umpiring
-
'డేర్ అండ్ డాషింగ్' హర్మన్‌ప్రీత్.. కుండ బద్దలయ్యేలా!
టీమిండియా మహిళల కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఎంత డేర్ అండ్ డాషింగ్‌గా ఉంటుందో మరోసారి చూపించింది. తాను చెప్పాలనుకున్నది సూటిగా స్పష్టంగా మొహంమీద చెప్పడం ఆమె నైజం. ఇదే ఆమెను అందరిలో స్పెషల్‌గా నిలిపింది. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వన్డేలో అంపైరింగ్ ప్రమాణాలపై అసహనం వ్యక్తం చేసింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ట్రోఫీ అందుకోవడానికి ముందు మాట్లాడుతూ.. ''ఈ మ్యాచ్‌తో మేం చాలా నేర్చుకున్నాం. అంపైరింగ్ ప్రమాణాలను కూడా చూశాం. చాలా ఘోరంగా ఉంది. మేం మళ్లీ బంగ్లాదేశ్‌కు వచ్చినప్పుడు దాని కోసం కూడా సిద్ధమై రావాలేమో. ఇక మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఇండియన్ హైకమీషన్‌కు కనీసం స్వాగతం పలకలేదు. బంగ్లాదేశ్ క్రికెట్లో అంపైరింగే అనుకున్నాం.. కనీస మర్యాదలకు కూడా చోటు లేదు. మీరు మ్యాచ్‌కు వచ్చినందుకు మా ఇండియన్ టీమ్ తరపున హైకమీషన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.'' అంటూ పేర్కొంది. Indian Captain Harmanpreet Kaur blasts Bangladesh Cricket board, calls the umpiring and management pathetic. She also exposed the board for insulting the members of the Indian high commission by not inviting them on the stage. Sherni standing up for 🇮🇳 without any fear. pic.twitter.com/HNHXB3TvdW — Roshan Rai (@RoshanKrRaii) July 22, 2023 హర్మన్‌ప్రీత్ చేసిన వ్యాఖ్యలు టీమిండియా అభిమానులను ఆకట్టుకున్నాయి. ''బహుశా పురుషుల క్రికెట్లో కూడా ఇంత ధైర్యంగా మాట్లాడే సాహసం ఎవరు చేయలేదనుకుంటా. కానీ హర్మన్‌ప్రీత్ అలా కాదు.. తాను ఏం చెప్పాలనుకుందో అది స్పష్టంగా, ముక్కుసూటిగా చెబుతుంది.. అందుకే ఆమెంటే మాకు గౌరవం'' అంటూ కామెంట్ చేశారు. తప్పుడు నిర్ణయం.. అంపైర్‌పై కోపంతో బంగ్లాదేశ్ బౌలర్ నహిదా అక్తర్ వేసిన 34 ఓవర్లో నాలుగో బంతికి భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ స్వీప్ షాట్ ఆడింది. అయితే, బంతి బ్యాట్‌కు తగలకుండా.. ప్యాడ్‌కు తగిలింది. బంగ్లా ప్లేయర్లు అప్పీల్ చేయగా.. అంపైర్ ఎల్బీడబ్ల్యూ ఔట్ ఇచ్చాడు. బంతికి లెంగ్ స్టంప్ అవతల పిచ్ అయిందని, నాటౌట్ అని హర్మన్ భావించింది. దీంతో అంపైర్ నిర్ణయంపై ఆగ్రహించిన హర్మన్.. బ్యాట్‌తో వికెట్లను కొట్టింది. కనీస ధర్మాన్ని పాటించడం లేదంటూ అంపైర్‌ను తిట్టుకుంటూ పెవిలియన్ వైపు వెళ్లింది. ఈ సమయంలో బంగ్లా అభిమానుల్లో కొంతమంది ఆమెను రెచ్చగొట్టే ప్రయత్నం చేయగా.. హర్మన్‌ప్రీత్ వ్యంగ్యంగా వారికి బొటనవేలు చూపించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The controversial dismissal of Harmanpreet Kaur #CricketTwitter #BANvIND pic.twitter.com/XEGdTMgRJd — Female Cricket (@imfemalecricket) July 22, 2023 చదవండి: IND vs BAN: కోపంతో ఊగిపోయిన టీమిండియా కెప్టెన్.. బ్యాట్‌తో వికెట్లను కొట్టి! వీడియో వైరల్ -
అంపైర్ల నియామకానికి రాత పరీక్ష.. పిచ్చి ప్రశ్నలతో విసిగించిన బీసీసీఐ
క్రికెట్లో అంపైర్ల పాత్ర కీలకమైనది. అది ఫీల్డ్ అంపైర్లు కావొచ్చు.. థర్డ్ అంపైర్ కావొచ్చు. అంపైర్లు తీసుకునే నిర్ణయాలపైనే ఆటగాళ్ల భవితవ్యం ఆధారపడి ఉంది. అంపైర్ నిర్ణయంపై అప్పీల్ చేసుకోవడానికి ఇప్పుడంటే డీఆర్ఎస్ రూపంలో ఒక ఆప్షన్ ఉంది. కానీ డీఆర్ఎస్ లేనప్పుడు అంపైర్‌దే కీలక నిర్ణయం.రనౌట్, స్టంపింగ్ మినహా మిగతా ఎలాంటి నిర్ణయాలైనా అంపైర్ తీర్పు ఫైనల్‌గా ఉంటుంది. కొన్నిసార్లు ఔట్ కాకపోయినప్పటికి.. అంపైర్ తప్పుడు నిర్ణయాల వల్ల బ్యాట్స్మెన్లు బలైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒక్కోసారి అవి మేలుచేస్తే.. కొన్నిసార్లు కీడు చేశాయి. తప్పుడు అంపైరింగ్ వల్ల ఆటగాళ్లు ఫీల్డ్ అంపైర్లతో గొడవకు కూడా దిగిన సందర్బాలు కోకొల్లలు. డీఆర్ఎస్ రూల్ వచ్చినప్పటికి.. ఇప్పటికీ ఫీల్డ్ అంపైర్లకే సర్వాధికారాలు ఉంటాయి. థర్డ్ అంపైర్ ఔట్ కాదని ప్రకటించినా.. ఒకవేళ ఫీల్డ్ అంపైర్లు ఔట్ ఇస్తే బ్యాటర్ వెనుదిరగాల్సిందే. ఇలాంటివి అంతర్జాతీయ క్రికెట్ సహా బిగ్‌బాష్ లీగ్, ఐపీఎల్ సహా ఇతర ప్రైవేట్ లీగ్స్‌లో చాలానే చోటుచేసుకుంటున్నాయి. కాగా క్రికెట్లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న భారత్‌లోనూ అంపైరింగ్ వ్యవస్థ ఎప్పటిలాగే ఉంటుంది. ఇటీవలే ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో కూడా అంపైర్ల నిర్ణయాలపై తీవ్ర దుమారం రేగుతుండడంతో బీసీసీఐ.. అంపైరింగ్ స్థాయిని పెంచేందుకు చర్చలు తీసుకోవడం మొదలెట్టింది. కొత్త అంపైర్లను తీసుకునే నియామక ప్రక్రియలో అత్యంత కఠినమైన పరీక్షలు నిర్వహించాలని భావించింది. అందుకే గ్రూప్-డి అంపైరింగ్ నియమాకాల కోసం (మహిళలు, జూనియర్ మ్యాచులు) బీసీసీఐ రాత పరీక్ష నిర్వహించింది. 200 మార్కులకు జరిగిన ఈ పరీక్షలో క్వాలిఫికేషన్ మార్కులు 90. 200 మార్కుల్లో.. రాత పరీక్షకు 100 మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూకి 35 మార్కులు, వీడియో ఇంటర్వ్యూకి 35 మార్కులు ఉంటాయి. ఫిజికల్ టెస్టుకి మిగిలిన 30 మార్కులు ఉంటాయి. అయితే అంపైర్ల నియామకాల కోసం బీసీసీఐ నిర్వహించిన రాతపరీక్షలో కొన్ని పిచ్చిప్రశ్నలతో అభ్యర్థులను విసిగించింది. రాత పరీక్షలో ప్రశ్నలన్నీ కఠినంగా ఉన్నప్పటికి.. కొన్ని మాత్రం వింతగా ఉండడంతో ఆశ్చర్యపోవడం ఖాయం. అలాంటి కొన్ని ప్రశ్నలు మీకోసం.. చదివేయండి. ►పెవిలియన్‌లో ఫ్లడ్ లైట్స్‌తో పాటు స్టేడియం స్టాండ్స్ నీడ పడడం సహజం. అలాగే ఫీల్డర్ నీడ కూడా పిచ్‌పై పడుతూ ఉంటుంది. అలాంటి సమయంలో బ్యాటర్, అంపైర్‌కి ఫిర్యాదు చేస్తే... ఏం చేస్తారు? ►బౌలర్ గాయపడి చేతికి బ్యాండేజీ కట్టుకున్నాడు. అది నిజమైనది కాదని, మీరు దాన్ని పీకేశారు. అప్పుడు రక్తస్రావం అయ్యింది. మీరేం చేస్తారు? అతనితో బౌలింగ్ చేయనిస్తారా? ►షార్ట్ లెగ్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్ హెల్మెట్ పెట్టుకోవచ్చు. అలా ఫీల్డర్ హెల్మెట్‌లో బ్యాటర్ కొట్టిన బంతి వెళ్లి ఇరుక్కుని, దాన్ని ఫీల్డర్ క్యాచ్‌గా పట్టుకుంటే అది ఔట్‌గా పరిగణిస్తారా? పైన చెప్పుకున్నవి కేవలం సాంపుల్.. ఇలాంటి వింత ప్రశ్నలు మరో 37 ఉన్నాయి. గత నెల అహ్మదాబాద్‌లో నిర్వహించిన ఈ పరీక్షకు 140 మంది హాజరయితే పరీక్ష రాయగా.. అందులో నుంచి ముగ్గురిని మాత్రమే ఎంపిక చేయనున్నారు.'' ఇది కేవలం క్రికెట్ రూల్స్ గురించి మాత్రమే కాదు. భిన్నమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఒక అంపైర్ సమయోచితంగా ఎలా నిర్ణయం తీసుకుంటాడనేది ముఖ్యం. అది తెలుసుకునేందుకు ఇలాంటి క్లిష్టమైన ప్రశ్నలతో పరీక్ష నిర్వహించాం'' అని ఒక బీసీసీఐ అధికారి వెల్లడించారు. -
అంపైరింగ్ విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం
ఇటీవలీ కాలంలో క్రికెట్ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్లు పక్షపాత ధోరణి అవలంభిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సొంత దేశంలో సిరీస్ ఆడుతున్న జట్టుకు అక్కడి లోకల్ అంపైర్స్ మద్దతుగా నిలుస్తూ ప్రత్యర్థి జట్లు సిరీస్‌లు కోల్పోయేలా చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. వీటిలో నిజమెంత అనేది పక్కనబెడితే.. తాజాగా ఐసీసీ అంపైరింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకముందు ఉన్న న్యూట్రల్ అంపైర్(తటస్థ అంపైర్) విధానాన్ని ఐసీసీ తిరిగి తీసుకురానుంది. దీనివల్ల పక్షపాత ధోరణి అనే పదానికి చెక్ పెట్టినట్లు అవుతుందని ఐసీసీ చైర్మెన్ గ్రేగ్ బార్క్లే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవానికి కరోనా ముందు న్యూట్రల్ అంపైరింగ్ వ్యవస్థ అమల్లో ఉండేది. న్యూట్రల్ అంపైరింగ్ అంటే ఒక దేశం మరొక దేశంలో సిరీస్ ఆడేందుకు వెళ్లినప్పుడు లోకల్ అంపైర్లతో పాటు బయటి దేశాలకు చెందిన అంపైర్లు ఫీల్డ్ అంపైర్స్‌గా వ్యవహరించేశారు. అయితే 2020లో కరోనా మహమ్మారి విజృంభించడంతో బయటి దేశాల అంపైర్లపై ట్రావెల్‌పై బ్యాన్ విధించడంతో న్యూట్రల్ అంపైరింగ్ వ్యవస్థకు బ్రేక్ పడింది. అప్పటినుంచి ఏ దేశంలో సిరీస్‌లు జరిగినా ఆ దేశానికి చెందిన వ్యక్తులు ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం పక్కనబెడితే.. ఇటీవలే బంగ్లాదేశ్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటించింది.ఈ టూర్లో సౌతాఫ్రికాకు చెందిన అంపైర్లు మరియస్ ఎరాస్మస్, ఆడ్రియన్ హోల్డ్‌స్టాక్‌లు తమ తప్పుడు నిర్ణయాలతో పక్షపాత ధోరణి చూపించారంటూ విమర్శలు వచ్చాయి. చాలా మంది బంగ్లా ఆటగాళ్ల ఔట్ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని.. దీనివల్ల జట్టు ఓటమిపై ప్రభావం చూపిందంటూ ఆరోపణలు వచ్చాయి. ఇక బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ సౌతాఫ్రికా సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. అయితే న్యూట్రల్ అంపైరింగ్ లేకపోవడం వల్ల.. లోకల్ అంపైర్స్ నిర్ణయాలు తమ కొంప ముంచాయంటూ షకీబ్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం వైరల్‌గా మారింది. షకీబ్ కామెంట్స్ తర్వాత బంగ్లా క్రికెట్ బోర్డు(బీసీబీ) లోకల్ అంపైరింగ్ పక్షపాత ధోరణిపై ఐసీసీ మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ తమ స్వదేశంలో లంకతో ఆడుతున్న సిరీస్‌లో న్యూట్రల్ అంపైర్‌ను ఐసీసీ తాత్కాలికంగా ప్రవేశపెట్టింది. స్థానిక అంపైర్ షర్ఫుద్దౌలాతో పాటు ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ కెటిల్‌బరో, వెస్టిండీస్‌కు చెందిన జోయెల్ విల్సన్‌లను అంపైర్లుగా నియమించడంతో వివాదం సద్దుమణిగింది. ఇక తొందరలోనే న్యూట్రల్ అంపైరింగ్‌ను పూర్తి స్థాయిలో తిరిగి తీసుకురానున్నట్లు ఐసీసీ ప్రకటించింది. చదవండి: IND Vs SA T20 Series: ధావన్ ఎంపికలో అన్యాయం.. కేఎల్ రాహుల్ జోక్యంలో నిజమెంత? Kusal Mendis: మ్యాచ్ జరుగుతుండగానే ఛాతి నొప్పి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు -
T20 WC 2021: అంపైర్‌కు షాకిచ్చిన ఐసీసీ
Umpire Michael Gough Removed From Duties T20 WC 2021: ఇంగ్లీష్ అంపైర్ మైకెల్ గాఫ్‌కు ఐసీసీ షాకిచ్చింది. కరోనా నిబంధనలో భాగమైన బయోబబూల్‌ను ఉల్లఘించినందుకు గాఫ్‌ను ఆరురోజుల పాటు అంపైరింగ్ విధుల నుంచి తప్పిస్తున్నట్లు మంగళవారం పేర్కొంది. ప్రస్తుతం మైకెల్ గాఫ్ టి20 ప్రపంచకప్ 2021లో ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. విషయంలోకి వెళితే.. అక్టోబర్ 29న మైకెల్ గాఫ్ బయోబబూల్‌ను దాటి బయటికి వెళ్లి కొంతమందిని కలిశాడు. ఈ విషయం తెలుసుకున్న ఐసీసీ నిబంధనలు ఉల్లఘించినందుకుగానూ గాఫ్‌ను అంపైరింగ్ విధుల నుంచి తప్పించి ఆరు రోజుల పాటు కఠిన క్వారంటైన్‌కు తరలించింది. బెస్ట్ అంపైర్‌గా ప్రశంసలు పొందిన మైకెల్ గాఫ్ నిజానికి అక్టోబర్ 31న టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌కు అంపైరింగ్ చేయాల్సింది. కానీ 29న ఆయన బయెబబూల్ దాటి వ్యక్తులను కలవడంతో విషయం తెలుసుకున్న ఐసీసీ ఆయన్ను క్వారంటైన్‌కు తరలించింది. దీంతో గాఫ్ స్థానంలో సౌతాఫ్రికా అంపైర్ మరాయిస్ ఎరాస్మస్ అంపైరింగ్ విధులు నిర్వర్తించాడు. కాగా ఆరు రోజుల తర్వాత గాఫ్ తిరిగి ప్రపంచకప్‌లో అంపైరింగ్ విధులు నిర్వహిస్తాడా లేక బయోబబూల్ ఉల్లఘించినందుకు అతనిపై మరే విధంగానైనా చర్యలు తీసుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది. కాగా టి20 ప్రపంచకప్‌లో సూపర్ 12 దశలో గ్రూఫ్ 1 నుంచి ఇంగ్లండ్ సెమీస్‌కు చేరగా.. గ్రూఫ్ 2 నుంచి పాకిస్తాన్ మూడు విజయాలతో టాప్ ప్లేస్‌లో ఉంది. ఇవాళ నమీబియాతో జరగబోయే మ్యాచ్‌లో పాక్ గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టాలని భావిస్తోంది. చదవండి: T20 WC 2021: అంపైర్‌కు షాకిచ్చిన ఐసీసీ.. టీమిండియా, న్యూజిలాండ్ మ్యాచ్‌కు -
పిన్న వయసులోనే ఎలైట్ ప్యానల్లో చోటు
దుబాయ్: వచ్చే 2020-21 సీజన్లో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తమ అంపైర్ల ఎలైట్ ప్యానల్‌ను ప్రకటించింది. ఇందులో భారత్‌కు చెందిన అంపైర్ నితిన్ మీనన్‌కు చోటు కల్పిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. భారత్‌కు చెందిన అంపైర్ నితిన్‌ను ఎలైట్ ప్యానల్ చేర్చే విషయాన్ని ఐసీసీ సోమవారం ప్రకటించింది. దాంతో ఈ సీజన్లో ఐసీసీ అంపైర్ల ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్న పిన్నవయస్కుడిగా 36 ఏళ్ల నితిన్ నిలిచారు. ఇప్పటివరకూ మూడు టెస్టులకు, 24 వన్డేలకు, 16 టీ20లకు నితిన్ అంపైర్‌గా వ్యహరించారు. ఇంగ్లండ్‌కు చెందిన నిగెల్ ఎల్లాంగ్ స్థానంలో నితిన్‌కు అవకాశం దక్కింది. గతంలో శ్రీనివాస్ వెంకట్రాఘవన్, సుందర్ రవిలు ఐసీసీ ఎలైట్ ప్యానల్లో పని చేసిన భారత అంపైర్లు. కాగా, గతేడాది సుందర్ రవిని ఐసీసీ ఎలైట్ ప్యానల్ నుంచి ఐసీసీ తప్పించింది. (కరోనాతో మాజీ క్రికెటర్ మృతి) అంతకుముందు ఎమిరేట్స్ ఐసీసీ ఇంటర్నేషనల్ అంపైర్స్ ప్యానల్లో ఉన్న నితిన్‌ను.. ఎలైట్ ప్యానల్ అంపైర్‌గా ఐసీసీ జనరల్ మేనేజర్ జియోఫ్ అలార్డైస్, మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్, మ్యాచ్ రిఫరీలు రంజన్ మదుగలే, డేవిడ్ బూన్లతో కూడిన ప్యానెల్ ఎంపిక చేసింది. చాలా ఏళ్లుగా భారత అంపైర్ల స్టాండర్డ్స్‌పై విమర్శలు వినిపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరొకసారి భారత్‌కు చెందిన అంపైర్‌కు ఎలైట్ ప్యానల్లో చోటు దక్కడం విశేషం. కొంతకాలంగా నితిన్ అంపైర్‌గా కొన్ని కచ్చితమైన నిర్ణయాలు తీసుకున్న క్రమంలోనే అతనికి ఎలైట్ ప్యానల్లో చోటు కల్పించారు. ‘ఎలైట్ అంపైర్ల ప్యానెల్‌కు తనను ఎంపిక చేయడం గొప్ప గౌరవంగా, గర్వకారణంగా భావిస్తున్నాను. ప్రముఖ అంపైర్లు, రిఫరీలతో ఉన్న ఎలైట్ ప్యానల్లో చేరాలనేది నా కల. కల ఇన్నాళ్లకు నిజం కావడం అదృష్టంగా భావిస్తున్నాను’ అని నితిన్ ఆనందం వ్యక్తం చేశారు. (30 నిమిషాల కామెంటరీ అనుకుంటే..) నా తండ్రి కూడా అంపైరే ‘నా తండ్రి నరేంద్ర మీనన్ కూడా అంతర్జాతీయ అంపైరే. 2006లో బీసీసీఐ అంపైర్ల కోసం ఒక ఎగ్జామ్ నిర్వహించింది. అంతకు పూర్వం పది సంవత్సరాల క్రితం నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నువ్వు క్లియర్‌గా ఉంటే అంపైరింగ్ కోసం ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకో అన్నారు. నాకు అంపైరింగ్ అంటే ఇష్టం దాంతోనే అంపైరింగ్ పరీక్ష రాయడం జరిగింది. అలా నేను అంపైర్‌ను అయ్యాను’ అని మీనన్ తన జర్నీని రెండు మాటల్లో చెప్పేశారు. -
‘ఆ సమయంలో నిద్రపట్టేది కాదు’
క్రికెట్ ప్రపంచలో దిగ్గజ అంపైర్లలో ఒకరైన స్టీవ్ బక్నర్ మైదానంలో తాను తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయాల వల్ల నిద్రలేని రాత్రులు గడిపానని అన్నారు. రెండు సార్లు తాను తీసుకున్న పొరపాటు నిర్ణయాలను ఆయన గుర్తు చేసుకున్నారు. రెండు సందర్భాల్లోనూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బలయ్యాడని చెప్పారు. అయితే, అవన్నీ పొరపాటు నిర్ణయాలేననని వెల్లడించారు. మాన్సన్ అండ్ గెస్ట్స్ అనే రేడియా కార్యక్రమంలో బక్నర్ ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. (చదవండి: సానియాతో పెళ్లి.. మాలిక్ ఏమన్నాడంటే) ‘2003 గాబా టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్ జాసన్ గిలెస్పీ వేసిన బంతికి సచిన్ ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే, ఆ బంతి వికెట్ల పైనుంచి చాలా ఎత్తులో వెళ్తున్నట్టు రిప్లేలో తేలింది. మరోసారి 2005 కోల్‌కతా వన్డేలో పాకిస్తాన్ బౌలర్ అబ్దుల్ రజాక్ వేసిన బంతికి సచిన్‌ను క్యాచ్ ఔట్‌గా ప్రకటించా. కానీ, తర్వాత తెలిసింది, అది బ్యాట్‌కు తాకనే లేదని. మనుషులన్నాక పొరపాట్లు సహజం. అయితే, వాటిని అంగీకరించాలి. ఏ అంపైర్ కూడా తప్పుడు నిర్ణయాలు కావాలని తీసుకోడు. ఈడెన్ గార్డెన్స్‌లో కిక్కిరిసిన అభిమానుల హర్షధ్వానాలే రెండో పొరపాటుకు కారణమని భావిస్తున్నా. లక్ష మంది ఆ మ్యాచ్ వీక్షిస్తుండటంతో బంతి బ్యాట్‌కు తగిలింది లేనిది గ్రహించలేకపోయా. నా నిర్ణయాలకు చింతిస్తున్నా. వాటి వల్లే నా కెరీర్ ప్రమాదంలో పడొచ్చని అనుకుంటున్నా. పొరపాటు నిర్ణయాలు తీసుకున్నప్పుడు రాత్రుళ్లు నిద్రపట్టేది కాదు’ అని బక్నర్ అన్నారు. ఇక క్రికెట్లో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, డీఆర్ఎస్ పద్ధతి పొరపాటు నిర్ణయాలు సమీక్షించుకునేందుకు చక్కని అవకాశాలు ఇచ్చాయన్నారు. అవి అంపైరింగ్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చెప్పలేను కానీ, నిర్ణయాల్లో కచ్చితత్వం తెస్తాయని మాత్రం చెప్పగలనని బక్నర్ పేర్కొన్నారు. (ప్రపంచకప్‌లో తప్పకుండా ఆడతా) -
‘400 నాటౌట్.. 434 ఛేజింగ్ చూశా’
పెర్త్: పాకిస్తాన్‌కు చెందిన అంపైర్ అలీమ్ దార్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. టెస్టు ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్‌లకు అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రికార్డును అలీమ్ దార్ తన పేరిట లిఖించుకున్నారు. తద్వారా ఇప్పటివరకూ వెస్టిండీస్ అంపైర్ స్టీవ్ బక్నర్ పేరిట ఉన్న అత్యధిక టెస్టు మ్యాచ్‌ల అంపైరింగ్ రికార్డును అలీమ్ దార్ బ్రేక్ చేశారు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య పెర్త్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌కు అంపైర్‌గా చేయడం ద్వారా అలీమ్ దార్ ఈ రికార్డును నెలకొల్పారు. 