఇన్నింగ్స్ ఆడాను. ఒక్కసారిగా నా బ్యాటింగ్ ఆర్డర్ మార్చడంటని ఆయనతో అన్నాను. నేను గత 17 ఏళ్లగా ఓపెనింగ్ స్ధానంలోనే ఆడుతున్నాను. ఎప్పుడూ మూడు లేదా నాలుగో స్ధానంలో బ్యాటింగ్ చేయలేదు. అటువంటి అప్పుడు నా బ్యాటింగ్ ఆర్డర్ ఎలా మారుస్తారు. మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేసిన అనుభవం నాకు లేదు. ఫిజియో రిపోర్ట్ ప్రకారం.. నా ఫిట్నెస్ లెవల్స్ నాకు తెలుసు. కివీస్ తొలి వన్డే, రెండో వన్డే తర్వాత నేను కాస్త నొప్పితో బాధపడ్డా. అది వాస్తవం. కానీ రెండు రోజుల విశ్రాంతి తర్వాత మళ్లీ ఆఖరి వన్డేకు జట్టు సెలక్షన్‌కు నేను అందుబాటులోకి వచ్చా. కానీ జట్టు వైద్య సిబ్బంది విశ్రాంతి తీసుకుంటే బాగుటుందని సూచించారు. వరల్డ్‌కప్‌లో ప్రతీ మ్యాచ్‌కు దాదాపు రెండు రోజుల విశ్రాంతి లభిస్తోంది. నాకు అది చాలు . ఇప్పటికే నేను దాదాపు 10 వారాల పాటు రిహాబిలేటేషన్లో ఉన్నా. ఉద్దేశ్వపూర్వకంగానే నన్ను జట్టు నుంచి తప్పించారు అని తమీమ్ సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్చేశాడు. చదవండి: IND Vs AUS 3rd ODI: అభిమానుల మనసు గెలుచుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్ -
టీమిండియాపై అద్భుత ప్రదర్శన.. బంగ్లాదేశ్ జట్టుకు భారీ నజరానా! ఎంతంటే?
స్వదేశంలో భారత మహిళల జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌ను 1-1తో బంగ్లాదేశ్ డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే. ఢాకా వేదికగా జరిగిన ఆఖరి వన్డే టై కావడంతో ట్రోఫీని ఇరు జట్లు సంయుక్తంగా పంచుకున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. టీమిండియా వంటి పటిష్ట జట్టుపై అద్బుత ప్రదర్శరన కనబరిచిన తమ జట్టుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారీ నజరానా ప్రకటించింది. తమ మహిళల జట్టుకు 35 లక్షల టాకాలు(భారత కరెన్సీలో సూమారు రూ.27 లక్షలు) ఇవ్వనున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. అదే విధంగా వన్డేల్లో బంగ్లాదేశ్ మహిళల జట్టు తరపున తొలి సెంచరీ సాధించిన ఫర్గానా హోక్‌పై బీసీబీ ఛీప్ నజ్ముల్ హసన్ పాపోన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఫర్గానా అద్బుతమైన బ్యాటర్ అని, బంగ్లా క్రికెట్‌ను మరో స్ధాయికి తీసుకువెళ్తుందని అతడు కొనియాడాడు. "సాధారణంగా మేము సిరీస్ గెలిస్తే మా జట్లకు బోనస్ ఇస్తాం. కానీ భారత్‌తో సిరీస్ డ్రా అయినప్పటికీ మా జట్టుకు రివార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ సిరీస్‌లో సిరీస్‌లో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా భారత్‌పై మేము తొలి వన్డే విజయం సాధించాము. అదే విధంగా సెంచూరియన్ ఫర్గానా హోక్ వంటి వ్యక్తిగత ప్రదర్శనలు కూడా ఉన్నాయి. అందుకే మా ప్లేయర్స్‌కు 25 లక్షల టాకాలు ఇవ్వాలని అనుకుంటున్నాం. అదేవిధంగా సెంచరీతో చెలరేగిన ఫర్గానా 2 లక్షల టాకాలు, వ్యక్తిగత ప్రదర్శన మిగితా ప్లేయర్స్‌కు రివార్డు ఇవ్వనున్నాం. మరోవైపు కోచింగ్ స్టాప్‌ను కూడా ఇందులో భాగం చేయాలి అనకుంటున్నాం. మొత్తంగా 35 లక్షల టాకాలు రివార్డు రూపంలో ఇవ్వనున్నాం" అని నజ్ముల్ హసన్ పాపోన్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. -
'డేర్ అండ్ డాషింగ్' హర్మన్‌ప్రీత్.. కుండ బద్దలయ్యేలా!
టీమిండియా మహిళల కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఎంత డేర్ అండ్ డాషింగ్‌గా ఉంటుందో మరోసారి చూపించింది. తాను చెప్పాలనుకున్నది సూటిగా స్పష్టంగా మొహంమీద చెప్పడం ఆమె నైజం. ఇదే ఆమెను అందరిలో స్పెషల్‌గా నిలిపింది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వన్డేలో అంపైరింగ్ ప్రమాణాలపై అసహనం వ్యక్తం చేసింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ట్రోఫీ అందుకోవడానికి ముందు మాట్లాడుతూ.. ''ఈ మ్యాచ్‌తో మేం చాలా నేర్చుకున్నాం. అంపైరింగ్ ప్రమాణాలను కూడా చూశాం. చాలా ఘోరంగా ఉంది. మేం మళ్లీ బంగ్లాదేశ్‌కు వచ్చినప్పుడు దాని కోసం కూడా సిద్ధమై రావాలేమో. ఇక మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఇండియన్ హైకమీషన్‌కు కనీసం స్వాగతం పలకలేదు. బంగ్లాదేశ్ క్రికెట్లో అంపైరింగే అనుకున్నాం.. కనీస మర్యాదలకు కూడా చోటు లేదు. మీరు మ్యాచ్‌కు వచ్చినందుకు మా ఇండియన్ టీమ్ తరపున హైకమీషన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.'' అంటూ పేర్కొంది. Indian Captain Harmanpreet Kaur blasts Bangladesh Cricket board, calls the umpiring and management pathetic. She also exposed the board for insulting the members of the Indian high commission by not inviting them on the stage. Sherni standing up for 🇮🇳 without any fear. pic.twitter.com/HNHXB3TvdW — Roshan Rai (@RoshanKrRaii) July 22, 2023 హర్మన్‌ప్రీత్ చేసిన వ్యాఖ్యలు టీమిండియా అభిమానులను ఆకట్టుకున్నాయి. ''బహుశా పురుషుల క్రికెట్లో కూడా ఇంత ధైర్యంగా మాట్లాడే సాహసం ఎవరు చేయలేదనుకుంటా. కానీ హర్మన్‌ప్రీత్ అలా కాదు.. తాను ఏం చెప్పాలనుకుందో అది స్పష్టంగా, ముక్కుసూటిగా చెబుతుంది.. అందుకే ఆమెంటే మాకు గౌరవం'' అంటూ కామెంట్ చేశారు. తప్పుడు నిర్ణయం.. అంపైర్‌పై కోపంతో బంగ్లాదేశ్ బౌలర్ నహిదా అక్తర్ వేసిన 34 ఓవర్లో నాలుగో బంతికి భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ స్వీప్ షాట్ ఆడింది. అయితే, బంతి బ్యాట్‌కు తగలకుండా.. ప్యాడ్‌కు తగిలింది. బంగ్లా ప్లేయర్లు అప్పీల్ చేయగా.. అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఔట్ ఇచ్చాడు. బంతికి లెంగ్ స్టంప్ అవతల పిచ్ అయిందని, నాటౌట్ అని హర్మన్ భావించింది. దీంతో అంపైర్ నిర్ణయంపై ఆగ్రహించిన హర్మన్.. బ్యాట్‌తో వికెట్లను కొట్టింది. కనీస ధర్మాన్ని పాటించడం లేదంటూ అంపైర్‌ను తిట్టుకుంటూ పెవిలియన్ వైపు వెళ్లింది. ఈ సమయంలో బంగ్లా అభిమానుల్లో కొంతమంది ఆమెను రెచ్చగొట్టే ప్రయత్నం చేయగా.. హర్మన్‌ప్రీత్ వ్యంగ్యంగా వారికి బొటనవేలు చూపించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The controversial dismissal of Harmanpreet Kaur #CricketTwitter #BANvIND pic.twitter.com/XEGdTMgRJd — Female Cricket (@imfemalecricket) July 22, 2023 చదవండి: IND vs BAN: కోపంతో ఊగిపోయిన టీమిండియా కెప్టెన్.. బ్యాట్‌తో వికెట్లను కొట్టి! వీడియో వైరల్ -
ఐపీఎల్లో ఆడనందుకు రివార్డు.. ఆ ముగ్గురికీ బోనస్
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగం కావాలని ప్రపంచంలో ప్రతీ ఒక్క క్రికెటర్ కోరుకుంటాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే విధంగా ఎంతోమంది అనామకులను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత కూడా ఐపీఎల్‌కు ఉంది. ఇటువంటి క్యాష్‌రిచ్ లీగ్‌లో భాగమయ్యే అవకాశాన్ని ఏ ఆటగాడు వదులుకోవడానికి ఇష్టపడడు. కానీ బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్ కంటే తమ జాతీయ జట్టుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఐపీఎల్ ఆఫర్‌ను వదులుకున్న బంగ్లాదేశ్ ఆటగాళ్లు షకీబ్ అల్హసన్, లిటన్ దాస్, టాస్కిన్ అహ్మద్‌లకు ఆ దేశ క్రికెట్ రివార్డు ప్రకటించింది. ఈ ముగ్గురికీ కలిపి 65 వేల డాలర్లు (దాదాపు 53 లక్షలు) బీసీబీ రివార్డుగా ఇవ్వనుంది. కాగా ఐపీఎల్ 2023 మినీ వేలంలో బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌ని బేస్ ప్రైజ్ రూ.1.5 కోట్లకు కొనుగోలు కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. అయితే ఐర్లాండ్‌తో టెస్టు సిరీస్ కారణంగా షకీబ్ అల్హసన్ ఐపీఎల్-2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అదే విధంగా లిటన్ దాస్ కూడా ఐర్లాండ్ సిరీస్ కారణంగా ఈ ఏడాది సీజన్ ఫస్ట్‌హాఫ్‌లో ఆడలేదు. ఆ తర్వాత ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో ఆడేందుకు వచ్చిన కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడి స్వదేశానికి వెళ్లిపోయాడు. అతడిని రూ.50 లక్షలకు కేకేఆరే సొంతం చేసుకుంది. మరోవైపు గాయం కారణంగా ఐపీఎల్ సెకెండ్ హాఫ్‌కు దూరమైన లక్నో ఫాస్ట్ బౌలర్ స్ధానంలో టాస్కిన్ అహ్మద్‌కు ఆ ఫ్రాంచైజీ నుంచి పిలుపు వచ్చిందంట. అయితే బంగ్లా క్రికెట్ బోర్డు అనుమతి ఇవ్వకపోవడంతో లక్నో ఆఫర్‌ను టస్కిన్ అహ్మద్ తిరష్కరించినట్లు సమాచారం. ఇక వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023 ఫైనల్‌ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు కూడా ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమయ్యారు. చదవండి: ఆ రెండు మ్యాచులు గెలిస్తే.. వరల్డ్ కప్ టీమిండియాదే: సునీల్ గవాస్కర్ -
టీమిండియాతో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ కెప్టెన్‌గా లిటన్ దాస్
టీమిండియాతో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ రెగ్యూలర్ కెప్టెన్ తమీమ్ ఇక్భాల్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. దీంతో తమీమ్ స్ధానంలో కెప్టెన్‌గా ఆ జట్టు వికెట్ కీపర్- బ్యాటర్ లిటన్ దాస్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నియమించింది. కాగా లిట్టన్ దాస్‌కు కెప్టెన్‌గా అంత అనుభవం లేదు. అంతకుముందు ఒకే ఒక టీ20 మ్యాచ్‌లో బంగ్లా జట్టుకు సారథ్యం వహించాడు. "లిటన్ దాస్ మా జట్టులో అనుభవజ్ఞుడైన ఆటగాళ్లలో ఒకడు. అదే విధంగా అతడు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్‌ను కూడా కలిగిఉన్నాడు. అయితే ముఖ్యమైన ఈ సిరీస్‌కు తమీమ్ దూరం కావడం చాలా దురదృష్టకరం. గత రెండేళ్లలో అతడి సారథ్యంలో మా జట్టు అద్భుతంగా రాణిస్తోంది. అదే విధంగా వన్డే ఫార్మాట్లో తమీమ్ అత్యుత్తమ ఆటగాడు" అని బీసీబీ క్రికెట్ ఆపరేషన్ చైర్మన్ జలాల్ యూనస్ పేర్కొన్నారు. కాగా హోం సిరీస్‌లో భాగంగా భారత్‌తో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఆదివారం(డిసెంబర్ 4)న జరగనున్న తొలి వన్డేతో భారత పర్యటన ప్రారంభం కానుంది. భారత్‌తో వన్డేలకు బంగ్లా జట్టు: లిట్టన్ కుమార్ దాస్(కెప్టెన్), అనముల్ హక్ బిజోయ్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ చౌదరి, మెహిదీ హసన్ మిరాజ్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, ఎబాడోత్ హుస్సేన్, నసుమ్ అహ్మద్,జ్ముల్ హుస్సేన్ శాంటో,మహ్మదుల్లా,నూరుల్ హసన్ సోహన్ చదవండి: IND vs BAN: టీమిండియాతో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్‌కు ఊహించని షాక్! ఇక అంతే సంగతి -
ఏడేళ్ల తర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా..!
ఈ ఏడాది డిసెంబర్లో బంగ్లాదేశ్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా.. అతిథ్య బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది. భారత పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ గురువారం ప్రకటించింది. డిసెంబర్ 4న ఢాకా వేదికగా జరగనున్న తొలి వన్డేతో భారత్ టూర్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు కూడా ఢాకా వేదికగానే జరగనున్నాయి. అనంతరం డిసెంబర్ 14 చటోగ్రామ్ వేదికగా తొలి టెస్టు.. డిసెంబర్ 22 ఢాకాలో రెండో టెస్టు జరగనుంది. కాగా భారత జట్టు దాదాపు ఏడేళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు టూర్‌కు వెళ్లనుండడం గమనార్హం. టీమిండియా చివరిసారిగా 2015లో బంగ్లా పర్యటనకు వెళ్లింది. మరోవైపు బంగ్లాదేశ్ పర్యటకు భారత్ జట్టు రానుండడం తమకు ఎంతో సంతోషంగా ఉంది అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ అన్నారు. "బంగ్లాదేశ్- భారత్ మధ్య మరో చిరస్మరణీయమైన సిరీస్ కోసం ఇరు దేశాల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేము షెడ్యూల్‌ను ఫిక్స్ చేయడంలో మా క్రికెట్ బోర్డుకు సహకరించినందుకు బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి)కి ధన్యవాదాలు. బంగ్లాదేశ్‌కు వచ్చే భారత జట్టును స్వాగతించేందుకు ఎదురుచూస్తున్నాం’’ అని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ పేర్కొన్నారు. చదవండి: T20 World Cup 2022: పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. మెల్బోర్న్కు చేరుకున్న టీమిండియా -
Asia Cup 2022: బంగ్లాదేశ్ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్!
Asia Cup 2022- T20 World Cup 2022: ఆసియా కప్-2022, టీ20 ప్రపంచకప్-2022 టోర్నీల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా ఈవెంట్ల కోసం టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీధరన్ శ్రీరామ్‌ను కోచ్‌గా నియమించినట్లు సమాచారం. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ వెల్లడించినట్లు ది డైలీ స్టార్ తన కథనంలో పేర్కొంది. ‘‘అవును.. ప్రపంచకప్ ఈవెంట్ వరకు మేము శ్రీరామ్‌తో కలిసి పనిచేయబోతున్నాం. ఆసియా కప్ నుంచి సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. మా ప్రధాన లక్ష్యం టీ20 ప్రపంచకప్. నిజానికి... వరల్డ్‌కప్ టోర్నీ సమయంలో ఈ నియామకం జరిగినట్లయితే.. అప్పటికప్పుడు పరిస్థితులను అర్థం చేసుకుని జట్టుతో మమేకమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి.. ఆసియా కప్ ఈవెంట్ నుంచే జట్టుతో కలిసేలా ప్రణాళికలు వేశాం’’ అని సదరు అధికారి పేర్కొన్నట్లు డైలీ స్టార్ తెలిపింది. మరి పాత కోచ్? అదే విధంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌కు శ్రీరామ్ నియామకం నేపథ్యంలో ప్రస్తుత కోచ్ రసెల్ డొమింగో బంగ్లాదేశ్ టెస్టు జట్టుకు మార్గదర్శనం చేస్తాడని తెలిపినట్లు పేర్కొంది. కాగా చెన్నైకి చెందిన శ్రీధరన్ శ్రీరామ్ లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా ఎదిగాడు. 2000- 2004 మధ్య కాలంలో టీమిండియా తరఫున ఎనిమిది వన్డేలు ఆడిన అతడు కోచింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. ఆసీస్‌ను విజేతగా నిలపడంలో! ఈ క్రమంలో ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించి.. అష్టన్ అగర్, ఆడం జంపా వంటి యువకులకు స్పిన్ బౌలింగ్‌లో మెళకువలు నేర్పించాడు. టీ20 ప్రపంచకప్-2021 గెలిచిన ఆసీస్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. అదేవిధంగా ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కోచింగ్ స్టాఫ్‌లో భాగంగా ఉన్నాడు. గతంలో పంజాబ్ బౌలింగ్ కోచ్‌గానూ శ్రీధరన్ శ్రీరామ్ పనిచేశాడు. ఘోర పరాభవం! కాగా ఇటీవల బంగ్లాదేశ్.. జింబాబ్వే చేతిలో ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. జింబాబ్వేలో పర్యటించి వన్డే, టీ20 సిరీస్‌లను 2-1 తేడాతో ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. ఆసియా కప్-2022కు ముందుకు ఇలాంటి పరాభవం ఎదురైన నేపథ్యంలో బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కోచ్‌గా శ్రీధరన్ శ్రీరామ్ నియామకం జరిగినట్లు సమాచారం. చదవండి: Ind Vs Zim: అతడిని ముట్టుకున్నా.. జింబాబ్వే యువతి సంతోషం! ఫిదా చేసిన భారత క్రికెటర్! LLC 2022: గంభీర్ అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ బ్యాట్ పట్టనున్న గౌతీ! -
ఆసియా కప్‌కు జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. స్టార్ ఆటగాడు దూరం!
ఆసియా కప్-2022 కు 17 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు శనివారం ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ ఆల్ హసన్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ వరకు బంగ్లా జట్టు కెప్టెన్‌గా షకీబ్ కొనసాగనున్నాడు.ఇక జింబాబ్వే సిరీస్‌లో గాయపడిన వికెట్ నూరల్ హసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక అదే సిరీస్‌లో గాయపడిన మరో వికెట్ కీపర్ లిటన్ దాస్ మాత్రం ఇంకా కోలుకోలేదు. దీంతో అతడు ఆసియాకప్‌కు దూరమయ్యాడు. కాగా ఆసియా కప్‌కు జట్టును బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆగస్టు 8న ప్రకటించాల్సి ఉండగా.. షకీబ్ స్పాన్సర్షిప్ వివాదం వల్ల ఆలస్యమైంది. ఇక ఆసియాకప్‌లో బంగ్లాదేశ్ ఇప్పటి వరకు ఒక్క సారి కూడా టైటిల్ నెగ్గలేకపోయింది. 2012, 2016, 2018లో ఫైనల్‌కు చేరినప్పటికీ విజయం సాధించలేకపోయింది. కాగా ఆసియకప్-2022 ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికగా జరనగుంది. తొలి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా ఆఫ్గానిస్తాన్- శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఆసియా కప్‌కు బంగ్లాదేశ్ జట్టు షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), అనాముల్ హక్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్, మొసద్దెక్ హొస్సేన్, మహ్మదుల్లా, మహేదీ హసన్, మహ్మద్ సైఫుద్దీన్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, నసుమ్ అహ్మద్, సబ్బీర్ రహ్మాన్,మెహిదీ హసన్ మిరాజ్,ఎబాడోత్ హుస్సేన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, నూరుల్ హసన్ సోహన్, టాస్కిన్ అహ్మద్ చదవండి: Asia Cup 2022: బంగ్లాదేశ్ కెప్టెన్‌గా షకీబ్ ఆల్ హసన్.. -
చిక్కుల్లో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్..
