
లాస్ క్రూసెస్: అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం రేపాయి. తాజాగా న్యూ మెక్సికో(New Mexico)లోని లాస్ క్రూసెస్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక పార్కులో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మృతిచెందారు. 15 మంది గాయపడ్డారు. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు.
శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందగానే పోలీసులు(Police) ఘటన జరిగిన యంగ్ పార్కుకు చేరుకున్నారు. పార్కులో ఒక కార్ షో జరిగింది. దానికి దాదాపు 200 హాజరయ్యారు. కాగా ఈ కార్ షోకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. లాస్ క్రూసెస్ పోలీస్ చీఫ్ జెరెమీ స్టోరీ మీడియాతో మాట్లాడుతూ పార్క్‌లో చెల్లాచెదురుగా 50 నుండి 60 షెల్ కేసింగ్‌లు కనిపించాయని, దీనిని చూస్తుంటే, చాలామంది తుపాకీలతో కాల్పులు జరిపినట్లు తెలుస్తున్నదన్నారు.
పార్కులో రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగివుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనలో ముగ్గురు మృతిచెందారు. 15 మంది గాయపడ్డారు. మృతులంతా టీనేజర్లు(Teenagers). మృతులు, గాయపడిన వారి పేర్లను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఈ ఘటనలో గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించినట్లు లాస్ క్రూసెస్ అగ్నిమాపక విభాగం చీఫ్ మైఖేల్ డేనియల్స్ తెలిపారు. లాస్ క్రూసెస్ నగర కౌన్సిలర్ జోహన్నా బెంకోమో, మేయర్ ప్రో టెం జోహన్నా బెంకోమో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేస్తూ, ఈ సంఘటనపై విచారాన్ని వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: దక్షిణ కొరియాలో బూడిదవుతున్న 20 అడవులు
Comments
Please login to add a commentAdd a comment