
ఓక్లహామా సిటీ (యూఎస్): అమెరికా(America)లో ప్రకృతి ప్రకోపించి 17 మంది ప్రాణాలను బలితీసుకుంది. కొన్ని రాష్ట్రాలు పెను తుపాను బారినపడితే మరికొన్ని చోట్ల టోర్నడోలు విజృంభించాయి. మరికొన్ని చోట్ల కార్చిచ్చు ఘటనలు స్థానికులను కకావికలం చేస్తున్నాయి. మిస్సోరీ రాష్ట్రంలో టోర్నడో కారణంగా 11 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. శుక్రవారం రాత్రి అర్కాన్సాస్‌లో ముగ్గురు, టెక్సాస్‌లో సిటీలో దుమ్ము తుపాను కారణంగా జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు.
దేశవ్యాప్తంగా 16 కౌంటీలలో పలు ఇళ్లు, వ్యాపార సంస్థ నష్టం వాటిల్లిందని, విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయని, చెట్లు కూలిపోయాయని అర్కాన్సాస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ(Arkansas Department of Public Safety) ఒక ప్రకటనలో తెలిపింది. టెక్సాస్ పాన్‌హ్యాండిల్‌లోని అమరిల్లో కౌంటీలో చోటు చేసుకున్న కారు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారని అధికారులు తెలిపారు. మిస్సౌరీలోని బేకర్స్‌ఫీల్డ్ ప్రాంతంలో తుఫానుల కారణంగా ఇద్దరు మరణించారని, పలువురు గాయపడ్డారని మిస్సౌరీ స్టేట్ హైవే పెట్రోల్ తెలిపింది. ఈ నేపధ్యంలో స్థానికులు సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లాలని అధికారులు సూచించారు.
బేకర్స్‌ఫీల్డ్‌కు తూర్పున 177 మైళ్ల దూరంలోని ఒక ఇంటిని సుడిగాలి చుట్టుముట్టడంతో, ఒకరు మృతి చెందారని, మరో మహిళను రెస్క్యూ టీమ్ రక్షించిందని అధికారులు తెలిపారు. అర్కాన్సాస్‌లోని కేవ్ సిటీ ప్రాంతంలో టోర్నడో కారణంగా ఐదుగురు గాయపడ్డారని, ఈ నేపధ్యంలో అత్యవసర పరిస్థితి విధించినట్లు మేయర్ జోనాస్ ఆండర్సన్ తెలిపారు.
ఇది కూడా చదవండి: హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా దాడి.. 9 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment