saifuddin
-
డిప్రెషన్‌తో బాధపడుతున్నా.. నన్ను సెలక్ట్ చేయవద్దు: స్టార్ క్రికెటర్
పాకిస్తాన్ పర్యటనకు ముందు బంగ్లాదేశ్ క్రికెట్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ సైఫుద్దీన్ మానసిక సమస్యల కారణంగా రెండు నెలల పాటు అన్ని రకాల క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.ఈ క్రమంలో తన నిర్ణయాన్ని సైఫుద్దీన్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు తెలియజేసినట్లు క్రిక్‌బజ్ తమ కథనంలో పేర్కొంది. రెండు నెలల పాటు తనని ఏ ఫార్మాట్‌కు ఎంపిక చేయవద్దని బోర్డుకు అతడు అభ్యర్ధించినట్లు సమాచారం. బీసీబీ కూడా అతడి అభ్యర్ధన పట్ల సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.కాగా ఈ నెలలో బంగ్లాదేశ్ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు పాకిస్తాన్‌కు వెళ్లనుంది. ఆగస్టు 21 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. సీనియర్ జట్టు కంటే ముందు బంగ్లాదేశ్-ఎ జట్టు పాక్ గడ్డపై అడుగుపెట్టనుంది. ఈ టూర్లో భాగంగా బంగ్లా ఎ జట్టు.. . పాకిస్తాన్ షహీన్స్‌తో రెండు నాలుగు రోజుల అనాధికారిక టెస్టులు, మూడు వన్డేలలో తలపడనుంది. అయితే ఈ టూర్‌కు ఎంపిక చేసిన బంగ్లా ఎ జట్టులో సైఫుద్దీన్‌కు సెలక్టర్లు చోటిచ్చారు. ఈ సిరీస్‌లో అతడి ప్రదర్శనను పరిగణలోకి తీసుకోని పాక్‌తో టెస్టులకు ఎంపిక చేయాలని బంగ్లా సెలక్టర్లు భావించరంట. కానీ అంతలోనే డిప్రెషన్ కారణంగా సైఫుద్దీన్ తప్పుకున్నాడు.కాగా టీ20 వరల్డ్‌కప్-2024 బంగ్లాదేశ్ జట్టులో సైఫుద్దీన్‌కు చోటు దక్కలేదు. టీ20 క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నప్పటకి సెలక్టర్లు మాత్రం అతడి స్ధానంలో తాంజిమ్ హసన్ షకీబ్‌కు ఛాన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి సైఫుద్దీన్ మానసికంగా కాస్త ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే రెండు నెలల పాటు అతడు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.చదవండి: ప్రపంచం ఏం అంతం కాదు.. నిజంగా అదో పెద్ద జోక్: రోహిత్ శర్మ -
కాల్పుల్లో టీఎంసీ నేత మృతి.. మూక దాడిలో నిందితుడు హతం
జోయ్‌నగర్: పశి్చమబెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా జోయ్‌నగర్‌లో సోమవారం టీఎంసీకి చెందిన స్థానిక నేత ఒకరు దుండగుల కాల్పుల్లో చనిపోయారు. నిందితుడిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తి మూకదాడిలో ప్రాణాలు కోల్పోయాడు. బమున్‌గాచి ఏరియా టీఎంసీ అధ్యక్షుడు సైఫుద్దీన్ లస్కర్(47) సోమవారం ఉదయం ప్రార్థనలకు బయటకు వచ్చారు. మాటువేసిన దుండగులు దగ్గర్నుంచి జరిపిన తుపాకీ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఘటనతో కోపోద్రిక్తులైన ఆయన మద్దతుదారులు నిందితులుగా భావిస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు. వారి దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రెండో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లస్కర్ మద్దతుదారులు పొరుగునే ఉన్న దలువాఖలి గ్రామంలో లూటీకి పాల్పడ్డారు. ఈ ఘటనల నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. లస్కర్ హత్యతో తమకెలాంటి సంబంధం లేదని సీపీఎం పేర్కొంది. అధికార యంత్రాంగం, పోలీసులు టీఎంసీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించింది. -
క్రికెట్ చరిత్రలో వింత ఘటన: దెయ్యమే అలా చేసిందంటున్న నెటిజన్లు
హరారే: క్రికెట్లో అప్పుడప్పుడు వింత ఘటనలు జరుగుతూ ఉంటాయి. బ్యాట్స్మెన్లు ఊహించని రీతిలో పెవిలియన్‌కు చేరడం, ఫీల్డర్లు నమ్మశక్యంకాని రీతిలో రనౌట్లు, క్యాచ్‌లు పట్టడం వంటివి గమినిస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మనం చూడబోయే ఓ ఘటన బహుశా క్రికెట్ చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ జరిగి ఉండకపోవచ్చు. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ జట్టు జింబాబ్వే పర్యటనలో భాగంగా ఇటీవల హరారే వేదికగా రెండో టీ20 ఆడింది. ఈ మ్యాచ్‌లో బంగ్లా ఇన్నింగ్స్‌లోని 18వ ఓవర్లో మహమ్మద్ సైఫుద్దీన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. First ever wicket taken by a ghost 😛😂 pic.twitter.com/9vG0BI50S4 — Mazher Arshad (@MazherArshad) July 24, 2021 జింబాబ్వే బౌలర్ టెండాయ్ చతారా ఐదో బంతి వేయకముందే.. వికెట్ల మీద ఉన్న బెయిల్స్ వాటంతట అవే పడిపోయాయి. ఇది గమనించని బ్యాట్స్‌మన్ వెనక్కి జరిగి పుల్ షాట్ ఆడాడు. ఆపై వెనక్కి తిరిగి చూసుకోగా.. బెయిల్స్ పోడిపోయి ఉన్నాయి. దీంతో సైఫుద్దీన్ షాక్ అయ్యాడు. తాను కాని బాల్ కాని వికెట్లుకు తగల్లేదు కదా.. బెయిల్స్ ఎలా పడిపోయాయని ఆశ్చర్యపోయాడు. ఫీల్డ్ అంపైర్లు స్పష్టత కోసం థర్డ్ అంపైర్‌ను సంప్రదించగా.. రీప్లేల్లో బ్యాట్స్‌మన్ స్టంప్స్‌కు తగల్లేదని స్పష్టంగా తేలింది. దీంతో బెయిల్స్ ఎందుకు పడిపోయాయో అర్థం కాలేదు. గాలి కారణంగా బెయిల్ కింద పడిందని అనుకున్నా.. స్టంప్ ఎలా కదిలిందో మాత్రం అర్థం కాలేదు. ఆ సమయంలో గాలి ఛాయలు కూడా లేకపోవడం ఆటగాళ్లతో సహా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ మిస్టరీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోను చూసి రక రకాల కామెంట్లు చేస్తున్నారు. దెయ్యం వికెట్ తీసిందని, క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా దెయ్యం తీసిన వికెట్ ఇదేనని చిత్రవిచిత్రమైన కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే బంగ్లాతో జరిగిన ఈ సిరీస్ మొత్తంలో జింబాబ్వే ఇదొక్క మ్యాచ్ మాత్రమే నెగ్గడం మరో విశేషం. ఈ మ్యాచ్‌లో ఆతిధ్య జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీని తర్వాత జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో బంగ్లా జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొంది మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తేడాతో గెలిచింది. అంతకుముందు జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్ట్‌లోనూ, అలాగే మూడు వన్డేల్లోనూ బంగ్లానే గెలుపొందింది. -
‘పటేల్‌ను నెహ్రూ ఆడ్డుకున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత సైఫుద్దీన్ సోజ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి (అంతరిక్ష వ్యవహారాల శాఖ ఇన్‌ఛార్జి) జితేంద్ర సింగ్ స్పందించారు. కశ్మీర్‌కు బదులుగా హైదరాబాద్‌ను పాకిస్తాన్‌కు ఇచ్చేందుకు తొలి హోంమంత్రి సర్ధార్ వల్లబాయ్ పటేల్ పాక్‌కు ఆఫర్ చేశారని సైఫుద్దీన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన జితేంద్ర సింగ్.. కశ్మీర్ విషయంలో పటేల్ జోక్యం చేసుకుని ఉంటే ఈ రోజు భారతదేశ చర్రిత మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. కశ్మీర్‌పై పటేల్ జోక్యం చేసుకోకుండా ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నియంత్రించారని, లేకపోతే కశ్మీర్ సమస్యకు అప్పడే శాస్వత పరిష్కారం ఏర్పడేదని పేర్కొన్నారు. హోంమంత్రి స్థానంలో ఉన్నా పటేల్‌ను ప్రధాని నెహ్రూ నిలువరించారని, కశ్మీర్‌పై నెహ్రూ సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్లనే కశ్మీర్ సమస్య ఏర్పడిందని తెలిపారు. పటేల్ చర్యల కారణంగానే హైదరాబాద్ సంస్థానం విలీనం జరిగిందని, కశ్మీర్ సమస్య కూడా ఆనాడే ముగిసిపోయి ఉండేదని అన్నారు. ప్రస్తుత కశ్మీర్లో పాకిస్తాన్ భాగంగా ఉందని అది చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. -
కాంగ్రెస్, ఉగ్రవాదుల ఆలోచన ఒక్కటే!
జమ్మూ: కాంగ్రెస్ నేతలు, ఉగ్రవాదులు ఒకే రకంగా ఆలోచిస్తున్నారని బీజేపీ చీఫ్ అమిత్ షా విమర్శించారు. బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ జమ్మూ, కశ్మీర్లు విడిపోయేందుకు అంగీకరించదని స్పష్టం చేశారు. భద్రతా బలగాలను విమర్శిస్తూ.. ఇటీవల కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, సైఫుద్దీన్ సోజ్‌లు చేసిన వ్యాఖ్యలపై షా తీవ్రంగా మండిపడ్డారు. జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకుని జమ్మూలో జరిగిన ఓ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘సోజ్, మీరు వంద జన్మలెత్తినా.. కశ్మీర్‌ను భారత్ నుంచి విడదీయడాన్ని బీజేపీ ఒప్పుకోదు. జమ్మూ కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. శ్యామా ప్రసాద్ ముఖర్జీ తన జీవితాన్ని పణంగా పెట్టి ఈ రెండు ప్రాంతాలను కలిపారు. ఆయన ఆశయ సాధనే మా లక్ష్యం’ అని పేర్కొన్నారు. రాహుల్ వీరిని సమర్థిస్తారా? భద్రతా బలగాలు కశ్మీర్లో.. ఉగ్రవాదుల కంటే సామాన్యులను ఎక్కువగా చంపేస్తున్నాయని ఆజాద్ ఆజాద్ వ్యాఖ్యలను సమర్థిస్తూ లష్కరే తోయిబా ప్రకటన చేయడంతో.. షా మండిపడ్డారు. ‘లష్కరే ఉగ్రవాదులు, కాంగ్రెస్ నేతల ఫ్రీక్వెన్సీ (ఆలోచన ధోరణి) సరిగ్గా సరిపోతోంది. ఆజాద్‌తోపాటు లష్కరే.. వ్యాఖ్యలను రాహుల్ ఖండిస్తారా?’ అని షా ప్రశ్నించారు. ఆజాద్, సోజ్‌లు దేశానికి క్షమాపణలు చెప్పాలని రాహుల్ ఆదేశించాలని డిమాండ్ చేశారు. -
ముషార్రఫ్ వైఖరి సరైనదే: కాంగ్రెస్ నేత
న్యూఢిల్లీ : కశ్మీర్ స్వాతంత్ర్యంపై పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ వైఖరికి కాంగ్రెస్ సీనియర్ నేత సైఫుద్దీన్ సోజ్ మద్దతు పలికారు. ఆయన మాట్లాడుతూ.. ‘కశ్మీర్ ప్రజలు పాకిస్తాన్లో కలవడానికి ఇష్టపడటం లేదు.. వారు కోరుకునేది స్వాతంత్ర్యమేనని ముషార్రఫ్ అన్నారు. నేను కూడా తొలి నుంచి అదే చెబుతున్నాను. ఈ విషయాన్ని 2007లో ముషార్రఫ్ పాక్ మిలటరీ అధికారులతోను అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలోని కొందరితో పంచుకున్నారు. కానీ అది సాధ్యపడదనే విషయం నాకు తెలుసున’ని తెలిపారు. సోజ్ రచించిన ‘గ్లిమ్ప్సెస్ ఆఫ్ హిస్టరీ అండ్ స్టోరీ ఆఫ్ స్ట్రగుల్’ పుస్తకం ఈ నెల 25 విడుదల కానున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తన పుస్తకం గురించి మాట్లాడుతూ.. కార్గిల్ యుద్దంలో ఓడిన తర్వాత.. తన లక్ష్యాన్ని చేధించడంలో ముషార్రఫ్ విఫలమయ్యారని తెలిపారు. ఆ తర్వాత కశ్మీర్ ప్రజలు స్వాతంత్ర్యం కోరుకుంటున్నట్టు పాకిస్తాన్ ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేశారని అన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి కాలంలో జరిగిన లాహోర్ డిక్లరేషన్‌తో కశ్మీర్ ప్రజల ఆశలు చిగురించాయని పేర్కొన్నారు. కాగా, సోజ్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. సైఫుద్దీన్ లాంటి నాయకుడు ఈ విధంగా మాట్లాడటం బాధ కలిగించిదన్నారు. భారత ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గులాం నబీ ఆజాద్ కూడా భారత ఆర్మీని అప్రతిష్టపాలు చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివసేన కూడా సోజ్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. -
జలియన్‌వాలాబాగ్
ఉద్యమనాయకులు సత్యపాల్, డా. సైఫుద్దీన్‌ల అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ అమృత్సర్(పంజాబ్)లోని జలియన్‌వాలాబాగ్‌లో వందలాదిమంది దేశభక్తులు సమావేశమయ్యారు. ఎలాంటి కవ్వింపు చర్యల్లో లేవు. ఎలాంటి హింసాత్మక సంఘటనలూ చోటు చేసుకోలేదు. అయినప్పటికీ బ్రిటిష్ వాడికి కోపం వచ్చింది. ఒంటిని రాక్షసత్వం ఆవహించింది. జనరల్ డయ్యర్ ఆదేశాలతో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న దేశభక్తులపై పదినిమిషాల పాటు విచక్షణరహితంగా కాల్పులు జరిగాయి. 370 మంది చనిపోయారని, 1200 మంది గాయపడ్డారని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవాలు మాత్రం వేరుగా ఉన్నాయి. 1000 మందికిపైగా మరణించారు. మాటలకందని ఈ విషాదం చరిత్ర పుటలపై తడి ఆరని నెత్తుటి చుక్కై మెరుస్తూనే ఉంది.