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ చిక్కుల్లో పడ్డాడు. బంగ్లా క్రికెట్ బోర్డు(బీసీబీ) నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకున్నాడు. విషయంలోకి వెళితే.. ఇటీవలే ఈ స్టార్ ఆల్‌రౌండర్ ఒక బెట్టింగ్ వెబ్‌సైట్‌తో కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని షకీబ్.. ''బెట్ విన్నర్ న్యూస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నా'' అంటూ ఫేస్బుక్ వేదికగా ఫోటోను షేర్ చేశాడు. తన కాంట్రాక్ట్ ఒప్పందం విషయమై షకీబ్ బీసీబీకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఇదే ఇప్పుడతన్ని కష్టాల్లోకి నెట్టింది. షకీబ్ మమ్మల్ని సంప్రదించకుండా ఒక బెట్టింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడని.. బెట్టింగ్ అనేది ఒక అనైతిక చర్య అని.. బెట్టింగ్తో సంబంధమున్న ఏ కంపెనీతోనూ ఆటగాళ్లు ఒప్పందం కుదుర్చుకోరాదని నిబంధనల్లో ఉందని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ పేర్కొన్నాడు. షకీబ్ ఒప్పంద విషయమై బోర్డు మీటింగ్ అనంతరం అధ్యక్షుడు నజ్ముల్ హసన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాడు. ''గురువారం జరిగిన మీటింగ్‌లో షకీబ్ తాజాగా ఒప్పందం కుదుర్చుకున్న స్పాన్సర్షిప్ గురించి ప్రస్తావనకు వచ్చింది. అతను ఒక బెట్టింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని నిబంధన ఉల్లఘించాడు. ఒప్పంద విషయమై బోర్డుకు కనీస సమాచారం ఇవ్వకుండా సొంత నిర్ణయం తీసుకున్నాడు. దీనిపై వివరణ కోరుతూ షకీబ్‌కు నోటీసులు పంపించాం. ఒకవేళ షకీబ్ ఒప్పందం కుదుర్చుకున్న సంస్థకు బెట్టింగ్ మాఫియాతో సంబంధముందని తెలిస్తే ఉపేక్షించబోయేది లేదు. దీనిపై ఇన్వెస్టిగేషన్(విచారణ) ప్రారంభించబోతున్నాం. మా అనుమతి తీసుకోకుండా ఒప్పందం కుదుర్చుకున్న షకీబ్‌పై ఎలాంటి చర్యలు ఉంటాయనేది విచారణ అనంతరమే తెలుస్తోంది. కానీ షకీబ్ చేసింది బీసీబీ బోర్డుకు విరుద్దంగా ఉంది. బెట్టింగ్ అనే అంశానికి (బీసీబీ-లా) పూర్తి వ్యతిరేకం'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఎన్ని వివాదాలు ఉన్నా షకీబ్ అల్ హసన్ ప్రస్తుత తరంలో ఉన్న గొప్ప ఆల్రౌండర్లలో ఒకడు. మైదానం వెలుపల.. బయట ఎంతో అగ్రెసివ్‌గా కనిపించే షకీబ్ ఆల్‌రౌండర్‌గా లెక్కలేనన్ని రికార్డులు తన సొంతం. బంగ్లాదేశ్ క్రికెటర్లలో ఫేస్బుక్లో ఎక్కువ మంది ఫాలోయర్లు ఉన్న ఆటగాడు షకీబ్ అల్ హసన్. దాదాపు 15.6 మంది మిలియన్ ఫాలోవర్స్ అతని సొంతం. టి20లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో షకీబ్ అల్ హషన్ నెంబర్ వన్‌లో ఉన్నాడు. 99 టి20ల్లో 121 వికెట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు. ఇక టి20 వరల్డ్‌కప్‌లోనూ అత్యధిక వికెట్లు షకీబ్(41 వికెట్లు) పేరిటే ఉండడం విశేషం. ఐసీసీ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విభాగంలో షకీబ్ అల్ హసన్ ఎక్కువకాలం పాటు నెంబర్‌వన్‌గా కొనసాగాడు. ప్రస్తుతం ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్ విభాగంలో నెంబర్-2లో ఉన్నాడు షకీబ్. బంగ్లాదేశ్ తరపున షకీబ్ 63 టెస్టులు, 221 వన్డేలు, 99 టి20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లు కలిపి బ్యాటింగ్‌లో 12వేలకు పైగా పరుగులు.. బౌలింగ్‌లో 621 వికెట్లు పడగొట్టాడు. చదవండి: NZ vs NED: కివీస్‌కు ముచ్చెమటలు పట్టించిన డచ్ బ్యాటర్.. Senior RP Singh: భారత్‌ను కాదని ఇంగ్లండ్‌కు ఆడనున్న మాజీ క్రికెటర్ కుమారుడు -
జింబాబ్వే టూర్.. జట్లను ప్రకటించిన బంగ్లాదేశ్.. కెప్టెన్ దూరం..!
జింబాబ్వే పర్యటనకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ జట్లను శుక్రవారం ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా జింబాబ్వేతో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, మూడు టీ20ల మ్యాచ్‌లు ఆడనుంది. అయితే టీ20, వన్డే సిరీస్‌లకు రెండు వేర్వేరు జట్లును సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా టీ20 సిరీస్‌కు బంగ్లా రెగ్యులర్ కెప్టెన్ మహ్మదుల్లాకు సెలక్టర్లు విశ్రాంతి విశ్రాంతి ఇచ్చారు. అతడి స్థానంలో కెప్టెన్‌గా ఆ జట్టు వికెట్ కీపర్ నూరుల్ హసన్ ఎంపికయ్యాడు. అదే విధంగా జట్టు స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. జూలై 30 న హరారే వేదికగా జరగనున్న తొలి టీ20తో బంగ్లా పర్యటన ప్రారంభం కానుంది. ఇక ఇటీవల విండీస్‌తో జరిగిన టీ20, టెస్టు సిరీస్‌లో ఓటమి చెందిన బంగ్లాదేశ్.. వన్డే సిరీస్‌ను మాత్రం క్లీన్‌స్వీప్ చేసింది. బంగ్లాదేశ్ టీ20 జట్టు: నూరుల్ హసన్ (కెప్టెన్), మునిమ్ షహరియార్, అనాముల్ హక్, లిటన్ దాస్, అఫీఫ్ హుస్సేన్, మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్, హసన్ మహమూద్, మొసద్దెక్ హుస్సేన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో,మెహిదీ హసన్ మిరాజ్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్ బంగ్లాదేశ్ వన్డే జట్టు: తమీమ్ ఇక్బాల్ (కెప్టెన్), లిటన్ దాస్, అనాముల్ హక్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, నూరుల్ హసన్ (వికెట్), మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్, హసన్ మహమూద్, హజ్సన్ మహ్మద్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, మొసద్దెక్ హొస్సేన్, తైజుల్ ఇస్లాం చదవండి: IRE vs NZ 3rd T20: తిరుగులేని న్యూజిలాండ్.. సిరీస్ క్లీన్‌స్వీప్ -
బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్ మోమినుల్ హక్ సంచలన నిర్ణయం
బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ మోమినుల్ హక్ టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇటీవలే స్వదేశంలో లంకతో జరిగిన టెస్టు సిరీస్ ఓటమికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు మంగళవారం జరిగిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(బీసీబీ) సమావేశంలో అధ్యక్షుడు నిజాముల్ హసన్‌కు తన నిర్ణయాన్ని వెల్లడించి కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. కాగా మోమినుల్ నాయకత్వంలో బంగ్లాదేశ్ జట్టు 17 టెస్టుల్లో కేవలం మూడు మాత్రమే గెలిచి.. 12 ఓడిపోయి.. మరో రెండు మ్యాచ్‌లు డ్రా చేసుకుంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ''ఒక ఫెయిల్యుర్ ఆటగాడిగా జట్టును ముందుకు నడిపించలేను. నా స్థానంలో మరొకరిని కెప్టెన్‌గా నియమించడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నా. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో బ్యాటింగ్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టేందుకు దృష్టి సారిస్తా'' అని చెప్పుకొచ్చాడు. కాగా లంకతో సిరీస్‌లో బ్యాటింగ్‌లోనూ ఘోరంగా విఫలమైన మోమినుల్ హక్ 2022లో ఆడిన ఆరు టెస్టులు కలిపి 162 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. కాగా మోమినుల్ స్థానంలో షకీబ్ అల్ హసన్ టెస్టు కెప్టెన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇక మోమినుల్ హక్ బంగ్లాదేశ్ తరపున 53 టెస్టుల్లో 11 సెంచరీల సాయంతో 3525 పరుగులు చేశాడు. చదవండి: Ms Dhoni: ప్రేమించే వారికోసం ఎంతదూరమైనా.. అదీ ధోని అంటే! -
T20 World Cup 2021: స్టార్ ఓపెనర్‌కు మొండిచేయి.. బంగ్లా జట్టు ఇదే
ఢాకా: ఐసీసీ టీ 20 ప్రపంచకప్ 2021 సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ) 15 మందితో కూడిన ప్రాబబుల్స్‌ను ప్రకటించింది. మహ్మదుల్లా కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో ఆసీస్, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొన్న ఆటగాళ్లకే తొలి ప్రాధాన్యం ఇచ్చింది. షీకీబ్ ఆల్ హసన్, ముష్ఫీకర్ రహీమ్, లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, ముస్తాఫిజుర్ రెహ్మన్ లాంటి ఆటగాళ్లు చోటు దక్కించుకోగా.. బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్‌కు మాత్రం మొండిచేయి చూపింది. గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న తమీమ్‌ను బీసీబీ పరిగణలోకి తీసుకోలేదు. చదవండి: BAN Vs NZ: ముస్తాఫిజుర్ స్టన్నింగ్ క్యాచ్.. మోచేతికి దెబ్బ తగిలినా ఇక స్టాండ్ బై ప్లేయర్స్‌గా రూబెల్ హుస్సెన్, అమినుల్ ఇస్లామ్ బిప్లాబ్లను ఎంపిక చేసింది. ఇటీవలే ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న బంగ్లాదేశ్ .. తాజాగా కివీస్‌పై ట20 సిరీస్‌ను గెలుచుకునే పనిలో ఉంది. ఇప్పటికే 3-1 తేడాతో ఆధిపత్యంలో ఉన్న బంగ్లా చివరి టీ20ని గెలిచి 4-1తో ముగించాలని భావిస్తోంది. అయితే బంగ్లాదేశ్ సూపర్ 12లో ఎంటర్ కావాలంటే ముందుగా క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుంది. క్వాలిఫయింగ్ దశలో గ్రూఫ్ బిలో ఉన్న బంగ్లాదేశ్‌తో పాటు స్కాట్లాండ్, పపువా న్యూ జినియా, ఒమన్ ఉన్నాయి. ఇక గ్రూఫ్ ఏలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా ఉన్నాయి. చదవండి: Ishan Kishan T20 World Cup 2021: ఎంపికయ్యానని తెలియగానే ఏడ్చేశాడు టీ20 ప్రపంచకప్ బంగ్లాదేశ్ టీ 20 జట్టు: మహ్మదుల్లా (కెప్టెన్), నయీమ్ షేక్, సౌమ్య సర్కార్, లిట్టన్ కుమార్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొసైన్, నూరుల్ హసన్ సోహన్, షాక్ మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మన్, షోరిఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, షైఫ్ ఉద్దీన్, షైఫ్ ఉద్దీన్, షామిమ్ ఉద్దీన్ స్టాండ్ బై ప్లేయర్స్: రూబెల్ హుస్సేన్, అమీనుల్ ఇస్లాం బిప్లాబ్ Bangladesh have announced their 15-member squad for the ICC Men’s #T20WorldCup 2021! 🚨 All you need to know 👇 — ICC (@ICC) September 9, 2021 -
'నాకు దేశభక్తి ఎక్కువ.. ఐపీఎల్ ఆడను'
ఢాకా: ఐపీఎల్ కంటే దేశం తరపున ఆడడమే తనకు ముఖ్యమని బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ స్పష్టం చేశాడు. ఏప్రిల్‌లో మొదలవనున్న ఐపీఎల్ 2021 సీజన్ సమయంలోనే బంగ్లా క్రికెట్ బోర్డు(బీసీబీ) లంకతో టెస్టు సిరీస్ ఆడాలని సోమవారం నిర్ణయం తీసుకుంది. కాగా బీసీబీ నిర్ణయం తీసుకున్న రోజే తాను ఐపీఎల్ ఆడేందుకు అనుమతి ఇవ్వాలంటూ మరో ఆల్‌రౌండర్ షకీబ్ ఆల్ హసన్ కోరాడు.దీనిపై నిరాశ చెందిన బీసీబీ ఐపీఎల్ ఆడాలనుకునేవారికి ఎన్వోసీ ఇస్తామని... లీగ్‌లో పాల్గొనే వారిని తాము అడ్డుకోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ముస్తాఫిజుర్ స్పందించాడు. ' నాకు దేశ భక్తి ఎక్కువ. ఐపీఎల్ కంటే దేశానికి ప్రాధాన్యమిస్తా. బంగ్లా బోర్డు ఏది చెబితే అదే చేస్తా. ఒకవేళ శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు నా పేరును ప్రకటిస్తే దేశానికి ఆడేందుకే ప్రాధాన్యమిస్తా. ఐపీఎల్ దృష్యా ఒకవేళ బోర్డు లంకతో సిరీస్‌కు తన పేరును పరిగణలోకి తీసుకోకుంటే ఆ విషయం వాళ్లే స్వయంగా చెబుతారు. వారు ఎన్వోసీ ఇచ్చేవరకు వేచిచూస్తా.. అప్పుడే ఐపీఎల్లో ఆడేందుకు వెళ్తా. ఐపీఎల్లో పాల్గొనమని బోర్డు ఎన్వోసీ ఇచ్చినా నా మొదటి ప్రాధాన్యం దేశ భక్తిపైనే ఉంటుంది.' అని రెహ్మాన్ స్పష్టం చేశాడు. కాగా ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను రాజస్తాన్ రాయల్స్ కనీస ధర రూ. కోటికి దక్కించుకోగా.. ఆల్‌రౌండర్ షకీబ్ ఆల్ హసన్‌ను కేకేఆర్ రూ.3.20 కోట్లకు కొనుగోలు చేసింది. బంగ్లాదేశ్ తరపున ముస్తాఫిజుర్ 14 టెస్టుల్లో 30 వికెట్లు, 61 వన్డేల్లో 115 వికెట్లు, 41 టీ20ల్లో 58 వికెట్లు తీశాడు. ఇక ఐపీఎల్లో 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడిన ముస్తాఫిజుర్ చక్కగా రాణించాడు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసి ఆ ఏడాది ఎస్ఆర్హెచ్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 2018 ఐపీఎల్ సీజన్లో ముంబైకి ప్రాతినిధ్యం వహించిన ముస్తాఫిజుర్ మొత్తం 24 మ్యాచ్‌లాడి 24 వికెట్లు తీశాడు. చదవండి: విదేశీ బౌలర్లకు అంత ఇచ్చి.. అతనికి ఇంత తక్కువ సన్‌రైజర్స్‌కు వార్నర్ షాక్ ఇవ్వనున్నాడా! -
బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ ఆత్మహత్య
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రాబోయే బంగాబందు టీ-20 టోర్నమెంట్లో చోటు దక్కకపోవడంతో నిరాశ చెంది బంగ్లాదేశ్ అండర్ -19 మాజీ ఆటగాడు మహమ్మద్ సోజిబ్(21) శనివారం రాజ్‌షాహిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. టోర్నమెంట్లో తనకు అవకాశం కచ్చితంగా లభిస్తుందని తన చుట్టూ ఉన్న వ్యక్తులతో సోజిబ్ తెలిపాడు. టీ-20 ఆటగాళ్ల జాబితాలో తన పేరు రాలేదని నిరాశకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తల్లిదండ్రులు తెలిపారు. మహమ్మద్ సోజిబ్ మృతిని దుర్గాపూర్ పోలీస్ స్టేషన్ అధికారి హష్మోత్ అలీ ధ్రువీకరించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం సోజిబ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 2017లో అండర్ -19 ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ తాత్కాలిక జట్టులో సోజిబ్ పాల్గొన్నాడు. అతడు 2018 అండర్ -19 ప్రపంచ కప్‌లో స్టాండ్-బై ప్లేయర్ గా ఉన్నాడు. చదవండి: మొదటి బంతికే డకౌట్, సారీ చెప్పిన బౌలర్ -
పెద్ద మనసు చాటుకున్న వెటోరి
ఢాకా: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, బంగ్లాదేశ్ స్పిన్ బౌలింగ్ కోచ్ డేనియల్ వెటోరి పెద్ద మనసు చాటుకున్నాడు. తన జీతంలో కొంత భాగాన్ని కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బోర్డు సిబ్బందికి ఇవ్వాల్సిందిగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును (బీసీబీ) కోరాడు. ఈ విషయాన్ని బీసీబీ సీఈవో నిజాముద్దీన్ ప్రకటించారు. అయితే ఎంత మొత్తాన్ని వెటోరి విరాళంగా ప్రకటించాడో మాత్రం ఆయన గోప్యంగా ఉంచారు. టి20 ప్రపంచకప్ ముగిసేవరకు బంగ్లాదేశ్ కోచింగ్ బృందంలో ఉండనున్న 41 ఏళ్ల వెటోరికి బంగ్లాదేశ్ బోర్డు మొత్తం 2,50,000 డాలర్లు (రూ. కోటీ 88 లక్షలు) చెల్లించనుంది. -
మీ కోచింగ్ పదవి నాకొద్దు..
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ జట్టు తమ టెస్టు జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పని చేయాలంటూ చేసిన ప్రతిపాదనను భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ తిరస్కరించాడు. ముందే కుదుర్చుకున్న ప్రొఫెషనల్ ఒప్పందాలతో పాటు వ్యక్తిగత అం శాలు కూడా ఇందుకు కారణమని అతను చెప్పాడు. 12 టెస్టులు, 15 వన్డేలు ఆడిన బంగర్ భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా ఐదేళ్ల పాటు అద్భుతమైన ఫలితాలు సాధించాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్ లోపాలను సరిదిద్ది వారిని అత్యుత్తమంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు. తమ టెస్టు జట్టును పటిష్టపర్చేందుకు బంగ్లాదేశ్ బంగర్ సేవలను కోరింది. అయితే ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న అతను తన వల్ల కాదని చెప్పాడు. ఇప్పటికే బంగ్లాదేశ్ బ్యాటింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు నీల్ మెకెంజీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాను పరిమిత ఓవర్లు, టీ 20లకు మాత్రమే బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతానని కొద్దిరోజుల క్రితం బీసీబీకి తెలిపాడు. దీంతో టెస్టు ఫార్మాట్‌కు కొత్త బ్యాటింగ్ కోచ్‌కు అన్వేషణ మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే బీసీబీ సంజయ్ బంగర్‌ను కలిసినట్లు తెలిసింది. కాగా టెస్టులకు కొత్త బ్యాటింగ్ కోచ్ వచ్చేవరకు మెకేంజీనే మూడు ఫార్మాట్లలో బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతాడని బీసీబీ స్పష్టం చేసింది. కాగా సంజయ్ బంగర్ 2014 నుంచి 2019 వరకు టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. -
బంగ్లా బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా సంజయ్ బంగర్?
ఢాకా : అన్నీ అనుకున్నట్లు జరిగితే టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ బంగర్‌ను జూన్‌లో ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ జట్టుకు టెస్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా చూడొచ్చు. ఇందుకు సంబంధించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(బీసీబీ) సంజయ్ బంగర్‌ను టెస్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా తీసుకోవాలనే యోచనలో ఉంది. ' మేము సంజయ్ బంగర్‌తో ఈ విషయమై చర్చించాము.. కానీ తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ బంగర్ రాలేని అవకాశం ఉంటే మిగతావాళ్లతో కూడా టచ్‌లో ఉంటాము' అని బీసీబీ ఎగ్జిక్యూటివ్ కోచ్ నిజాముద్దీన్ చౌదరీ పేర్కొన్నాడు. (టెస్టు చాంపియన్‌షిప్‌పై వకార్ యూనిస్ అసంతృప్తి) కాగా ఇప్పటికే బంగ్లాదేశ్ బ్యాటింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు నీల్ మెకెంజీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాను పరిమిత ఓవర్లు, టీ 20లకు మాత్రమే బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతానని కొద్దిరోజుల క్రితం బీసీబీకి తెలిపాడు. దీంతో టెస్టు ఫార్మాట్‌కు కొత్త బ్యాటింగ్ కోచ్‌కు అన్వేషణ మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే బీసీబీ సంజయ్ బంగర్‌ను కలిసినట్లు తెలిసింది. కాగా టెస్టులకు కొత్త బ్యాటింగ్ కోచ్ వచ్చేవరకు మెకేంజీనే మూడు ఫార్మాట్లలో బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతాడని బీసీబీ స్పష్టం చేసింది. కాగా సంజయ్ బంగర్ 2014 నుంచి 2019 వరకు టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన సంగతి తెలసిందే. ఒకవేళ బంగర్ బంగ్లా జట్టుకు టెస్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వస్తే మాత్రం జూన్ 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకు కొనసాగే అవకాశం ఉంది. ('ధోని ఇక జట్టులోకి రావడం కష్టమే') -
మాకు కోహ్లి కావాలి: బంగ్లాదేశ్
ఢాకా: బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబూర్ రెహ్మాన్ శతజయంతి సందర్భంగా వచ్చే నెలలో ఆసియా ఎలెవన్, ప్రపంచ ఎలెవన్ జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్‌లను నిర్వహించడానికి ఆ దేశ క్రికెట్ బోర్డు(బీసీబీ) ఇప్పటికే సగం ఏర్పాట్లును పూర్తి చేసింది. ఇంకా షెడ్యూల్, ఆటగాళ్ల పూర్తి వివరాలను ఖరారు చేయాల్సి ఉండగా దానిపై తమ కార్యాచరణను ముమ్మరం చేసింది. మార్చి 18-22 మధ్యలో రెండు టీ20లను జరపాలని బంగ్లాదేశ్ యోచిస్తోంది. దీనిలో భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని కచ్చితంగా ఆసియా ఎలెవన్ జట్టులో ఉంచాలని బీసీబీ పట్టుదలతో ఉంది. (ఇక్కడ చదవండి: పాక్ వద్దు.. భారత్ ముద్దు) ‘మేము ఇంకా షెడ్యూల్, అందుబాటులో ఉండే ఆటగాళ్లపై కసరత్తులు చేస్తున్నాం. మరో రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మేము ప్రస్తుతం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీ)తో టచ్‌లో ఉన్నాం. భారత్ నుంచి ఏ ఆటగాళ్లు ఉంటారు అనే దానిపై వివరణ కోరాం. కాకపోతే కోహ్లి కచ్చితంగా ఉండాలని బీసీసీఐకి విజ్క్షప్తి చేశాం. దీనిపై బీసీసీఐ సానుకూలంగా స్పందించింది. ఈ విషయాన్ని బీసీసీఐ పరిశీలిస్తోంది. కోహ్లితో మాట్లాడిన తర్వాత మాకు సందేశం పంపొచ్చు. ఈ రెండు టీ20ల సిరీస్‌లో కోహ్లి ఉంటాడనే భావిస్తున్నాం’ బీసీబీ తెలిపింది.(ఇక్కడ చదవండి: ‘మేము రావట్లేదు.. మీరే ఆడుకోండి’) అయితే భారత్ నుంచి నాలుగు నుంచి ఐదుగురు ప్లేయర్లను ఆసియా ఎలెవన్ తరఫున ఆడటానికి పంపించడానికి సిద్ధమవుతున్న విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. కాకపోతే ఆ క్రికెటర్ల పేర్లు ఇంకా ఖరారు కాలేదన్నాడు. ఆదివారం జరుగనున్న ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బంగ్లాదేశ్ అభ్యర్థనపై బీసీసీఐ చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. రేపు దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై కోహ్లితో ముందుగా చర్చించాలని బీసీసీఐ భావిస్తోంది.