స్వదేశంలో భారత మహిళల జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌ను 1-1తో బంగ్లాదేశ్ డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే. ఢాకా వేదికగా జరిగిన ఆఖరి వన్డే టై కావడంతో ట్రోఫీని ఇరు జట్లు సంయుక్తంగా పంచుకున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. టీమిండియా వంటి పటిష్ట జట్టుపై అద్బుత ప్రదర్శరన కనబరిచిన తమ జట్టుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారీ నజరానా ప్రకటించింది.
తమ మహిళల జట్టుకు 35 లక్షల టాకాలు(భారత కరెన్సీలో సూమారు రూ.27 లక్షలు) ఇవ్వనున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. అదే విధంగా వన్డేల్లో బంగ్లాదేశ్ మహిళల జట్టు తరపున తొలి సెంచరీ సాధించిన ఫర్గానా హోక్‌పై బీసీబీ ఛీప్ నజ్ముల్ హసన్ పాపోన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఫర్గానా అద్బుతమైన బ్యాటర్ అని, బంగ్లా క్రికెట్‌ను మరో స్ధాయికి తీసుకువెళ్తుందని అతడు కొనియాడాడు.
"సాధారణంగా మేము సిరీస్ గెలిస్తే మా జట్లకు బోనస్ ఇస్తాం. కానీ భారత్‌తో సిరీస్ డ్రా అయినప్పటికీ మా జట్టుకు రివార్డు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ సిరీస్‌లో సిరీస్‌లో మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా భారత్‌పై మేము తొలి వన్డే విజయం సాధించాము. అదే విధంగా సెంచూరియన్ ఫర్గానా హోక్ వంటి వ్యక్తిగత ప్రదర్శనలు కూడా ఉన్నాయి.
అందుకే మా ప్లేయర్స్‌కు 25 లక్షల టాకాలు ఇవ్వాలని అనుకుంటున్నాం. అదేవిధంగా సెంచరీతో చెలరేగిన ఫర్గానా 2 లక్షల టాకాలు, వ్యక్తిగత ప్రదర్శన మిగితా ప్లేయర్స్‌కు రివార్డు ఇవ్వనున్నాం. మరోవైపు కోచింగ్ స్టాప్‌ను కూడా ఇందులో భాగం చేయాలి అనకుంటున్నాం. మొత్తంగా 35 లక్షల టాకాలు రివార్డు రూపంలో ఇవ్వనున్నాం" అని నజ్ముల్ హసన్ పాపోన్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment