Indian Captain Harmanpreet Kaur Blasts Bangladesh Cricket Board - Sakshi
Sakshi News home page

#HarmanpreetKaur: 'డేర్‌ అండ్‌ డాషింగ్‌' హర్మన్‌ప్రీత్‌.. కుండ బద్దలయ్యేలా!

Published Sun, Jul 23 2023 8:58 AM | Last Updated on Sun, Jul 23 2023 12:00 PM

Harmanpreet-Blasts BCB-Pathetic Umpiring-Insult-Indian Commission Members - Sakshi

టీమిండియా మహిళల కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఎంత డేర్‌ అండ్‌ డాషింగ్‌గా ఉంటుందో మరోసారి చూపించింది. తాను చెప్పాలనుకున్నది సూటిగా స్పష్టంగా మొహంమీద చెప్పడం ఆమె నైజం. ఇదే ఆమెను అందరిలో స్పెషల్‌గా నిలిపింది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వన్డేలో అంపైరింగ్‌ ప్రమాణాలపై అసహనం వ్యక్తం చేసింది.

మ్యాచ్‌ ముగిసిన అనంతరం ట్రోఫీ అందుకోవడానికి ముందు మాట్లాడుతూ.. ''ఈ మ్యాచ్‌తో మేం చాలా నేర్చుకున్నాం. అంపైరింగ్‌ ప్రమాణాలను కూడా చూశాం. చాలా ఘోరంగా ఉంది. మేం మళ్లీ బంగ్లాదేశ్‌కు వచ్చినప్పుడు దాని కోసం కూడా సిద్ధమై రావాలేమో. ఇక మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన ఇండియన్‌ హైకమీషన్‌కు కనీసం స్వాగతం పలకలేదు. బంగ్లాదేశ్‌ క్రికెట్‌లో అంపైరింగే అనుకున్నాం.. కనీస మర్యాదలకు కూడా చోటు లేదు. మీరు మ్యాచ్‌కు వచ్చినందుకు మా ఇండియన్‌ టీమ్‌ తరపున హైకమీషన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.'' అంటూ పేర్కొంది.

హర్మన్‌ప్రీత్‌ చేసిన వ్యాఖ్యలు టీమిండియా అభిమానులను ఆకట్టుకున్నాయి. ''బహుశా పురుషుల క్రికెట్‌లో కూడా ఇంత ధైర్యంగా మాట్లాడే సాహసం ఎవరు చేయలేదనుకుంటా. కానీ హర్మన్‌ప్రీత్‌ అలా కాదు.. తాను ఏం చెప్పాలనుకుందో అది స్పష్టంగా, ముక్కుసూటిగా చెబుతుంది.. అందుకే ఆమెంటే మాకు గౌరవం'' అంటూ కామెంట్‌ చేశారు.

తప్పుడు నిర్ణయం.. అంపైర్‌పై కోపంతో
బంగ్లాదేశ్ బౌలర్ నహిదా అక్తర్ వేసిన 34 ఓవర్లో నాలుగో బంతికి భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ స్వీప్ షాట్ ఆడింది. అయితే, బంతి బ్యాట్‍కు తగలకుండా.. ప్యాడ్‍కు తగిలింది. బంగ్లా ప్లేయర్లు అప్పీల్ చేయగా.. అంపైర్ ఎల్‍బీడబ్ల్యూ ఔట్ ఇచ్చాడు. బంతికి లెంగ్ స్టంప్‍ అవతల పిచ్ అయిందని, నాటౌట్ అని హర్మన్ భావించింది.

దీంతో అంపైర్ నిర్ణయంపై ఆగ్రహించిన హర్మన్.. బ్యాట్‍తో వికెట్లను కొట్టింది. కనీస ధర్మాన్ని పాటించడం లేదంటూ అంపైర్‌ను తిట్టుకుంటూ పెవిలియన్‌ వైపు వెళ్లింది. ఈ సమయంలో బంగ్లా అభిమానుల్లో కొంతమంది ఆమెను రెచ్చగొట్టే ప్రయత్నం చేయగా.. హర్మన్‌ప్రీత్‌ వ్యంగ్యంగా వారికి బొటనవేలు చూపించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: IND vs BAN: కోపంతో ఊగిపోయిన టీమిండియా కెప్టెన్‌.. బ్యాట్‌తో వికెట్లను కొట్టి! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement