
టీమిండియాతో వన్డే సిరీస్‌కు బంగ్లాదేశ్ రెగ్యూలర్ కెప్టెన్ తమీమ్ ఇక్భాల్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. దీంతో తమీమ్ స్ధానంలో కెప్టెన్‌గా ఆ జట్టు వికెట్ కీపర్- బ్యాటర్ లిటన్ దాస్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నియమించింది. కాగా లిట్టన్ దాస్‌కు కెప్టెన్‌గా అంత అనుభవం లేదు. అంతకుముందు ఒకే ఒక టీ20 మ్యాచ్‌లో బంగ్లా జట్టుకు సారథ్యం వహించాడు.
"లిటన్ దాస్ మా జట్టులో అనుభవజ్ఞుడైన ఆటగాళ్లలో ఒకడు. అదే విధంగా అతడు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్‌ను కూడా కలిగిఉన్నాడు. అయితే ముఖ్యమైన ఈ సిరీస్‌కు తమీమ్ దూరం కావడం చాలా దురదృష్టకరం. గత రెండేళ్లలో అతడి సారథ్యంలో మా జట్టు అద్భుతంగా రాణిస్తోంది.
అదే విధంగా వన్డే ఫార్మాట్‌లో తమీమ్ అత్యుత్తమ ఆటగాడు" అని బీసీబీ క్రికెట్ ఆపరేషన్ చైర్మన్ జలాల్ యూనస్ పేర్కొన్నారు. కాగా హోం సిరీస్‌లో భాగంగా భారత్‌తో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. ఆదివారం(డిసెంబర్ 4)న జరగనున్న తొలి వన్డేతో భారత పర్యటన ప్రారంభం కానుంది.
భారత్‌తో వన్డేలకు బంగ్లా జట్టు: లిట్టన్ కుమార్ దాస్(కెప్టెన్), అనముల్ హక్ బిజోయ్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ చౌదరి, మెహిదీ హసన్ మిరాజ్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, ఎబాడోత్ హుస్సేన్, నసుమ్ అహ్మద్,జ్ముల్ హుస్సేన్ శాంటో,మహ్మదుల్లా,నూరుల్ హసన్ సోహన్
చదవండి: IND vs BAN: టీమిండియాతో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్‌కు ఊహించని షాక్! ఇక అంతే సంగతి
Comments
Please login to add a commentAdd a comment