207 వన్డేలకు, 46 అంతర్జాతీయ టీ20లకు అంపైర్‌గా పని చేసిన అలీమ్ దార్‌కు ఇది 129వ టెస్టు మ్యాచ్ అంపైరింగ్ కావడం విశేషం. 1989-2009 మధ్య కాలంలో బక్నర్ 128 టెస్టులకు 181 వన్డేలకు అంపైర్‌గా పని చేశారు. కాగా, వన్డేల్లో అంపైరింగ్ రికార్డును అందుకోవడానికి ఇంకా రెండు మ్యాచ్‌లు దూరంలో ఉన్నారు దార్. దక్షిణాఫ్రికాకు చెందిన రూడీ కోర్టెజన్ 209 వన్డేలకు అంపైర్‌గా చేసి తొలి స్థానంలో ఉన్నారు. పాకిస్తాన్లో దశాబ్దానికి పైగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడిన 51 ఏళ్ల అలీమ్ దార్.. తన ఆన్ ఫీల్డ్ అంపైరింగ్ కెరీర్‌ను 2003లో ఇంగ్లండ్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఢాకాలో జరిగిన మ్యాచ్ ద్వారా ఆరంభించారు. తన తాజా ఘనతపై అలీమ్ దార్ మాట్లాడుతూ.. ‘ నేను అంపైరింగ్ కెరీర్ మొదలుపెట్టే సమయానికి నేను దీన్ని సాధిస్తానని అనుకోలేదు. ఇది నా అంపైరింగ్ కెరీర్లో ఒక మైలురాయి. ఎన్నోవేల మైళ్ల ప్రయాణంలో ఇదొక తీపి జ్ఞాపకం. నా ప్రయాణంలో ఎన్నో ఘనతలు చూశా. టెస్టు ఫార్మాట్లో బ్రియాన్ లారా అజేయంగా 400 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరుతో పాటు 2006లొ ఆస్ట్రేలియా నిర్దేశించిన 434 పరుగుల వన్డే లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేజింగ్ చేయడం కూడా చూశా’ అని అలీమ్ దార్ ఆనందం వ్యక్తం చేశారు. -
భారత అంపైర్లకు మరో పదేళ్లు పడుతుంది
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఎలైట్ ప్యానల్లో చేరేందుకు భారత అంపైర్లకు మరో పదేళ్లు పడుతుందని రిటైర్డ్ అంపైర్ సైమన్ టౌఫెల్ అన్నాడు. మంగళవారం ఆయన ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ ఈ విషయం పేర్కొన్నాడు. ‘ప్రపంచ స్థాయి అంపైర్ కావాలంటే కనీసం పదేళ్లు పడుతుంది. మేం భారత్‌లో ఈ కార్యక్రమాన్ని 2006లో మొదలుపెట్టి 2016లో ముగించాం. ఎలైట్ ప్యానల్లో అడుగుపెట్టడానికి భారత్ నుంచి అంపైర్ ఎస్.రవికి కనీసం పదేళ్లు పట్టింది. అందుకే బీసీసీఐ ఈ విషయంపై పునరాలోచించాలి. భారత్‌కు అంపైర్లు అవసరం. దేశవాళీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తానంటున్న బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఈ విషయంపైనా దృష్టి పెట్టాలి. అంపైర్లు ఎదిగే వాతావరణాన్ని సృష్టించాలి. అంపైర్ల కోసం ప్రత్యేకంగా మేనేజర్లు, కోచ్‌లు, ట్రైనర్లను నియమించాలి’అని పేర్కొన్నాడు. కాగా భారత్ నుంచి ఎలైట్ ప్యానల్లో 2015లో చోటు దక్కించుకున్న రవి విధుల్లో పదే తప్పులు చేస్తుండడంతో ఈ ఏడాది మొదట్లో తొలగించారు. రవి యాషెస్ సహా 33 టెస్ట్‌లు, 48 వన్డేలు, 18 టీ20లకు అంపైర్ బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు 15 ఏళ్ల క్రితం భారత అంపైర్ ఎస్.వెంకట్రాఘవన్ ఒక్కరే ఐసీసీ ఎలైట్ ప్యానెల్ చోటు దక్కించుకోగా.. ఆ తరువాత ఎస్ రవి ఆ అరుదైన గౌరవాన్ని వరుసగా రెండోసారి దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక 2004 నుంచి 2008 వరకు నంబర్ వన్ అంపైర్‌గా కొనసాగిన ఈ 48 ఆస్ట్రేలియన్ 2012లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అనంతరం అక్టోబర్ 2015 వరకు ఐసీసీ అంపైర్ పెర్ఫార్మెన్స్ అండ్ ట్రైనింగ్ మేనేజర్‌గా సేవలందించాడు. -
క్రికెట్ చరిత్రలో తొలిసారి..!
సిడ్నీ:ఇక నుంచి మహిళా క్రికెట్ అంపైర్లు మైదానంలో కనిపించబోతున్నారా?, కేవలం మహిళా క్రికెట్ మ్యాచ్ లకే కాకుండా పురుషుల క్రికెట్ మ్యాచ్ ల్లో సైతం మహిళా అంపైర్లు రాబోతున్నారా?అంటే అవుననక తప్పదు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన మహిళా అంపైర్ క్లైర్ పొలోసాక్ ఒక పురుషుల మ్యాచ్ కి అంపైరింగ్ చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. తద్వారా పురుషుల మ్యాచ్ లకు మహిళా అంపైర్లు అంపైరింగ్ చేసేందుకు రంగం సిద్ధమవుతుందనే విషయం మరింత బలపడుతోంది. అంపైర్ల ఎలైట్ ప్యానల్ లో కొనసాగుతున్న 29 ఏళ్ల పొలోసాక్.. ఆదివారం జరిగిన దేశవాళీ పురుషుల క్రికెట్ మ్యాచ్ లో అంపైరింగ్ చేశారు. న్యూ సౌత్ వేల్స్-క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పొలోసాక్ అంపైరింగ్ చేసి ఆకర్షించారు. ఇలా పురుషుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో ఒక మహిళ అంపైరింగ్ చేయడం క్రికెట్ చరిత్రలో తొలిసారి కావడం ఇక్కడ విశేషం. అయితే ఆమెకు ఎప్పుడూ క్రికెట్ ఆడిన అనుభవ మాత్రం లేకపోవడం మరో విశేషం. కేవలం అంపైరింగ్ గురించి మాత్రమే తెలుసుకుని అందులో పొలోసాక్ ఆరితేరారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. 'నేను ఎప్పుడూ క్రికెట్ మ్యాచ్ లు ఆడలేదు. మ్యాచ్ లు చూడటం మాత్రమే ఇష్టం. అందులో అంపైరింగ్ పై ఆసక్తి ఉండేది. దాంతో నాన్న అంపైరింగ్ కోర్సులో చేర్పించారు. అలా అంపైర్ గా స్థిరపడ్డాను. ఇదొక సువర్ణావకాశం. మహిళల క్రికెట్ కు కూడా మరింత స్ఫూర్తిదాయకంగా నిలుసుందని భావిస్తున్నా'అని పొలోసాక్ తెలిపారు. నో హెల్మెట్.. ఇప్పుడు అంపైర్లు ఫీల్డ్ లో అంపైరింగ్ చేసేటప్పుడు వారి ఇష్టానుసారం కొంత రక్షణ సామాగ్రిని తీసుకోవచ్చు. ఫీల్డ్ లో ఎటువంటి గాయాల బారిన పడకుండా ఉండేందుకు అంపైర్లు హెల్మెట్ వంటివి ధరిస్తున్నారు. కాకపోతే పొలోసాక్ మాత్రం హెల్మెట్ ను ధరించడానికి ఇష్టపడటం లేదు. క్రికెట్ ఫీల్డ్ లో బంతిని సునిశితంగా గమనించేందుకు హెల్మెట్ అడ్డువచ్చే అవకాశం ఉన్న క్రమంలో అందుకు ఆమె విముఖత వ్యక్తం చేశారు. 'నాకు క్రికెట్ ఆస్ట్రేలియా హెల్మెట్ లేదా రక్షణ కవచాన్ని ధరించేందుకు ఆఫర్ చేసింది. అందుకు వారికి ధన్యవాదాలు. నాకు అది ఉపయోగించే అవకాశం రాదనే అనుకుంటున్నా.మనం సరైన స్థానంలోనిల్చుని బంతితో ఫాలో అయితే గాయాల బారిన పడే అవకాశం ఉండదనేది నా అభిప్రాయం. అందుచేత హెల్మెట్ వద్దనా'అని పొలోసాక్ తెలిపారు. మహిళలు అంపైరింగ్ చేసేటప్పుడు ఎటువంటి తడబాటుకు లోనుకాకుండా ఉండాలని సూచించారు. -
అంపైర్ కావడం ఎలా...
క్రికెట్‌పై ఆసక్తి ఉండి, ఆటతో అనుబంధం కొనసాగించాలనుకునేవారికి అంపైరింగ్‌ను ఒక మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు. అంపైర్‌గా మారేందుకు విద్యార్హతల గురించి పెద్దగా పట్టింపు లేదు. కనీస పరిజ్ఞానం ఉంటే ముందుకు వెళ్ళవచ్చు. రాష్ట్ర స్థాయిలో... క్రికెట్ అసోసియేషన్లు (హెచ్‌సీఏ లేదా ఏసీఏ) ఏడాదిలో ఒకసారి రాష్ట్ర స్థాయి అంపైర్ల అర్హత పరీక్షను నిర్వహిస్తాయి. సాధారణంగా సీజన్ ఆరంభానికి ముందు జూన్‌లో ఇది జరుగుతుంది. లీగ్ స్థాయి క్రికెట్ ఆడిన ఆటగాడు నేరుగా పరీక్షకు హాజరు కావచ్చు. లేదా సదరు సంఘంలోని ఏదైనా అనుబంధ క్లబ్ కార్యదర్శి లేదా జిల్లా సంఘం కార్యదర్శి సిఫారసు చేస్తే పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. ఇందు కోసం మార్కెట్లో లభించే ఎంసీసీ క్రికెట్ లా పుస్తకం చదివి సిద్ధం కావచ్చు. 50 ఆబ్జెక్టివ్ టైప్, 50 థియరీ టైపు ప్రశ్నలతో మొత్తం 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. మార్కులను బట్టి గ్రేడింగ్ ఇస్తారు. బీసీసీఐ స్థాయిలో... రాష్ట్ర స్థాయి పరీక్షలో టాప్-10లో నిలిచినవారు బీసీసీఐ లెవెల్ 1 పరీక్షకు అర్హత సాధిస్తారు. దానిలో ఉత్తీర్ణులైతే లెవెల్ 2 పరీక్షకు హాజరు కావచ్చు. ఇందులోనూ పాస్ అయితే అండర్-16, మహిళల క్రికెట్... తదితర జూనియర్ స్థాయి టోర్నీలకు అంపైర్‌గా వ్యవహరించేందుకు బీసీసీఐ అవకాశం కల్పిస్తుంది. దాదాపు రెండేళ్ల పాటు ఈ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేయడాన్ని ప్రొబేషనరీ పీరియడ్‌గా వ్యవహరిస్తారు. ఆయా మ్యాచ్‌ల్లో అంపైర్‌గా పని తీరు, మ్యాచ్ రిఫరీల నివేదికలను బట్టి కెరీర్లో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. రెండేళ్లు ముగిసిన తర్వాత బోర్డు వైవా నిర్వహిస్తుంది. అందులో తమ సామర్థ్యం నిరూపించుకుంటే బీసీసీఐ ప్యానల్లో చోటు లభించి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లకు కూడా అవకాశం దక్కుతుంది. వారికీ అవకాశముంది... రాష్ట్ర స్థాయి పరీక్షలో టాప్-10లో రాకపోయినా ఇబ్బంది లేదు. వారికి స్థానిక మ్యాచ్‌లలో అంపైరింగ్‌కు అవకాశం కల్పిస్తారు. ముఖ్యంగా లీగ్‌లలో, వారాంతపు మ్యాచ్‌లలో పెద్ద సంఖ్యలో అంపైర్ల అవసరం ఉంటుంది కాబట్టి కనీస అర్హతలు ఉంటే ఎవరైనా చాన్స్ దక్కించుకోవచ్చు. లెవెల్ 1 పాసైతే బోర్డునుంచి అవకాశాలు దక్కుతాయి. లెవెల్ 2 పాసైతే పెద్ద స్థాయికి (ఐసీసీ వరకు) చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. లీగ్ స్థాయిలో అంపైర్‌కు ఒక రోజుకు కనీసం రూ. 500తో ప్రారంభమై, 750... 1,000... 1,500... ఇలా అంపైర్ గ్రేడ్‌ను బట్టి, మ్యాచ్ స్థాయిని బట్టి ఫీజును అందజేస్తారు. రంజీ ట్రోఫీ, అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఈ మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది.