బంగ్లాదేశ్ పురుషల క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా స్టార్ బ్యాటర్ నజ్ముల్ హుస్సేన్ శాంటో ఎంపికయ్యాడు. మూడు ఫార్మాట్లలో తమ జట్టు పగ్గాలను అప్పగిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కాగా టెస్టు, టీ20ల్లో కెప్టెన్‌గా ఉన్న షకీబ్ అల్ హసన్ రాజకీయాలపై దృష్టి సారించడంతో.. అతడి రీ ఎంట్రీ అనిశ్చతి నెలకొంది.
షకీబ్ ప్రస్తుతం కంటి సమస్యతో కూడా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో త్వరలో జరగనున్న శ్రీలంకతో వైట్‌బాల్ సిరీస్‌కు షకీబ్ దూరమయ్యాడు. మరోవైపు స్టార్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటకి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతాడన్నది అనుమానమే.
కాగా వన్డే వరల్డ్‌కప్-2023కు ముందు బంగ్లాదేశ్ వన్డే కెప్టెన్సీ నుంచి తమీమ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో షకీబ్‌ను వన్డే కెప్టెన్‌గా బీసీబీ నియమించింది. అయితే వరల్డ్‌కప్ అనంతరం షకీబ్ కూడా బంగ్లా వన్డే, టీ20 జట్టు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశాడు. కేవలం టెస్టుల్లో మాత్రమే కొనసాగతానని షకీబ్ తెలిపాడు.
అయితే షకీబ్ ఇప్పటిలో రీ ఎంట్రీ ఇచ్చేలా కన్పించడం లేదు. ఈ నేపథ్యంలోనే శాంటోను మూడు ఫార్మట్లలో ఏడాది పాటు కెప్టెన్‌గా బీసీబీ నియమించింది. కాగా శాంటోకు కెప్టెన్‌గా అనుభవం ఉంది. గతేడాది సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో బంగ్లా జట్టుకు శాంటో సారథ్యం వహించాడు. అతడి నాయకత్వంలోని బంగ్లా జట్టు సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది.
అంతకుముందు వన్డే వరల్డ్‌కప్‌లోనూ షకీబ్ గైర్హజరీలో శాంటో జట్టు పగ్గాలను చేపట్టాడు. అతని సారథ్యంలో బంగ్లాదేశ్ 11 మ్యాచ్‌లు ఆడగా.. మూడింట గెలిచింది. సొంతగడ్డపై మార్చిలో శ్రీలంకతో బంగ్లాదేశ్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్‌తో బంగ్లా ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా శాంటో ప్రయాణం ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment