బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ అంతర్జాతీయ టీ20లకు విడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాన్పూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షకీబ్ తన భద్రత గురుంచి కీలక వ్యాఖ్యలు చేశాడు. "బంగ్లాలో నా చివరి టెస్టు ఆడాలని ఉంది. భారత్ నుంచి అక్కడకు వెళ్లేందకు నాకు ఎలాంటి సమస్య ఎదురుకాకపోవచ్చు. కానీ అక్కడ వెళ్తే బయటకు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు.
నా స్నేహితులు, కుటుంబసభ్యులు నా భద్రతపై ఆందోళనతో ఉన్నారు అని షకీబ్ పేర్కొన్నాడు. తాజాగా ఇదే విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ స్పందించాడు. షకీబ్ భద్రతకు బోర్డు ఎటువంటి హామీ ఇవ్వలేదని ఫరూక్ అహ్మద్ స్పష్టం చేశాడు.
"షకీబ్ భద్రత ఆంశం మా చేతుల్లో లేదు. బోర్డు ఎవరికీ వ్యక్తిగతంగా భద్రతను అందించదు. అతడు తన నిర్ణయాన్ని వెల్లడించాడు. అతడి భద్రత విషయంపై ప్రభుత్వ అత్యున్నత స్థాయి వర్గాలు స్పందిస్తాయి. బీసీబీ.. పోలీసు లేదా రాపిడ్ యాక్షన్ బెటాలియన్ వంటి భద్రతా ఏజెన్సీ కాదు. మేము ఈ విషయం గురించి ప్రభుత్వంలో ఎవరితోనూ చర్చించలేదు.
స్వదేశంలో తన చివరి టెస్టు అతడు ఆడవచ్చు. అందుకు ఎటువంటి సమస్య లేదు. షకీబ్ తన జీవితంలో ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అతడితో తన రిటైర్మెంట్ విషయం గురించి ఇంకా మాట్లాడలేదు. రిటైరయ్యేందుకు ఇదే సరైన సమయమని భావించాడు. అతడి నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాము" అని ఫరూక్ పేర్కొన్నారు
Comments
Please login to add a commentAdd a comment