టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ 631 రోజుల తర్వాత తొలిసారి టెస్టు బరిలో దిగాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా వైట్ జెర్సీలో మెరిశాడు. పునరాగమనంలో 52 బంతులు ఎదుర్కొన్న పంత్ 39 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అయితే, దూకుడుకు మారుపేరైన ఈ 26 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్.. తొలిరోజే బంగ్లా క్రికెటర్‌కు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన తీరు అభిమానులను ఆకర్షించింది.
కీలక బ్యాటర్లు విఫలం
చెన్నై వేదికగా గురువారం మొదలైన టెస్టులో రోహిత్ శర్మ(6), శుబ్‌మన్ గిల్(0), విరాట్ కోహ్లి(6) పూర్తిగా విఫలమయ్యారు. బంగ్లా యువ పేసర్ హసన్ మహమూద్ ధాటికి భారత్ 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన వేళ.. పంత్ క్రీజులోకి వచ్చాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ గాడినపెట్టే ప్రయత్నం చేశాడు.
సులువైన పరుగులకు వీలుకాని పిచ్‌పై ఎదుర్కొన్న తొలి 15 బంతుల్లో రెండు ఫోర్లు చేసి టచ్‌లోకి వచ్చాడు. అనంతరం జైస్వాల్‌తో కలిసి సింగిల్స్ రాబట్టే క్రమంలో.. బంగ్లాదేశ్ వికెట్ కీపర్ లిటన్ దాస్ పంత్‌పై అసహనం ప్రదర్శించాడు. ఇందుకు పంత్ బదులిస్తూ.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
లిటన్‌దాస్ అసహనం
జైస్వాల్ బంతిని గల్లీ దిశగా బాది సింగిల్ కోసం పంత్‌ను పిలిచాడు. ఆ తర్వాత వెనక్కి వెళ్లమన్నట్లుగా సైగ చేశాడు. అప్పటికే ఫీల్డర్ బంతిని స్టంప్స్ వైపు విసరగా.. పంత్ ప్యాడ్స్‌ను తాకినట్లు కనిపించింది. అయితే, ఓవర్ త్రో కావడంతో వేగంగా ఇద్దరూ కలిసి పరుగు పూర్తి చేశారు. ఈ క్రమంలో భారత్‌కు పరుగు రావడంపై లిటన్ దాస్ అసహనం ప్రదర్శించాడు. పంత్ ప్యాడ్లను తాకినా పరిగెత్తి రన్ పూర్తి చేయడం ఏమిటన్నట్లుగా చూశాడు.
అతడు అలా చేస్తే నేనిలాగే చేస్తా
ఇందుకు పంత్ బదులిస్తూ.. ‘‘మరి అతడేం చేశాడో చూడవా? అతడు నన్ను ఎందుకు కొడుతున్నాడు?’’ అని ఫీల్డర్‌ను ఉద్దేశించి లిటన్‌దాస్‌తో అన్నాడు. ఇందుకు స్పందనగా.. ‘‘అతడు కొట్టాలి కాబట్టి కొట్టాడు’’ అని లిటన్ దాస్ పేర్కొనగా.. ‘‘అందుకే నేను పరుగు తీయాలి కాబట్టి తీస్తున్నా’’ అని పంత్ కౌంటర్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో 50 ఓవర్లు పూర్తయ్యేసరికిటీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
చదవండి: Eng vs Aus: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. తొలి వన్డేకు ముగ్గురు స్టార్లు దూరం!
Argument between liton das & rishabh pant.
Rishabh : "usko feko na bhai mujhe kyu mar rhe ho" pic.twitter.com/cozpFJmnX3— PantMP4. (@indianspirit070) September 19, 2024
Comments
Please login to add a commentAdd a comment