పాకిస్తాన్ పర్యటనకు ముందు బంగ్లాదేశ్ క్రికెట్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ సైఫుద్దీన్ మానసిక సమస్యల కారణంగా రెండు నెలల పాటు అన్ని రకాల క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో తన నిర్ణయాన్ని సైఫుద్దీన్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు తెలియజేసినట్లు క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. రెండు నెలల పాటు తనని ఏ ఫార్మాట్‌కు ఎంపిక చేయవద్దని బోర్డుకు అతడు అభ్యర్ధించినట్లు సమాచారం. బీసీబీ కూడా అతడి అభ్యర్ధన పట్ల సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
కాగా ఈ నెలలో బంగ్లాదేశ్ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు పాకిస్తాన్‌కు వెళ్లనుంది. ఆగస్టు 21 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. సీనియర్ జట్టు కంటే ముందు బంగ్లాదేశ్-ఎ జట్టు పాక్ గడ్డపై అడుగుపెట్టనుంది. ఈ టూర్‌లో భాగంగా బంగ్లా ఎ జట్టు.. . పాకిస్తాన్ షహీన్స్‌తో రెండు నాలుగు రోజుల అనాధికారిక టెస్టులు, మూడు వన్డేలలో తలపడనుంది.
అయితే ఈ టూర్‌కు ఎంపిక చేసిన బంగ్లా ఎ జట్టులో సైఫుద్దీన్‌కు సెలక్టర్లు చోటిచ్చారు. ఈ సిరీస్‌లో అతడి ప్రదర్శనను పరిగణలోకి తీసుకోని పాక్‌తో టెస్టులకు ఎంపిక చేయాలని బంగ్లా సెలక్టర్లు భావించరంట. కానీ అంతలోనే డిప్రెషన్ కారణంగా సైఫుద్దీన్ తప్పుకున్నాడు.
కాగా టీ20 వరల్డ్‌కప్-2024 బంగ్లాదేశ్ జట్టులో సైఫుద్దీన్‌కు చోటు దక్కలేదు. టీ20 క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నప్పటకి సెలక్టర్లు మాత్రం అతడి స్ధానంలో తాంజిమ్ హసన్ షకీబ్‌కు ఛాన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి సైఫుద్దీన్ మానసికంగా కాస్త ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే రెండు నెలల పాటు అతడు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
చదవండి: ప్రపంచం ఏం అంతం కాదు.. నిజంగా అదో పెద్ద జోక్: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment