బంగ్లాదేశ్ పర్యటనకు భారత మహిళల జట్టు అన్ని విధాల సిద్దమవుతోంది. ఈ పర్యటనలో భాగంగా భారత్ మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ అతిథ్య బంగ్లాదేశ్‌తో తలపడనుంది. హర్మాన్ ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు జూలై5న బంగ్లాదేశ్‌కు పయనమైంది. అయితే ఈ మల్టీఫార్మాట్ సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో స్టార్ బౌలర్ శిఖా పాండేకు చోటుదక్కలేదు.
ఈ సిరీస్‌కు తనను ఎంపిక చేయకపోవడంపై శిఖా పాండే అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ తో స్పోర్ట్స్‌స్టార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శిఖా ఏడ్చేసింది. "నేను నిరుత్సాహంగా, కోపంగా లేనని చెబితే నేను అస్సలు మనిషినే కాదు. మనం కష్టపడినదానికి తగిన ఫలితం దక్కకపోతే చాలా బాధగా ఉంటుంది. నన్ను తప్పించడం వెనుక ఎదో పెద్ద కారణం ఉంది.
అది ఎంటో నాకు కూడా చెబితో బాగున్ను. కానీ నేను నా హార్డ్‌వర్క్‌నే నమ్ముతా అంటూ శిఖా పాండే కన్నీరు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా శిఖా పాండే ఇప్పటివరకు 55 వన్డేలు, 56 టీ20ల్లో భారత్ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది.
అదే విధంగా తొలి మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన శిఖా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. అయినప్పటికీ పాండేకు జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం అందరని ఆశ్చర్యపరిచింది. ఆమెతో పాటు బంగ్లాటూర్‌కు రిచా ఘోష్, రేణుకా సింగ్‌కు కూడా చోటు దక్కలేదు.
చదవండి: IND vs WI: అతడిని ఎందుకు సెలక్ట్ చేశారు.. ఏం చేశాడని! పాపం రుత్‌రాజ్
🗣️ Shikha Pandey gets teary-eyed talking about the disappointment of not finding a place in the Indian team.
— Sportstar (@sportstarweb) July 6, 2023
Watch the full interview with @wvraman here ➡️ https://t.co/9H20WnkoZG#WednesdaysWithWV | #WomensCricket pic.twitter.com/d5tJmro6SC
Comments
Please login to add a commentAdd a comment