జోయ్‌నగర్: పశి్చమబెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా జోయ్‌నగర్‌లో సోమవారం టీఎంసీకి చెందిన స్థానిక నేత ఒకరు దుండగుల కాల్పుల్లో చనిపోయారు. నిందితుడిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తి మూకదాడిలో ప్రాణాలు కోల్పోయాడు. బమున్‌గాచి ఏరియా టీఎంసీ అధ్యక్షుడు సైఫుద్దీన్ లస్కర్(47) సోమవారం ఉదయం ప్రార్థనలకు బయటకు వచ్చారు. మాటువేసిన దుండగులు దగ్గర్నుంచి జరిపిన తుపాకీ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.
ఘటనతో కోపోద్రిక్తులైన ఆయన మద్దతుదారులు నిందితులుగా భావిస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు. వారి దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రెండో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లస్కర్ మద్దతుదారులు పొరుగునే ఉన్న దలువాఖలి గ్రామంలో లూటీకి పాల్పడ్డారు. ఈ ఘటనల నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. లస్కర్ హత్యతో తమకెలాంటి సంబంధం లేదని సీపీఎం పేర్కొంది. అధికార యంత్రాంగం, పోలీసులు టీఎంసీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment