storm
-
ఈశాన్యంతో 34 శాతం అధిక వర్షం
సాక్షి, చైన్నె: ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో ఈ ఏడాది 34 శాతం అదికంగానే వర్షం పడింది. ఈ సీజన్ ముగింపు దశకు చేరడంతో ఇక చలి పులి దెబ్బకు జనం గజగజ వణికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. వివరాలు.. రాష్ట్రంలో ఏటా ఈశాన్య రుతుపవనాలు ఆశా జనకంగానే ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఏదో ఒక తుఫాన్, వాయుగండం ప్రళయాన్ని రాష్ట్రం ఎదుర్కొంటోంది. ఈ ఏడాది అక్టోబరులో ఈ పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. వచ్చి రాగానే చైన్నె, శివారు జిల్లాలపై ప్రభావం చూపించాయి. ఆ తదుపరి రాష్ట్రవ్యాప్తంగా పవనాలు విస్తరించారు. ఈ సీజన్లో సుమారు తొమ్మిది అల్పపీడనాలు బయలు దేరాయి. ఇందులో నాలుగు తమిళనాడు మీద తీవ్రంగానే దాడి చేశాయి. ఇందులో పెంగల్ తుపాన్ తాండవానికి పొరుగున ఉన్నకేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరితో పాటూ రాష్ట్రంలోని విల్లుపురం, కడలూరు, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై, కృష్ణగిరి జిల్లాలో వరుణ తాండం అంతాఇంతా కాదు. వరదలు పోటెత్తి గ్రామాలను ముంచేశాయి. ఆ తదుపరి తిరునల్వేలి, తెన్కాశి తదితర జిల్లాల మీద తీవ్ర అల్పపీడనం ప్రభావాన్ని చూపించాయి. ప్రధానంగా డెల్టాలోని నాగపట్నం, మైలాడుతురై, తంజావూరు, తిరువారూర్ జిల్లాలో అయితే సాధారణం కంటే రెట్టింపుగా వర్ష పాతం నమోదైంది. ప్రస్తుతం ఈశాన్య సీజన్ ముగింపుదశకు చేరింది. ఈ సీజన్లో రాష్ట్రంలో కడలూరు జిల్లాలో అధిక వర్షం పడింది. అతి తక్కువ వర్షం తూత్తుకుడిలో నమోదైంది. తమిళనాడు వ్యాప్తంగా ఈ సీజన్లో 47 సెం.మీ వర్షం పడాల్సి ఉండగా 57 సెం.మీ వర్షం కురిసింది. తిరుపత్తూరులో 25 సెం.మీ వర్షం పడాల్సి ఉండగా 45 సెం.మీ వర్షం కురిసింది. కృష్ణగిరిలో 27 సెం.మీ వర్షంకు బదలుగా 49 సెం.మీ పడింది. విల్లుపురంలో 50 సెం.మీ కురవాల్సి ఉండగా 88 సెం.మీ వర్షం పడింది. తిరునల్వేలి, కాంచీపురం తదితర జిల్లాల్లోనూ సాధాకరణం కంటే అధికంగానే వర్షం పడింది. చైన్నెలో 47 సెం.మీ వర్షం పడాల్సి ఉండగా అదనంగా 10 సెం.మీ కురిసింది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తగా 34 శాతం అధికంగానే వర్షాన్ని ఈశాన్య రుతు పవనాలు తీసుకొచ్చాయి. ఈ సీజన్ ముగింపు దశకు చేరడంతో ఇక క్రమంగా మంచు దుప్పటితో పాటుూ చలి ప్రభావం రాష్ట్రంలో పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇప్పటికే చలి క్రమంగా పెరుగుతుండటం గమనార్హం. -
సూరీడు రాక నాలుగు రోజులైంది
శివమొగ్గ: ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాలు కురిసిన మలెనాడులో ఇప్పుడు బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన తుపాను ప్రభావంతో చలికాలంలోనూ జోరు వర్షాలు కురుస్తున్నాయి. ఫెంగల్ తుపాను ప్రభావంతో గత మూడు రోజులుగా జిల్లాలో ఆకాశం మేఘావృతమైంది. సోమవారం సాయంత్రం నుంచి ప శి్చమ కనుమలతో పాటు పలు చోట్ల చెదురుమదురు వర్షాలు కురిశాయి. వర్షంతో పాటు చల్లగాలులు కూడా జోరుగా వీస్తున్నాయి. ఇలా అనూహ్యమైన వాతావరణంతో ప్రజల ఆరోగ్యం కూడా తలకిందులవుతోంది. చలిజ్వరం, దగ్గు పడిశంతో చిన్నా పెద్దా ఆస్పత్రులకు వెళ్తున్నారు. కాగా రాబోయే రెండు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం ఎల్లో అలర్ట్ ఉంటుంది. గత మూడు నాలుగు రోజుల నుంచి సూర్యుడు కనిపించడం మానేశాడు. పగటి వేళలో కూడా చల్లని వాతావరణం కొనసాగుతోంది. ప్రజలు ఎండ కోసం తపించాల్సి వస్తోంది. -
తీరం తరుక్కుపోతోంది..
సాక్షి, అమలాపురం/ అల్లవరం: కోస్తా తీరం భారీగా కోతకు గురవుతోంది. వాయుగుండాలు, అల్పపీడనాలు, తుపాన్లు ఏర్పడిన సమయంలో కోత అధికంగా ఉంటోంది. తాజాగా ఫెంగల్ తుపాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో తీరం పొడవునా కోత అధికమైంది. మన రాష్ట్రంలో 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండగా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 140 కిలోమీటర్ల మేర ఉంది.కోనసీమ జిల్లాలో అంతర్వేది సముద్ర సంగమ ప్రాంతం నుంచి ఐ.పోలవరం మండలం బైరుపాలెం వరకూ 90 కిలోమీటర్లు కాగా, తాళ్లరేవు మండలం గాడిమొగ నుంచి తుని మండలం వరకూ సుమారు 50 కిలోమీటర్ల మేర తీరం ఉంది. పచ్చని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి నదీ పాయల కోత వల్ల ఇప్పటికే వందలాది ఎకరాల కొబ్బరి తోటలు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. ఇదే సమయంలో తీరం పొడవునా సముద్ర కోత కూడా అధికంగా ఉంటోంది. కోనసీమ జిల్లాలో ఓడలరేవు, కేశనపల్లి, అంతర్వేది, కొమరగిరిపట్నంలో ప్రభావం ఎక్కువగా ఉంది. భూములు, సరుగుడు తోటలు సముద్రంలో కలసిపోతున్నాయి. గడచిన పదేళ్లలో కోత తీవ్రత రెట్టింపు అయ్యింది. ఓడలరేవులో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ తీరాన్ని ఆనుకుని ఏర్పాటు చేసిన ఓఎన్జీసీ చమురు బావులు ఇప్పుడు సముద్రంలో ఉన్నాయి.ఎనిమిదేళ్ల కిందట ఓడలరేవు బీచ్‌లో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకం వరకూ సముద్రం చొచ్చుకువచ్చి భూమి కోతకు గురవుతోంది. అంతర్వేది బీచ్‌లో అలల ఉధృతి స్థానికంగా ఉన్న రిసార్ట్స్ వరకూ వస్తోంది. స్థానికంగా ఉన్న పల్లిపాలెం గ్రామంలోకి సైతం అలలు అప్పుడప్పుడు వచ్చి ఇళ్లను ముంచెత్తుతున్నాయి. కేశవదాసుపాలెం తూర్పులంక వంటి గ్రామాల్లోకి ఉప్పు నీరు ముంచెత్తడంతో కొబ్బరి తోటలు నాశనం అవుతున్నాయి. కాలుష్యాన్ని కలిపేస్తూ.. అరేబియా సముద్రం కన్నా బంగాళాఖాతం అత్యంత ప్రమాదకరం. దేశంలో చాలా వరకూ నదులన్నీ దీనిలోనే కలుస్తాయి. ఉత్తరాదిన గంగా, బ్రహ్మపుత్ర, మధ్యభాగంలో మహానది, దిగువన గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి, వంశధార, నాగావళి వంటి నదుల సంగమం బంగాళాఖాతంలోనే. దేశంలో చాలా వరకూ కాలుష్యాన్ని మోసుకువస్తున్న ఈ నదులు దానిని బంగాళాఖాతంలో కలిపేస్తున్నాయి. ఫలితంగా బంగాళాఖాతం త్వరగా వేడెక్కుతోంది. దీనివల్ల తరచూ తుపాన్లు ఏర్పడుతున్నాయి. అందుకే అరేబియా సముద్రం కన్నా బంగాళాఖాతంలోనే తుపాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాలు అధికం. వీటి ప్రభావంతో అలలు ఎగసిపడి కోత ఉధృతి పెరుగుతోంది. తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్ వరకూ భూభాగ నైసర్గిక స్వరూపం సముద్రంలోకి చొచ్చుకు వచ్చినట్టు ఉంటుంది. దక్షిణాయన కాలంలో అంటే జూలై 16 నుంచి జనవరి 13 వరకూ బంగాళాఖాతంలో అలలన్నీ దక్షిణం నుంచి ఉత్తరం వైపునకు వస్తాయి. ఫలితంగా అప కేంద్ర బలాలతో తీరం పొడవునా కోత తీవ్రత పెరిగిందని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. అలలు ఎగసిపడి.. కాకినాడ జిల్లా ఉప్పాడ, కోనపాపపేట తీరం కోతకు తరుక్కుపోతుంది. కాకినాడ తీరం సమీపంలో హోప్ ఐలెండ్ ఉండడం, డీప్ వాటర్ పోర్టు కోసం సముద్రంలో ఇసుక తవ్వకాల ప్రభావం సమీపంలోని “ఉప్పాడ’ గ్రామంపై పడుతోంది. సముద్రంలో తవ్వకాలు చేసిన ప్రాంతాల్లో తిరిగి ఇసుక పూడుకునేటప్పుడు ఏర్పడుతున్న ఒత్తిడితో ఉప్పాడ వద్ద అలలు ఎగసిపడుతున్నాయి. హోప్ ఐలెండ్ వద్ద తీరం పెరుగుతుండగా, ఉప్పాడ వద్ద కోత పెరుగుతోంది. కోత ఇలా కొనసాగితే కొద్ది సంవత్సరాల్లో ఉప్పాడ గ్రామం కనుమరుగు కానుంది. భూములను కలిపేసుకుని.. ప్రకృతి ప్రకోపానికి ఓడలరేవు నదీ సంగమం నుంచి రిసార్ట్స్ వరకూ వందలాది ఎకరాల జిరాయితీ, డీపట్టా భూములు సముద్రంలో కలసిపోయాయి. 25 ఏళ్లుగా సముద్రం 500 మీటర్లకు పైగా ముందుకు వచ్చింది. ఇటీవల నెల రోజుల్లో రెండు పర్యాయాలుగా సముద్రం ముందుకు వచ్చి 936, 937 సర్వే నంబర్ గల జిరాయితీ, డీ పట్టా భూములు సుమారు 17 ఎకరాలను సముద్రం తనలో కలిపేసుకుంది. దీంతో ఓడలరేవులో సీతారామస్వామి దేవస్థానానికి చెందిన 11 ఎకరాలు, పెమ్మాడి సూర్యనారాయణ, ఇల్లింగి కాసులమ్మ, తదితరులకు చెందిన మరో ఆరు ఎకరాలు భూమి కోతకు గురైంది. –పాల వర్మ, ఓడలరేవు, అల్లవరం మండలం ప్రమాదంలో ఓఎన్జీసీ టెర్మినల్ కోనసీమ జిల్లా పరిధిలోని ఓడలరేవు ఓఎన్జీసీ వశిష్ట టెర్మినల్‌లోకి సముద్రం నీరు చొచ్చుకు రావడంతో ఉద్యోగులు, స్థానికులు ఆందోళన చెందారు. సముద్ర అలల తాకిడికి ఈ టెరి్మనల్ ప్రధాన గోడ వరకూ భూమి కోతకు గురైంది. ఇప్పుడున్న టెరి్మనల్ గోడకు సముద్ర తీరం సుమారు కిలోమీటరు దూరంలో ఉండేది. నెమ్మది నెమ్మదిగా సముద్రం చొచ్చుకొస్తూ గోడ వరకు వచ్చింది. కోత నివారణకు జియోట్యూబ్ పద్ధతిలో రాళ్లు వేసినా కోత ఆగడం లేదు. తాజాగా తుపాన్లతో అలల ఉధృతికి కోత తీవ్రత మరింత పెరిగింది. భారీ రక్షణ గోడ ఏర్పాటు చేస్తే తప్ప ఇక్కడ కోత ఆగే పరిస్థితి లేదు. మానవ తప్పిదాలే కారణం ప్రకృతిలో జరుగుతున్న మార్పుల కన్నా మానవ తప్పిదాల కారణంగానే సముద్రాలు గతి తప్పుతున్నాయి. సముద్ర ఉషో్టగ్రతలు పెరిగి తుపాన్లకు దారి తీస్తున్నాయి. తీరానికి రక్షణగా ఉండే మడ అడవులు, సరుగుడు తోటలను ఇష్టానుసారంగా నరికేస్తున్నారు. సముద్ర తీరంలో ఇసుక తవ్వకాలు, ఆక్వా చెరువులతో కూడా తీరం కోతకు గురవుతోంది. ఇటీవల కాలంలో చంద్రుడు, భూమికి మధ్య ఆకర్షణ శక్తి పెరుగుతోందని, ఫలితంగా అలల ఉధృతి పెరిగిందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. -
రాకాసి అలల పని పడుతూ గస్తీ కాసే బోట్లు (ఫొటోలు)
-
బ్రెజిల్లో తుపాను బీభత్సం.. ఏడుగురు మృతి
సావోపాలో: బ్రెజిల్‌లోని సావోపాలోను తాకిన భారీ తుపాను బీభత్సం సృష్టించింది. తుఫాను కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. గంటకు 67 మైళ్ల (108 కిలోమీటర్లు) వేగంతో దూసుకొచ్చిన తుఫాను కారణంగా పలుచోట్ల చెట్లు నేలకూలాయని, కొన్ని ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని సావోపాలో అధికారులు తెలిపారు.తుపాను తీవ్రతకు పలుచోట్ల కార్లు, ఇతర వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. తుఫాను కారణంగా దేశంలోని పలు విమానాశ్రయాలను మూసివేశారు. అనేక ప్రాంతాల్లో తాగునీటికి అంతరాయం ఏర్పడింది. వేలాది ఇళ్లు అంధకారంలో మగ్గుతున్నాయి. సావోపాలో మహానగరంలో 2 కోట్ల 10 లక్షల మంది తుపానుకు ప్రభావితమయ్యారు. ఇది కూడా చదవండి: సాహస యాత్రల్లో దిట్ట,, అనంతపురం నివాసి సమీరా -
యూరప్‌లో వరద విలయం
కుండపోత వర్షాలు మధ్య, తూర్పు యూరప్‌లో బీభత్సం సృష్టిస్తున్నాయి. బోరిస్ తుఫాను ధాటికి విపరీతమైన వర్షపాతం నమోదవుతోంది. రొమేనియా, ఆ్రస్టియా, జర్మనీ, స్లొవేకియా, హంగేరీ సహా పలు మధ్య యూరోపియన్ దేశాల్లో భారీ వర్షాలు కురిశాయి. చెక్ రిపబ్లిక్ కూడా ఎడతెరిపి లేని వానలతో అతలాకుతలమవుతోంది. భారీ సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దేశవ్యాప్తంగా 90 చోట్ల వరద హెచ్చరికలను ప్రకటించారు. ఓపావా సహా పలు నగరాల్లో వేలాది మందిని ఇళ్లను వదిలి ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా ప్రభుత్వం కోరింది. రాజధాని ప్రేగ్నూ వరద విలయం సృష్టిస్తోంది. దక్షిణ బొహెమియా ప్రాంతంలో వరదల దెబ్బకు ఓ డ్యామ్ బద్దలైంది. 1997 నాటి ‘శతాబ్దపు వరద’ల కంటే పరిస్థితి దారుణంగా ఉందని చెక్ ప్రధాని పీటర్ ఫియాలా వాపోయారు. నైరుతి పోలెండ్‌లోని ఒపోల్ ప్రాంతంలో నది ఉప్పొంగడంతో పట్టణం వరద ముంపుకు గురైంది. దేశంలో రెండో అతి పెద్ద నగరం క్రాకోవ్ కూడా వరదలో చిక్కుకుంది. కరెంటు లేక, టెలిఫోన్ నెట్వర్క్ పని చేయక జనం నరకం చూస్తున్నారు. ఆస్ట్రియాలో వియన్నా పరిసరాలను విపత్తు ప్రాంతంగా ప్రకటించారు. భారీ వర్షాలు మంగళవారం దాకా కొనసాగుతాయన్న అంచనాలు మరింత భయపెడుతున్నాయి. – ప్రేగ్ -
దారి మళ్లనున్న తుపాను!
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను దారిమళ్లి, రాష్ట్రం నుంచి దూరంగా వెళ్లనుంది. ఈ తుపాను ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం చూపుతుందని తొలుత భావించారు. అయితే తాజా వాతావరణ పరిస్థితులనుబట్టి అది బంగ్లాదేశ్ వైపు వెళ్తుందని తేలింది. దీంతో రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పనుంది. ఈనెల 22న (బుధవారం) నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది 24 నాటికి వాయుగుండంగా, ఆపై తుపానుగాను బలపడుతుందని వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. తొలుత వాయుగుండం వాయవ్య బంగాళాఖాతం వైపు పయనిస్తూ తుపానుగా మారితే దాని ప్రభావం కోస్తాంధ్ర, ముఖ్యంగా ఉత్తరాంధ్ర పైన ఉంటుందని పేర్కొన్నాయి. అయితే ఐఎండీ తాజా అంచనాల ప్రకారం.. అల్పపీడనం దిశ మార్చుకుని ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుంది. ఆ తర్వాత మరింత బలపడి అదే దిశలో బంగ్లాదేశ్ వైపు వెళ్తుంది. దీని ఫలితంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్ తీరానికి మధ్య బంగాళాఖాతం సుమారు వెయ్యి కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంటుంది. అంటే రాష్ట్రానికి వెయ్యి కిలోమీటర్ల దూరంలోనే వాయుగుండం/తుపాను బంగ్లాదేశ్ వైపు మళ్లుతుండడం వల్ల దాని ప్రభావం ఏపీపై ఉండదు. అదే మధ్య బంగాళాఖాతంలో కాకుండా వాయవ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఉంటే రాష్ట్రంలో భారీ వర్షాలకు ఆస్కారం ఉండేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.మళ్లీ కొన్నాళ్లు అధిక ఉష్ణోగ్రతలు..రాష్ట్రంలో వారం రోజులుగా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో పలుచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. వడగాడ్పులు కూడా తగ్గాయి. తాజా అంచనాల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపాను గాలిలో తేమను బంగ్లాదేశ్ వైపు లాక్కునిపోతుంది. దీనివల్ల మళ్లీ పగటి ఉష్ణోగ్రతలు 3 – 4 డిగ్రీల వరకు పెరుగుతాయని, కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.మూడు రోజులు తేలికపాటి వానలుప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. బుధవారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గంటకు 30 – 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. -
ముంబై అతలాకుతలం..బీభత్సం సృష్టించిన గాలివాన (ఫొటోలు)
-
ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రాత్రి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులు చుట్టుముట్టడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా పాదచారులు, ద్విచక్ర వాహనదారులు పలు అవస్థలకు లోనయ్యారు. పలుచోట్ల చెట్లు నేలకూలడంతో పాటు ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.తుఫాను, వర్షం, బలమైన గాలుల కారణంగా ఢిల్లీ-ఎన్సీఆర్లో వాతావరణం ఊహించని విధంగా మారింది. ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు కూలిపోయి, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి తొమ్మిది విమానాలను జైపూర్‌కు మళ్లించారు. బలమైన గాలుల కారణంగా నోయిడాలోని సెక్టార్ 58లో ఒక భవనం మరమ్మత్తు కోసం ఏర్పాటు చేసిన షట్టరింగ్ కూలిపోయింది. దీంతో పలు కార్లు దెబ్బతిన్నాయి. #WATCH | Noida, Uttar Pradesh: Several cars were damaged after a shuttering installed to repair a building in Sector 58 of Noida blew off due to gusty winds hitting the National Capital & the adjoining areas. pic.twitter.com/lz7F2WuX9q— ANI (@ANI) May 10, 2024 శనివారం(ఈరోజు) గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉంది.రాజధానిలో గాలి దిశలో మార్పు కారణంగా శుక్రవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 180 వద్ద నమోదైంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం) తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం తూర్పు నుంచి ఆగ్నేయ దిశగా గంటకు సగటున ఎనిమిది నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలి వీచింది. -
ఏడాదిలో కురవాల్సిన వాన ఒక్కసారిగా కురిస్తే ఇలా ఉంటుందా..!
వర్షం అనేది మనకు సీజన్ల బట్టే వస్తోంది ఒక్కోసారి సమ్మర్లో కూడా వచ్చిన అదికూడా ఓ మోస్తారుగా వస్తుంది. వర్షాకాలంలోనే మనకు అత్యధికంగా వర్షాలు పడతాయి. ముఖ్యంగా ఎడారి దేశమైన దుబాయ్ లాంటి దేశాల్లో వర్షం అనేది చాలా తక్కువ. ఏడాదికి చాలా తక్కువ వర్షపాతమే నమోదవ్వుతుంది. అలాంటిది ఇటీవల దుబాయ్‌ని వణికించేలా వర్షాలు పడ్డాయి. ఒక్కసారిగా దుబాయ్‌లోని కార్లు, బహుళ అంతస్థులు నీట మునిగాయి. అంతేగాదు కనివిని ఎరుగని రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. చెప్పాలంటే ఒక్క ఏడాదిలో కురవాల్సిన వానంతా ఒక్కరోజే పడితే ఎలా ఉంటుందో అలా కుండపోతగా కురిసేసింది. అంతేగాదు అక్కడ అధికారులు కూడా ఇలాంటి వానను ఎన్నడు చూడలేదని ఇది "చారిత్రక వాతావరణ సంఘటన" అని చెబుతున్నారు. దుబాయ్ 75 ఏళ్ల చరిత్రలో ఇలాంటి వర్షాన్ని చూడలేదని తెలిపారు. ఈ భారీ వర్షాలకు ఎడారి దేశమైన దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ చిగురుటాకులా వణికిపోయింది. ఈ భారీ వర్షాలు యూఏఈనే కాకుండా ఒమన్‌ని కూడా తాకింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన చాలామంది నెటిజన్లు ముంబైలో ఉండగా కూడా తాము ఇలాంటి వర్షాన్ని చూడలేదంటున్నారు. ఎడారిలాంటి దుబాయ్ అంతటా కాలువలు పారుతున్నాయంటూ పోస్టులు పెట్టారు. Dubai: Timelapse of the massive storm that caused a historic flood. pic.twitter.com/tackWMYJzO — Pagan 🚩 (@paganhindu) April 17, 2024 (చదవండి: అతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..!) -
ఒకేరోజు 12 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు!
ఛత్తీస్‌గఢ్‌లో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోయాయి. గత 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలు తగ్గింది. తేమ 87 శాతానికి పెరిగింది. ఫలితంగా రాష్ట్రంలోని ఇళ్లు, కార్యాలయాల్లోని ఏసీలు, కూలర్లకు విశ్రాంతి దొరికింది. రాజధాని రాయ్‌పూర్‌లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తోంది. గడచిన 24 గంటల్లో రాయ్‌పూర్‌లో ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది, రాయ్‌పూర్‌లో 24.7, మనాలో 24, బిలాస్పూర్లో 28.4, పెండ్రారోడ్లో 29.6, అంబికాపూర్‌లో 31.5, జగదల్పూర్లో 26.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయ్‌పూర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మూడు డిగ్రీల సెల్సియస్ తగ్గింది. -
పశ్చిమ బెంగాల్లో తుపాను బీభత్సం.. ఐదుగురి మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో తుపాను బీభత్సం సృష్టించటంతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. సుమారు 500 మందికి గాయాలు అయ్యాయి. ఆదివారం ఈ భారీ తుపాను, వడగళ్లతో జలపాయిగురి జిల్లాలో అనేక ఇళ్లు కూలిపోయాయి. తీవ్ర తుపాను కారణంగా రోడ్లపై చెట్లు నేలకొరిగాయి. తుపాను పరిస్థితులపై సీఎం మమతా బెనర్జీ బాగ్దోగ్రా ప్రాంతంలో మీడియాతో మాట్లాడారు. తుపాను సంభవించిన ప్రాంతాల్లో బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం అందిస్తుందని సీఎం తెలిపారు. Several homes damaged, trees uprooted due to storm in West Bengal's Jalpaiguri pic.twitter.com/3wBeikxOHJ — NDTV (@ndtv) March 31, 2024 జిల్లా ఉన్నతాధికారులు బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తారని తెలిపారు. బాధితులకు వైద్యసిబ్బంది చికిత్స అందిస్తోందని సీఎం మమతా బెనర్జీ అన్నారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న చోట అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జలపాయిగురితో పాటు పక్కనే ఉన్న అలియుపుర్‌దువార్ కూచ్ బెహార్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తుపాను, వడగళ్ల ప్రభావం స్వల్పంగా చూపిందని కానీ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. Sad to know that sudden heavy rainfall and stormy winds brought disasters today afternoon in some Jalpaiguri-Mainaguri areas, with loss of human lives, injuries, house damages, uprooting of trees and electricity poles etc. District and block administration, police, DMG and QRT… — Mamata Banerjee (@MamataOfficial) March 31, 2024 -
బ్రెజిల్లో తుపాను బీభత్సం
రియోడిజెనెరియో: బ్రెజిల్లో తుపాను బీభత్సం సృష్టించింది. రియోడిజెనెరియో రాష్ట్రంలోని పర్వత ప్రాంతాల్లో తుపాను సృష్టించిన అల్లకల్లోలానికి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పెట్రోపోలిస్ పట్టణంలో ఓ ఇళ్లు కూలిన ఘటనలో నలుగురు మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన ఒక బాలికను రెస్క్యూ సిబ్బంది కాపాడారు. అదే ప్రాంతంలో బాలిక తండ్రి మృతదేహాన్ని కనుగొన్నారు. సాంటా క్రుజ్ ద సెర్రాలో జరిగిన ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు. పెట్రోపోలిస్ నగరంలో పరిస్థితి దారుణంగా ఉందని, క్విటాదిన్హా నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పాటు భారీ వర్షాలు ఆగకుండా కురుస్తున్నాయని రియోడిజెనెరియో గవర్నర్ క్యాస్టట్రో తెలిపారు. వాతావరణ మార్పుల వల్లే బబ్రెజిల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి.. పపువా న్యూ గినియాలో భూకంపం -
అన్నదాత సేవలో ఆర్బీకే సైన్యం
సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, అధిక గాలులకు దెబ్బతిన్న పంటలను కాపాడటంలో ఆర్బీకై సైన్యం శక్తివంచన లేకుండా శ్రమిస్తోంది. వర్షం తెరిపివ్వడంతో పంటలను, పంట ఉత్పత్తులను కాపాడటంలో విశేష కృషి చేస్తూ రైతుల్లో ధైర్యాన్ని నింపుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సహాయక చర్యలను వ్యవసాయ శాఖ ముమ్మరం చేసింది. క్షేత్రస్థాయి సిబ్బంది ఆర్బీకేల ద్వారా పూర్తిస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ.. పొలాల్లోని వరి పనలు మొలకెత్తకుండా ఉండేందుకు 5 శాతం ఉప్పు ద్రావణాన్ని రైతులతో కలిసి పనలపై సామూహికంగా చల్లుతున్నారు. పొలాల్లో నిలిచిపోయిన నీటిను కిందకు పోయేలా చేస్తున్నారు. తడిసిపోయిన పనలను రైతు కూలీలతో కలిసి ఒడ్డుకు తీసుకొచ్చి ఉప్పు ద్రావణం చల్లే ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారుల సమన్వయంతో కాలువలు, డ్రెయిన్లను ఉపాధి హామీ కూలీల సహకారంతో మరమ్మతులు చేసి పంట పొలాల నుంచి వర్షపు నీటిని బయటకు పంపుతూ రైతులకు ఇబ్బంది లేకుండా సహాయ సహకారాలు అందిస్తున్నారు. పంట కోతకు సిద్ధంగా ఉన్న పొలాల్లో నీరు నిలిచి ఉంటే.. చేలల్లో చిన్నపాటి బాటలు, బోదెలు తీసి మడుల నుంచి నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆర్బీకే సిబ్బంది స్వయంగా చేలలో నేలకు పడిపోయిన వరి దుబ్బులను లేపి.. కట్టలు కట్టే ప్రక్రియలో రైతులకు తోడ్పాటు అందిస్తున్నారు. పంట నష్టం అంచనాలకు ఎన్యుమరేషన్ బృందాలను ఏర్పాటు చేశామని, ముంపు నీరు పూర్తిగా చేల నుంచి తొలగిన తర్వాత పంట నష్టం అంచనా వేసేందుకు ఈ బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తాయని వ్యవసాయ శాఖ కమిషనర్ చేవూరు హరికిరణ్ ఓ ప్రకటనలో తెలిపారు. -
పంట నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలు
సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపానుతో నష్టపోయిన రైతన్నలకు వైఎస్ జగన్ ప్రభుత్వం కొండంత భరోసానిస్తోంది. తుపాను కారణంగా కురిసిన వర్షాలకు తడిసి, తేమ శాతం, రంగు మారిన ధాన్యాన్ని సాంకేతిక కారణాలను పట్టించుకోకుండా, నిబంధనలు సడలించి మరీ ప్రభుత్వమే కొనుగోలు చేసింది. అదీ రైతులకు ఏమాత్రం నష్టం రాకుండా మద్దతు ధరకే కొని, మిల్లులకు తరలించింది. మరోవైపు సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పంట నష్టం అంచనా వేసేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖలు సన్నద్ధమయ్యాయి. రెవెన్యూ శాఖతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాయి. ఒకటి రెండ్రోజుల్లో ముంపు నీరు దిగిపోయిన వెంటనే క్షేత్రస్థాయి పర్యటనలకు ఈ బృందాలు సిద్ధమవుతున్నాయి. ఈ నెల మూడో వారంలోగా పంట నష్టం అంచనాలు కొలిక్కి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. నెలాఖరులోగా లేదా జనవరి మొదటి వారంలో పరిహారం పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం జగన్ ఆదేశాలతో రంగంలోకి ఖరీఫ్ సీజన్లో 64.35 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, 28.94 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగయ్యాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల ఏడు జిల్లాల్లో 14.91 లక్షల ఎకరాల్లో పంటలు ఇప్పటికే దెబ్బతిన్నట్టుగా గుర్తించారు. ఇక మిగిలిన విస్తీర్ణంలో 17 లక్షల ఎకరాల్లో పంటలు కోతలు పూర్తయ్యాయి. మరో 14.37 లక్షల ఎకరాల్లో కోతలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ దశలో మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసాయి. ప్రాథమికంగా సుమారు 80 వేల ఎకరాల్లో పంటలు ముంపునకు గురి కాగా, మరో లక్ష ఎకరాలకు పైగా కోతకు సిద్ధంగా ఉన్న పంట నేల కొరిగినట్టు అంచనా వేశారు. వరితో పాటు మిరప, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ పంటలపై ప్రభావం చూపినట్టుగా గుర్తించారు. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తుపాను ప్రారంభమైంది మొదలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేశారు. రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా కుండపోత వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ఆర్బీకే సిబ్బందితో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఆర్బీకే సిబ్బంది రైతులతో నిత్యం మమేకమవుతూ వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నారు. స్వయంగా చేలకు వెళ్లి నష్ట నివారణకు తీసుకోవల్సిన చర్యలపై సూచనలు చేశారు. కోతలు పూర్తయిన పంటను కల్లాల నుంచే కొనుగోలు చేశారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటను కాపాడుకునేలా రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు. ముంపునకు గురైన పొలాల్లో నీరు నిలవకుండా యుద్ధ ప్రాతిపదికన తీసుకున్న చర్యలు ఫలితాన్నిచ్చాయి. వర్షాలు తెరిపినిచ్చిన కొద్ది గంటల్లోనే చేలల్లోని నీరు కిందకు దిగిపోవడం మొదలైంది. మరో వైపు నేలకొరిగిన వరి, ఇతర పంటలను కాపాడుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. వరి పంటను కోయకుండా రైతులను అప్రమత్తం చేశారు. నేలకొరిగిన వరిచేలలో కూడా ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు. వేరుశనగ, పత్తి, మిరప, శనగ, మినుము, పెసర తదితర పంటలు సాగు చేసిన రైతులను కూడా ఇదే రీతిలో అప్రమత్తం చేశారు. -
తుపానుపై సర్వత్రా అప్రమత్తం
సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై స్పందించి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. మూడు రోజుల ముందు నుంచే జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వచ్చింది. సోమవారం సీఎం వైఎస్ జగన్ జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి తుపాను వల్ల ఎక్కడా ఇబ్బందికర పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సహాయ, పునరావాస కార్యక్రమాలకు సంబంధించి రెవెన్యూ శాఖ ఐదు జీఓలు, ఒక మెమో విడుదల చేసింది. సీఎం ఆదేశాలతో 10 జిల్లాల్లో తుపాను అత్యవసర సహాయక చర్యల కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు రూ.11 కోట్లను అత్యవసరంగా డ్రా చేసుకునేందుకు అనుమతి ఇస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ జీఓ నంబరు 72 జారీ చేశారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు రూ.2 కోట్లు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు రూ.కోటి చొప్పున వినియోగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిధులను వర్ష ప్రభావిత ప్రాంతాల నుంచి బాధితులను సహాయక శిబిరాలకు తరలించడం, ఆయా ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీరు, ఆహారం, పాలు అందించడంతోపాటు వారికి అవసరమైన ఆరోగ్య శిబిరాలు, పారిశుధ్య నిర్వహణ, పశువులకు ఆహారం, కూలిపోయిన లేక దెబ్బతిన్న ఇళ్లకు తక్షణ పరిహారం ఇచ్చేందుకు వినియోగించాలని ఆదేశించింది. సహాయక చర్యలు ముమ్మరం ► తుఫాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లకు పంపుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కోసం నెల్లూరులో 4, బాపట్లలో 3, కృష్ణాలో 2, తిరుపతి, ప్రకాశంలో ఒక్కొక్క బృందం చొప్పున మొత్తం 5 ఎన్డీఆర్ఎఫ్, 6 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు. కృష్ణా, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్సార్ నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 192 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, సోమవారం సాయంత్రం వరకు 7,361 మందిని తరలించామన్నారు. ప్రభావిత జిల్లాల్లోని 2.38 కోట్ల మందికి తుపాను హెచ్చరిక సందేశాలు (సెల్ ఫోన్‌కు) పంపినట్లు తెలిపారు. ► ముందస్తు చర్యల్లో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ లోతట్టు ప్రాంతాలను గుర్తించి సమీపంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, 1,900 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి లోతట్టు ప్రాంతాలలోని పేదలకు ఆహారం అందజేశారు. రెస్క్యూ టీంలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముత్తుకూరు, నెలటూరు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ► తిరుపతి జిల్లాలోని 162 మంది గర్భిణిలను ప్రసూతి ఆస్పత్రులకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా 31 గ్రామాలలో 2,620 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం, సింగరాయకొండ, టంగుటూరు, ఒంగోలు, నాగులుప్పలపాడు మండలాల్లోని తీర ప్రాంతాల్లో పూరిళ్లు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పాత ఇళ్లలో ఉంటున్న వారిని 47 పునరావాస శిబిరాలకు తరలించారు. ప్రతి శిబిరానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. ► బాపట్ల జిల్లాలో 14 పునరావాస కేంద్రాలు, 43 తుపాను షెల్టర్లు సిద్ధం చేసి, లోతట్లు ప్రాంత ప్రజలను తరలిస్తున్నారు. 18 మంది గర్భిణీలను వైద్యశాలలకు తరలించారు. ఎన్డిఆర్ఎఫ్(నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్), ఎస్డిఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్) బృందాలను, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. సూర్యలంకలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి సోమవారం పరిశీలించారు. ► కృష్ణా జిల్లాలో 64 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మచిలీపట్నం, అవనిగడ్డ ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్ల బృందాలు చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్పీ పి.జాషువా నేతృత్వంలో శిబిరాల్లో తాగునీరు, ఆహారంతో పాటు వైద్య సహాయం కోసం వైద్య సిబ్బంది, మరుగుదొడ్లను, వైర్లెస్ సెట్లను ఏర్పాటు చేశారు. 40 వేల టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. మరో 20 వేల టన్నుల ధాన్యాన్ని గోడౌన్‌కు తరలించారు. ఇంకో 10 వేల టన్నుల ధాన్యాన్ని ఆఫ్‌లైన్‌లో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ► పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం, మొగల్తూరు తీర ప్రాంత మండలాల్లో 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పీఎం లంక నుంచి 150 మందిని పునరావాస కేంద్రానికి తరలించారు. ఆరుగురు గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్పించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఈతగాళ్లు, మెకనైజ్డ్ బోట్లను సిద్ధం చేసినట్టు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. ►అనకాపల్లి జిల్లాలో 52 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. వీటిలో 60 వేల మందికి పైగా వసతి కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఏలూరులో విద్యుత్ శాఖ 9440902926 టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది. రూ.1,000 నుంచి రూ.2,500 ఆర్థిక సాయం సహాయక శిబిరాల నుంచి బాధిత కుటుంబాలను ఇంటికి పంపే ముందు ఆర్థిక ఆసరా కోసం రూ.1,000 నుంచి రూ.2,500 ఇవ్వాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ జీఓ నెంబరు 73 విడుదల చేసింది. ఆయా కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, ఒక లీటర్ పామాయిల్, కేజీ చొప్పున ఉల్లిపాయలు, బంగాళాదుంపలను ఉచితంగా పంపిణీ చేయాలని మరో జీఓ ఇచ్చింది. తుపాను వల్ల దెబ్బతిన్న, కూలిపోయిన ఇళ్లు, గుడిసెలకు ఇచ్చే పరిహారాన్ని రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంచి ఇవ్వాలని ఆదేశించింది. సీఎం జగన్ సమీక్షలో ఈ విషయంపై ఆదేశాలు ఇవ్వడంతో అందుకనుగుణంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. పశు వైద్య శిబిరాల ఏర్పాటు, పశువులకు గడ్డి సరఫరా వంటి అవసరాలకు నిధులు వినియోగించుకునేందుకు కలెక్టర్లకు అనుమతి ఇచ్చారు. తుపాను సహాయ, పునరావాస చర్యల్లో సహకరించేందుకు 8 జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. బాపట్ల జిల్లాకు కాటంనేని భాస్కర్, అంబేడ్కర్ కోనసీమకు జి జయలక్ష్మి, తూర్పుగోదావరికి వివేక్ యాదవ్, ప్రకాశంకు పీఎస్ ప్రద్యుమ్న, కాకినాడకు ఎన్ యువరాజ్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుకు సీహెచ్ హరికిరణ్, తిరుపతికి జే శ్యామలరావు, పశ్చిమగోదావరికి కే కన్నబాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి జీఓ జారీ చేశారు. కాగా, భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. -
అన్నదాతకు అండగా ప్రభుత్వం
సాక్షి, అమరావతి: వరి పంట కోతల సమయమిది. రాష్ట్రంలోని రైతులు పంట కోసం, కల్లాల్లో, రోడ్ల పైన ఆరబెట్టారు. ఇదే సమయంలో రెండు రోజుల క్రితం మిచాంగ్ తుపాను ప్రభావం మొదలవడంతో రైతాంగం వణికిపోయింది. ఆపత్కాలంలో ఉన్న అన్నదాతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచింది. సీఎం జగన్ అధికారులతో సమీక్షించి, పలు ఆదేశాలు జారీ చేశారు. ఒక్క రైతుకు కూడా నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. దీంతో క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అధికార యంత్రాంగం హుటాహుటిన రంగంలోకి దిగింది. గ్రామాల్లో రైతులు కల్లాలు, రోడ్ల మీద ఆరబెట్టిన ధాన్యాన్ని ఎక్కడికక్కడ ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. నిబంధనలను సైతం సడలించి ధాన్యాన్ని సంపూర్ణ మద్దతు ధరకే కొంటోంది. వెనువెంటనే మిల్లులకు తరలిస్తోంది. కేశవరావు లాంటి వేలాది రైతులను ఆదుకుంటోంది. గడిచిన 48 గంటల్లో ఏకంగా 1.07 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా క్షేత్ర స్థాయిలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని తరలిస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రికార్డు స్థాయిలో కల్లాల్లోని ధాన్యాన్ని మిల్లులకు చేర్చింది. ఇప్పటివరకు ఆన్లైన్లో 75 వేల మంది రైతుల నుంచి రూ.1,211.49 కోట్ల విలువైన 5.30 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. ఇందులో 55 వేల మంది రైతులకు సుమారు రూ.750 కోట్ల వరకు నిర్ణీత కాల వ్యవధిలో వారి ఖాతాల్లో జమ చేసింది. అత్యవసర నిధి కింద జిల్లాకు రూ.కోటి తుపాను నేపథ్యంలో కల్లాల్లోని ధాన్యం తడిసిపోకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆన్లైన్ ద్వారా సాంకేతికంగా వివరాల నమోదులో కొంత జాప్యం జరుగుతుంది. ఈలోగా వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోకుండా ఆఫ్‌లైన్‌లో కొనేలా నిబంధనలను సడలించింది. దీనిని మరింత వేగంగా చేపట్టేందుకు అత్యవసర నిధుల కింద అవసరమైన జిల్లాలకు రూ.కోటి చొప్పున కేటాయించింది. ఈ నిధులతో కలెక్టర్లు మిల్లర్లు పంపించే వాహనాలకు తోడు ఎక్కడికక్కడ ప్రైవేట్ వాహనాలను బుక్ చేసి ధాన్యం బస్తాలను శరవేగంగా తరలిస్తున్నారు. ఇప్పటివరకు కృష్ణా, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధులు విడుదల చేశారు. కంట్రోల్ రూమ్‌ల ద్వారా పర్యవేక్షణ విపత్కర పరిస్థితుల్లో ఉన్న రైతుల నుంచి ధాన్యం సేకరణకు అధికార యంత్రాంగం సమష్టిగా పని చేస్తోంది. రాష్ట్ర స్థాయిలో పౌర సరఫరాల సంస్థ ఎండీ, జిల్లా కలెక్టర్లు, జేసీలు, డీఎంలు, తహసీల్దార్లు కంట్రోల్ రూమ్‌ల ద్వారా కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గ, మండల, ఆర్బీకేల్లో ప్రత్యేక అధికారులను సైతం నియమించి రోడ్లపై ఉన్న ధాన్యాన్ని తక్షణం మిల్లులకు తరలిస్తున్నారు. తుపాను సమయంలో రైతులు పంట రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. మిల్లుల సామర్థ్యం తక్కువగా ఉన్న చోట ధాన్యాన్ని మార్కెట్ యార్డుల్లో భద్రపరుస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమలో అత్యధికంగా.. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటి వరకు ఆర్బీకేల ద్వారా ఆన్లైన్లో 96,965 టన్నులు, ఆఫ్‌లైన్‌లో 48వేల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఆదివారం ఒక్కరోజే 40 వేల టన్నులకుపైగా కొనడం విశేషం. మాన్యువల్‌గా పుస్తకంలో రైతుల ధాన్యం వివరాలను నమోదు చేసుకుని మిల్లులకు తరలిస్తున్నారు. తేమ 18 శాతం ఉన్నప్పటికీ మిల్లర్లు సహకరిస్తున్నారు. ఈ ఖరీఫ్‌లో 2.40 లక్షల టన్నులు వస్తుందని అంచనా వేయగా ఇప్పటికే 1.43 లక్షల టన్నులు కొనుగోలు చేశారు. అమలాపురం, కొత్తపేట డివిజన్లలో పంట కోతలకు సమయం ఉంది. ఆలమూరు, మండపేట, రాయవరం ప్రాంతాల్లో మొత్తం ధాన్యాన్ని తుపాను ప్రభావం కంటే ముందే సేకరించారు. ఇప్పుడు మద్దతు ధర ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో రైతుల వివరాలను వేగంగా ఆన్లైన్ చేస్తూ ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ (ఎఫ్‌టీవో)లు జనరేట్ చేస్తున్నట్టు పౌర సరఫరాల సంస్థ డీఎం ఎస్. సుధా సాగర్ చెప్పారు. ఇప్పటివరకు రైతులకు మద్దతు ధరకు సుమారు 15 వేల టన్నులకుపైగా ఎఫ్‌టీవోలు ఇచ్చామన్నారు. ‘14 ఎకరాల పంట. ఈసారి బాగా పండటంతో 30 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. యంత్రంపై కోయడంతో ధాన్యం పచ్చిగా ఉందని కల్లాల్లో ఆరబెట్టాను. చివరికొచ్చేసరికి తుపాను భయం పట్టుకుంది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షం పడితే ఎలా అనుకుంటున్న దశలో అధికారులు వచ్చారు. కంప్యూటర్లో ఎక్కించాల్సిన అవసరంలేదని, లోడును వెంటనే పక్కనున్న మిల్లులకు పంపించేద్దామని చెప్పారు. కూలీలను పిలిపించారు. గోతాల్లోకి నింపి.. నా ట్రాక్టర్లోనే ఆదివారం రాత్రి పంటను తీసుకెళ్లి మిల్లులో అప్పజెప్పాను. లేకుంటే సోమవారం కురిసిన చినుకులకు చేతికొచ్చిన లాభం తడిసిపోయేది’ అంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పులూరుకు చెందిన కౌలు రైతు శీర్ల వెంకట కేశవరావు సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యేక ఏర్పాట్లతో వర్షంలోనూ తరలింపు ► కృష్ణా జిల్లాలో కల్లాల్లోని ధాన్యం తడిసిపోకుండా, రవాణా వాహనాలపై కప్పేందుకు వీలుగా 700కుపైగా టార్పాలిన్లు ప్రభుత్వం కొనుగోలు చేసింది. తేమ శాతం నిబంధనలను సైతం పక్కనబెట్టి 20 వేల టన్నులకుపైగా ధాన్యాన్ని సేకరించింది. వీటిని ఎక్కువ కాలం నిల్వ చేస్తే చెడిపోయే ప్రమాదం ఉండటంతో వెంటనే గుంటూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లోని డ్రయర్ సౌకర్యం ఉన్న మిల్లులకు తరలిస్తోంది. ► ఏలూరు జిల్లాలో ఆదివారం ఒక్కరోజే 10 వేల టన్నులు తరలించగా సోమవారం వర్షంలోనూ ధాన్యం సేకరణ కొనసాగింది. అయితే తుపాను భయంతో కొంత మంది రైతులు కోతలు చేపడుతున్నారు. మరికొందరు కోసిన ధాన్యాన్ని ఇళ్లలో, షెడ్లలో నిల్వ చేసుకుంటున్నారు. వర్షాలు తగ్గిన తర్వాత ఆరబోసుకుని విక్రయించేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నట్టు జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం భార్గవి తెలిపారు. వర్షాల్లో కోత మంచిది కాదని, తమ సిబ్బంది సహాయంతో రైతులకు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో ఆఫ్‌లైన్, ఆన్లైన్లో లక్ష టన్నులకు పైగా ధాన్యం సేకరించామన్నారు. ► పశ్చిమ గోదావరి జిల్లాలో కోతలు కోసి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని దాదాపు మొత్తం సేకరించారు. ఆదివారం రాత్రి 12 గంటల వరకూ వాహనాల్లో తరలించారు. ఆ ఒక్కరోజే సుమారు 24,000 టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేసింది. అక్కడక్కడా మిగిలిన స్వల్ప మొత్తం ధాన్యాన్ని కూడా సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 90 వేల ఎకరాల్లో వరికోతలు పూర్తవగా 1.80 లక్షల టన్నుల ధాన్యం దిగుబడిని అంచనా వేస్తున్నట్టు జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం శివరామ్ చెప్పారు. ఇందులో 1.30 టన్నులు ఆర్బీకేల్లో కొనుగోలు చేశామన్నారు. ► తూర్పు గోదావరి జిల్లాలో 6,367 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు జేసీ తేజ్‌భరత్ తెలిపారు. ఇక్కడ అత్యధికంగా బహిరంగ మార్కెట్‌కు తరలిపోగా ఆర్బీకేల ద్వారా 15,272 మంది రైతుల నుంచి 1,04,917 టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. ► ఉత్తరాంధ్ర జిల్లాల్లో తుపాను ప్రభావం పెద్దగా లేదు. విజయనగరం జిల్లాలో నూర్పిడి చేసిన ధాన్యం 1,242 టన్నుల వరకు ఉంది. దీనిలో 440 మెట్రిక్ టన్నులు సోమవారం ఆఫ్‌లైన్‌లో కొన్నారు. మంగళవారం మరో వెయ్యి టన్నులు కొనుగోలు చేయనున్నారు. శ్రీకాకుళంలో 700, పార్వతీపురం మన్యంలో 500 టన్నులు కొనుగోలు చేశారు. ► కాకినాడ జిల్లాలో కల్లాల్లో, రోడ్లపై ఉన్న 23 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ దేవీపట్నం, గంగవరం ప్రాంతాల్లో 300 టన్నులు కొన్నారు. ఆఫ్‌లైన్‌లో ఆదుకున్నారు.. నేను సొంతంగా, కౌలుకు కలిపి 70 ఎకరాల్లో వరి సాగు చేశాను. ఎకరాకు 30 నుంచి 35 బస్తాలు వచ్చింది. ఆఫ్‌లైన్‌లో ఆదివారం 240 బస్తాలు ఆర్బీకేలో విక్రయించాను. ఇప్పుడు వర్షాలకు ధాన్యం తడిసే అవకాశమున్నందున తేమ శాతం ఉండాలనే నిబంధనను ప్రభుత్వం సవరించి కొనుగోలు చేయడం హర్షణీయం.– సేవా సత్యనారాయణ, లొల్ల గ్రామం, అంబేడ్కర్ కోనసీమ జిల్లా తేమతో సంబంధం లేకుండా.. ఒక్క రోజు ఆలస్యమైనా పంట మొత్తం వర్షార్పణమయ్యేది. చాలా ఇబ్బందులు పడేవాడిని. సకాలంలో అధికారుల సాయంతో నాలుగు ఎకరాల ధాన్యాన్ని తేమతో సంబంధం లేకుండా నేరుగా మిల్లుకే చేర్చాను. ఫలితంగా 10 టన్నుల ధాన్యాన్ని నష్టపోకుండా ఒబ్బి చేసుకోగలిగా. – చిటికెన పెద సత్యనారాయణ, వడలి, పశ్చిమగోదావరి జిల్లా కోతలు వాయిదా వేయండి రైతులు వరికోతలను నాలుగు రోజులు వాయిదా వేస్తే మంచిది. వర్షాల సమయంలో పంట కోస్తే తడి ఆరక తేమ పెరిగిపోతుంది. త్వరగా మొలకలు వచ్చి ధాన్యం దెబ్బతింటుంది. కోసిన ధాన్యంలో తేమ ఎక్కువగా ఉంటే వాటిని డ్రయర్ సౌకర్యం ఉన్న మిల్లులకు వర్షంలోనూ ప్రత్యేక జాగ్రత్తల నడుమ తరలిస్తున్నాం. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కూడా ఆర్బీకేల్లో తీసుకునేలా అవకాశం కల్పిస్తాం. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ కల్లాల్లో స్వల్పంగానే.. తుపాను హెచ్చరికలతో వర్షం రాక ముందే ధాన్యాన్ని మిల్లులకు తరలించేశాం. ఇంకా అక్కడక్కడా కొద్దిగా ఉంది. దానిని కూడా తరలిస్తాం. కొందరు రైతులు ఆదివారం కూడా యంత్రంపై కోతలు ఎక్కువగా చేశారు. వాటిల్లో చాలా వరకు కొనుగోలు చేశాం. తేమ శాతం ఎక్కువ ఉంటే రైతులకు నష్టం జరగకుండా మిల్లర్లతో మాట్లాడుతున్నాం. అప్పటికప్పుడు ప్రైవేటు వాహనాల్లో ధాన్యం లోడును తరలించాలని కలెక్టర్లకు చెప్పాం. – జి.వీరపాండియన్, ఎండీ, పౌర సరఫరాల సంస్థ ప్రభుత్వ చొరవ కాపాడింది ఐదు ఎకరాలు కౌలుకు సాగు చేశాను. పంటను మిషన్‌తో కోయించి, ధాన్యం రోడ్డుపై రాశి పోశాను. తుపాను కారణంగా వర్షం పడుతుందని బరకాలతో కప్పి ఉంచాను. లేదంటే వర్షానికి ధాన్యం తడిసిపోయేది. జేసీగారు వచ్చి మా ధాన్యాన్ని వెంటనే మిల్లుకు పంపించారు. తేమ ఎక్కువ ఉంటే మిల్లరు ధాన్యంలో కోత వేస్తారు. కానీ, ధాన్యంలో ఎటువంటి కోతా పెట్టలేదు. ప్రభుత్వం తీసుకున్న చొరవే నన్ను కాపాడింది – వాసంశెట్టి అర్జునరావు, గొడ్డటిపాలెం, కాకినాడ జిల్లా మద్దతు ధర నష్టపోకుండా.. ఎకరాకు 30 బస్తాల పైనే దిగుబడి వచ్చింది. ఈ లోగా తుపాను భయపెట్టింది. ప్రైవేటుగా అమ్మేందుకు ప్రయత్నించా. మద్దతు ధర కంటే రూ.400 తక్కువకు అడిగారు. ఇంతలోనే వానలు మొదలయ్యాయి. ధాన్యం నిల్వ చేయడానికి సరైన గిడ్డంగులు లేవు. తక్కువకు అమ్మితే బాగా ఆదాయం పోతుందని బాధ పడ్డాను. ఆర్బీకేలో చెబితే ఆఫ్‌లైన్‌లో నా 220 బస్తాల ధాన్యం కొని, మిల్లుకు తరలించారు. పూర్తిగా మద్దతు ధర వస్తుందని వీఏఏ చెప్పారు. ఆపత్కాలంలో ఆదుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – పంచిరెడ్డి రమణ, గండువల్లిపేట, నరసన్నపేట నిబంధనలు సడలించి ఆదుకున్నారు తుపాను హెచ్చరికలతో పంట కోత కోయించాను. ఆర్బీకే వాళ్లు తేమ 22 శాతం ఉందన్నారు. మద్దతు రేటు రాదేమో అనుకున్నా. కానీ ప్రభుత్వం నిబంధనలు మార్చి మేలు చేసింది. తేమ శాతం ఎక్కువ వచ్చినా మద్దతు ధర దక్కేలా చేసింది. కోత చేసిన 495 సారలు (40 కిలోల బస్తాలు) ఆదివారం ముసురులోనే ధాన్యం కాటా వేయించి లారీల్లో పంపించారు. – సాగి కోటేశ్వరరావు, కౌలురైతు, పునాదిపాడు, కృష్ణాజిల్లా -
తీవ్ర తుఫానుగా హమూన్.. ఏడు రాష్ట్రాలకు అలర్ట్
ఢిల్లీ: 'హమూన్' తీవ్ర తుఫానుగా మారిందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ప్రస్తుతం ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌కు దగ్గరగా ఉందని స్పష్టం చేసింది. తుఫాను ప్రస్తుతం ఒడిశాలోని పారాదీప్‌కు 290 కి.మీ, పశ్చిమ బెంగాల్‌కు 270 కి.మీ, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరాకు నైరుతి దిశలో 230 కి.మీ దూరంలో ఉందని వెల్లడించింది. బుధవారం సాయంత్రం ఖేపుపరా, చిట్టగాంగ్ మధ్య బంగ్లాదేశ్ తీరానికి చేరడాని కంటే ముందే 'హమూన్' బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 25 నాటికి మళ్లీ తుఫానుగా మారుతుంది. గాలి వేగం గంటకు 65 నుంచి 75 కి.మీ వరకు ఉంటుందని ఐఎమ్‌డీ తన తాజా నివేదికలో తెలిపింది. దాదాపు ఏడు రాష్ట్రాల్లో వర్షపాతం హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. అక్టోబర్ 25 వరకు బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని మత్స్యకారులను కూడా కోరింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, మణిపూర్, త్రిపుర, మిజోరాం, అసోం, మేఘాలయ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఇదీ చదవండి: మొసలితో రైతుల వినూత్న నిరసన.. కేటీఆర్ రియాక్షన్ ఇది..! -
నేడు బంగాళాఖాతంలో వాయుగుండం!
సాక్షి, విశాఖపట్నం: మధ్య బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ ఆదివారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. అనంతరం ఈ వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు పయనించనుంది. ఆ తర్వాత మూడు రోజుల్లో మరింతగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం నివేదికలో వెల్లడించింది. ఈ వాయుగుండం తుపానుగా బలపడవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి సూచికగా తమిళనాడులో శనివారం నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయని ఐఎండీ తెలిపింది. నేడో, రేపో మన రాష్ట్రంలోనూ ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. -
ఈ లిబియాకు ఏమైంది? వెన్నాడుతున్న గడాఫీ అరాచకాలే కారణమా?
ఉత్తర ఆఫ్రికా దేశమైన లిబియాలో ‘డేనియల్’ తుఫాను సంభవించిన తర్వాత ముంచెత్తిన వరదలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. లిబియా ఒక చిన్న దేశం. అయితే అనునిత్యం ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తోంది. ఈ దేశం అక్కడి గత నియంత ముఅమ్మర్ అల్ గడాఫీ కారణంగా చర్చల్లో నిలిచింది. అలాగే సమృద్ధిగా ఉన్న చమురు సంపద కారణంగానూ పేరొందింది. గడాఫీ హత్య తర్వాత అంతర్యుద్ధం 2011, అక్టోబర్ 20న గడాఫీ హత్య తర్వాత ఇక్కడ అంతర్యుద్ధం ప్రారంభమైంది. ఇది చాలా కాలం పాటు కొనసాగింది. దీని తరువాత ఇస్లామిక్ స్టేట్ ఇక్కడకు వచ్చి దేశాన్ని సర్వనాశనం చేసింది. ఇప్పుడు దర్నా నగరాన్ని తాకిన వరద సర్వం తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. లిబియా విధ్వంసం కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా మొదలైన గడాఫీ శకం గడాఫీ 27 ఏళ్ల వయసులో తిరుగుబాటుకు పాల్పడి లిబియాలో అధికారంలోకి వచ్చాడు. గడాఫీ ఈ దేశాన్ని 42 సంవత్సరాలు పాలించాడు. ‘బ్రిటన్ రాణి 50 ఏళ్లు, థాయ్‌లాండ్ రాజు 68 ఏళ్లు పాలించగలిగినప్పుడు నేనెందుకు పాలించలేను’ అని గడాఫీ తరచూ అంటుండేవాడు. గడాఫీ 1942 జూన్ 7న లిబియాలోని సిర్టే నగరంలో జన్మించాడు. 1961లో బెంఘాజీలోని మిలిటరీ కాలేజీలో చేరాడు. శిక్షణ పూర్తయిన తర్వాత లిబియా సైన్యంలో చేరాడు. అనేక ఉన్నత స్థానాల్లో పనిచేశాడు. గడాఫీ సైన్యంలో ఉన్న సమయంలో అక్కడి రాజు ఇద్రీస్‌తో విభేదాలు వచ్చాయి. దీంతో గడాఫీ సైన్యాన్ని విడిచిపెట్టాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే బృందంలో చేరాడు. 1969 సెప్టెంబర్ 1న తిరుగుబాటుదారులతో కలిసి గడాఫీ నాటి రాజు ఇద్రిస్ నుంచి అధికారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అంతులేని గడాఫీ అరాచకాలు గడాఫీ అధికారం చేపట్టిన తర్వాత లిబియా నుంచి సహాయం అందుకుంటున్న అమెరికన్, బ్రిటీష్ సైనిక స్థావరాలను మూసివేయాలని గడాఫీ ఆదేశించాడు. లిబియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ కంపెనీలు వారికి లభిస్తున్న ఆదాయంలో ఎక్కువ వాటా ఇవ్వాలని ఆదేశించాడు. గ్రెగోరియన్ క్యాలెండర్ స్థానంలో ఇస్లామిక్ క్యాలెండర్ అమలు చేశాడు. మద్యం విక్రయాలపై నిషేధం విధించాడు. 1969 డిసెంబర్లో, అతని రాజకీయ ప్రత్యర్థులు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, వారందరినీ హత్యచేశాడు. ఇటాలియన్లను, యూదు సమాజానికి చెందిన ప్రజలను లిబియా నుండి బహిష్కరించాడు. లిబియా ఆర్థిక వ్యవస్థ పతనం ప్రత్యర్థులను అణచివేసేందుకు గడాఫీ చేపట్టిన విధానాలే అతని పతనానికి కారణంగా నిలిచాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత గడాఫీ క్రమంగా అనేక దేశాల ప్రభుత్వాలపై ఆంక్షలు విధిస్తూనే ఉన్నాడు. ఫలితంగా జనం అతనిని వెర్రివాడు అని పిలిచేవారు. గడాఫీ ప్రవర్తన కారణంగా లిబియా ఆర్థిక వ్యవస్థ పతనమయ్యింది. సిర్టేలో గడాఫీ హతం అనంతరం లిబియా పేరు పలు ఉగ్రవాద దాడులతో ముడిపడి కనిపించింది. 1986లో వెస్ట్ బెర్లిన్ డ్యాన్స్ క్లబ్‌పై జరిగిన బాంబు దాడిలో లిబియా పేరు వినిపించింది. దీంతో నాటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ చర్యలు చేపట్టి, ట్రిపోలీలోని గడాఫీ నివాసంపై దాడి చేశారు. నాటి నుంచి యూఎన్ఓ గడాఫీ తిరుగుబాటుదారులకు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టింది. నాటో కూటమి కూడా లిబియాపై వైమానిక దాడులు చేయడం ప్రారంభించింది. జూన్ 2011లో గడాఫీ కేసు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు చేరింది. గడాఫీ, అతని కుమారుడు సైఫ్ అల్-ఇస్లాంలకు కోర్టు వారెంట్లు జారీ చేసింది. 2011, జూలైలో ప్రపంచంలోని 30 దేశాలు లిబియాలో తిరుగుబాటు ప్రభుత్వాన్ని గుర్తించాయి. 2011, అక్టోబరు 20న గడ్డాఫీ తన స్వస్థలమైన సిర్టేలో హతమయ్యాడు. చెలరేగిపోయిన లిబియా నేషనల్ ఆర్మీ గడాఫీ మరణానంతరం ఐక్యరాజ్యసమితి ‘నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ (టీఎన్సీ)’ని చట్టబద్ధమైన ప్రభుత్వంగా ప్రకటించింది. టీఎన్సీ 2012లో జనరల్ నేషనల్ కాంగ్రెస్‌కు అధికారాన్ని అప్పగించింది. దీని తరువాత లిబియాలోని టోబ్రూక్ డిప్యూటీస్ కౌన్సిల్ కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. కాగా 2014 నుండి జనరల్ హఫ్తార్‌కు చెందిన ‘లిబియన్ నేషనల్ ఆర్మీ’ లిబియాలో తన ప్రభావాన్ని పెంచుకుంది. 2016లో ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో లిబియాలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడింది. అయితే కొన్ని లిబియా గ్రూపులు దానిని అంగీకరించడానికి నిరాకరించాయి. ఇంతలోనే లిబియా రాజధాని ట్రిపోలీని స్వాధీనం చేసుకునేందుకు లిబియా నేషనల్ ఆర్మీ.. విమానాశ్రయంపై దాడి చేసింది. జనరల్ హఫ్తార్ తన సైన్యాన్ని ట్రిపోలీపై దాడి చేయాలని ఆదేశించాడు. ఈ విధంగా అతని సైన్యం..ఇతర సమూహాల మధ్య చాలా కాలంగా ఘర్షణ వాతావరణం కొనసాగింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హతం గడాఫీ మరణానంతరం ప్రారంభమైన అంతర్యుద్ధాన్ని సద్వినియోగం చేసుకున్న ఇస్లామిక్ స్టేట్ ఈ దేశంలోకి ప్రవేశించింది. రాజధాని ట్రిపోలీకి తూర్పున 450 కి.మీ దూరంలో ఉన్న సిర్టే నగరంలో తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. ఇస్లామిక్ స్టేట్ ఇక్కడ ఊచకోతలకు పాల్పడింది. అయితే 2022లో అక్టోబర్‌లో ఖలీఫా హిఫ్తార్ దళాలు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అంతమొందించాయి. తాజా వరదల్లో వేలాదిమంది మృతి తాజాగా లిబియాలోని దర్నాను తాకిన సునామీ తరహా వరద నగరంలోని అనేక ప్రాంతాలను ముంచెత్తింది. ట్రిపోలీలో సంభవించిన వరదల్లో 2,300 మంది మరణించారని చెబుతున్నారు. దర్నాతో సహా దేశంలోని పశ్చిమ ప్రాంతంలో సంబంధిత అధికారులు 5,300కు మించిన మృతదేహాలను వెలికితీశాని సమాచారం. కాగా వరదల్లో వేలాది మంది గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 34 వేల మంది నిరాశ్రయులయ్యారని తెలుస్తోంది. ఇది కూడా చదవండి: పాక్ ఆ బంకర్లలో ఏమి దాస్తోంది? -
బిపర్జోయ్ తుపాను మహోగ్రరూపం
బిపర్జోయ్ తుపాను ఉగ్రరూపం దాల్చింది. ఇది మరో 10 గంటల్లో అత్యంత తీవ్ర తుపానుగా మారే అవకాశం కనబడుతోంది. దీని ప్రభావంతో గుజరాత్ తీర ప్రాంతలో భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గుజరాత్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని ఇప్పటికే ఐఎండీ స్పష్టం చేసిననప్పటికీ సౌరాష్ట్ర, కచ్ దగ్గర తీరాన్ని తాకే అవకాశం ఉండటంతో తీరం వెంబడి ఉన్న ప్రాంతాల్లో దీని ప్రభావం అధికంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. బిపర్జోయ్ తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మరొకవైపు ఈ తుపాను ప్రభావంతో రానున్న ఐదు రోజులపాలు గుజరాత్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కర్ణాటక, గోవా రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉంది. వాతావవరణ శాఖ సైక్లోన్ అలర్ట్ జారీ చేయడంతో గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిలో భాగంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అత్యంత తీవ్ర తుపానుగా మారే దృష్ట్యా అధికారులు అంతా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్, డీజీపీ వికాస్ సహాయ్, రిలీఫ్ కమిషనర్ అలోక్ పాండే, రెవెన్యూ శాఖ, ఇంధన శాఖ, రోడ్డు భవనాల శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇదిలా ఉంచితే, రాబోయే ఐదు రోజుల్లో గుజరాత్‌లోని కచ్, పాకిస్తాన్‌లోని కరాచీలపై ఈ తుపాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. - ఉదయ్ కుమార్, సాక్షి వెబ్‌డెస్క్ -
ఉగ్రరూపం దాలుస్తున్న బిపర్ జోయ్ తుపాను
బిపర్ జోయ్ తీవ్ర తుపానుగా మారబోతోందా..? కేంద్ర వాతావరణ శాఖ ఏమని హెచ్చరిస్తోంది..? దీని ప్రభావం ఏ రాష్ట్రాలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది..? అసలు బిపర్ జోయ్ అంటే ఏంటి..? అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్ జోయ్ తుపాను మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారబోతోందంటూ ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. తుపాను ఉత్తర, ఈశాన్య దిక్కుగా తుపాను కదులుతోందని తెలిపింది. తుపాను కేంద్రీకృతమైన ప్రాంతంలో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. ఈ క్రమంలో కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్, గుజరాత్, కేరళ రాష్ట్రాలకు ఐఎండీ అలెర్ట్ ప్రకటించింది. తీవ్ర తుపాను కారణంతో ఈ కోస్టల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మరోవైపు తుపాను నేపథ్యంలో గుజరాత్ లోని ప్రఖ్యాత టూరిస్ట్ డెస్టినేషన్ అయిన వల్సాద్ లోని తిథాల్ బీచ్ ను ఈ నెల 14 వరకు మూసి వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని... సముద్రంలోకి వెళ్లిన వారు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలని తెలిపారు. మరోవైపు, వార్నింగ్ సిగ్నల్ ఇవ్వాలని పశ్చిమ తీరంలోని అన్ని పోర్టులకు ఆదేశాలు జారీ అయ్యాయి. బిపర్ జోయ్ అని బంగ్లాదేశ్ సూచించిన పేరు అదలా ఉంటే.. ప్రతి తుపానుకు ఒక పేరు పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తోంది.. ఈ క్రమంలోనే.. ఇప్పుడు అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపానుకు బిపర్ జోయ్ అనే పేరు పెట్టారు. ఇది బంగ్లాదేశ్ సూచించిన పేరు. బిపర్ జాయ్ అంటే విపత్తు అని దీని అర్థం. మరి ఈ విపత్తు నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. -
ముంచుకొస్తున్న 'బిపర్ జోయ్' తుఫాను..అలర్ట్ చేసిన వాతావరణ శాఖ!
అరేబియా సముద్రంలో అత్యంత తీవ్రమవుతున్న బిపర్ జోయ్ తుపాను రానున్న 36 గంటల్లో మరింత తీవ్రం కానుందని వాతావరణ శాఖ(ఐఎండీ) పేర్కొంది. మరో రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని ఐఎండీ ట్వీట్ చేసింది. జూన్ 08 రాత్రి 11.30 గంటలకు గోవాకిమ నైరుతి దిశలో 840 కిలోమీటర్లు, ముంబైకి పశ్చిమ నైరుతి దిశలో 870 కిలోమీటర్లు, ముంబైకి నైరుతిగా 901 కిలోమీటలర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు పేర్కొంది. నిజానికి ఈ బిపర్ జోయ్ తుపాను తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా ఏర్పడి..నెమ్మది నెమ్మదిగా బలపడుతూ..రానున్న 36 గంటల్లో క్రమక్రమంగా తీవ్ర రూపం దాల్చనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు ఐఎండీ ట్విట్టర్లో తెలిపింది. ఈ తుపాను కారణంగా దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర సహా తీర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా ఈ తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. అలాగే సముద్రంలోకి వెళ్లిన వారు వెంటనే తిరిగి రావాలని హెచ్చరించడమే గాక జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేటను నిలిపేయాలని కోరింది. (చదవండి: వాతావరణ శాఖ చల్లటి కబురు.. మరో 48 గంటల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు) -
రెండ్రోజులపాటు పెరగనున్న ఉష్ణోగ్రతలు.. ఆదిలాబాద్‌లో భగభగ
సాక్షి, హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బుధవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది క్రమంగా బలపడి అర్ధరాత్రికల్లా తుపానుగా బలపడే అవకాశం ఉందని వివరించింది. అనంతరం గురువారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. అది క్రమంగా బలపడుతూ ఈనెల 12వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపానుగా మారనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత దిశను మార్చుకుంటూ క్రమంగా బలహీ నపడుతుందని వాతావరణ శాఖ అంచనావేసింది. దీని ప్రభా వంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో తేలిక పాటి, ఒకట్రెండు చోట్ల మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. రానున్న రెండ్రోజులు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరు గుతాయ ని గరిష్ట ఉష్ణోగ్రత 43డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకా శముందని వాతావరణశాఖ వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 40డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవు తాయని తెలిపింది. బుధవారం రాష్ట్రంలో... గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 41.3డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 24.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. -
కాలిఫోర్నియాలో తుఫాన్ బీభత్సం.. 19 మంది మృతి.. వేల మంది..
కాలిఫోర్నియా: అమెరికా కాలిఫోర్నియాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల దాటి వరదలు సంభవించాయి. డ్యాములు పొంగిపొర్లాయి. దీంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు వాగులను తలపించాయి. వందలాది ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. EE.UU. Declara a California en estado de emergencia por las constantes lluvias que afectan esa parte del país. #California#Noticias pic.twitter.com/qNRwg9fJLY — JOSELITO POCHES (@joselitopoches) January 16, 2023 శీతకాల వర్షాల ధాటికి కాలిఫోర్నియాలో వరదలతో పాటు కొండచరియులు విరిగిపడ్డాయి. పలు చోట్ల భూమికి పగుళ్లు వచ్చాయి. తుఫాన్ కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో మొత్తం 19 మంది చనిపోయినట్లు శ్వేతసౌధం అధికారిక ప్రకటనలో తెలిపింది. Así se desgajó una carretera en Pescadero, California, por las intensas lluvias en EU. Dónde ya ha decretado estádo de catástrofe#California #Californiastorm #Noticias pic.twitter.com/YpoRIDTOY9 — JOSELITO POCHES (@joselitopoches) January 16, 2023 కాలిఫోర్నియాలో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 14,411 మందిని సురక్షిత ప్రాంతాలకు తరిలించినట్లు అధికారులు తెలిపారు. సోమవారం కూడా తుఫాన్ ముప్పు ఉందని హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాలిఫోర్నియా తర్వాత ఈ తుఫాన్ లాస్ ఏంజెల్స్ వైపు వెళ్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. చదవండి: Nepal Plane Crash: నేపాల్ విమాన ప్రమాదం.. 10 సెకన్ల ముందు వీడియో వైరల్.. -
అమెరికాపై " స్నో బాంబు "
-
తుఫాన్ పరిస్థితులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
దక్షిణ కోస్తా వైపు వాయుగుండం!
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రానున్న 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం అది అదే దిశలో 3 రోజులు ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్రల వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 20 నుంచి 22 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, 21, 22 తేదీల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. అదే సమయంలో తీరం వెంబడి గంటకు 40–45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది. రానున్న రెండు రోజులు ఉత్తర కోస్తాలో వాతావరణం పొడిగా ఉంటుందని పేర్కొంది. -
గంటకు 160 కి.మీ వేగంతో ప్రచండ తుపాను గాలులు.. సరదాగా ఎదురెళ్తారా?
తుపానుల సమయంలో వీచే పెను గాలుల హోరు ఏ స్థాయిలో ఉంటుందో మనం అప్పుడప్పుడూ టీవీల్లో చూసే ఉంటాం.. కానీ గంటకు సుమారు 160 కి.మీ. వేగంతో వీచే ప్రచండ గాలుల తీవ్రతను ఎప్పుడైనా అనుభూతి చెందారా? డెన్మార్క్‌లోని యూనివర్స్ సైన్స్ పార్క్ ఔత్సాహికులకు ఈ వెరైటీ అవకాశాన్ని కల్పిస్తోంది! అది కూడా పూర్తి సురక్షితమైన వాతావరణంలోనే!! ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా? కృత్రిమంగా ప్రచండ గాలులను సృష్టించడం ద్వారానేలెండి. ఇందుకోసం సైన్స్ పార్క్‌లో తాజాగా రెండు సిములేటర్లతో కూడిన గ్లాస్ చాంబర్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేసి కృత్రిమంగా పెను గాలులను సృష్టిస్తున్నారు. బీట్ ద స్టార్మ్‌గా పిలిచే ఈ చాంబర్లోకి ఐదేళ్ల చిన్నారులు మొదలు 80 ఏళ్ల వృద్ధుల వరకు వెళ్లి భారీ గాలులను అనుభూతి చెందొచ్చు. అయితే పిల్లల కోసం 35 కి.మీ. వేగంతో వీచే సాధారణ గాలులను సిములేటర్ల ద్వారా సృష్టిస్తుండగా పెద్దల కోసం 160 కి.మీ. వేగం వరకు కేటగిరీ–2 హరికేన్ గాలులను సృష్టిస్తున్నారు. గాలులు ఇక చాలనుకుంటే ఔత్సాహికులు గ్లాస్ చాంబర్లో ఒకవైపు నుంచి మరోవైపునకు గాలికి ఎదురెళ్లి అక్కడున్న బటన్‌ను నొక్కాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం కారణంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
ఉత్తరాఖండ్ లో భారీ మంచు తుఫాన్
-
అద్భుత దృశ్యం.. ఆకుపచ్చగా మారిన ఆకాశం.. ఫోటోలు వైరల్
అమెరికా: సాధారణంగా నీలిరంగులో ఉండే ఆకాశం పూర్తిగా ఆకుపచ్చ రంగులోకి మారింది. అమెరికాలోని దక్షిణ డకోటాలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. సియాక్స్ ఫాల్స్ నగర వాసులు ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. హాలీవుడ్ సినిమాలో ఏలియన్స్ రావడానికి ముందు కన్పించే దశ్యాల్లా ఆకాశంలో ఈ మార్పులను చూసి నగరవాసులు ఆశ్చర్యంతో పాటు భయాందోళనకు గురయ్యారు. ఆ మార్పులే కారణం అయితే ఆకాశం ఆకుపచ్చగా మారడానికి వాతావరణంలో అనూహ్య మార్పులే కారణమని తెలుస్తోంది. దక్షిణ డకోటా, మిన్నెసొటా, అయోవ నగరార్లో మంగళవారం ప్రచండ గాలులతో తుపాను బీభత్సం సృష్టించింది. ఆ సమయంలోనే ఈ ప్రాంతాల్లో 'డెరోకో' ఏర్పడిందని వాతావరణ శాఖ ధ్రువీకరించింది. అందుకే ఆకాశం రంగు మారినట్లు పేర్కొంది. ఆకాశం ఆకుపచ్చ రంగులోకి మారినంత మాత్రాన టోర్నడోలు వస్తాయని భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వాతావరణ నిపుణులు తెలిపారు. దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. The approach. @NWSSiouxFalls @keloland @dakotanews_now pic.twitter.com/NOl35jIlpt — jaden 🥞 🍦 (@jkarmill) July 5, 2022 #salemsd pic.twitter.com/ExbpCtV1tI — J (@Punkey_Power) July 5, 2022 ఆకుపచ్చగా ఎందుకు? ఆకాశం ఆకుపచ్చ రంగులోకి ఎందుకు మారుతుందో పూర్తిగా అర్థంకాకపోయినప్పటికీ పలు అమెరికా పరిశోధనా నివేదికలు దీని గురించి వివరించాయి. సూర్యాస్తమయం సమయంలో ఎరుపు కాంతి ఉన్నప్పుడు ఉరుములతో కూడిన వర్షం పడితే, గాలిలోని నీటి కణాల వల్ల ఆకాశం ఆకుపచ్చ రంగులో ఉన్నట్లుగా కనిపిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. తుపాను కారణంగా మంగళవారం రాత్రి నాలుగు గంటల పాటు దక్షిణ డకోటాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ ఆస్తి నష్టం కూడా సంభవించింది. గాలివాన వల్ల ఆకాశం పలుమార్లు నలుపు, నీలం, బూడిద, ఆకుపచ్చ రంగుల్లోకి మారింది. -
Viral Video: గాల్లో ప్రాణాలు.. గగుర్పాటుకు గురిచేసిన వీడియో
Thousands tune in to watch pilots land in London: యూనిస్ తుపాను లండన్ నగరాన్ని వణికిస్తోంది. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈదురు గాలులు వీస్తున్నాయి. ఈ భీకర గాలులు కారణంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ.. ప్రజలను బయటకు రావద్దని హెచ్చరికలు జారి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే లండన్ వీచిన గాలలుకి ఒక విమానం విమానశ్రయంలో ల్యాండింగ్ అయిన విధానం చూస్తే కచ్చితంగా భయమేస్తుంది. ఆ ఈదురుగాలులకి విమానం ఒక్కసారిగా రోడ్డు మీద వెళ్లుతున్న వాహనాలను ఢీ కొడుతుందేమో అనే సందేహం కలుగుతుంది. ఆ విమానంలో ప్రయాణికలు సైతం భయంతో ఊపిరి బిగబిట్టుకుని చూస్తున్నారు. అంత భయంకరంగా ఆ విమానం రన్ వే పై ల్యాండ్ అయ్యింది. అయితే పైలెట్ చాకచక్యంగా ఆ విమానాన్ని చివరికి సురక్షితంగా విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వొళ్లు గగ్గుర్పాటుకు గురిచేసిన ఈ వీడియోనీ మీరు ఒకసారి వీక్షించండి. (చదవండి: బస్తా చిల్లర పైసలతో షోరూంకి వెళ్లాడు.. ఆ తర్వాత) -
అప్రమత్తంగా ఉండండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉత్తరాంద్ర జిల్లా కలెక్టర్లను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ క్రమంలోనే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధమయ్యాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లోను కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండండి: సీఎం జగన్ తుపాను నేపథ్యంలో అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుపాను అనంతరం పరిస్థితులపైనా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, ఉత్తరాంధ్ర, దక్షిణా ఒడిశా తీరాలను గులాబ్ తుపాను తాకనుంది. ఈరోజు అర్థరాత్రి గోపాల్పూర్-కళింగపట్నం మధ్య తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 90 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. దాంతో ఉత్తరాంధ్ర, ఒడిశాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు భారీ సూచనలు ఉన్నాయి. ఉభయగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చదవండి: Cyclone Gulab: దూసుకొస్తున్న గులాబ్ తుపాను -
AP: గులాబ్ తుపాన్‌తో పలు రైళ్లు రద్దు
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ‘గులాబ్ తుపాన్’ కొనసాగుతోంది. గోపాలపూర్‌కు 310కిలో మీటర్లు, కళింగపట్నానికి 380 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది. సాయంత్రానికి కళింగపట్నం-గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ‘గులాబ్’ తుపాను నేపథ్యంలో పలు రైళ్లు రద్దయ్యాయి. పలు రైళ్ల రాకపోకలు మల్లింపు, కొన్ని రైళ్లను రద్దు చేసిన తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. 08463 భువనేశ్వర్-కే.ఎస్.ఆర్ బెంగళూరు స్పెషల్ ట్రైన్, 02845 భువనేశ్వర్- యస్వంత్ పూర్ స్పెషల్ ట్రైన్‌ను రద్దు చేసినట్లు పేర్కొంది. -
‘గులాబ్’ తుపాను: హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్..
సాక్షి, హైదరాబాద్: వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శనివారం ఉదయం ఏర్పడిన తీవ్ర వాయుగుండం సాయంత్రం 5.30 గంటల సమయంలో ‘గులాబ్’తుపానుగా మారింది. ఇది గోపాల్‌పూర్‌కు 370 కిలోమీటర్లు, కలింగపట్నంకు తూర్పు, ఈశాన్య దిశలో 440 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను పశ్చి మ దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరప్రాంతాల్లోని కలింగపట్నం, గోపాల్పూర్ మధ్యలో ఆదివారం సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, ఈనెల 27న ఈశాన్య, తూర్పు, మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఆవర్తనం ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో తదుపరి 24 గంటల్లో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయవ్య దిశగా ప్రయాణించి ఈనెల 29న పశ్చిమ బెంగాల్ తీరం వద్దకు చేరుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఆదివారం ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. -
తుపాను పరిస్థితులపై సీఎం జగన్ ఆరా
సాక్షి, అమరావతి: తుపాను పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కార్యాలయ అధికారులతో సమీక్షించారు. అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశామని, తీసుకోవాల్సిన చర్యలపై వారికి తగిన సూచనలు చేశామని అధికారులు సీఎంకు వివరించారు. గ్రామ సచివాలయాల వారీగా కంట్రోలు రూమ్స్ కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. (చదవండి: రెండేళ్ల పాలనకు నిదర్శనమే ఈ ప్రజా తీర్పు: మంత్రి బొత్స) విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో విపత్తు నిర్వహణ సిబ్బందిని కూడా సిద్ధం చేశామన్నారు. అవసరమైన చోట శిబిరాలు తెరిచేందుకు కలెక్టర్లు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. తుపాను అనంతర పరిస్థితులపైనా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. తీరం దాటిన తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. చదవండి: 26న ‘గులాబ్’ తుఫాన్.. నేడు, రేపు భారీ వర్షాలు -
సూరీడుకి కోపమొచ్చిందా? అలా ఇప్పుడొస్తే.. అల్లకల్లోలమే!
అది 1859వ సంవత్సరం.. సెప్టెంబర్ ఒకటో తేదీ.. అంతా ఆఫీసుల్లో పనిచేసుకుంటున్నారు. ఉన్నట్టుండి రేడియోలన్నీ ఏదేదో చిత్రమైన శబ్దం చేస్తూ మూగబోయాయి.. కాసేపటికే టెలిగ్రాఫ్ లైన్లలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. ఆఫీసులు కాలిపోయాయి. ఒకటి రెండు చోట్లనో కాదు.. ఉత్తర అమెరికా, యూరప్ ఖండాల్లోని చాలా దేశాల్లో ఇదే కలకలం. దీనంతటికీ కారణం ఓ సౌర తుఫాను.. ఇప్పుడు కూడా అలాంటి ఓ సౌర తుఫాను వస్తోంది. దాని రేడియేషన్, విద్యుదయస్కాంత శక్తి వల్ల సమాచార, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉందన్న హెచ్చరికలు వస్తున్నాయి. మరి ఈ సౌర తుఫానులు ఏంటి, ఎందుకు, ఎప్పుడు ఏర్పడుతాయి, ప్రమాదం ఏమిటన్న వివరాలు తెలుసుకుందామా? –సాక్షి సెంట్రల్ డెస్క్ ఏమిటీ సౌర తుఫానులు సూర్యుడు కొన్ని కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రతలో కుతకుత ఉడుకుతూనే ఉంటాడు. ఆ పరిస్థితిలో హైడ్రోజన్ అణువులు సంలీనమై హీలియంగా మారుతూ భారీ ఎత్తున శక్తి విడుదల అవుతుంది. ఆ శక్తి కాంతి ‘ఫోటాన్ల’రూపంలో ప్రసరిస్తుంది. ఇదే మనకు అందే సూర్యరశ్మి. అయితే భారీ ఉష్ణోగ్రతలు, పీడనం వల్ల సూర్యుడిపై పదార్థమంతా ప్లాస్మా (ద్రవానికి, ఘనానికి మధ్య) స్థితిలో ఉంటుంది. సూర్యుడి అయస్కాంత క్షేత్రంలో మార్పులు జరిగినప్పుడు.. ఈ ప్లాస్మా తీవ్ర ఒత్తిడికి లోనై ఒక్కసారిగా విస్ఫోటం చెందుతుంది. ఆ ప్లాస్మాతో కూడిన విద్యుదయస్కాంత వికిరణాలు (ఎలక్ట్రో మ్యాగ్నటి క్ రేస్).. అతి వేగంతో అంతరిక్షంలోకి విడుదలవుతాయి. కోట్ల కిలోమీటర్లు ప్రయాణిస్తూ.. మార్గమధ్యలో ఉండే గ్రహాలపై ప్రభావం చూపిస్తాయి. మనుషులకు ప్రమాదకరమా? సౌర తుఫానుల వల్ల మనుషులకు నేరుగా ప్రమాదం కలిగే అవకాశాలు అతి స్వల్పమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమికి ఉన్న అయస్కాంత క్షేత్రం, వాతావరణం కలిసి.. సూర్యుడి ప్లాస్మా వికిరణాలను, రేడియేషన్‌ను చాలావరకు అడ్డుకుంటాయని వివరిస్తున్నారు. చాలా శక్తివంతమైన సౌర తుఫానులు భూమిని తాకితే.. నేరుగా ఎండ తగిలే లా ఉన్నవారిపై కాస్త రేడియేషన్ ప్రభావం ఉండొ చ్చని, కానీ అది స్వల్పమేనని స్పష్టం చేస్తున్నారు. ప్రతి పదకొండు ఏళ్లకోసారి.. సూర్యుడి స్వీయ భ్రమణం, పాలపుంతలోని ఇతర నక్షత్రాల ప్రభావం వల్ల.. సూర్యుడి అయస్కాంత ధ్రువాలు ప్రతి 11 ఏళ్లకోసారి తారుమారు అవుతుంటాయి. అంటే ఉత్తర ధ్రువం దక్షిణంగా, దక్షిణ ధ్రువం ఉత్తరంగా మారుతుంటాయి. ఈ క్రమంలో అయస్కాంత శక్తి చిక్కుపడి ప్లాస్మా విస్ఫోటనం చెంది సౌర తుఫానులు ఏర్పడుతాయి. ప్రతి పదకొండేళ్లకు ఇలా సౌర తుఫానులు ఏర్పడుతున్నా.. కొన్నిసార్లు మామూలుగా, మరికొన్నిసార్లు అత్యంత శక్తివంతంగా ఉంటాయి. అవన్నీ కూడా అంతరిక్షంలో వివిధ దిక్కుల్లోకి విడుదలవుతుంటాయి. కొన్నిసార్లు మాత్రమే భూమి వైపు వస్తుంటాయి. ►1859లో భారీ సౌర తుఫాను వచ్చినప్పటికి ఉన్న కమ్యూనికేషన్ టెక్నాలజీలు కేవలం రేడియో, టెలిగ్రాఫ్ లైన్లు మాత్రమే. అందువల్ల ఆ తుఫాను దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా రేడియోలు మూగబోయాయి. సౌర తుఫాను విద్యుదయస్కాంత ప్రభావం వల్ల ఉత్తర అమెరికా, యూరప్ ఖండాల్లో టెలిగ్రాఫ్ లైన్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ఆ సౌర తుఫానును గుర్తించిన రిచర్డ్ క్యారింగ్టన్ పేరు మీదుగా.. ఆ ఘటనకు ‘క్యారింగ్టన్ ఈవెంట్’గా పేరు పెట్టారు. ►1989లో ఏర్పడిన సౌర తుఫాను కారణంగా కెనడాలో విద్యుత్ సరఫరా వ్యవస్థ కుప్పకూలింది. అలా ఇప్పుడొస్తే.. అల్లకల్లోలమే.. 1859 నాటి స్థాయి సౌర తుఫాను ఇప్పుడు వస్తే.. కమ్యూనికేషన్, విద్యుత్ సరఫరా వ్యవస్థలు మొత్తం కుప్పకూలిపోతాయని హార్వర్డ్ ఆస్ట్రానమీ శాస్త్రవేత్త అబ్రహం లోబ్ వెల్లడించారు. లక్షలాది పరికరాలు పాడైపోతాయని, కొద్దిరోజులు కోట్ల మంది చీకట్లో మగ్గాల్సి వచ్చేదని తెలిపారు. అదే జరిగితే కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. 2014లో ఒక భారీ సౌర తుఫాను వచ్చినా.. భూమి ముందుకు వెళ్లిపోవడంతో త్రుటిలో తప్పించుకున్నామ న్నారు. అదే 9 రోజులు ముందు వచ్చి ఉంటే భారీ నష్టం జరిగి ఉండేదని వివరించారు. వచ్చే వందేళ్లలో ప్రమాదకర సౌర తుఫాను భూమిని తాకే అవకాశం ఉందని చెప్పారు. దేనిపై ప్రభావం.. ఎంత ప్రమాదం సౌర తుఫానుల కారణంగా విద్యుదయస్కాంత తరంగాలపై ఆధారపడి పనిచేసే కమ్యూనికేషన్ వ్యవస్థలపై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా శాటిలైట్ సిగ్నళ్లు, జీపీఎస్ నావిగేషన్, మొబైల్ ఫోన్ సిగ్నళ్లు, డీటీహెచ్ ప్రసారాల్లో అంతరాయం ఏర్పడుతుంది. సౌర తుఫాను మరీ తీవ్రంగా ఉంటే పరికరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ►సూర్యుడి ప్లాస్మా వికిరణాలు విద్యుత్ సరఫరా లైన్లపై ప్రభావం చూపిస్తాయి. ఓల్టేజీ ఒక్కసారిగా పెరిగిపోయి.. ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటాయి. విద్యుత్ గ్రిడ్ కుప్పకూలిపోతుంది. వాటన్నింటినీ మరమ్మతు చేయడమో, కొత్తవి ఏర్పాటు చేయడమో జరిగేదాకా విద్యుత్ సరఫరా ఆగిపోయినట్టే. ఆకాశంలో అందమైన కాంతులు ఇవే.. భూమి ఉత్తర, దక్షిణ ధ్రువాల వద్ద అప్పుడప్పుడూ వివిధ రంగుల్లో అందమైన కాంతి పుంజాలు (అరోరాలు) ఏర్పడుతుంటాయి. వాటికి కారణం సూర్యుడి విద్యుదయస్కాంత వికిరణాలే. భూమివైపు వస్తు న్న ఆ వికిరణాలను భూమి వాతావరణం, అయస్కాంత క్షేత్రం అడ్డుకున్నప్పుడు ఏర్పడే చర్యల్లో.. అలా రంగురంగుల అరోరాలు ఏర్పడుతాయి. -
తుఫానుగా బలపడనున్న వాయుగుండం
సాక్షి, విజయవాడ: నైరుతి, దాని అనుసంధానంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సూచనల ప్రకారం 24 గంటల్లో తుఫాన్‌గా బలపడనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. దాని ప్రభావంతో రాగల 3 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. బుధవారం, గురువారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయిని పేర్కొన్నారు. మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 45-65 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మూడు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేశామని ఆయన తెలిపారు. రైతాంగం వ్యవసాయ పనుల యందు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కె. కన్నబాబు తెలిపారు. చదవండి: పచ్చి అబద్ధాలే ‘పచ్చ’ రాతలు! -
తుపానులో ‘పెళ్లి’ తంటాలు.. ఫోటోలు వైరల్
కల్యాణం వచ్చినా.. కక్కు వచ్చినా ఆగదన్నట్టు.. వానొచ్చినా...వరదొచ్చినా.. తమ పెళ్లి ముచ్చట కాస్తా జరిగి తీరాల్సిందే అని ఒక జంట నిశ్చయించుకుంది. భారీ వరదల మధ్య ప్రమాదకరమైన నదిని దాటి మరీ ఈ జంట వివాహ వేడుకను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పెళ్లి దుస్తుల్లో వధూవరుల ఇబ్బందులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విరివిగా షేర్ అవుతున్నాయి. అడ్డంకులను అధిగమించి ఒక్కటైన జంటను నెటిజన్లు అభినందిస్తున్నారు. స్థానిక వార్తాపత్రిక ఫిలిప్పీన్ స్టార్ ప్రకారం,టైఫూన్ క్వింటా కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు వరదలు ముంచెత్తాయి. అయితే ఇలాంటి ప్రతికూల వాతావరణంలో కూడా వివాహబంధంతో ఒక్కట వ్వాలనుకున్నారు రోనీ గుళీపా, జెజిల్ మసూలా. వరదలతో పోటెత్తిన లుయాంగ్ నదిని దాటుకుని చర్చికి వెళ్లి అక్టోబర్ 23న మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా పెళ్లి గౌనులో వధువు, సూట్ ధరించిన వరుడు ఇద్దరూ పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. ఈ జంటతో పాటు స్నేహితులు, బంధువులు కూడా ఇబ్బందులు పడుతూ పెళ్లికి హాజరు కావడం విశేషం. వేడుక అనంతరం అంతా ఆనందంతో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ పెళ్లి ప్రయాణానికి సంబంధించిన ఫోటోలు ఇపుడు ఆసక్తికరంగా మారాయి. బంధువుల్లో ఒకరైన జోసెఫిన్ బోహోల్ సబనాల్ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
నేడు తీరం దాటనున్న ఉంపన్
సాక్షి, విశాఖపట్నం/కోల్‌కతా/భువనేశ్వర్: ఉంపన్ తుపాను మంగళవారం బలహీనపడి, అత్యంత తీవ్ర తుపానుగా మారింది. అయినా, ఒడిశా, పశ్చిమబెంగాల్లోని తీర ప్రాంత జిల్లాల్లో విధ్వంసం సృష్టించే స్థాయిలోనే ఉంది. దాంతో, ఆ రాష్ట్రాలు ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. తుపాను ప్రభావం ఉండే తీర ప్రాంతాల నుంచి లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.‘కోల్‌కతాకు దక్షిణంగా 180 కి.మీల దూరంలో ఉన్న దిఘాకు, బంగ్లాదేశ్‌లోని హతియా దీవికి మధ్య బుధవారం మధ్యాహ్నానికి తుపాను తీరం దాటొచ్చు. ఆ సమయంలో తీరం వెంబడి పెనుగాలుల వేగం 165 కి.మీల వరకు ఉండొచ్చు’ అని భువనేశ్వర్‌లోని వాతావరణ శాఖ అధికారి వెల్లడించారు. సహాయక చర్యలు పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన 41 బృందాలను మోహరించామని ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు. బెంగాల్ తీర ప్రాంతాల నుంచి సుమారు 3 లక్షల మందిని తుపాను సహాయ కేంద్రాలకు తరలించామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ తెలిపారు. గత సంవత్సరం ఫని, బుల్బుల్ తుపానులను ఎదుర్కొన్న అనుభవం ఇప్పుడు ఉపయోగపడుతోందని విపత్తు నిర్వహణ మంత్రి జావేద్ పేర్కొన్నారు. ఒడిశాలో.. తుపాను ప్రభావిత తీర ప్రాంతాల్లోని 11 లక్షల మందిని తరలించే కార్యక్రమం ప్రారంభించామని ఒడిశా అధికారులు తెలిపారు. ప్రభావిత జిల్లాలో విపత్తు నిర్వహణ దళాలు సహాయ సామగ్రితో సిద్ధంగా ఉన్నాయన్నారు. కేంద్రపార, బాలాసోర్ తదితర తీర ప్రాంత జిల్లాల్లో పెనుగాలులతో భారీ వర్షాలు పడే అవకాశముంది. ఉంపన్ తుపాను సహాయ చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమబెంగాల్ సీఎం మమత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లతో వేర్వేరుగా సమీక్షించారు. అత్యంత తీవ్ర(ఎక్స్ట్రీమ్లీ సివియర్) తుపాను నుంచి సోమవారం ప్రచండ తుపాను(సూపర్ సైక్లోన్)గా ఉంపన్ పరిణమించింది. మంగళవారం బలహీనపడి అత్యంత తీవ్ర తుపానుగా మారింది. -
రేపు తీరం దాటనున్న ‘అంఫాన్’
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ, మధ్య బంగాళాఖాతం మీదుగా సూపర్ సైక్లోన్ 'అంఫాన్' కొనసాగుతోంది. ఈ తుపాన్ పారాదీప్‌కు దక్షిణంగా 520 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తూ రేపు(బుధవారం) సుందర్బన్స్కు సమీపంలో అంఫాన్ అతి తీవ్ర తుపానుగా మారనుంది. డిఘ-హతియా తీరం వద్ద ‘అంఫాన్’ తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇక కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, ఉత్తర కోస్తాలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. (అంఫన్‌తో జాగ్రత్త) తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీసున్నాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు, కృష్ణపట్నం పోర్టుల్లో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. -
అంఫన్‌తో జాగ్రత్త
సాక్షి, కాకినాడ: అంఫన్ తుపాను హెచ్చరిక నేపథ్యంలో అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రా ల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డి. మురళీధర్‌రెడ్డి సోమ వారం రాత్రి తీర ప్రాంత మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలను ఆదేశించారు. తుని, ఉప్పాడ కొత్తపల్లి, తాళ్లరేవు, కాకినాడలతో పాటు కోనసీమ ప్రాంతంలోని కాట్రేనికోన, అల్లవరం, అమలాపురం, మలికిపురం, రాజోలు, ముమ్మిడివరం, ఐ.పోలవరం, అయినవిల్లి మండలాల అధికారులు అప్రమత్తంగా ఉంటూ 24 గంటల తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. గ్రామాల్లో తుపాను హెచ్చరికలపై ప్రచారం చేయాలన్నారు. అవసరమైతే పల్లపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే తమిళనాడు దక్షిణ కోస్తాతో పాటు నెల్లూరు లో వర్షాలు పడుతున్నాయన్నారు. ఇది ఉత్తర దిశగా కదులుతుందని, ఈ నెల 20, 22 తేదీల మ«ధ్య ఒడిశా, భువనేశ్వర్ తీరంవైపు కదులు తూ బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశాలున్నట్టు తు పాను హెచ్చరిక కేంద్రం ప్రకటించడంతో అధికారు లు అప్రమత్తం కావాలన్నారు. జిల్లాలో బుధవారం ఈదురుగాలులతో వర్షం పడే అవకాశాలున్నట్టు తెలిపారు. సముద్రం తీరానికి పర్యాటకులను అనుమతించ వద్దని, ఎవరైనా వస్తే వారిపై అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అన్ని మండల కేంద్రాలు, రెవెన్యూ కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆర్డీవో, తహసీల్దార్లను ఆదేశించారు. తుపాను సమయంలో వినియోగించే వివిధ పరికరాల పని తీరును పరిశీలించి తదనుగుణంగా వాటిని సిద్ధం చేసుకోవాలని మండల పరిధిలోని అధికారులను కలెక్టర్ మురళీధర్‌రెడ్డి ఆదేశించారు. రాజోలు దీవిలో ‘అల’జడి 30 మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం మలికిపురం: అంఫన్ తుపాను ప్రభావం రాజోలు దీవి సముద్ర తీరంలో తీవ్రంగా ఉంది. తుపాను కారణంగా సముద్రపు అలలు భారీగా ఎగసి పడుతున్నాయి. సుమారు 30 మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. రాజోలు దీవిలో సముద్ర తీరం వెంబడి భారీగా అలలు భూభాగం వైపు చొచ్చుకుని వచ్చాయి. భూభాగం కూడా కొట్టుకుపోతోంది. మలికిపురం ఎస్సై ఎం.నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బంది సముద్ర తీరం వద్ద బందోబస్తు నిర్వహించి ప్రజలు అటు వైపు రాకుండా అడ్డుకున్నారు. -
నేడు తుపానుగా మారనున్న అల్పపీడనం!
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గంటగంటకూ బలోపేతమవుతోంది. ఇది శనివారం తెల్లవారేలోగా వాయుగుండంగా మారి సాయంత్రానికల్లా బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఇది 17వ తేదీ వరకు వాయువ్య దిశగా కదులుతూ.. 18, 20వ తేదీల్లో ఉత్తర ఈశాన్య దిశగా బంగాళాఖాతం వైపు పయనిస్తుందని శుక్రవారం రాత్రి ఐఎండీ వెబ్సైట్లో ప్రకటించింది. వాయుగుండం బలపడటం, ఇతర ప్రభావాల వల్ల రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. ‘ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా జల్లుల నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయి. అదే సమయంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి’ అని పేర్కొంది. శనివారం నుంచి 3 రోజుల పాటు బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంటుందని.. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం, ఒక్కోసారి 60 కిమీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులెవ్వరూ వెళ్లొద్దనీ హెచ్చరించింది. 36 గంటల్లో అండమాన్‌కు ‘నైరుతి’ రాగల 36 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతు పవనాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. -
అమెరికాను కుదిపేసిన తుపాను
లూయిస్విల్లే: అమెరికాను భారీ తుపాను వణికించింది. ఆ తుపాను ధాటికి అయిదుగురు మృతి చెందారు. దాదాపు 3 లక్షల ఇళ్లకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఈ తుపాను ఉత్తర కరోలినాలో భారీ ప్రభావం చూపింది. పెన్సిల్వేనియాలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రోడ్డు ప్రమాదాలు, వరదలు, వర్షం కారణంగా అయిదుగురు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ వర్జీనియాలో ఎమర్జెన్సీ ప్రకటించారు. చాలా చోట్ల పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఉత్తర, దక్షిణ కరోలినా, వర్జీనియా, జార్జియాల్లో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. వాయు తీవ్రతకు చాలా చోట్ల చెట్లు విరిగిపడటంతో ఇళ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. అప్రమత్తంగా ఉండాలని తుపాను ప్రభావిత ప్రాంతాలోని ప్రజలను టెన్నెసీ లోయ ప్రాధికార సంస్థ కోరింది. మరోవైపు మంచు భారీగా కురుస్తుండటంతో అమెరికా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. (చదవండి: విషాద ఛాయల మధ్య ఆనందోత్సవాలు..) -
తీవ్ర తుపానుగా బుల్బుల్
సాక్షి, విశాఖపట్నం : తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న బుల్బుల్ తుపాను తూర్పు మధ్య బంగాళాఖాతంలో పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 640 కి.మీ, పశ్చిమ బెంగాల్‌కు 740 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటల్లో ఇది తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. అనంతరం బుల్బుల్.. ఈ నెల 9వ తేదీ ఉదయం వరకు ఉత్తర దిశగా పయనించనుంది.తర్వాత దిశను మార్చుకుని ఈశాన్య దిశగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. బుల్బుల్ తీవ్రరూపం దాలుస్తున్నందున విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు రెండో ప్రమాద హెచ్చరిక, కాకినాడ, గంగవరం పోర్టులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని కళింగపట్నం, భీమునిపట్నం పోర్టులకు వాతావరణ శాఖ అధికారులు సూచించారు. సముద్రం అలజడిగా ఉండనున్నందున మత్స్యకారులెవరూ శుక్రవారం వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. -
కల్లోల కడలి
సాక్షి, వజ్రపుకొత్తూరు(శ్రీకాకుళం) : కడలి కల్లోలమవుతోంది. అలలు ఉగ్రరూపం దాల్చి తీరానికి వస్తున్నాయి. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలను చూసి మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని భావనపాడు, మంచినీళ్లపేట, బారువ తీరాల్లో దాదాపు 50 మీటర్ల ఎత్తున అలలు ఎగసి పడుతున్నాయి. అలల తాకిడికి వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట తీరంలో సముద్రం దాదాపు 135 మీటర్ల మేర ముం దుకు వచ్చింది. తీరానికి ఆనుకుని ఉన్న ఇసుక దిబ్బలు కోతకు గురవుతున్నాయి. మంచినీళ్లపేటతో పాటు దేవునల్తాడ, అక్కుపల్లి, డోకులపాడు తీరంలో తీరం కోతకు గురైంది. అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం వెరసి కోస్తా తీరానికి భారీ వర్షం పొంచి ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించడంతో శ్రీకా కుళం జిల్లాలో తీరం ప్రాంతాన్ని అధికారులు అప్రమత్తం చేశారు. తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లరాదంటూ దండోరాలు వేయించిన రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలంటూ సూచిస్తున్నారు. తీరంలోనే వేట సామగ్రి వదిలిన మత్స్యకారులు వేట లేకరెండురోజులుగా ఇళ్లకే పరిమితమయ్యారు. ఏడాదిలో ఐదోసారి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తీరం కోత కు గురవడం ఇది ఐదోసారని, గతంలో వచ్చిన తుఫాన్, అధిక వర్షాలకు ఇలాంటి ప్రమాదకర పరిస్థితి ఉండేది కాదని మత్స్యకారులు చెబుతున్నారు. మంచినీళ్లపేట, దేవునల్తాడ, అక్కుపల్లి ప్రాంతాల్లో ఏడాదిలో ఐదు సార్లు తీరం కోతకు గురైంది. జిల్లాలో సంతబొమ్మాళి, గార, ఎచ్చెర్ల మండలాల్లో చాలా చోట్ల తీరం ఇలాగే ఆందోళన రేకెత్తిస్తోంది. ఇది ఒక రకంగా ప్రమాదానికి సూచిక అంటూ పెద్దలు హెచ్చరిస్తున్నారు. హుద్‌హుద్, తిత్లీ, ఫొని లాంటి తుపాన్లే ఇందకు నిదర్శనం కాగా.. సముద్ర అంతర్భాగంలోని పొరల్లో ఏర్పడుతున్న అలజడి ఓ కారణం అంటూ నిపుణులు చెబుతున్నారు. నెల రోజుల కిందట అక్కుపల్లి తీరంలో దాదాపు కిలోమీటరు మేర, ఇప్పుడేమో మంచినీళ్లపేట తీరంలో 2 కిలోమీటర్ల మేర తీరం కోతకు గురైంది. పస్తుల్లో గంగపుత్రులు వరుసగా తుఫాన్లు, అల్పపీడన ద్రోణులు ఏర్పడుతుండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లడం కుదరడం లేదు. వేట లేక మత్స్యసంపద చిక్కక, చిక్కిన సంపదకు దళారుల బెడద కలగలిపి గంగపుత్రులను బెంగ కు గురి చేస్తున్నాయి. మరో పక్క 61 రోజుల పాటు వేట నిషేధ భృతి ఇంకా అందలేదు. ఆయిల్ సబ్సిడీ సైతం అందని మత్స్యకారులు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వేట నిషేధ భృతి పెంచింది. తుఫాన్ల సమయంలోనూ తమను ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. చేపల వేటకు వెళ్లొద్దు అల్పపీడణ ద్రోణి ఉన్నందున మత్స్యకారులను చేపల వేటకు వెళ్లవద్దని ఆదేశించాం. ఇప్పటికే మా సిబ్బంది ద్వారా సాగర మత్స్యకార సొసైటీ అధ్యక్షులకు సమాచారం అందించాం. తీర ప్రాంత గ్రామాల్లో దండోరాలు వేయించాం. వేట నిషేధ భృతికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు రూ.10వేలు వేట నిషేధ భృతి కోసం కమిషనరేట్ నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు అడిగారు. అవి పంపించాం. అందుకే వేట నిషేధ భృతి కొంత మేర ఆలస్యమైంది. త్వరలో మంజూరు అయ్యే అవకాశం ఉంది. – సంతోష్‌కుమార్, ఎఫ్డీఓ, పలాస తుపాన్ల సమయంలో అండగా నిలవాలి తుపానులు, అధిక వర్షా ల సమయంలో మత్స్యకారులకు తీవ్ర నష్టం జరుగుతోంది. రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ తుఫాన్ల సమయంలో మత్స్యకారులకు కూడా అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇసుక దిబ్బ లపై ఎండబెట్టిన ఉప్పు చేపలు పాడైతే నష్ట పరిహారం ఇవ్వాలి. మత్స్యకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు అందించి సొసైటీలను బలోపేతం చేయాలి. వేటకెళ్లే మత్స్యకారుని ఖాతాలో నిషేధ భృతి జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. – జి.శంభూరావు, మత్స్యకారుడు. -
దూసుకొస్తున్న ‘ఫణి’
విజయవాడ: ఫణి తుపానును ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో తుపాను ముందస్తు చర్యలపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలోపేతమై మచిలీపట్నం వైపునకు ఫణి తుపానుగా దూసుకొస్తోందన్నారు. రానున్న 72 గంటల్లో వాయుగుండం ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతానికి చేరుకుంటుందన్నారు. ఈనెల 28, 29, 30 తేదీల్లో జిల్లాపై ఈ ప్రభావం ఉండవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసిందన్నారు. ఈ ప్రభావంతో గంటకు 40 నుంచి 50కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలుస్తోందన్నారు. తుపాను ప్రభావిత మండలాల్లో హై అలర్ట్ ఈ నేపథ్యంలో జిల్లాలో ముఖ్యంగా తుపాను ప్రభావిత మండలాలైన మచిలీపట్నం, నాగాయలంక, కోడూరు, కృత్తివెన్ను, బంటుమిల్లి, అవనిగడ్డ, మోపిదేవిలతో పాటు 16 ముంపు మండలాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకునేందుకు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక అధికారులను నియమించామని చెప్పారు. 137 కమ్యూనిటీ రేడియో సెట్లతో.. జిల్లా వ్యాప్తంగా 137 కమ్యూనిటీ రేడియో సెట్ల ద్వారా తుపాను ప్రభావిత మండలాల్లో మత్స్యకారులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ అప్రమత్తం చేయాలని మత్స్యశాఖ అధికారులను ఆదే«శించామన్నారు. అన్ని రెవెన్యూ డివిజినల్, తహసీల్దార్ కార్యాలయాల్లో వైర్లెస్ సెట్లు, హోం రేడియోలతో సిద్ధంగా ఉండాలన్నారు. ప్రభుత్వాస్పత్రులు, రక్షిత మంచినీటి సరఫరా కేంద్రాల వద్ద జనరేటర్లతో సిద్ధంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్ అథారిటీ, పంచాయతీ అధికారులు ఓవర్‌హెడ్ ట్యాంకులను తాగునీటితో నింపుకోవాలని కలెక్టర్ సూచించారు. విద్యుత్‌కు అంతరాయం ఏర్పడితే తాగునీటికి ఇబ్బంది లేకుం డా డీజిల్ జనరేటర్లను సిద్ధం చేసుకోవాలన్నారు. వరి పైరును రక్షించేందుకు.. జిల్లాలో పంట దశలో ఉన్న 7వేల హెక్టార్ల వరిపైరును రక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యానికి టార్పాలిన్ కప్పి ఉంచే విధంగా రైతులను అప్రమత్తం చేయాలన్నారు. మామిడి, ఉద్యానవన పంటల రైతులకు తుపాను పరిస్థితిని వివరించి అప్రమత్తం చేయాలన్నారు. అన్ని ప్రభుత్వాస్పత్రుల వద్ద వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని అత్యవసర మందులను కూడా సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్లా, సబ్–కలెక్టర్లు మిషాసింగ్, స్వప్నిల్ దినకర్, జేసీ–2 పి.బాబూరావు, డీఆర్వో ఏ.ప్రసాద్, జెడ్పీ సీఈఓ షేక్‌సలాం, ఆర్డీఓలు పాల్గొన్నారు. -
తిత్లీ
వారం రోజులుగా ముసురు. టిపిరి టిపిరి సినికులు తగులుకున్నాయి. ‘‘అరె శివ.. రేతిరికి పెద్ద తుపానమట్రా.. తిత్లీ’’ అనింది సీకన్య. అప్పుడు మావూరి అమ్మోరి గుడికాడ వున్నాన్నేను. సీకన్య ఆల్లమ్మతో గుడికొచ్చింది. ‘‘తిత్లీ’’..ఈ పేరు ఇనగానే శానా నవ్వొచ్చింది నాకు. గట్టిగా నవ్వాను. ‘‘ఏనికిరా ఆ నవ్వు’’ అని మూతిరిసింది సీకన్య. నాకింకా నవ్వొచ్చింది. ‘‘అంత నవ్వొద్దురా.. టీవీలసెప్పారు. తిత్లీ తుపానమట’’ అనింది మళ్లా పెద్ద తెలిసినట్టుగా.. నేనసలే æఒకరి మాట ఇనే నాకొడుకుని కాను. అది సెప్పిందెందుకింటాను?! దాని మాటకి ఇగటానికి దిగినాను. ‘‘తిత్లీ అట.. తిత్లీ.. కిట్లీ.. ఫిట్లీ.. లొట్లీ’’ అని ఇగటానికెళ్ళాను. ‘‘ఎల్రా ఊసకల్లోడా.. టీవీ సూస్తే తెలుసును. గంటకి 150 గాలట. పలాస దాక పారొచ్చింది’’అని టీవీల నూసులాగ మళ్లా సెప్పింది. నాకు ఇంకా పౌరుసం పొడుసుకొచ్చింది. ‘‘ఎల్లే..పెద్ద నీకేదో తెలిసినట్టు పోజు కొట్టక. సోసల్ల పస్టు నాను. నాకు తెలుసును. తుపానమంటే పెద్ద గాలి. గట్టిగా వస్తాది. అది పలాస దాకొచ్చి ఆగిపోదు.! అదేమైనా బొస్సా?! పలాస నుండి సోంపేటొచ్చి, అక్కడ రెస్టు సేసుకొని మళ్లా ఇచ్ఛాపురం రావడానికి’’ అన్నాను ఇగటంగా.నా మాటకి ఇంత పొడుగు మూతెట్టింది సీకన్య. ‘‘ఎల్రా..ఊసకల్లోడా’’ అని నా పొద్దెట్టి ఆలమ్మ యెనక సిన్న ఈరో సైకిలు తొక్కుకుంటూ ఎల్లిపోయింది. సీకన్య, నాను ఒకటే క్లాసు. ఆరు. ఈ ఏడే ఎంపీపీ ఇస్కూల్ నుండి జెడ్పీహెచ్ ఇస్కూల్కి ఎళ్లినాము. మా యడ్డుమాస్ట్ కూతురే సీకన్య. నాను ‘‘సీకాయ’’ అని ఇగటమాడుతుంటాను. ‘‘అరె..ఊసకల్లోడా.. నాపేరు శ్రీకన్య. పలకడం రాకపోతే పల్లకో. అంతేగానీ పరాసికాని పోకు’’ అని శానా ఇదైపోతాది సీకన్య.కానీ సీకన్య సూపరు. నాను, సీకన్యని ‘‘ఐస్పర్యారాయ’’అని ముద్దుగా పిలుసుకుంటా. బొమ్మ సెక్కినట్టుగ వుంటాది సీకన్య. దాన్ని కేళిసేయడం నాకు శానా సరదా. నానింకా అమ్మోరి గుడికాడే వున్నాను. ముసురు గదా... పొద్దుగూకే యాల కూడా తెలియట్లే. ఇంతల సిమ్మాద్రి వచ్చాడు. మాసీనేరు. పదోక్లాసు. ‘‘శివ..గెడ్డ కెళ్తామా?’’ అన్నాడు.నాకు బైమేసింది. మాయమ్మ మాటలు గురుతుకొచ్చాయి. ‘‘అరెశివుడు.. ముసురు పట్టింది. గెడ్డకెల్లక. నీరు పారతుంది నాయన... జాగరత. నూతికాడే పోసుకో. రొండుకొస్తే మెరకరోడు మీదకెళ్ళు. అంతే గానీ గెడ్డ జోలికెళ్ళక’’ అని మూడు రోజులుగా గంట కొట్టినట్టుసెప్తుంది. ఆ మాటలు గురతుకొచ్చాయి. ‘‘వద్దన్నా..రాను’’ అన్నాను. ‘‘పోబే..పిరికోడా’’ అని నా మొకమ్మీన అనేసెల్లిపోయాడు సిమ్మాద్రి.‘‘ సెహ్.. ! నా పొరువు పోయినంత పనైంది. ఎవురు పక్కన నేరు కాబట్టి సరిపాయే. మా ఐస్పర్యా వుండివుంటే..?! సెహ్.. నా తల ఎక్కడ పెట్టుకుందను. మాయమ్మొకటి. ! ఎప్పుడూ పిరికి నూరిపోస్తాది’’ అని నాలోనే ఇదైపోయాను. అయినా మాగెడ్డ అంటే నాకు బైమే. ఇలాంటి ముసురులో అది పొంగితుంది. మా ఇలకాలే పారితాది మాగెడ్డ. అది బాహుదా నది తాలూకు గెడ్డట. మాయమ్మ సెప్పింది. ఆ నది తిన్నగా ఈతపరం యేటిల కలిస్తాది. అక్కడి నుండి సముద్రమట. నాకు తెల్దు. మాయమ్మే సెప్పింది. కానీ గడ్డ పారినప్పుడు అందులో గెంతిఈతపరం దాక ఈత కొట్టాలనే ఓ కోరిక వున్నాది నాకు. ఇదే సంగతి మాయన్నకు సెప్పానొకసారి. నన్ను ఎగాదిగాసూసి, బుర్రమీన ఒక్క గస్కీ ఇచ్చాడు. ముసురు ఎక్కువైయింది. ఇంక ఆలిసం సేయకంటా ఇంటికి పారొచ్చాను. ···మాది కమ్మలిల్లు. కిందమట్టి. ముసురికి బాగా తడిసిపోయి, ఐసుగడ్డనాగ వుంది మా ఇల్లు. జోరుగాలికి కెరంట్ ఎల్లిపోయింది. ఇల్లంతా సిమ్మసీకటి. నాను పరిగెత్తికెళ్లి మాయమ్మను పట్టుకున్నాను. నాకు సూడకంట కొవ్వొత్తి కోసం యతకత్నాది మాయమ్మ. కొవ్వొత్తి దొరికింది. ఎలిగించింది. ఆ ఎలుతురులో ఎర్రటి సెంద్రుడిలా కానొచ్చింది మాయమ్మ. మాయమ్మ కాలికి జలగలా పట్టుకున్న నాకుసూసి ‘‘ఓ.. పిరికోడు’’ అని ఉడికించాడు మాయన్న. కానీ నాను ఉడకనేదు. ఆడి బుద్ధి నాకు తెలుసు. నానొగ్గేస్తే ఆడొచ్చి అమ్మను సుట్టుకుంటాడు. ఆడి సంగతి నాకు తెల్డా?! ఆడి పప్పులు నాదగ్గిర ఉడకవు.మానాయన, అన్న ఏరే దీపంబుడ్డి ఎలిగించారు. మాయన్నకి సదువు పిచ్చి. ఇంత ముసురులో కూడా పుస్తకం వదల్డు. నాయనికి యాదో పాటం అప్పగిస్తన్నాడు.నాను మాయమ్మ దగ్గిర కూకున్నాను. దసరా సీజన కదా..సేలా రకాల పప్పలు సేసి వుంచిందమ్మ. మూడు రోజులుగా నాకు పండుగే. ఇంకా సేలా రకాల పప్పలు, ఖజ్జాలువున్నాయి. అవన్నీ ఒక పెద్ద డబ్బాలో ఉంచిందమ్మ.‘‘మా.. ఖ...ఖ..జ్జ‘’ అని సిన్నగా అడిగాన‘‘ఇప్పుడు వద్దు నాయినా.. కూడు తినేయాల ఖజ్జాలు తింటే మరి బువ్వేం తింటావు. వండిన అన్నం పారేస్తానా’’ అనిదీర్గంతీసిందమ్మ.‘‘నాను అన్నం తిన్నే. పప్పలు, ఖజ్జాలే తింటాను. నాకు అవే ఇయ్యు’’ అని కచ్చా సేసాను. ‘‘సెహ్.. ఏంపిల్లడవురా నీవు?! సెప్పిన మాట ఇనవు. షెహ్.. నీతో నాకు సచ్చేసావొచ్చింది’’ అని మీదకి లేసిందమ్మ. నా మొకం ఎలిగిపోయింది. ‘‘మ్మా...గ..గ..గ..’’ అని వుసారుగా పాడాను. ‘‘అరె.. గార్లన్నీ నీవే తిన్నావ్. పెద్దోడికి ఏం లేవు’’ అని మాయన్న సైడు మాటాడిందమ్మనాను మళ్లా మూతి ముడుసుకున్నాను. ‘‘ఇదొక్కటి నేర్సావ్తండ్రినాగ’’ అని బుర్రమీద ముద్దుగా ఒక్కటి మొట్టి.. రెండు గార్లుసేతిలో పెట్టి.. మళ్లా డబ్బా మెద్దిమీదెట్టేసింది.మినపగార్లు అంటే నాకు శానా పిచ్చి. నా కోసమే పెషల్గా గార్లు సేస్తాది మాయమ్మ. పెనంమీదే పాతిక లాగించేస్తాను. మాయన్నకి ఇవంటే పెద్ద ఇష్టం నేదు. ఆడు అరిసెల పెసలిస్ట్. అమ్మ వండిన అరెసలన్నీ ఆడికే. నాకెందుకో అవి కిట్టవు.రెండు నిమషాల్లో రెండు గార్లు ఊదేసాను. మళ్లా ‘‘ప...ఖ.. గ...’’ అని రాగం తీసాను. ఈసారమ్మకు సిరాకొచ్చింది. ‘‘ఏమయ్యో.. ఈడిని ఆ మెద్దెక్కించే. పప్పలు.. పప్పలు.. అని పానం తీస్తనాడు. సెహ్..ఇనాటి పిల్లడు ఎక్కడా వుండడమ్మా?!’’ అని ఇంత దీర్గం తీసిందమ్మ. మాయమ్మ సిరాకు ఇని ‘‘అరె శివ.. ఇక్కడికి వస్తావా? అక్కడికి రమ్మంటావా?’’ అంగటింటి నుండి వార్నింగి వదిల్నాడు మా నాయిన. తేలుకుట్టిన దొంగలాగ పల్లక వుండిపోయాన్నాను.‘‘అక్కడకిక్కడికి నేదు. ఒకటే కొవ్వొత్తుంది. ఆ బుడ్డీల సవురు నేదు. ఇంత ముద్ద తినేసి బొజ్జుంటారండి’’ అని గిన్నల దగ్గరికెళ్ళిందమ్మ. నాను ముందు మటం ఏసాను.‘‘ఇందాక తిననన్నావ్బే..’’ అని సిన్నగా నా సెవి దగ్గరన్నాడు మాయన్న. దొరికింది శాన్స్.. ఇంత పొడుగు రాగం తీసి ‘‘ఈడు నాకు ఉడికించాడు. నాను తిన్న్ పో..’’ అని డ్రామా కట్టాను. పాపం..మాయన్న డ్రామాల మనిషి కాదు. నాను పక్కా డ్రామా నాకొడుకొని.ఈర లెవల్లో యాగీ సేస్తాను. అయితే ఎంత డ్రామా నాకొడుకునైనా మాయమ్మ దగ్గిర పిచికనే. ‘‘ఒరేయ్.. అపరా నీ ఏసికాలు. ఖజ్జాలు కావాలని అడుగు. ఈ ఏసికాలన్నీ వద్దు’’ అని గాలి తీసేసింది మాయమ్మ. మాయన్న మళ్లా ఆడి కంటితో ఉడికించాడు. నా మొకం ఎక్కడ పెట్టుకొవాలో అర్దం కాలే. మెల్లిగా మానాయిన పక్కకెల్లాను. సెవిలో ఒక ‘మాట’ సెప్పాను. మా నాయిన శానా సంతోసపడ్డాడు. ‘‘అనే.. ఆడికి అన్నం సహించదు. ఓ రెండు గార్లిచ్చే’ అని నాసైడు తీసుకున్నాడు. ‘‘బుర్రకి నూన రాసి, ఒళ్లుపట్టి, కాళ్ళు నొక్కితా.. పైకి ఎక్కితా..అన్నాడా?’’ అనిందమ్మ.‘‘సెహ్.. మా’మాట’ అమ్మకి తెలిసిపోయింది. పిల్లిసెవులు. ఎలా ఇనేస్తాదో?!’’ అని గోలు కొరుక్కున్నాన్నాను. మా నాయిన మాయమ్మని సూసి ఉడతపిల్ల కీచమన్న రీతిగా నవ్వుకున్నాడు.‘‘అరేయ్ శివుడు.. మూడు రోజులైయిందిరా నీవు బువ్వతిని.! సెహ్.. ఒట్టు..ఇంకెప్పుడు ఈ పప్పలు వండను. ఒకేల వండితే నాది మనిషి జలమ్మే కాదు’’ అని నాలుగు గారెలు, రెండు పొంగడాలు, ఇన్ని జంతికులు, ఇంత సలిమిడి ముద్ద కంచంలో పెట్టి అన్నం వడ్డించినట్టు ఇచ్చింది. నా మొకం మళ్లా ఎలిగిపోయింది. పదినిమిషాల్లో మెక్కేసా.···‘‘శివా.. మాట’’ అని గుర్తు సేసాడు మా నాయిన బొంత మీద నడుం వాలుస్తూ.నాకు పప్పలు పీకమొయ్యికైపోయాయి. ‘’రేపు’’ అన్నట్టుగా సూసాను.‘‘సెహ్..శివడ్ని ఇంకనమ్మేదిలే’’ అని ఇంత పొడుగు మొకం పెట్టాడు మానాయిన. ఈసారి మాయమ్మ ఉడతపిల్ల కీచుమన్నట్టుగా నవ్వింది.ఇంతలో పెద్ద శబ్దం ఇనిపించింది. నాను జడుసుకొని ఒక్క జంపుకొట్టి మాయమ్మని పట్టుకున్నాను. అమ్మ గాబరా పడింది.‘‘ఏంనేదు నాయన. జడక. వాన తగ్గిపోయినట్టుంది. అందికే ఈ మెరుపులు, ఉరుములు. ఉరుము వచ్చిందంటే ఇంక వాన తగ్గిపోద్ది’’ అని సామాన్య పాటమేదో సెప్పిందమ్మ. నాకేం బుర్రకెక్కనేదు, కానీ ‘‘వాన తగ్గిపోద్ది’’అనే మాట శానా మంచిగా అనిపించింది. ‘‘ఈ సీగొట్టి ముసురు వల్ల దసరా సెలవలన్నీ ఏస్ట్.! ఈ పదిరోజులు కసిగా క్రికెట్టు ఆడాలని అనుకున్నాం. గ్రౌండ్సెక్కాం. ఈ ముసురు వల్లఅంతా బురదైపోయింది. గవర్నమెంటోడు దయ తలిసి వానవొదిలిపోయినాక.. మరో పది రోజులుసెలవ ఇస్తే ఆడికి పున్నెందక్కును. అనాగే క్వార్టర్లీ పేపర్లు పదిసార్లు రాయమని తగులుకున్నారు మేస్టార్లు. ఆలకేం పోయింది. రాసినోడికి తెలుస్తాది నెప్పి. అంచేత..ముసురు కారణంగా రాతకార్యక్రమం కూడా రద్దుసేస్తినట్లు గవర్నమెంటు నిండి ఒకసర్కిలరువస్తే.. మా ఐస్పర్య ఆళ్ళ తోటలో దొంగతనం సేసైనా అమ్మోరికి వంద కొబ్బిరికాయలు కొడతాను’’అని మనుసులోనే మొక్కుకున్నాను.ఇందాక మాయమ్మ సెప్పినట్టు వాన తగ్గింది. కానీ జోరుగా గాలి తగులుకుంది. ‘‘హు..హు.. హు..’’ అని ఇస్పీడుగా కొడుతుంది గాలి. కమ్మలిల్లుకదా.. గాలిసబ్దం అదో రకంగా ఇనిపిస్తుంది. సలికూడా వేస్తుంది. మాయమ్మ దగ్గరికెళ్ళి ముడుసుకొని కడుపులో దూరిపోయాను. బలేటి యచ్చగావుంది. కునుకు పట్టేసింది. ···సరిగ్గా ఒంటిగెంట. నా మొకమ్మీన ఎవరో నీరు కొట్టినట్టు అనిపించింది. ఇలాటి పిత్తిగిల్లి పని మాయన్న సెయ్యడే?! ఈటైంలో ఎవుడు?! అని సిరాగ్గా కళ్ళు తెరిసాను. పక్కన మాయమ్మ నాయిన అన్న.. ఎవురూ కనిపించనేదు. ‘‘కెవ్వు’’మని అరిసాను. ‘‘శివజడక.. నాను ఇక్కడే వున్నాను’’ అని అంగటింట్లో నిండిటార? అంటూ సూపించాడు మాయన్న. కాసేపయ్యాక అమ్మ నాయన అన్న వొచ్చారు.గాలికి అంగట్లో పెనక ఎగిరిపోతుంది. దానికి కందాడుతో గుంజకి కట్టడానికెళ్ళారు. వాన, గాలి ఎక్కువైపోతుంది. ఇల్లంతా కారిపోతుంది. మెద్ది కింద వున్నాం కాబట్టి తడవం నేదు. కానీ గట్టిగా గాలి వస్తుంటే.. పంచ నుండి నీళ్ళు మొకానికి కొడతనాయి. కాసేపటికి గాలి ఇంకా ఎక్కువైయింది. ఎన్నుకట్టు బిగి వదిలేసినట్టుంది. కమ్మలు ఒకొక్కటిగా ఎగిరిపోతున్నాయి. మెద్ది కింద పడుకున్న నాకు ఇనిపిస్తుంది కమ్మలు ఎగిరిపోయే సబ్దం. గాలికి కమ్మలు ఎగిరిపోతున్నపుడు అదోరకం యరైటీ సౌండ్ వస్తాది. ‘‘జయ్యి.....జప్. జయ్యి....జుప్’’ ఇలా ఎగిరిపోతుంది ఇంటి మీద కమ్మ. కాసేపటికి ఇంట్లోనే గాలి, వాన కురిసింది.పరిస్థితిç Üూసి ‘‘అనే..ఈ తుపానము ఎక్కువైపోతుంది. ఇంటి నుండి ఎల్లిపోదాం పదే’’ అనిందమ్మ. మా నాయిన పల్లకున్నాడు. నాకు సీకన్య మాటలు గుర్తుకొచ్చినాయి. ‘‘అదేదో పేరు సెప్పి..పెద్ద తుపానమనింది. నాను ఇగటానికి పోయాను. ఆ తుపాన్ని ఎక్కిరించాను. ఇప్పుడు గాలిని సూస్తుంటే.. కొంపతీసి నా ఎక్కిరింతలు ఇని ఆ తుపాను పగ తీర్చుకోవడం నేదుకదా..?! ఈ గాలి వరస సూస్తుంటే.. మొత్తం మా ఇంటికే తగులుకున్నట్టు వుంది.! ఓరి బగమంతుడా..! రెపొద్దున సీకన్య మొకం ఎలా సూసేది?! సెహ్..! ఈ తుపాన్ రేపొచ్చినా బాగున్ను. దాని మాట నిలబడకపోను..సస్’’ మళ్లా అడిగిందమ్మ.‘‘పదే.. ఎల్లిపోదుము.. మనకేమైనా పర్వానేదు. ఇక్కడే వుంటే పిల్లలు సచ్చిపోతారే’’ అని గొంతు అదోలా సేసిందమ్మ. ఆ గొంతు ఇంటే నాకు బైమేసింది. మానాయినకి మాత్రం సిరాకేసింది. ‘‘ఈ రాతిరి ఎక్కడికి ఎల్తామే..?! ఎవరింట్లో దూరిపోతామే..?! మనకి సిగ్గునేదా?’’ గాలి కంటా గట్టిగా అరిసాడు మా నాయిన. ‘‘సీ.. నీ బతుక్కి మళ్లా రోసము..! దసరాకి కొత్త కమ్మ నేయించమని గింజుకున్నాను. ఇన్నావుగాదు. ఇప్పుడా పాత కమ్మ గడ్డి పరకలా ఎగిరిపోతుంది. సెహ్..ఏంమనిసివే నీవు’’ అని దెప్పిపొడిచిందిమ్మ.‘‘అనే.. సుసావా..! కొత్త కొమ్మ నేసుంటే ఎంతనష్టి.! ఈగాలికి కొత్త కమ్మ కూడా నిలబడదు.సేలెంజ్!’’ అని మూకుడి ఏసాడు మా నాయిన. ‘‘అయ్యా... నీతో మాటాడి నెగ్గనేను. ఇనాగే వుంటే ఈ ఇల్లు కూలిపోద్ది. బగమంతుడా..నా పిల్లలు..’’ అని మళ్లా అదోలా అనిందమ్మ.‘‘ఏం కాదు. గాలి తగ్గిపోద్ది’’ అన్నాడు నాయిన‘‘అనే.. పదే.. ఈరమ్మత్త ఇంటికి ఎల్లిపోతుమా’’ అనిందమ్మఈరమ్మత్తిల్లు మా ఇంటికి ఐదిళ్ళు దూరం.పెద్దిల్లు. రెండు అంతస్తుల మేడ. మాయమ్మా ఈరమ్మత్త మంచి మొకరాలు. కానీ ఈరమ్మత్తతో ఒక సిక్కుంది! పిసరంత ఉప్పు ఇచ్చినా పేనంపోయినంత వరకి దెప్పుతునే వుంటాది. ఇప్పుడు గానీ మాము ఆడికెల్తే.. ఇంక మా పేనాన్ని కాపాడేసినట్టు డబ్బా కొడతాది. అసలే మా నాయిన శానపౌరుసం మనిషి. సచ్చినా సస్తాడు కానీ దాని ఇంటి ముందుకెళ్ళి నిలబడడు. ఆ సంగతి నాకు బాగా తెలుసు.నాను అనుకున్నట్టే అయ్యింది.! ‘‘ఈరమ్మ ఇంటికా.. నాను సచ్చినా రానే’’అని తెగేసిసెప్పాడు మా నాయిన. మా నాయిన ఆ మాటన్న యంటనే ఎన్నుకట్టు ఇరిగిన సబ్దం ఇనిపించింది. నాలుగు ఎదురు కర్రలు ‘‘పట్ఫాట్ఫట్’’మని ఇరిగిఇంట్లో పడ్డాయి. ‘‘ఏం కాదు.. ఏం కాదు.. మనకి మెద్ది వుంది.ఏం కాదు’’అని దైర్యం సెప్పాడు మా నాయిన. మేం అంతా మెద్దికింద వున్నాం.ఇంతలమరో రెండు కమ్మలు ఎగిరిపోనాయి. అదిసూసి మాయమ్మ ‘‘నాయినా.. నీవు నా పిల్లలని తినేస్తావు.! నీవు వస్తేరా.. నేకపోతే మానే.. నాను మాత్రం నా పిల్లల్ని ఎట్టికెళ్ళిపోతా’’ అని నన్ను బుజాన ఎత్తుకొని మాయన్న రెక్క పట్టుకుని రెండు అడుగులేసింది.మా నాయిన అనాగేç ³ల్లకుని కూకోయినాడు. ఒక నాలుగు అడుగులు నడిసిన మాయమ్మ.. మళ్లా ఎనక్కి తిరిగి.. ‘‘ఓరి బగమంతుడా.. నాకెందుకీ సావొచ్చింది’’ అని మా నాయిన దగ్గరికొచ్చి నాయిన వడిలో తలపెట్టుకుంది. మామంత నాయిన సుట్టు సేరినాం.నా యదవ కడుపేమిటో గానీ, దానికి సమయం, సందర్భం ఏమీనేదు. ఎందుకో తెల్దు.! నాకు ఇప్పుడాకలేసింది. మెద్దిమీదున్న పప్పల డబ్బాపై నా మనసు లాగింది. ఇపుడుగానీ ‘‘గ.. గ.. గ’’ అంటే బాగోదు. గాలింకా పెరిగిపోయింది. మాయమ్మ పల్లకున్నాది. ఇంక శకితి లేనట్టు మానాయిన జబ్బమీద వాలిపోయింది. నాను, మాయన్న.. మానాయిన కాలు సెరోటి సుట్టుకున్నాం. మాఇంటి ముందు పంచ ఎగిరిపోయింది. గాలిదెబ్బకి తలుపు ముక్కలైపోయింది. ఎందుకో మా నాయినలో కూడా కొంచెం బయం కనిపించింది. ‘‘అనే..ఈ మాయదారి తుపాను తగ్గినట్టు ఏమీనేదు. పద బయటికి ఎల్లిపోదాం’’ అన్నాడు మా నాయిన. అంత సీకట్లో కూడా మాయమ్మ కంటిల సంతోసం కానొచ్చింది. మా నాయిన కాస్త బలంగా దిట్టంగా వుంటాడు. అన్నని అమ్మని సెరోసేయితో పట్టుకున్నాడు. నాకు గుర్రంపళ్ళు ఎక్కమన్నాడు.నాను ఏదోఆలోసిస్తున్నట్లు మొకమెట్టాను. ‘‘ఏంట్రా శివుడు.. పదరా..’’ అని తొందరబెట్టిందమ్మ. నాను మెద్ది మీదున్న పప్పల డబ్బాకేసి సూసాను. మాయమ్మకు మా శానా సెడ్డ కోపమొచ్చింది.‘‘సెహ్.. ఏం పిల్లడివిరా నీవు?! పానం పోతున్నా.. నీకు పప్పలే కావాలా?! తు..నీజలమ..!ఏం జలమ్రా నీది..?! బతికుంటే బండెడు పప్పలు సేసి పెడతాను.. పదరాఅయ్యా..’’ అని బుర్రమీద ఒక్కటేసింది. అ దెబ్బకి మా నాయిన బుజాలెక్కేసాను. నాను మా నాయిన బుజంమ్మీన వున్నాను. అమ్మ అన్నా సెరో వైపు వున్నారు. మా నాయిన నోటితో టార్చలైటు పట్టుకున్నాడు. మెల్లిగా మా ఇల్లు దిగాం. ఈదిలోకి వచ్చాం. గాలి దంచి కొడుతుంది. ఎనక్కి తోస్తుంది. మానాయిన గాలిని మెడ్డుకుని ముందుకి కదల్తనాడు. ‘‘హు.. హు.. హు..’’ అని శబ్ధంతో సెవులు దిమ్మ కట్టేస్తనాయి. మా నాయిన మాత్రం గాలిని మెడ్డుకుని ముందుకెల్తనాడు. మా నాయిన్ని ఇలా సూస్తుంటే అచ్చిం సినిమాలా ఈరోవునాగే అనిపిస్తనాడు.మా నాయిన తుపానికి ఎదురెల్తనాడు. ఇంత జోరుగాలిని మెడ్డతనాడు. నాకు శానా మంచిగా అనిపిస్తింది. ఈరమ్మత్త ఇంటికెదురుగా వచ్చినాం. మాయమ్మ అటుకేసి ఎల్లబోయింది. యంటనే మా నాయిన మాయమ్మసెయి ఎనక్కినాగి ముందుకెళ్ళాడు. అప్పుడు అర్దమైయింది. మా నాయిన ఇంకెక్కడికో తీసుకుయల్తనాడని.ఈదిల ఇల్లన్నీ దాటుతున్నాయి. ఎక్కడ ఆపుతాడో తెల్దు. మాటాడిస్తామా.. అంటే నోట్లోటార్చలైటెట్టుకున్నాడు. ఒక ఇంటి దగ్గరికి ఎల్లగానే మెల్లిగా నడిసాడు. నా గుండ్లో రాయిపడింది.! అది మా ఐస్పర్య ఇల్లు. ‘‘సాయంకాలమే దానితో ఇగటమాడాను. ఇప్పుడు గానీ దాని ముందు నిలబడ్డానా?! నాను సచ్చినట్టే నెక్క. తు.. నా బతుకు. ఇంకెక్కడ తలపెట్టుకునేది.?! బగమంతుడా.. ఏమీ కర్మరా.. చస్.. ఏం గాచారమొచ్చింది. దాని ఇంట్లోకి ఎల్లే బదులు ఏటిలోకి ఎల్లిపోవడం నయం’’అని మనుసులో శానా ఇదైపోతున్నాను. హమ్మయ్యా.. ! సెప్పు సరి సేసుకోవడానికి కాస్త ఆగినాడు మానాయిన. ఇప్పుడు దాని ఇల్లు కూడా దాటిపోయినాం. మరో ఇరవై అడుగులేసినాక మా ఎంపీపీ ఇస్కూలొచ్చింది. తిన్నగా ఇస్కూల్లోకి తీసుకెళ్లినాడు మా నాయిన. ఊపిరి పీలిసింది మాయమ్మ. నిరుడే దిట్టంగా డాబా ఇస్కూల్ కట్టారు. పది కుటమాలైన ఆ డాబాలో పట్టిపోతాయి. సాయింకాలం బంట్రోత్తో దండోరా ఏయించారట. తుపానంతో ఎవరికైనా ఇబ్బంది వుంటే ఇస్కూల్లోకి రావచ్చునని. మేము వచ్చేసరికి ఇంకో రెండు కుటమాలక్కడున్నాయి. తడిబట్టలుతోనే ఒకవార కూకున్నాం.మేమొచ్చినాక ఇంకా గట్టిగా తగులుకుంది తుపాను. ఐతిప్పుడు బయంలే. పైగానా కోరిక తీరింది. నాను ఎంపీపీ ఇస్కూల్లా వుండగా యడ్డుమేస్టు సీటులో పడుకోవాలనే కోరికుండేది. ఇప్పుడా కోరిక తీరింది. తిన్నగా ఎల్లి యడ్డుమేస్టు సీటులో కూకోని ఎదరగా వున్న టేబులు మీన దర్జాగా కాలు సాపాను.నాకు మళ్లా మా ఇంట్లో మెద్ది మీదున్న పప్పల డబ్బా గురతుకొచ్చింది. ఇప్పుడా డబ్బా తెచ్చుకొని వుంటే ఈ సలిలో దర్జాగా కాలు మీద కాలేసుకొని తిందును.. చస్’’ ···తెల్లారింది. తుపాను అలిసిపోయి వూరుకున్నాది. ఇస్కూల్ నుండి బయటికి వచ్చాం. మా ఈది మొత్తం నాకు అదో రకంగా కానొచ్చింది. రంగులు ఒలిసేసిన ఇల్లునాగ. గెడ్డ పూర్తిగా పొంగి పోయినట్టువుంది. ఈదిలోకి మోకాల్లోతు నీరు ఎక్కిపోయింది. సిన్నగా దాటుకొని మా ఇంటి దగ్గరికొచ్చాం. మా ఇల్లు నేదు.! కూలిపోయింది. మాయమ్మా నాయిన కూలిపోయిన ఇంటిని సూసి పల్లక నిలబడిపోయినారు. మాయన్న కూలిపోయిన గోడలమీద నించెల్లి ఆడిఇస్కూల్ బ్యాగు తెచ్చుకున్నాడు. ఎక్కడి నుండి వచ్చిందో.. పిల్లి గొంతుకేసుకొని.. నాపక్కన నిలబడి ‘‘సెప్పానా శివ.. తిత్లీ తుపానమని. ఇగటమాడినావు. ఇపుడుసూడు..’’ అని దెప్పి పొడిచినట్టు ఎల్లిపోయింది ఐస్పర్య..ఉరఫ్ సీకాయ.. అలియాస్ సీకన్య.నాను మాత్రం కూలిపోయిన మా ఇంటిని సూస్తూ నిలబడ్డాను. ‘‘పాపిష్టి దాన్ని. పసిపాపడు నోరు తెరిసి అడిగితే కడుపునిండా నాలుగు దినుసులు పెట్టనేకపోయాను. ఇపుడు మన్నుల కలిసింది. ఈ పాపిష్టిదాని కడుపున ఎందుకు పుట్టినావురా నాయిన..’’ అని మాయమ్మ నాకు దగ్గిరికి తీసుకుంది. · -
బిడ్డను కాపాడుకునేందుకు..
-
చీకట్లో ‘సిక్కోలు’!
శ్రీకాకుళం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి/అరసవల్లి(శ్రీకాకుళం): టిట్లీ తుపాను సిక్కోలు జిల్లాను అంధకారంలోకి నెట్టేసింది. గంటకు 100 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలుల ధాటికి జిల్లాలో విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. వేల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ట్రాన్స్ఫార్మర్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లక్షల సంఖ్యలో కనెక్షన్లు తెగిపోయాయి. విద్యుత్ పంపిణీ వ్యవస్థ దెబ్బతినడంతో వందలాది గ్రామాల్లో అంధకారం అలుముకుంది. ఈపీడీసీఎల్ వర్గాల సమాచారం ప్రకారమే 4,319 గ్రామాలకు సరఫరా నిలిచిపోయింది. మొత్తంగా తుపాను కారణంగా జిల్లాలో విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. పాక్షికంగా పునరుద్ధరణ.. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) వర్గాల సమాచారం ప్రకారం గురువారం రాత్రి 9 గంటల వరకు 2,160 గ్రామాలకు సరఫరాను పునరుద్ధరించగలిగారు. 101 సబ్స్టేషన్లు దెబ్బతినగా 38 స్టేషన్లు, 11 కేవీ సబ్స్టేషన్లు 350కిగాను 93 సబ్స్టేషన్లను సరిచేశారు. 33 కేవీ స్తంభాలు 58, ఎల్టీ స్తంభాలు 2,036, 11 కేవీ స్తంభాలు 1,055 దెబ్బతిన్నాయి. కాగా, 33 కేవీ ఫీడర్లు 50 దెబ్బతినగా 22 ఫీడర్లను, 33 కేవీ ఫీడర్లు 380కిగాను 27 సరిచేశారు. జిల్లావ్యాప్తంగా 7,76,706 విద్యుత్ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇందులో గురువారం రాత్రికి కేవలం 6,200 కనెక్షన్లకు మాత్రమే సరఫరాను పునరుద్ధరించగలిగారు. జిల్లాలోని శ్రీకాకుళం, పలాస, టెక్కలి, సోంపేట, నర్సన్నపేట, ఇచ్ఛాపురం పట్టణాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. గురువారం రాత్రికి శ్రీకాకుళంలో విద్యుత్‌ను పునరుద్ధరించగా నర్సన్నపేటలో శుక్రవారం నాటికి ఇవ్వనున్నారు. ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, టెక్కలి పట్టణాలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు మరో నాలుగైదు రోజుల సమయం పడుతుందని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర ‘సాక్షి’కి తెలిపారు. ఇదిలా ఉండగా, జిల్లాలో చిన్నాభిన్నమైన విద్యుత్ వ్యవస్థను సరిచేసేందుకు ఈపీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాలకు చెందిన 111 బృందాలను వినియోగిస్తున్నారు. 872 మంది కార్మికులు, 51 మంది ఏఈలు, 60 మంది ఏడీఈలు, డీఈలను నియమించారు. ఎస్పీడీసీఎల్ పరిధిలోని విజయవాడ నుంచి మరో పదిమంది ఏఈలు, 200 మంది లేబర్‌ను శ్రీకాకుళం జిల్లాకు పంపుతున్నారు. టిట్లీ తుపాను వల్ల ఈపీడీసీఎల్‌కు ఎంత నష్టం వాటిల్లిందో లెక్క తేల్చే పనిలో అధికారులున్నారు. అనధికార సమాచారం ప్రకారం రూ. 25 కోట్లకుపైగా నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోపరిస్థితిని సమీక్షించడానికి ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ గురువారం రాత్రి శ్రీకాకుళం చేరుకున్నారు. టెక్కలి డివిజన్‌ను పరిశీలించిన హెచ్‌వై దొర ఇదిలా ఉండగా, టిట్లీ తుపాను వల్ల విద్యుత్ నష్టాల్ని అంచనా వేసేందుకు విశాఖపట్నం కార్పొరేట్ కార్యాలయం నుంచి ఈపీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర నేతృత్వంలోని అధికారుల బృందం టెక్కలి డివిజన్లో పరిశీలించింది. అయితే టెక్కలి సమీపంలో రోడ్డు దెబ్బతినడం వల్ల దొర వెనుదిరిగి జిల్లా కేంద్రంలోనే మకాం వేసి నష్టాలపై సమీక్షించారు. -
పెను విధ్వంసం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తిత్లీ.. అంతా భయపడినట్లే విరుచుకుపడింది! ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం జిల్లాలో ఈ పెను తుపాను విధ్వంసం సృష్టించింది. పచ్చని కొబ్బరిచెట్లతో సిక్కోలు కోనసీమగా పేరొందిన ఉద్ధానం ఊపిరి తీసేసింది! గంటకు 165 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడిన ఈ తుపాను ధాటికి రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ధ్వంసమవడంతో జిల్లాతో ఉద్ధానం బంధం తెగిపోయింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు దాదాపు పన్నెండు గంటలపాటు ఏకధాటిగా విలయతాండవం చేసిన తిత్లీ దెబ్బకు జిల్లా అతలాకుతలమైంది. గతంలో ఇలాంటి సీజన్‌ల్లోనే దాడి చేసిన ఫైలీన్, హుద్‌హుద్ తుపానుల కన్నా మితిమీరిన ప్రతాపంతో విరుచుకుపడడంతో ఉద్ధానం వారేగాక శ్రీకాకుళం జిల్లా ప్రజలంతా ప్రాణాలు గుప్పిట పెట్టుకుని గజగజ వణికిపోయారు. తుపాను కారణంగా చెట్లు, ఇళ్లు కూలిన ఘటనల్లో ఏడుగురు మృతిచెందారు. తుపాను సృష్టించిన విధ్వంసానికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు కూకటివేళ్లతో విరిగిపడ్డాయి. పూరిళ్లు పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పాటు పలుచోట్ల విద్యుత్తు తీగలు తెగిపడ్డాయి. ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వందలాది గ్రామాలు, పట్టణాలు అంధకారంలో మునిగిపోయాయి. రైతులకు అపారనష్టం వాటిల్లింది. పంటలు భారీగా దెబ్బతిన్నాయి. కొబ్బరి తోటలు నేలమట్టమయ్యాయి. వరి తీవ్రంగా దెబ్బతింది. మరోవైపు విజయనగరం జిల్లాపైనా తుపాను ప్రభావం చూపింది. ఇక ఒడిశా రాష్ట్రంపైనా తిత్లీ విరుచుకుపడింది. ప్రధానంగా గజపతి జిల్లాలో బీభత్సం సృష్టించింది. మొత్తంగా విలయ విధ్వంసం సృష్టించి, భీకర గాలులతో తీవ్ర నష్టాన్ని కలిగించి శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ అతి తీవ్ర తుపాను గురువారం వేకువ జామున 4.30 నుంచి 5.30 గంటల మధ్య తీరాన్ని దాటింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పల్లెసారధి గ్రామం వద్ద గంటకు 150 నుంచి 165 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని దాటింది. అనంతరం తీవ్ర తుపానుగాను, ఆపై తుపానుగాను మారి గురువారం రాత్రికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఇది ఈశాన్య దిశగా పశ్చిమబెంగాల్ వైపు పయనిస్తోంది. గురువారం రాత్రి పది గంటల సమయానికి ఇది ఒడిశాలోని భవానీపట్నాకు తూర్పు ఆగ్నేయంగా 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. చిగురుటాకులా వణికిన సిక్కోలు.. తిత్లీ ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అయితే విశాఖపట్నం, విజయనగరం జిల్లాలను కరుణించిన తిత్లీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఫలితంగా దీని ధాటికి సిక్కోలు చిగురుటాకులా వణికిపోయింది. అర్థరాత్రి తర్వాత నుంచి గంటగంటకూ తిత్లీ తన ప్రతాపాన్ని చూపించింది. తీరాన్ని దాటే సమయానికి పలాస, ఇచ్చాపురం, టెక్కలి, నర్సన్నపేట, సోంపేట తదితర ప్రాంతాల్లో పెనుగాలుల ఉధృతి మరింత పెరిగింది. దీంతో ఈ ప్రాంతాలపై తుపాను ప్రభావం అధికంగా ఉంది. టెక్కలి డివిజన్లో అనేక ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. సమాచార వ్యవస్థ కుప్పకూలిపోయింది. అప్పటిదాకా గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులు తెల్లవారుజామున 3 గంటల నుంచి 130 నుంచి 165 కిలోమీటర్ల వేగానికి చేరాయి. దీంతో శ్రీకాకుళం జిల్లావాసులు తీవ్ర భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. తుపాను తీరాన్ని దాటిన సమయంలో వజ్రపుకొత్తూరు మండల ప్రజలు గజగజ వణికిపోయారు. నాలుగేళ్లక్రితం ఇదే సమయంలో విశాఖ కేంద్రంగా హుద్‌హుద్ వణికించగా.. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాను తిత్లీ తీవ్రంగా దెబ్బతీసింది. ఉద్ధానంపై తీవ్ర ప్రభావం.. ముఖ్యంగా వజ్రపుకొత్తూరు మండలంలో తీరం దాటడంతో ప్రధానంగా ఉద్ధానం ప్రాంతంపై తీవ్ర ప్రభావం పడింది. భీకర రీతిలో విరుచుకుపడిన పెనుగాలుల ప్రభావంతో కొబ్బరి చెట్లతోపాటు జీడిమామిడి, అరటి, బొప్పాయి తదితర ఉద్యాన పంటలన్నీ దెబ్బతిన్నాయి. టెక్కలి సమీపంలో కన్నెవలస వద్ద జాతీయ రహదారి పూర్తిగా వరదలో మునిగిపోవడంతో ఉద్ధానం ప్రాంతానికి జిల్లాతో సంబంధం తెగిపోయింది. సుమారు 12 గంటలపాటు కురిసిన వర్షాలకు జిల్లా అంతటా వరద ముంచెత్తింది. గురువారం జిల్లాలో సగటున 77 మిమీ వర్షపాతం నమోదైంది. దీంతో పలు మండలాల్లో వరి పంట నీటమునిగింది. సుమారు 1.44 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతింది. అలాగే ఉద్ధానం సహా జిల్లావ్యాప్తంగా 3 లక్షల కొబ్బరి చెట్లు నేలకూలాయి. 737 హెకార్లలో అరటి, బొప్పాయి, జీడిమామిడి తదితర ఉద్యాన పంటలతో పాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. మొత్తంగా రెండు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు ధ్వంసమైనట్టు అధికారులు అంచనా వేశారు. పంటలకు వాటిల్లిన నష్టం రూ.1,350 కోట్ల వరకూ ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. పక్కా ఇళ్లకూ తప్పని దెబ్బ... తిత్లీ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీగా ఇళ్లకు నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా 1,021 ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా లెక్కించారు. ఇందులో రెండు పక్కా ఇళ్లు పూర్తిగా ధ్వంసంకాగా, మరో ఆరిళ్లు పాక్షికంగా దెబ్బతి న్నాయి. పూరిళ్లు మాత్రం తుపాను దాటికి ఆగలేకపోయాయి. 409 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరో 254 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వీటిలో ఎక్కువగా రేకుల ఇళ్లే. ఈదురుగాలులకు రేకులు ఎగిరిపోవడంతో వర్షానికి ఇళ్లల్లోని వస్తువులు, ఆహారధాన్యాలు పాడైపోయాయి. ఇలా ఇళ్లు నష్టపోయినవారిలో ఎక్కువమంది వంశధార ప్రాజెక్టు నిర్వాసితులే ఉన్నారు. ఈ మొత్తం నష్టం రూ.20 కోట్ల వరకూ ఉంటుందని ప్రాథమిక అంచనా. మత్స్యకారులకు తీరని నష్టం... తిత్లీ తుపాను ధాటికి మత్స్యకారులకు సంబంధించిన 12 బోట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరో 445 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అంతేకాదు మత్స్యకారులు వేటకు ఉపయోగించే 1,520 వలలు కూడా ఎందుకూ పనికిరాకుండా పోయాయి. దీనివల్ల జరిగిన నష్టం రూ.9.34 కోట్లు ఉంటుందని అంచనా. ఇచ్ఛాపురంలో 24 సెం.మీల భారీ వర్షం.. తిత్లీ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల కుంభవృష్టి వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఇచ్ఛాపురంలో 24, టెక్కలిలో 23, పలాసలో 20, మందసలో 13, సోంపేటలో 12, పాతపట్నంలో 10, కళింగపట్నంలో 9, రణస్థలంలో 5, పాలకొండలో 4 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. తుపాను తీరాన్ని దాటాక గాలుల ఉధృతి క్రమేపీ తగ్గుముఖం పట్టినా గురువారం మధ్యాహ్నం దాకా ఈదురుగాలులు కొనసాగుతూనే ఉన్నాయి. రాత్రికి గాలులు తగ్గి వాతావరణం సాధారణ స్థితికి చేరుకుంది. మరోవైపు తిత్లీ తుపాను తీరం దాటి తీవ్ర వాయుగుండంగా బలహీనపడి పశ్చిమ బెంగాల్ వైపు పయనిస్తుండడంతో ఉత్తరాంధ్రలో వానలు తగ్గుముఖం పట్టనున్నాయి. రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వీలుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి నివేదికలో వెల్లడించింది. తుపాను తీరం దాటడంతో రాష్ట్రంలోని అన్ని పోర్టులకు జారీ చేసిన హెచ్చరికలను ఉపసంహరించింది. ఏడుగురి మృతి... తుపాను ప్రభావంతో విరుచుకుపడిన ఈదురుగాలులు, వర్షాల కారణంగా గురువారం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి గాయాలయ్యాయి. వర్షానికి నానిపోయిన ఇంటిస్లాబ్ కూలిపోయిన ప్రమాదంలో సరిబుజ్జిలి మండలం రొట్టవలసకు చెందిన మూడడ్ల సూర్యారావు(46) చనిపోయారు. తనపై చెట్టు కూలిపోవడంతో వంగర మండలంలోని వోనె అగ్రహారానికి చెందిన తాడి అప్పలనర్సమ్మ(62) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. సంతబొమ్మాళి మండలంలో సున్నాపల్లి గ్రామానికి చెందిన బొంగు దుర్గారావు(50) కూడా చనిపోయినా కారణం ఏమిటనేదీ అధికారికంగా ప్రకటించలేదు. పొలంలో తన ఎద్దులను రక్షించడానికి వెళ్లిన సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్ర గ్రామానికి చెందిన అప్పలస్వామి(56) మృత్యువాత పడ్డారు. టెక్కలిలోని ఆండ్ర వీధిలో పూరిల్లు కూలిపోయి కొల్లి లక్ష్మమ్మ(70) అనే వృద్ధురాలు మృత్యువాత పడ్డారు. అలాగే నందిగాం మండలం దేవీపురం గ్రామానికి చెందిన మున్నేన సంతోష్‌కుమార్(29), బోలుభద్ర గ్రామానికి చెందిన ఇప్పిలి కన్నయ్య(53) గొర్రెలను కాస్తూ మందస మండలంలోని సువర్ణపురం వద్దకు వెళ్లారు. వారిపై కొబ్బరిచెట్టు పడడంతో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. అలాగే తుపాను ధాటికి మూగజీవాలు సైతం మృత్యువాత పడ్డాయి. తొమ్మిది ఎద్దులు, గేదెలు చనిపోగా, గొర్రెలు, మేకలు 80 వరకూ చనిపోయినట్టు తెలుస్తోంది. అలాగే 500 కోళ్లు చనిపోయినట్లు సమాచారం. 9 లక్షలమందిపై ప్రత్యక్ష ప్రభావం! ఊహించిన దానికన్నా ప్రచండమారుతంలా తిత్లీ తుపాను విరుచుకుపడటంతో ప్రత్యక్షంగా నష్టపోయిన బాధితుల సంఖ్య సుమారు 9 లక్షలమంది దాకా ఉంటుందని అధికారిక లెక్కలు పేర్కొంటున్నాయి. అయితే అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనా. జిల్లాలోని 38 మండలాలపైనా తుపాను ప్రభావం కనిపించింది. 16 మండలాలపై తీవ్రంగా ఉంది. సుమారు 1,864 గ్రామాలతో పాటు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలు కూడా ఈ తుపాను ధాటితో నష్టాన్ని చవిచూశాయి. మొత్తం మీద తిత్లీ తుపాను వల్ల జిల్లాలో రూ.1,400 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. -
తరుముకొస్తున్న టిట్లీ
సాక్షి, విశాఖపట్నం: ‘టిట్లీ’ తుపాను విశాఖలో అలజడి రేపుతోంది. ఇది ఉత్తరాంధ్ర వైపు దూసుకు వస్తోందన్న వాతావరణ శాఖ సమాచారంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తొలుత తుపాను గాను, ఆపై పెను తుపానుగాను ఉధృతరూపం దాలుస్తుండడమే ఇందుకు కారణం. సరిగ్గా నాలుగేళ్ల క్రితం హుద్‌హుద్ తుపాను సృష్టించిన పెను విలయాన్ని గుర్తు చేసుకుని ఈ ‘టిట్లీ’ ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందోనన్న భయం నెలకొంది. హుద్‌హుద్ అంతటి తీవ్రత ‘టిట్లీ’కి లేకపోయినా గంటకు 100–125 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయనున్నాయి. మరోవైపు తుపాను ప్రభావంతో బుధ, గురువారాల్లో విశాఖలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ వర్షాలకు పెనుగాలులు తోడైతే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనాల ప్రకారం భారీ వర్షాలు, ఈదురుగాలులకు విశాఖలోని లోతట్టు ప్రాంతా లు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. కచ్చా ఇళ్లు, పూరిళ్లు, చెట్లు కూలిపోవచ్చని, విద్యుత్, ఇతర సమాచార వ్యవస్థ, రోడ్లు, వరి, అరటి, బొప్పాయి వంటి పంటలు దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయింది. నగరంతో పాటు జిల్లాలోనూ తహసీల్దార్లు, ఇతర అధికారులు అందుబాటులో ఉండాలని, సహాయక చర్యలకు సన్నద్ధం కావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. మొదలైన ఈదురుగాలులు మంగళవారం మధ్యాహ్నం నుంచే ఈదురుగాలులు మొదలయ్యాయి. అవి అంతకంతకు తీవ్రమవుతున్నాయి. సముద్రం అలజడిగా మారి అలలు పైపైకి ఎగసిపడుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు హెచ్చరించారు. విమాన సర్వీసులకు అంతరాయం గోపాలపట్నం(విశాఖ పశ్చిమం): విశాఖలో మంగళవారం తుపాను గాలులు ఉధృతంగా వీయడంతో ఆ ప్రభావం విమానాల రాకపోకలపై పడింది. రెండు విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఓ విమానం వెనుదిరిగి పోయి తిరిగి రాకపోవడంతో సర్వీసు రద్దయింది. మరో విమానం వెనుదిరిగి వెళ్లి నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చింది. విశాఖ–హైదరాబాద్ సర్వీసు రద్దు ముంబయి నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖకు ఇండిగో విమానం మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు రావాల్సి ఉంది. అయితే ఈ విమానం సమయానికి విశాఖకు వచ్చినా ఇక్కడ తీవ్రమైన గాలులు వీచాయి. దీంతో విమానం చక్కర్లు కొట్టి ల్యాండ్ అవడానికి ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంకేతాలు రాక హైదరాబాద్‌కు వెనుదిరిగి వెళ్లిపోయింది. ఇది అక్కడి నుంచి రాలేదు. ఇక్కడి నుంచి సర్వీసు రద్దయిందని తెలిసి హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు ప్రత్యామ్నాయ సర్వీసుల్లో వెళ్లారు. 4 గంటలు ఆలస్యం కోల్‌కతా నుంచి భువనేశ్వర్ మీదుగా విశాఖకు మధ్యాహ్నం 2.25 గంటలకు రావాల్సిన ఇండిగో విమానం గాలుల ప్రభావంతో వెనక్కి మళ్లింది. హైదరాబాద్‌కు వెళ్లి పోయింది. ఇది తిరిగి సాయంత్రం ఆరున్నరకు వచ్చింది. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు నాలుగు గంటలు పడిగాపులు కాశారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ తుపాను నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. టోల్‌ఫ్రీ నంబరు 1800 42500001ను అందుబాటులో ఉంచారు. ఈపీడీసీఎల్ అప్రమత్తం టిట్లీ తుపాను నేపథ్యంలో ఏపీఈపీడీసీఎల్ అప్రమత్తమైంది. సీఎండీ హెచ్‌వై దొర సంస్థ కార్యాలయంలో మంగళవారం అధికారులతో సమావేశమయ్యారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పరికరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. -
అమెరికాకు మరో హరికేన్ ముప్పు!
మియామి: అమెరికాకు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. గంటకు 100 మైళ్ల వేగంతో వీస్తున్న గాలులతో హరికేన్ మైకేల్ కేటగిరీ–2గా బలపడింది. దీంతో ఫ్లొరిడాకు భారీ వర్ష ముప్పు ఉంది. ప్రస్తుతం గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో కేంద్రీకృతమైన మైకేల్.. ఫ్లొరిడా వైపు దూసుకొస్తోంది. బుధవారం కల్లా ఫ్లొరిడా తీరాన్ని తాకే అవకాశాలున్నాయని నేషనల్ హరికేన్ సెంటర్ హెచ్చరించింది. ఇది భయంకర తుపాను అని, దీని వల్ల నష్టం భారీగా వాటిల్లే ప్రమాదం ఉందని ఫ్లొరిడా గవర్నర్ రిక్ స్కాట్ ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్లొరిడా తీరాన్ని చేరే సరికి అది కేటగిరీ–3గా బలపడే అవకాశం ఉందని చెప్పారు. 10–20 సె.మీ వరకు వర్షపాతం నమోదవడంతో పాటు వరదల ముప్పు ఉందని వాతావరణ నిపుణులు అంచనావేశారు. -
కేరళ విపత్తుకు కారణమిదే!
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస అల్పపీడనాలు, తుపాను పరిస్థితులకు తోడు రుతు పవనాల తీవ్రత కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయని నిపుణులు విశ్లేషించారు. జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం కన్నా వరుసగా 15%, 18% వర్షాలు ఎక్కువగా కురవగా ఆగస్ట్ 1–19 తేదీల మధ్య సాధారణం కన్నా 164% ఎక్కువగా వర్షపాతం నమోదవడం విలయ తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ విపరీత పరిస్థితులను వాతావరణ నిపుణులు విశదీకరించారు. రుతుపవనాలు, తుపాను పరిస్థితులతో పాటు ‘సోమాలీ జెట్’ దృగ్విషయం కూడా కేరళలో తీవ్ర వర్షపాతానికి కారణమైందని వారు వివరించారు. మడగాస్కర్ ప్రాంతంలో ప్రారంభమై పశ్చిమ కనుమల వైపు వేగంగా వీచే గాలులను సోమాలీ జెట్ పవనాలుగా పేర్కొంటారు. ‘ఇప్పటికే కేరళ రాష్ట్రవ్యాప్తంలో రుతుపవనాలు క్రియాశీలంగా ఉన్నాయి. మరోవైపు, ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను కారణంగా కేరళలో, ఉత్తర కర్ణాటకలో వర్షాలు కురుస్తున్నాయి’ అని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ ఉపాధ్యక్షుడు మహేశ్ పాల్వత్ వివరించారు. ‘ఆగస్ట్ 7, 13 తేదీల్లో ఒడిశా తీరం దగ్గరలో ఏర్పడిన రెండు అల్పపీడనాల వల్ల అరేబియా సముద్ర తూర్పు ప్రాంత మేఘావృత గాలులు పశ్చిమ కనుమలవైపు వచ్చి కేరళ రాష్ట్రవ్యాప్తంగా అధిక వర్షాలకు కారణమయ్యాయి’ భారత వాతవరణ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. ఇలా పలు వర్షపాత అనుకూల పరిస్థితులు ఒకేసారి రావడం వల్ల భారీ వర్షాలు కురవడం, తద్వారా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుంది. -
23.8 మీటర్ల ఎత్తున రాకాసి అల
-
చరిత్రలోనే అతిపెద్ద రాకాసి అల..!!
వెల్లింగ్టన్, న్యూజిలాండ్ : దక్షిణార్థగోళంలో భారీ ఎత్తైన రాకాసి అలను న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దాదాపు 23.8 మీటర్ల ఎత్తున రాకాసి అల నౌకపై విరుచుకుపడినట్లు వెల్లడించారు. అల ఎత్తు ఎనిమిది అంతస్తుల మేడకు సమానంగా ఉంటుందని పేర్కొన్నారు. న్యూజిలాండ్‌కు దక్షిణాన 700 కిలోమీటర్ల దూరంలో గల క్యాంప్‌బెల్ ద్వీప సమీపాన ఈ ఘటన జరిగినట్లు వివరించారు. 2012లో కూడా ఇదే ప్రాంతంలో 22.03 మీటర్ల ఎత్తుగల భారీ అల సంభవించింది. వీటికంటే అతి భారీ అలలు సంభవిస్తాయని భావిస్తున్నట్లు వివరించారు. కాగా, ఇప్పటివరకూ భూమి మీద అతిపెద్ద రాకాసి అల అలస్కా తీరంలోని లితుయా అగాథం వద్ద సంభవించింది. 1958లో సంభవించిన ఓ భారీ భూకంపం కారణంగా ఇక్కడ అలలు 30.5 మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. -
అరటి రైతుపై పిడుగు
వేముల/పులివెందుల: వైఎస్సార్ జిల్లాలో శుక్రవారం రాత్రి గాలివాన సృష్టించిన బీభత్సానికి అరటి తోటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దిగుబడులు చేతికందే సమయంలో ప్రకృతి ప్రకోపించడంతో కోతకు వచ్చిన అరటి గెలలు నేలవాలాయి. నిమ్మ తోటలు కూడా దెబ్బతినడంతోఅన్నదాతలు లబోదిబోమంటున్నారు. వైఎస్సార్ జిల్లా వేముల మండలంలో 285 హెక్టార్లలో అరటి, 5 ఎకరాల్లో నిమ్మ తోటలు దెబ్బతిన్నాయి. అరటి రైతులకు రూ.10 కోట్ల మేరకు నష్టం వాటిల్లింది. అలాగే వేంపల్లె మండలంలో 160 ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతినగా రూ.1.80 కోట్ల నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. గాలివానతో రాత్రికి రాత్రే తన నాలుగెకరాల్లో సాగు చేసిన అరటి దెబ్బతిని రూ.8 కోట్లు నష్టపోయానని వి.కొత్తపల్లెకు చెందిన మల్రెడ్డి ఆవేదన వ్యక్తం చేయగా, రెండెకరాల్లోని అరటి తోటను గాలివాన దెబ్బతీసిందని అదే గ్రామానికి చెందిన లక్ష్మీదేవి ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.35 వేలు ఇవ్వాలి: వైఎస్ అవినాష్‌రెడ్డి గాలివాన బీభత్సంతో నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరాకు రూ.35 వేల నష్టపరిహారం ఇవ్వాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం వైఎస్సార్ జిల్లా వేముల మండలంలోని భూమయ్యగారిపల్లె, వి.కొత్తపల్లెలలో గాలివానతో నేలవాలిన అరటి తోటలను పరిశీలించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యానశాఖ అధికారులను అప్రమత్తం చేసి, పంటనష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసి పరిహారం అందించాలని కోరారు. నష్టపోయిన ప్రతి రైతుకూ ప్రభుత్వం అరటి మొక్కలను ఉచితంగా ఇవ్వాలన్నారు. ఈ రెండు ప్రాంతాల్లో వెదర్ స్టేషన్లు ఉండటంతో వాతావరణాన్ని అంచనా వేయొచ్చని, మిగిలిన ప్రాంతాల్లో వెదర్ స్టేషన్లు లేవని తెలిపారు. వాతావరణం ఆధారంగా కాకుండా వాస్తవంగా క్షేత్రస్థాయిలో నష్టాలను అంచనా వేసి రైతులకు పరిహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. గత 15 ఏళ్లుగా రైతులు అరటిని సాగు చేస్తున్నారని.. ప్రతి ఎకరాకు రూ.3 వేల ప్రీమియం చెల్లిస్తున్నా ఇన్సూరెన్స్ వచ్చిన దాఖలాల్లేవన్నారు. ఇన్సూరెన్స్ విధానంలో లోపాలున్నాయని.. ఈ విషయంపై పార్లమెంటులో కూడా తాను ప్రస్తావించామని, లోపాలను సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వేముల మండలంలో నష్టపోయిన అరటి రైతుల విషయాన్ని వ్యవసాయ శాఖ ఏడీ వెంకటేశ్వరరెడ్డికి ఫోన్ ద్వారా తెలియజేసి, రైతులకు వెంటనే న్యాయం చేయాలని కోరారు. పంట నష్టం వివరాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని బాధిత రైతులకు ఎంపీ అవినాష్‌రెడ్డి హామీ ఇచ్చారు. -
భారీ ఈదురు గాలులు..8 మంది మృతి
పశ్చిమ బెంగాల్ : కోల్కత్తా నగరాన్ని మంగళవారం రాత్రి భారీ ఈదురుగాలులు తీవ్రంగా ఇబ్బందిపెట్టాయి. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు కూలిపోయి, విద్యుత్ వైర్లు తెగిపోయి ప్రజల మీద పడటంతో 8 మంది చనిపోయారు. సుమారు 30 మంది గాయపడ్డారు. సుమారు 100 కి.మీల వేగంతో గాలులు వీచాయని రీజినల్ మెటియోరాలాజికల్ డైరెక్టర్ జీకే దాస్ తెలిపారు. సుమారు 26 ప్రాంతాల్లో భారీ వృక్షాలు కూలిపోవడంతో పూర్తిగా ట్రాఫిక్ స్తంభించింది. సుమారు రెండు గంటల పాటు మెట్రో ట్రైన్ సేవలు నిలిచిపోయాయి. అకస్మాత్తుగా సంభవించిన తుపాను కారణంగా నగరానికి మధ్యలో ఉన్న న్యూమార్కెట్ పోలీస్ స్టేషన్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది.ఈ కారణంగా మంటలు చెలరేగి కరెంటు పోయి అంధకారంలో మునిగిపోయింది. రాత్రంతా కరెంటు లేక తుపానులో పోలీసులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పని ముగించుకుని సరిగ్గా ఇంటికి వెళ్లే సమయంలో తుపాను రావడంతో ఉద్యోగులు ఇంటికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మున్సిపల్, విపత్తు నిర్వహణా సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది. -
అమెరికాలో తుపాను.. ముగ్గురి మృతి
మిన్నియపోలిస్: తుపాను ప్రభావంతో మధ్య అమెరికా ప్రాంతంలో వడగళ్ల వానలు కురుస్తున్నాయి. తుపాను ధాటికి శనివారం రెండేళ్ల చిన్నారి సహా ముగ్గురు మరణించారు. వందల విమానాలు రద్దయ్యాయి. రోడ్లపై 35 సెంటీ మీటర్ల ఎత్తుమేర మంచు పేరుకుపోయింది. మిషిగన్, విస్కాన్సిన్, ఇల్లినాయిస్, లూసియానా, ఆర్కాన్సస్, టెక్సస్ తదితర రాష్ట్రాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. -
తీర ప్రాంత వాసులకు హెచ్చరిక
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర జార్ఖండ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. మరోవైపు దక్షిణ మహారాష్ట్ర నుంచి విదర్భ వరకు మరట్వాడా మీదుగా అల్పపీడనద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో శుక్ర, శనివారాల్లో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాలో కొన్నిచోట్ల పెనుగాలులు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గురువారం రాత్రి నివేదికలో వెల్లడించింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు గాని, వర్షం గాని కురవవచ్చని పేర్కొంది. ఆకాశం మేఘావృతమై ఉండడం వల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం రాష్ట్రంలోని అనంతపురం మినహా పలుచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే ఒకట్రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. అనంతపురంలో 41.4 డిగ్రీలు (+2.4) అధికంగా రికార్డయింది. -
వణికిపోతున్న అమెరికా
-
నాలుగైదు రోజుల్లో తుపాను!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కు మరో వరద ముప్పు పొంచి ఉందా? తుపాను రూపంలో ఆ ముప్పు ముంచుకు రానుందా? ప్రస్తుత పరిస్థితులను బట్టి అవుననే అంటున్నాయి అంతర్జాతీయ వాతావరణ సంస్థలు. నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడి రానున్న 24 గంటల్లో (సోమవారం నాటికి) మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమేపీ బలపడుతూ వాయుగుండంగా మారనుంది. అనంతరం వాయవ్య దిశగా పయనిస్తూ ఈనెల 19 నాటికి ఉత్తర కోస్తాంధ్ర – ఒడిశాల మధ్య తీరాన్ని తాకుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి వెల్లడించింది. మరోవైపు రాయలసీమపై నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. అదే సమయంలో రాయలసీమపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఆదివారం రాయలసీమలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు కొన్నిచోట్ల పిడుగులు పడతాయని, భారీ ఈదురుగాలులకు ఆవకాశం ఉందని వివరించింది. గడచిన 24 గంటల్లో తాడిమర్రిలో 8, బత్తలపల్లి, ధర్మవరంలలో 8, కంబదూరు, కూనవరం, వరరామచంద్రపురంలలో 7, రామగిరి, వేలేరుపాడు, చింతపల్లి, రామగిరిలోల 5, మడకసిరలో 4 సెం.మీల చొప్పున వర్షపాతం రికార్డయింది. వరద ముప్పు పొంచి ఉందా? ఈశాన్య రుతుపవనాల సీజను మొదలయ్యాక అక్టోబర్ – డిసెంబర్ మధ్య మూడు తుపాన్లు సంభవించనున్నాయంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తుపాన్ల రాకపై ఇప్పటికే ఇస్రో ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇచ్చినట్టు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం వాయుగుండంగా.. ఆ తర్వాత తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు, అంతర్జాతీయ ప్రైవేట్ వాతావరణ సంస్థ ఆక్యు వెదర్ సీనియర్ మెటిరియాలజిస్ట్ జాసన్ నికోల్స్ చెబుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, ఒడిశా తీరప్రాంతాలపై ప్రభావం చూపుతుందని అంచనా వేశారు. అందువల్ల వరదలు సంభవించే ప్రమాదం ఉందని సూచించారు. ఇదిలా ఉండగా చైనా సముద్రంలో ప్రస్తుతం ‘ఖానూన్’ అనే పెనుతుపాను కొనసాగుతోంది. ఇది రెండ్రోజుల్లో బలహీన పడే అవకాశం ఉండటంతో ఇక్కడ 16న అల్పపీడనం ఏర్పడి 19 నాటికి వాయుగుండంగా మారవచ్చని ఐఎండి పేర్కొంది. -
గురుడిపై భారీ తుపాను!
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన ‘జూనో’అంతరిక్ష నౌక గురుగ్రహంపై భారీ తుపాను ‘గ్రేట్ రెడ్ స్పాట్’ఫొటోలను పంపింది. ఈ గ్రేట్ రెడ్ స్పాట్‌ను సౌర కుటుంబంలోనే అతిపెద్దదిగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తారు. జూలై 10న నౌకలోని జూనోక్యామ్ అనే పరికరం ఈ అతిపెద్ద తుపాను ఫొటోలను తీసింది. వందల ఏళ్ల నుంచి శాస్త్రవేత్తలు ఈ తుపానును పరిశీలిస్తున్నారని శాన్ ఆంటోనియోలోని సౌత్‌వెస్ట్ ఇన్స్టిట్యూట్కు చెందిన స్కాట్ బోల్టన్ పేర్కొన్నారు. ‘ఈ తుఫానుకు సంబంధించి చాలా మెరుగైన ఫొటోలు మా వద్ద ఉన్నాయి. వీటిని విశ్లేషించడానికి మాకు కొంత సమయం పడుతుంది’అని ఆయన వివరించారు. ఈ గ్రేట్ రెడ్ స్పాట్ దాదాపు 16,350 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. అంటే భూమి వెడల్పుతో పోల్చుకుంటే దాదాపు 1.3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ తుపానును 1830వ సంవత్సరం నుంచి గమనిస్తూ ఉన్నారు. 350 ఏళ్ల నుంచి ఇది ఉండొచ్చని అంచనా. -
థ్యాంక్యూ దేవుడా...బతికి బయటపడ్డాం!
బుధవారం మహారాష్ట్రలోని లాతూర్ అనే స్మాల్ సిటీలో ఓ ఈవెంట్లో పాల్గొనడానికి శృంగారతార సన్నీ లియోన్, ఆమె భర్త డానియెల్ వెబర్ అండ్ టీమ్ ఫ్లైట్‌లో వెళ్లారు. వీళ్లు వెళ్లింది చిన్నా చితకా ఫ్లైట్‌లో కాదు... లార్జ్ ప్రయివేట్ జెట్‌లో వెళ్లారు. లాతూర్ చేరుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ సిబ్బంది చావు కబురు చల్లగా చెప్పినట్టు... ‘వుయ్ ఆర్ సో సారీ సన్నీ! మా రన్‌వే అంత పెద్ద ఫ్లైట్ ల్యాండ్ కావడానికి చాలదు. స్మాల్ ఫ్లైట్స్‌కి మాత్రమే పర్మిషన్ ఉంది’ అన్నారు. చేసేది ఏమీ లేక సన్నీ అండ్ కో గాల్లో ఉండగానే (ఫ్లైట్ ల్యాండ్ కాకుండానే) వెనుదిరిగారు. ముంబయ్‌కి రిటర్న్ వచ్చే టైమ్‌లో భారీ తుఫాను గాలుల్లో ఫ్లైట్ చిక్కుకుంది. దాంతో ఫ్లైట్‌లో జనాలకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైందట! ఈ ఘటన గురించి సన్నీ లియోన్ మాట్లాడుతూ – ‘‘విపరీతమైన భయమేసింది. ఆల్మోస్ట్ ఫ్లైట్‌లో ప్రాణాలు పోతాయేమో! అన్నంతగా భయపడ్డాం. తుఫానులో ఫ్లైట్ చిక్కుకుంటుందని ఎవరూ ఊహించలేదు. పైలట్స్ ధైర్యంగా, సేఫ్‌గా ఫ్లైట్‌ను ల్యాండ్ చేశారు. నేల మీదకు దిగిన తర్వాత బతికి బయటపడినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నా’’ అన్నారు. -
తీవ్ర తుఫానుగా మారిన 'వార్దా'
విశాఖపట్నం: వార్దా తుఫాను శనివారం తీవ్ర తుఫానుగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 790 కిలోమీటర్లు, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 870 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాకినాడ, నెల్లూరు మధ్య సోమవారం మధ్యాహ్నం వార్దా తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటే సమయంలో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. 'వార్దా' ప్రభావంతో ఆదివారం నుంచి కోస్తాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. -
తిరుమలలో భక్తులకు తూఫాను హెచ్చరిక
-
భీకర తుపాన్.. 50 మందికి పైగా మృతి
-
భీకర తుపాన్.. 50 మందికి పైగా మృతి
పోర్ట్ ఆ ప్రిన్స్: కరీబియన్ దీవులపై హరికేన్ విరుచుకుపడింది. దీంతో 50 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ ఘటన కరీబియన్ దీవులలోని హైతీ తీరంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక అధికారుల కథనం ప్రకారం.. హైతీ మాథ్యూ అని పిలువబడే భీకరమైన తుపాన్ హైతీ దక్షిణాన ఉన్న రోచ్ ఎ బటియు నగరాన్ని తాకింది. ఈ నగరం మొత్తం తీరప్రాంతం కావడంతో తుపాన్ దాటికి జనం విలవిల్లాడిపోయారు. ఈ హైతీ తుపాన్ కారణంగా గత రెండు రోజులుగా 23గా ఉన్న మృతుల సంఖ్య 50కి చేరుకుందని అధికారులు భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగి అవకాశాలున్నాయని తెలిపారు. లెస్ కాయెస్ నుంచి టిబురాన్, పెర్రె లూయిస ఆస్టిన్ నగరాలు హరికేన్స్ వల్ల తీవ్రంగా నష్టపోయాయి. -
దైవవాణికోసం నిరీక్షణలో... ప్రవక్త జీవితం
తరువాత ముహమ్మద్ (స) ఇంటికి తిరిగొచ్చారు. ఆయన ముఖారవిందం విచారంగా ఉంది. రకరకాల ఆలోచనలతో ఆయన మనసు నిండిపోయింది. ‘ఈ బలహీన భుజస్కంధాలపై దౌత్యభారమా ! దీని పర్యవసానం ఏమి కానుందో!? దీన్ని నేను ఎలా మోయగలను? ప్రజల్ని సత్యంవైపు, సన్మార్గం వైపు ఎలా పిలవడం? వీరు మార్గవిహీనులై, దైవానికి దూరంగా ఉన్నారు. సత్యానికి దూరంగా ఉన్నారు. విగ్రహారాధన, బహుదైవారాధన వీరి నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంది. మూఢాచారాల్లో పీకలదాకా మునిగి ఉన్నారు. అన్నిరకాల దుష్కార్యాలు, దుర్మార్గాలు వారిని పరివేష్టించి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో నా కర్తవ్యం ఏమిటి? దాన్ని నేను నిర్వర్తించడం ఎలా??’ మనసులో ఆలోచనల తుఫాను చెలరేగింది. దీంతో ఆయన దైవవాణి కోసం నిరీక్షించసాగారు. నిరీక్షణ. దైవదూత కోసం .. దైవవాణి కోసం ... వరఖా బిన్ నౌఫిల్ ధృవీకరించిన దూతకోసం.. ఖదీజా విశ్వసనీయంగా చెప్పిన దైవదూత కోసం..! కానీ ఫలించలేదు. జిబ్రీల్ దూత రాలేదు.. ఎలాంటి దైవవాణీ అవతరించలేదు... మళ్ళీ మనసులో అలజడి, పెనుతుఫాను.. ‘ఇప్పుడు నేనేంచేయాలి.. నా కర్తవ్యం ఏమిటి? ప్రజలకు ఏమి సందేశమివ్వాలి?’ ఈ విషయాలు చెప్పడానికి జిబ్రీల్ (అ) ఎందుకు రాలేదు? జిబ్రీల్ రాక ఎందుకు ఆగిపోయింది. మళ్ళీ సందేశం ఎందుకు తేలేదు! ఒకటే ఆలోచన. మనసంతా అంధకారమైన భావన. నిర్మల తేజంతో ప్రకాశించే సుందరవదనం కళా విహీనమైపోయింది. మనసును చీకట్లు ముసురుకున్నాయి. అటు బీబీ ఖదీజా పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. ఆమె మనసులో కూడా ఆందోళన మొదలైంది. రేయింబవళ్ళు లోలోనే కుమిలిపొయ్యారు. కాని ఎక్కడా బయట పడలేదు. భర్తకు ధైర్యవచనాలు చెబుతూ, ఊరడించడానికి శక్తిమేర ప్రయత్నించేవారు. ముహమ్మద్ (స) మళ్ళీ హిరాగుహను ఆశ్రయించారు. రేయింబవళ్ళు అక్కడే దైవధ్యానంలో గడిపేవారు. తన ప్రభువుతో సంభాషించేవారు. ప్రభూ! నువ్వే కదా నన్ను ప్రవక్తగా నియమించావు. మళ్ళీ అంతలోనే విడిచిపెట్టావా స్వామీ? అని మొరపెట్టుకునేవారు. బాధతో గుండెలు అవిసిపోయేవి. ఆందోళన.. ఆక్రందన.. ఏమీ అర్థంకాని పరిస్థితి.. ఏమీ పాలుపోక ఎటెటో తిరిగేవారు.. రాళ్ళురప్పల మధ్య.. కొండకోనల మధ్య.. ఒక్కోసారి తనువుచాలిద్దామన్నంత నిరాశతో కొండశిఖరం పైకి ఎక్కేవారు. అంతలో హజ్రత్ జిబ్రీల్ దూత వచ్చేవారు. ఆయన్ని శాంతపరిచేవారు. ‘ముహమ్మద్ ! మీరు నిస్సందేహంగా దైవప్రవక్తే.’ అని భరోసా ఇచ్చేవారు. దీంతో ఆయనకు సాంత్వన చేకూరేది. వెనుదిరిగి వెళ్ళిపోయేవారు. కొద్దిరోజుల తరువాత మళ్ళీ అదే పరిస్థితి ఎదురయ్యేది. మళ్ళీ పర్వత శిఖరంపైకి చేరుకునేవారు ఆత్మత్యాగం చేద్దామని! హజ్రత్ జిబ్రీల్ మళ్ళీ వచ్చి ఆయన్ని ఓదార్చేవారు, ఆయన వెనుదిరిగి వెళ్ళేవారు. ఆయన మనసు ఎంత గాయపడి ఉండాలి! ఆత్మ ఎంతగా రోదించి ఉండాలి! మనోమస్తిష్కాలపై ఎంతటి భారం పడిఉండాలి! దైవవాణి అవతరణ ఆగిపోవడం మామూలు శిక్షకాదు. దైవం నన్ను వదిలేశాడా అన్న భావన గుండెలో గునపాలు గుచ్చినంతగా బాధించేది. ఇవే ఆలోచనలు మనసును తొలుస్తుండగా, ఒకరోజు ఆయన ఎటో బయలు దేరారు. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఓ శబ్దం వినిపించింది. - ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతా వచ్చేవారం) -
ఆదిలాబాద్‌లో గాలి వాన బీభత్సం
జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతోన్నారు. -
నల్లగొండ జిల్లాల్లో గాలివాన.. నెలకొరిగిన చెట్లు
నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. హుజూర్నగర్ నియోజకవర్గం పరిధిలో పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. మేళ్లచెర్వు మండలం ఎర్రగట్టు తండాలో పిడిగుపాటుకు రెండు ఆవులు మృతి చెందాయి. -
చినుకు పడితే గుండె దడ దడ
వర్షాలు, గాలులకు తోడు భయపెడుతున్న పురాతన భవనాలు నగరంలో అధికారులు గుర్తించినా కూల్చనివి 274 నిర్లక్ష్యం వీడకపోతే ప్రాణనష్టం తప్పదంటున్న నిపుణులు సిటీబ్యూరో: క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో నగరంలో బుధవారం మళ్లీ గాలివాన బీభత్సం సృష్టించింది. ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 100 కి.మీ ప్రచండ వేగంతో ఈదురుగాలులు వీచాయి. పలు చోట్ల భారీ వృక్షాలు విరిగిపడడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. విద్యుత్ తీగలు తెగిపడడంతో పలు శివారు ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. ఎస్.ఆర్.నగర్ బీకేగూడాలో ఓ భారీ వృక్షం కూలి ఆటో ధ్వంసమైంది. సనత్‌నగర్ బస్టాప్ వద్ద ఓ దుకాణంపై భారీ వృక్షం కూలింది. అశోక్‌నగర్ కాలనీలో ఓ భవనంపై ఉన్న రేకులు ఎగిరి పక్కనే ఉన్న పెంకుటిల్లుపై పడడంతో ఆ ఇల్లు ధ్వంసమైంది. బేగంపేట్ రసూల్‌పురా భరణి కాంప్లెక్స్ వద్ద ఓ భారీ వృక్షం కూలి మూడు కార్లు ధ్వంసమయ్యాయి. సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులో ఓ భారీ వృక్షం కూలి రెండు కార్లు ధ్వంసమయ్యాయి. గాలివాన బీభత్సం నేపథ్యంలో బుధవారం సాయంత్రం జీహెచ్ఎంసీ మేయర్, వివిధ విభాగాల నోడల్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. జీహెచ్ఎంసీ అత్యవసర కాల్ సెంటర్‌కు అందిన ఫిర్యాదుల్లో.. విద్యుత్ సరఫరాలో అంతరాయంపై 26 ఫిర్యాదులు, చెట్లుకూలిన ఘటనపై 27 ఫిర్యాదులు అందినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. తక్షణం ఆయా సమస్యలను పరి ష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్ధన్‌రెడ్డి సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. కాగా సాయంత్రం 8.30 గంటల వరకు1.06 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. ట్రాఫిక్ జాంఝాటం.. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా గాలివాన రావడంతో అబిడ్స్, కోఠి, నాంపల్లి, లక్డికాపూల్, పంజగుట్ట, ఖైరతాబాద్, ఎస్.ఆర్.నగర్, అమీర్‌పేట్, సికింద్రాబాద్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లో వర్షపునీరు రహదారులపై నిలిచి ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. వాహనదారులు, ఉద్యోగులు, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు ట్రాఫిక్‌లో చిక్కుకొని విలవిల్లాడారు. ఆలస్యంగా ఇళ్లకు చేరుకున్నారు. కాగా మధ్యాహ్నం గరిష్టంగా 40.5 డిగ్రీలు, కనిష్టంగా 28.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ 89 శాతంగా నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రాగల 24 గంటల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఎమర్జెన్సీ కంట్రోల్‌రూమ్‌కు ఫిర్యాదులు బుధవారం సాయంత్రం కురిసిన వాన, ఈదురుగాలుల వల్ల 30 ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలిగినట్లు, 25 చెట్లు కూలిపోయినట్లు జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ కంట్రోల్‌రూమ్‌కు ఫిర్యాదులందాయి. దాంతో వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణశాఖ ద్వారా అందిని హెచ్చరికలతో ఎమర్జెన్సీ కంట్రోల్‌రూమ్‌కు చేరుకోవాల్సిందిగా ఆయా విభాగాల నోడల్ అధికారులకు సమాచారమిచ్చారు. కేవలం పదినిమిషాల్లోనే తక్షణ చర్యలు చేపట్టి ప్రజల ఇబ్బందులు తొలగించారని పేర్కొన్నారు. సీతాఫల్మండి, జూబ్లీహిల్స్, చిలుకలగూడ, లోయర్‌ట్యాంక్‌బండ్, ముషీరాబాద్ ఎమ్మార్వో కార్యాలయం, బంజారాహిల్స్ రోడ్డునెంబర్ 12 తదితర ప్రాంతాల్లో కూలిన చెట్లను వెంటనే తొలగించినట్లు పేర్కొన్నారు. ఓయూ క్యాంపస్‌లో కూలిన చెట్లు గాలివానతో బుధవారం ఓయూ క్యాంపస్ అతలాకుతలం అయింది. విపరీతమైన గాలికి పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగి కిందపడగా, కరెంట్ తీగలు తెగి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. టెక్నాలజీ విద్యార్థుల హాస్టల్ పైకప్పుపై చెట్టు విరిగిపడడంతో సిమెంట్ రేకులు విరిగిపోయాయి. దీంతో వర్షం నీరు హాస్టల్ గదుల్లోకి ప్రవేశించి విద్యార్థుల పుస్తకాలు, దుస్తులు, ఇతర వస్తులు తడిచిపోయాయి. -
గోడ కూలి కార్మికుడు దుర్మరణం
అత్తాపూర్‌లోని మారుతినగర్లో శుక్రవారం సాయంత్రం గాలి వానకు గోడ కూలిపోవడంతో కార్మికుడు మృతి చెందాడు. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా వీచిన గాలులకు నిర్మాణంలో ఉన్న గోడ కుప్పకూలింది. శిధిలాలు కార్మికులపై పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఎల్లయ్య అనే కార్మికుడు మృతి చెందగా మరొక కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ కార్మికుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
తుఫాన్‌గా మారనున్న వాయుగుండం
విశాఖపట్నం: వాయుగుండం తుఫానుగా మారనుందని విశాఖ తుఫాన్ కేంద్రం హెచ్చరించింది. చెన్నైకి 120 కిలోమీటర్ల దూరంలో దక్షిణ ఆగ్నేయ దిశగా నైరుతి బంగాళఖాతంలో అది కేంద్రీకృతం కానున్నట్లు వెల్లడించింది. ఉత్తర వాయవ్య దిశగా పయనం అయ్యి అనంతరం దిశ మార్చుకొని ఉత్తర ఈశాన్య దిశగా పయనించనున్నట్లు తెలిపింది. రాగల 24గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. రేపు రాత్రికి లేదా ఎల్లుండి ఉదయం నాటికి తుఫాన్ గా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. ఉత్తరకోస్తాలో మాత్రం ఓ మోస్తరుగా పడతాయి. తీరం వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు రానున్నాయి. దక్షిణ కోస్తాలో అన్ని ప్రధాన ఓడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉత్తర కోస్తాలో ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని ఆదేశించారు. -
తుపాన్ రాత్రి
క్లాసిక్ కథ అతణ్ని చూస్తూ ఉంటే అతనో పెద్ద మాటకారిలాగానే ఉన్నాడు. చెప్పిన విషయం చెప్పకుండా చెప్పుకుపోతున్నాడు. ఇంట్లోంచి కాఫీ తెప్పించాడు. తాగుతూ కూర్చున్నాను. అతను విషయం మార్చాడు. తనకు ఉద్యోగం దొరికిన తొలిరోజుల గురించి చెప్పడం ప్రారంభించాడు. ఎలాగైతేనేం చివరికి విశాఖపట్నంలో ఉద్యోగం దొరికింది. ఒక పెద్ద వ్యాపారస్తుడు సముద్రపు ఒడ్డున బీచ్‌రోడ్‌లో వరుసగా పెద్ద పెద్ద భవనాలు కడుతున్నాడు. అతను నన్నక్కడ సూపర్వైజర్గా నియమించుకున్నాడు. మంచి జీతం, ఉండడానికి ఇల్లు ఇచ్చాడు. పని జరుగుతున్న చోటుకు నాకిచ్చిన ఇల్లు చాలా దగ్గర. సూపర్వైజర్ అన్న డిజిగ్నేషన్ నాకెందుకో ఎబ్బెట్టుగా అనిపించేది. కాని అందులోని లోతుపాతులు తెలిసిన తర్వాత, అదే బావుందనిపించింది. కాని మొదట్లో ఉద్యోగం నిలదొక్కుకోవడం కష్టమే అయ్యింది. కాంట్రాక్టరు, రాళ్లు కొట్టేవాళ్లు, వడ్రంగి పనివాళ్లూ అందరూ... అనవసరంగా నేను వాళ్ల పనుల్లో జోక్యం కలిగించుకుంటున్నట్లు బాధపడిపోయేవారు. కాని కొద్దికాలంలోనే ఎవరిని ఎప్పుడు బెదిరించాలో, ఎప్పుడు ఎలా పని చేయించుకోవాలో తెలుసుకున్నాక ఇక ఏమాత్రం కష్టమనిపించలేదు. మీరు నమ్మండి, నమ్మకపోండి. అది మీ ఇష్టం. కాని నా అంతటి అదృష్టవంతుడు అసలు దేశంలో ఉన్నాడా అనిపించేది అప్పట్లో - ఎందుకంటే చెప్తాను వినండి. అదృష్టం నంబర్ వన్-సూపర్వైజర్గా నా పని అతి సులభంగా ఉండేది. సామాన్యంగా నా పర్యవేక్షణంతా ఇంట్లో పడుకుని కిటికీ గుండా చేస్తూ ఉండేవాడిని. అదృష్టం నంబర్ టు - నేనూ, నా భార్య అందమైన ఊహా ప్రపంచంలో బతికేవాళ్లం. ఎందుకంటే అప్పటికింకా మా అబ్బాయి పుట్టలేదు. వాడు పుట్టడానికి ఇంకా నెలరోజుల వ్యవధి ఉంది. అదృష్టం నంబర్ త్రీ - మా ఇల్లు ప్రశాంతమైన పరిసరాల్లో అధునాతనంగా ఉండేది. ఇక సముద్రమా? వాకిట్లోకి సరిగా పది అడుగులే. అట్లా అన్నీ కలిసొచ్చాయి. అది నవంబర్ నెల. ఒకరోజు ఉదయమే మామూలు ప్రకారం తొమ్మిదిన్నరకు నిద్రలేచాను. బయటంతా కారుమబ్బులు కమ్ముకుని నల్లగా ఉంది. పనివాళ్లు నాకోసం కాచుకుని ఉన్నారు. విషయమేమిటని తెలుసుకుంటే, ఆ రోజు వాతావరణం బాగోలేదు కాబట్టి పనిలోకి పంపించవద్దని అభ్యర్ధించారు. అలాంటి పిచ్చివేషాలు వేయగూడదని, మాట్లాడకుండా పనిలోకి వెళ్లమని గద్దించాను. కొద్దిసేపటి తర్వాత వీధిలోకి వెళ్లాను. ప్రపంచమంతా స్తంభించినట్లుంది. అందరి ముఖాలు దీనంగా ఉన్నాయి. ఎక్కడా చైతన్యం లేదు. అప్పటికి పది కావస్తోంది. అయినా దుకాణాలు తెరవలేదు. మామూలు రోజు పగటిపూట దుకాణాలు మూసి ఉంచడం విడ్డూరంగా అనిపించింది. ఒక్కసారిగా ఘొల్లుమని గోల వినిపించి అటూ ఇటూ చూశాను. పక్కనే ఉన్న పాఠశాల విడిచిపెట్టారు. పిల్లలందరూ కేకలేస్తూ గేట్లోంచి బయటికొస్తున్నారు. సెలవు దొరికిందన్న సంతోషం కాబోలు! ఒక పిల్లవాడు మాత్రం బరువైన సంచీని బలవంతంగా మోస్తూ ఏడుస్తూ నడుస్తున్నాడు. ఏమైందని నేనా పిల్లవాణ్ని దగ్గరికి తీసుకున్నాను. వాడు ఏడుపుతోనే చెప్పాడు. ‘‘మరండీ... ఈ రోజు ప్రపంచం మునిగిపోతుందాండీ. అట్లా అని మా టీచరుగారు చెప్పారు’’ అని అన్నాడు. నేనింటికి వెళ్లగానే నా భార్య అలాగే చెప్పింది. భయం భయంగా ముఖం పెట్టి వణుకుతున్న గొంతుతో, ‘‘ప్రపంచం ఈ రోజుతో ముగుస్తుందటండీ’’ అని చెప్పి, నన్ను నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉండబట్టలేక బొలబొలమని ఒక ఖాళీ నవ్వు నవ్వింది. ప్రపంచం అంతమవడం అన్న విషయమ్మీద నేనూ కొన్ని పిచ్చి జోకులు వేసి తనని నవ్వించాను. నిజంగానే ప్రపంచాన్ని వదిలి వెళ్లిపోవాల్సి వస్తే మంచి మంచి చీరెలు ఏరుకుని వెంట తీసుకుపొమ్మని... ఆమెకు సలహా ఇచ్చాను. మిట్ట మధ్యాహ్నానికి చూద్దును కదా సైట్మీద ఎవరూ లేరు. పనివాళ్లంతా చెప్పాపెట్టకుండా వెళ్లిపోయారు. అంతా నిర్మానుష్యంగా తయారైంది. వాళ్లలా వెళ్లిపోవడం నాకెంతో కోపం తెప్పించింది. ప్రపంచం మునిగిపోతుందన్న వార్త ఎవరు ఎప్పుడు పుట్టించారో గాని, వాతావరణం అందుకు తగినట్లుగానే భయంకరంగా మారిపోయింది. పగలు మూడు గంటలకే అన్ని దిక్కులకు చీకటి వ్యాపించింది. కొబ్బరిచెట్లు హోరుగాలికి నిలవలేకపోతున్నాయి. ఒక్కోసారి కింద ఇసుకను తాకి లేస్తున్నాయి. జానపద కథల్లో దెయ్యాల నృత్యాన్ని జ్ఞాపకానికి తెస్తున్నాయి. చల్లని వేళల్లో నాలో కవిత్వాన్ని పుట్టించే సముద్రం అప్పుడు ప్రళయరూపాన్ని దాల్చింది. సముద్రపు నీరు ఎర్రగా మురికి రక్తంలాగా అయ్యింది. ఒక్కొక్క కెరటం ఎత్తులో సగం కొబ్బరి చెట్టంత ప్రమాణంతో ఉంది. ఈ భూమండలాన్ని ఈ క్షణమో, మరో క్షణమో కప్పివేయాలన్నట్లు కెరటాలు ఒకదాని కంటే మరొకటి వేగంతో ఉధృతంగా లేచి పడుతున్నాయి. విపరీతమైన సముద్రపు హోరు మానవ నాశనాన్ని కోరుతున్నట్లుగా ఉంది. నా శ్రీమతి నా పక్కనే చాలాసేపు నిశ్శబ్దంగా కూర్చుంది. తర్వాత ఒంట్లో నలతగా ఉందని పోయి పడుకుంది. ఆమె ఉదయం ఉన్నంత ఉత్సాహంగా లేదు. ముభావంగా, బలహీనంగా ఉన్నట్లు కనిపించింది. దీపం వెలిగించి, ఆమె పక్కనే వెళ్లి కూర్చుని ఆరోజు వార్తాపత్రికలోని వింతల్ని, ముఖ్యమైన వార్తల్ని చదివి వినిపించాను. ఎలాగైనా ఆమె మనసుకు ఉల్లాసం కలిగించాలని నా ప్రయత్నం. ఆ సమయానికి బయట సముద్రం రాక్షసిలా ఘోషిస్తోంది. ఈదురుగాలి రక్తదాహంతో కేకలేస్తున్నట్లుగా ఉంది. దానికితోడు యింటి కప్పును సమ్మెటలతో బాదుతున్నట్లు వర్షం మొదలైంది. నేను చదువుతున్న వింత వింత వార్తల్ని మా ఆవిడ నిశ్శబ్దంగా వింటోంది. కొద్దిసేపటి తర్వాత మెల్లగా మూలగడం మొదలుపెట్టింది. మరికొంతసేపటికి తనకు నొప్పులు మొదలయినాయని ప్రకటించింది. రాత్రి ఎనిమిదయ్యేసరికి ఆమె పరిస్థితి మరీ విషమించింది. నాకేం చేయాలో తోచలేదు. అంత బాధలో కూడా ఆమెకు నా ఆకలి జ్ఞాపకం ఉంది. వెళ్లి వంట చేసుకొమ్మని సలహా ఇచ్చింది. నిజంగా అప్పటికే ఆకలితో కడుపు కాలిపోతూ ఉంది. వంటింట్లోకి ప్రవేశించాను. పొయ్యి అంటించే ప్రయత్నం చేశాను. నేర్చుకోలేక నేను ఓటమిని అంగీకరించిన విషయాల్లో సైకిలు తొక్కడం, తర్వాత ఈ పొయ్యి అంటించడం ఒకటి. మన ఆడవాళ్లు అంత సులభంగా నిమిషంలో ఎలా పొయ్యి అంటిస్తారోనన్నది నాకు అంతుపట్టని విషయమే! ఈ విషయంలో వాళ్లకు జోహార్లు అర్పించాల్సిందే. పొయ్యి నిండా కట్టెలు పేర్చాను. అగ్గిపెట్టె కోసం వెతికాను. తెరిచివున్న కిటికీ పక్కగా తడిసిన అగ్గిపెట్టె కనిపించింది. ఒకదాని తర్వాత ఒకటి యాభై పుల్లలు గీశాను. ఒక్కటీ వెలగలేదు. అనుకోకుండా యాభై ఒకటవ పుల్ల కాబోలు వెలిగింది. దాంతో పక్కనే ఉన్న పాత దినపత్రిక అంటించాను. అది పూర్తిగా కాలిపోక ముందే వార్తాపత్రిక పేజీలు ఒక్కొక్కటే కాలుస్తూ పొయ్యాను. కాని పొయ్యిలోని కట్టెలు మాత్రం ఇంకా అంటుకోలేదు. నా వేళ్లు అప్పటికే చాలాసార్లు అంటుకున్నాయి. అప్పుడు నాకు అనిపించింది. ఈ ఇళ్లు, దుకాణాలు ఉత్తుత్తగా ఎలా తగలబడిపోతాయో నాకు అర్థం కాలేదు. వంటింటి నిండా పొగ నిండింది. ఊపిరి ఆడడం కష్టమైపోయింది. అప్పటికే కళ్లూ, ముక్కూ పొగను పంచుకున్నాయి. వంటిల్లు విడిచిపెట్టి లోన గదిలోకి వెళ్లాను. ‘‘ఏమైనా తిన్నారా?’’ శ్రీమతి అడిగింది. ‘‘హూ! ఇంకా అది కూడానా? తుపాను వచ్చినా బతికి బయటపడొచ్చు కానీ, ఈ ఆకలితో బతికేట్లులేను’’ అని కోపంతో అరిచినట్లే చెప్పాను. అప్పుడు నాలో పొయ్యి అంటించడం చేతకాలేదన్న ఉక్రోషం ఉంది. అందుకే మూతి ముడుచుకుని కోపంగా కూర్చున్నాను. సామాను గది అంటే మరేదో కాదు, వంటింట్లోనే ఓ మూలకు సామాను గది అని గౌరవప్రదమైన పేరు. పాలు ఉన్నాయనగానే ముఖం బల్బులా వెలిగించుకుని సామాను గదిలోకి వెళ్లాను. ఒక్క గుటకలో పాలు స్వాహా చేసేవాడినే. కాని మళ్లీ ఆలోచించాను. శ్రీమతి పరిస్థితి బాగా లేదు. ఆమెకు ఏ సమయంలోనైనా వీటి అవసరం రావొచ్చు. మరేదైనా తిని కడుపు నింపుకుందామనుకున్నాను. సామాను గదిలోని, కుండలు, బుట్టలు, డబ్బాలు అన్నీ వెతకడం ప్రారంభించాను. ఒక కుండలో మెత్తగా, జిగటగా ఏదో తగిలింది. బహుశా చింతపండు అయివుంటుందని చేయి వెనక్కి తీసుకునే లోపలే వేలికి ఏదో కరిచింది. కంగారుపడి కుండ బోర్లించి చూస్తే అందులోంచి నల్లగా, పెద్దగా, లావుగా ఉన్న తేలు బయటపడింది. దాన్ని చూడగానే పైప్రాణాలు పైనే పోయాయి. కొద్దిసేపటికే మంటలు మొదలయ్యాయి. విషం - ప్రభావం చూపుతోందన్న మాట! బాధతో ఎగిరాను. గంతులేశాను. కిందపడి దొర్లాను. ముందు గదిలోకురికాను. పెనుగాలి ఇంకా తీవ్రమైంది. ముందు గది పైకప్పు పెంకులు కొన్ని ఎగిరిపొయ్యాయి. వర్షపు నీళ్లతో ఇల్లు నిండిపోయింది. నిలుచుండే చోటు ఎక్కడా లేదు. ఇల్లు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చునన్నంత ఘోరంగా ఉంది పరిస్థితి. కొట్లాటల్లో విసురుకునే కత్తుల్లాగా ఇంట్లోని క్యాలెండర్లు, పటాలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఎగిరిపడుతున్నాయి. వీటికి తోడు తేలు విషం! మంటలు, పోట్లు భరించలేకుండా ఉన్నాయి. నీళ్లలోంచి కాళ్లను లాక్కుంటూ శ్రీమతి ఉన్న గదిలోకి వెళ్లాను. ఆ గది కొంత మెరుగ్గా ఉంది. మంచంమీద ఆమె బాధతో మూలుగులతో మెలికలు తిరిగిపోతోంది. నేనక్కడే నిశ్చేష్టుణై్నపోయి నిలబడ్డాను. ఏం చేయాలో తోచలేదు. అవి పురిటి నొప్పులే అని ఆమె స్పష్టం చేయడంతో శపించేద్దామన్నంత కోపం వచ్చింది. లేకపోతే ఇలా పరిస్థితులన్నీ ఒకేసారి విషమించిన రోజే ఆమె ఈ నొప్పులు తెచ్చుకోవాలా? బాధలోనే మధ్యలో చెప్పింది, ‘‘మిమ్మల్ని బాధ పెట్టదలచుకోలేదు గానీ ఏం చేయనూ? తప్పదు - వెళ్లి ఎవరినైనా సహాయం పిలుచుకు రండి.’’ సహాయం..? ఎవరొస్తారు ఇంత రాత్రి తుపానులో? అయినా నాకిక్కడ ఎవరు తెలుసుననీ? అంతా కొత్త. ఇక తప్పదని, లాంతరు ఒక చేత, గొడుగు మరో చేత పట్టుకుని సిద్ధమయ్యాను. వెళ్తున్నట్టు ఆమెతో చెప్పి, చిర్నవ్వొకటి విసిరేసి బయలుదేరాను. మా ఇంటి ముందు రోడ్డు కొంత భాగం చెడిపోయి గుంటలయ్యాయి. వాటిలో సముద్రపు నీరు వచ్చి చేరింది. అక్కడ ఇళ్లు దూరందూరంగా ఉన్నాయి గనుక, మా పక్కింటికి వెళ్లాలంటే కొంత దూరం నడవాల్సి ఉంటుంది. అందుకు దగ్గరి తోవ వెతుకుతున్నాను. ఇంతలో గాలికి గొడుగు లేచిపోయింది. ఎటు పోయిందో కనిపించలేదు. వెనువెంటే లాంతరు ఆరిపోయింది. నేనిక చీకట్లోనే ప్రయాణం చేయాల్సి వచ్చింది. కాళ్లతో తోవలోని రాళ్లను పుణుక్కుంటూ పుణుక్కుంటూ చెట్లను, పొదలను తప్పించుకుంటూ నడిచాను. వీటికితోడు వీపులో వెన్నుపూస మీద చల్లని వర్షపునీరు పారుతున్న సంతోషమొకటి. కనిపించని దయ్యాల చేతిలో నలిగిపోతున్నట్లు అనిపించింది. చెట్లు కుడికి, ఎడమకు కొట్టుకుంటున్నాయి. ఈదురుగాలి మృత్యు సంకేతంలా ఉంది. కాళ్లు కోసుకుపోయి రక్తం కారుతున్నట్లుంది. అప్పటికి గాని నేను పక్కింటికి చేరలేదు. అందులో ఒక విదేశీయుడు ఉంటున్నాడు. తను పోలీసు అధికారి. అతని ఇంటిముందు క్రూరమైన పెంపుడు కుక్కలుంటాయని జ్ఞాపకం వచ్చింది. అడుగు వెనక్కి వేశాను. ఆలోచిస్తూ కొద్దిసేపు నిలబడ్డాను. ఆ ప్రాంతానికి నేను కొత్త. ఎవరూ తెలియదు. అసలు ఎవరు ఎక్కడుంటారో తెలియంది ఎవరింటికని వెళ్లడం? ఆకాశంలో మెరుపు మెరిసింది. నా మనసులో కూడా మెరిసినట్లయింది. వెంటనే అక్కడి నుండి కదిలాను. అదే రోడ్డులో మరో పదడుగులు పోతే ఒక డాక్టరుగారిల్లుంది. అతని యింటికి ‘సాగర దృశ్యం’ అనే పేరు కూడా ఉంది. తేలుకుట్టిన వేలు నోట్లో వేసుకుని చీకుతూ పరిశీలించుకుంటే తెలిసిందేమంటే - నేనప్పుడు చిన్నపిల్లాడిలా భోరుమని ఏడుస్తూ నడుస్తున్నాను. మిట్టలూ, పల్లాలూ జాగ్రత్తగా దాటుతూ ‘సాగర దృశ్యం’ అనే డాక్టరుగారి యింటి వరండా చేరుకున్నాను. సుమారు యిరవై నిమిషాలు తలుపు బాదాను. తర్వాత యింటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కేకలు పెట్టాను. అప్పుడుగాని ఒక మూల కిటికీ తెరుచుకోలేదు. అందులోంచి ఒక స్త్రీ కనిపించింది. ‘‘ఎవరు మీరు?’’ అని ఒక పనికిరాని ప్రశ్న వేసింది. నేనెవరో, నా వివరాలేమిటో ఆమెకు అన్నీ ముందే తెలిసినట్టు, నా పేరు చెప్పగానే ఆమె అంతా అర్థం చేసుకోబోతున్నట్టూ! గత్యంతరం లేక నా పేరు, వివరాలు గొంతు పెద్దగా చేసి చెప్పాను. ఆ క్షణంలో నేనెన్ని కష్టాల్లో వున్నానో కూడా టూకీగా చెప్పాను. అంతా బూడిదలో పన్నీరులాగా కొద్దిసేపైన తరువాత ‘‘మీరెవరూ?’’ అని ఆమె మళ్లీ కేకేసింది. నేనూ కేకేశాను బదులు చెప్పడానికి - విపరీతమైన తుపాను చప్పుడులో ఎవరి మాట ఎవరికీ విన్పించడం లేదు. ఒక్కో ప్రశ్న ఆమె రెండు మూడుసార్లు అడగడం, నేను చెప్పడం జరిగింది. కిటికీలోంచి వచ్చిన కొద్ది వెలుగులో ఆమెకు నేనో భూతంలాగా కనిపించి ఉంటాను. వర్షంలో తడిసి ముద్దయిన బట్టలు, బురదైపోయిన కాళ్లూ, చేతులూ, ముఖం నిండా అతుక్కుపోయిన వెంట్రుకలు... నా వాలకం చూసి ఆకలి భరించలేక అడుక్కునే బిచ్చగాడని ఊహించుకుందేమో గాని, గౌరవంగా ఉద్యోగం చేసుకునే పెద్దమనిషి అనుకుని ఉండదు. ఆకలితో ఒళ్లు తేలిపోతున్న మాట నిజమే. చివరికి శక్తినంతా కూడదీసుకుని గొంతెత్తి అడిగాను డాక్టరుగారి గురించి. ఆమె కూడా ఎంతో కష్టపడి బిగ్గరగా అరిచి చెప్పింది. డాక్టరుగారు యింట్లో లేరని, బొంబాయి వెళ్లారని, ఇంటి నిండా బంధువులు ఉన్నారని, అందరూ పడుకున్నారని, వాళ్లంతా లేస్తారేమోనని తను తలుపు తీయలేకపోతున్నానని, ఎంతో మర్యాదగా చెప్పింది. నాకు సాధ్యమైనంత వరకు నేను దయ్యాన్నో, భూతాన్నో కాదని, ఒక కుటుంబీకుణ్నని, ఎంతో విషమ పరిస్థితినెదుర్కొంటున్నానని చెప్పాను. ఆమె కొంత జాలి కనబరిచింది. అయినా అది ఏం చేసుకోను? నాకు డాక్టరుగారు కావాలి. వైద్యం ఏమాత్రం తెలియని ఆమో, గాఢనిద్రలో ఉన్న ఆమె బంధువులో అక్కరలేదు. అదృష్టం బాగుండి తిరిగి క్షేమంగా ఇల్లు చేరాను. ఒకరిని సహాయం రమ్మన్నాననీ, వాళ్లొస్తున్నారనీ శ్రీమతికి అబద్ధం చెప్పాను. ఆ చిన్న అబద్ధంతో ఆమె ముఖంలో కొత్త వెలుగు కనిపించింది. తర్వాత సముద్రం వైపున్న కిటికీ తెరవమని అడిగింది. అందుకు నేనొప్పుకోలేదు. అప్పటికే ఇల్లు పగుళ్లు బట్టి ఉంది. కిటికీ తెరవడమంటే తుపానుని గదిలోకి ఆహ్వానించడమేనని చెప్పాను. అదే విషయం మేం వాదులాడుకుంటూ ఉండగా వెనక వంటగది అంతా కుప్పకూలిపోయిన శబ్దమైంది. వెనువెంటనే మేమున్న గదిలో ఏదో పేలుడు సంభవించినట్లయ్యింది. మేం తెరవాలా వద్దా అని చర్చించు కుంటున్న కిటికీ ఉధృతమైన గాలికి ఊడిపోయి కిందపడిపోయింది. గదిలోని దీపం ఆరిపోయింది. స్థాణువునైపోయి కుప్పగా కూలబడిపోయాను. లేచి చీకట్లో కిటికీ వెదికి దాని స్థానంలో దాన్ని పెడదామని ప్రయత్నించాను. అది అడ్డంగా ఉంటే పెనుగాలి బారి నుండి కొంతవరకు తప్పించుకోవచ్చని నా అభిప్రాయం. కిటికీని అదిమిపెట్టానే గాని చేతి తేలు మంటల్ని అదిమి పెట్టలేకపోయాను. అదే సమయంలో నన్ను భయకంపితుడ్ని చేసే విధంగా నా శ్రీమతి పెడబొబ్బలు పెట్టింది. కేకలు వేసింది. మంచం మీద లేచి లేచి పడింది. నాకు పిచ్చిలేచినంత పనైంది. ధైర్యంగా ఉండమని, సహించి ఊరుకోమని చెప్పాను. కోప్పడ్డాను. చివరకు అడ్డమైన తిట్లన్నీ తిట్టాను. ఇంతలో కెవ్వుమని శిశువు కేక వినిపించింది. అనాలోచితంగా కిటికీని విడిచిపెట్టి ఆశ్చర్యంగా నిలబడ్డాను. కొత్తగా పుట్టిన శిశువు కేక తుపాను గాలినీ, చీకటిని ఛేదిస్తున్నట్లుగా ఉంది. ఈ జీవం సమాప్తం కాదు. కొత్త జీవం పుడుతూ ఉంటుందన్నట్లుగా ఉంది. ఆయన అకస్మాత్తుగా నిలబడి ‘‘బాబూ ఇలారా’’ అని ఇంట్లోకి కేకేశాడు. కథల్లోలాగా ఆయన అనుభవం ఇంత విచిత్రంగా ఉండటం నాకు గమ్మత్తుగా అనిపించింది. ‘తర్వాత ఏమైంది? అంతటి భయానకమైన పరిస్థితుల్లో ఆ పసివాడు ఎలా బతికాడు?’ ఇలా అనేక రకాల ఆలోచనలు నా మెదడులో తిరుగుతున్నాయి. లోపలి నుండి ఓ చిన్న కుర్రాడొచ్చాడు. ముద్దుగా బొద్దుగా ఉన్నాడు. వాడి కళ్లూ, వాడి చూపులూ చూడగానే మహాగడుసువాడేననిపించింది. వాడిలో చురుకుదనం, చలాకీతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ‘‘అయ్యా! వీడేనండి! ఆ తుపాను రాత్రి మమ్మల్నాడుకోవడానికి మా ఇంటికొచ్చిన పెద్దమనిషి’’ అని బొలబొలా నవ్వుకుంటూ కొడుకును వొళ్లో కూచోబెట్టుకున్నాడు అతను. తెలుగు అనువాదం: దేవరాజు మహారాజు - ఆర్.కె.నారాయణ్ -
తుపాను నుంచి రక్షణకు సాఫ్ట్వేర్
- ముందుకు వచ్చిన ఐబీఎం బృందం - సీఎస్ఆర్ నిధులతో అధునాతన విధానం రూపకల్పన - జిల్లా అధికారులతో సమావేశమైన సంస్థ సభ్యులు సాక్షి, విశాఖపట్నం: తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనడంలో సహకారమందించేందుకు సాఫ్ట్వేర్ దిగ్గజం ఐబీఎం ముందుకొచ్చింది. విపత్తుల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రణాళికను, అవసరమైన సాప్ట్‌వేర్‌ను కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఈ సంస్థ రూపొందించి ఇవ్వనుంది. హుద్‌హుద్ అనంతరం జిల్లా కలెక్టర్ యువరాజ్ తుఫాన్లు ఎదుర్కొనేందుకు సమాచార వ్యవస్థల రూపకల్పనలో సహకరించాల్సిందిగా ఐబీఎంకు లేఖ రాశారు. దీనికి స్పందించిన ఈ సంస్థ సహకరించేందుకు ముందుకొచ్చింది. సీఎస్ఆర్ వ్యవహారాల విభాగం అధిపతి మమతా శర్మ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్రతినిధి బృందం బుధవారం విశాఖ నగరాన్ని సందర్శించింది. జిల్లా అధికారులతో దీనిపై చర్చలు జరిపింది. అదనపు జాయింట్ కలె క్టర్ డి.వెంకటరెడ్డి నేతృత్వంలోని ఆ జిల్లా నగర అధికారుల బృందంతో హుద్‌హుద్ అనుభవాలు, వాటిని ఎదుర్కొన్న తీరు గురించి తెలుసుకుంది. జీవీఎంసీ ప్రజారోగ్యశాఖ ఇంజినీరింగ్, విద్యుత్ మత్స్యశాఖ, వ్యవసాయ, ఉద్యానవన శాఖాధికారులు తమ శాఖ ద్వారా తుఫాన్ సందర్భంగా చేపట్టిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఐబీఎం సీఎస్ఆర్ హెడ్ మమతా శర్మ మాట్లాడుతూ భవిష్యత్‌లో హుద్‌హుద్ లాంటి ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు విపత్తుల్లో సైతం పనిచేసేందుకు విలువైన అధునాతన సాప్ట్‌వేర్‌ను రూపొందిస్తామని చెప్పారు. అవసరమైన శాస్త్ర, సాంకేతిక సహకారాన్ని కూడా అందిస్తామన్నారు. సమీక్షలో జీవీఎంసీ తరపున అదనపు కమిషనర్ మోహనరావు, జీవీఎస్ మూర్తి, ప్రజారోగ్య విభాగం ఎస్ఈ శరత్‌బాబు, జిల్లా అగ్నిమాపకశాఖాధికారి జే.మోహనరావు, మత్స్యశాఖ జేడీ కోటేశ్వరరావు, జలవనరుల శాఖ ఎస్ఈ ఆర్.నాగేశ్వరరావు,బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ రవీంద్రకుమార్ పాల్గొన్నారు. -
పాక్‌లో తుపాను; 45 మంది మృతి
పెషావర్: వాయవ్య పాకిస్తాన్లో తుపాను, భారీ వర్షాల కారణంగా సోమవారం పెషావర్ లోయలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. 200 మంది గాయపడ్డారు. తుపాను, భీకర వర్షాల ధాటికి చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకూలాయి. ఆదివారం రాత్రి గంటకు 120కి.మీ.వేగంతో ప్రారంభమైన తుపాను ఖైబర్-పంఖ్తుంక్వా ప్రావిన్సును కుదిపేసింది. దీంతో ఒక్క పెషావర్‌లోనే 31 మంది చనిపోయారు. ఈ తుపాను దేశచరిత్రలోనే మూడో అతిపెద్ద ప్రకృతి విపత్తు అని అధికారులు చెప్పారు. -
అలజడి
https://www.youtube.com/watch?v=DY9RrScQOG4 కడలి కెరటాలు.. తీరం నుంచి అందంగానే కనిపిస్తాయి. అదే అలలపై సాగే మత్స్యకారుల బతుకు పయనం.. దినదిన గండమే. ధైర్యమనే నావను నమ్ముకుని సముద్రంపై వేటకు వెళ్లాల్సిందే. గాలానికి చేపలు చిక్కినా.. ఒడ్డుకు చేరే వరకూ టెన్షనే. వేటకు వెళ్లిన రోజు.. కడలి కల్లోలంగా మారితే.. వారి కుటుంబసభ్యులు ఒడ్డున పడ్డ చేపపిల్లల్లా అల్లాడిపోతుంటారు. సముద్రంలో తుపానుకు గల్లంతైన వారి గురించిన వార్తలు ఆ కుటుంబసభ్యుల్లో కలకలం రేపుతాయి. అదృష్టవంతులు తిరిగి తీరం చేరుకుంటారు. తుపాను తాకిడికి కొన్ని పాకలు ఖాళీ అవుతాయి. పునరావాసానికి తావు ఎక్కడా కనిపించదు.. ఇదీ వారి జీవితం. మత్స్యకారులకు సూచనలు, గల్లంతైన వారి వివరాలని వార్తలు వినడం తప్ప.. వారి జీవితాల గురించి తెలిసింది తక్కువే. మత్స్యకారుల పాట్లు, వారి కుటుంబసభ్యుల జీవితాల్లో ఆటుపోట్ల గురించి ఈ చిట్టిసినిమాలో చూపించారు దర్శకుడు సత్య. సీరియస్‌గా కాకుండా.. డ్రామటిక్‌గా చూపించే ప్రయత్నం చేశారు. కథలోకి వస్తే.. సముద్రం ఒడ్డున ఒక ప్రేమజంట.. అందమైన భవిష్యత్తును ఊహిస్తుంటుంది. అయితే అమ్మాయి అమ్మ, అమ్మమ్మ మాత్రం వీరి పెళ్లికి ఒప్పుకోరు. అమ్మాయి తండ్రి, తాత.. మత్స్యకారులు కావడం వల్లే బతికి లేరని, అలాంటి పరిస్థితి తనకు రాకూడదని సముదాయిస్తారు. అయితే ఆ అమ్మాయి మాత్రం అతడినే పెళ్లి చేసుకుంటుంది. పెళ్లయిన నాటి నుంచి.. అతను వేటకు వెళ్లిన ప్రతిసారి, సముద్రం ప్రతికూలించిన ప్రతి రాత్రి.. ఆమె భయపడుతూనే ఉంటుంది. అమ్మ చెప్పిన మాట గుర్తు చేసుకుంటూ సముద్రమంత బాధను గుండెల్లో మోసుకుంటూ బతకడం ఆమెకు అల వాటవుతుంది. మత్స్యకారుల జీవన చిత్రాన్ని అందంగా ఆవిష్కరించారు రచయిత, దర్శకుడు సత్య. మోహన్‌చంద్ సినిమాటోగ్రఫీ బాగుంది. - ఓ మధు -
విపత్త్తులను ముందే పసిగట్టగలం
టీఈడబ్ల్యూసీ సదస్సులో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రి హర్షవర్ధన్ పదేళ్ల కిందటి సునామీ బాధితులకు ఇంకా పునరావాసం అందలేదని వ్యాఖ్య టీఈడబ్ల్యూసీ సదస్సులో ప్రసంగించిన మంత్రి సాక్షి, హైదరాబాద్: సునామీ, తుపాను, భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే పసిగ ట్టే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మనకు ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. హైదరాబాద్‌లోని భారత జాతీయ మహా సముద్రాల సమాచార వ్యవస్థ (ఇన్కాయిస్) ప్రాంగణంలో ఉన్న ‘సునామీ ముందస్తు హెచ్చరికల కేంద్రం (టీఈడబ్ల్యూసీ)’ ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీ కలిగిన కేంద్రంగా పేరుగాంచిందని ఆయన చెప్పారు. ‘టీఈడబ్ల్యూసీ సాధించిన పురోగతి, భవిష్యత్ సవాళ్లు’ అనే అంశంపై శుక్రవారం ‘ఇన్కాయిస్’లో జరిగిన సదస్సులో హర్షవర్ధన్ మాట్లాడారు. ఏడేళ్ల కింద ఏర్పాటైన సునామీ హెచ్చరికల కేంద్రం దేశవ్యాప్తంగా సముద్ర తీరాల్లో 350 చోట్ల పరికరాలను ఏర్పాటు చేసుకుని, తీరప్రాంత ప్రజలకు నిత్యం ప్రమాద హెచ్చరికలను అందజేస్తోందని తెలిపారు. పదేళ్ల కింద 2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీతో దేశవ్యాప్తంగా వేలాదిమంది చనిపోయారని, తల్లిదండ్రులను కోల్పోయి ఎంతోమంది చిన్నారులు అనాథలయ్యారని ఆయన పేర్కొన్నారు. ఆ ఘటన జరిగి పదేళ్లుదాటినా గత ప్రభుత్వాలు బాధితులకు సరైన పునరావాసం కల్పించలేకపోయాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 26 శాతం మంది ప్రజలు సముద్రతీరానికి సమీపంలో నివసిస్తున్నారని, వైపరీత్యాల సమయంలో వారి ప్రాణాలను రక్షించేందుకు టీఈడబ్ల్యూసీ కేంద్రం ఎంతగానో దోహదపడుతోందని కేంద్ర మంత్రి చెప్పారు. ఈ కేంద్రం ఇచ్చిన సమాచారంతో ఇటీవలి హుద్‌హుద్ తుపాను నుంచి ఎక్కువ ప్రాణనష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోగలిగామన్నారు. హిందూ, పసిఫిక్ మహా సముద్రాల పరిధిలోని 16 దేశాలకు ఈ సునామీ హెచ్చరికల కేంద్రం సేవలందిస్తోందని హర్షవర్ధన్ చెప్పారు. వైపరీత్యాల నిర్వహణపై శిక్షణ.. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణకు స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లకు శిక్షణ ఇప్పించే యోచన చేస్తున్నామని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి వై.ఎస్.చౌదరి తెలిపారు. జపాన్ వంటి దేశాలు తమ సునామీ హెచ్చరికల కేంద్రాన్ని రూ. 1,200 కోట్లతో ఏర్పాటు చేసుకోగా... మనదేశంలో కేవలం రూ. 240 కోట్లతో ఏర్పాటైన టీఈడబ్ల్యూసీ ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా నిలిచిందని చెప్పారు. ఇతర దేశాల శాస్త్రవేత్తలతో సమాచారాన్ని పంచుకోవడం ద్వారా ఇటువంటి వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోగలమని ఆయన వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ కార్యదర్శి శైలేశ్‌నాయక్, మాజీ కార్యదర్శులు పీఎస్ గోయల్, హర్షగుప్తా, ఇన్కాయిస్ డెరైక్టర్ సతీష్ షెనాయ్ తదితరులు పాల్గొన్నారు. పోలియో సమూల నిర్మూలనకు వ్యాక్సిన్ పోలియో వ్యాధి సమూల నిర్మూలనకు, రాబోయే తరాలు దీని బారిన పడకుండా ఉండేందుకు పకడ్బందీ వ్యాక్సిన్ తయారీకి చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోది ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రణాళికలను సాకారం చేసే దిశలో పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డి) రంగంలో వివిధ ప్రాజెక్టులను రూపుదిద్దేక్రమంలో తమ శాఖ కీలకపాత్రను పోషించనున్నదని చెప్పారు. సునామీ హెచ్చరికలపై హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శుక్రవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ ఐఐసీటీ, ఐఐటీ, ఐఐఎం, తదితరాల ఆర్ అండ్ డి సెంటర్లను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. ఉత్తరాదిలో బీజేపీ బలంగా ఉన్నా, దక్షిణాదిలో ఎందుకు అంతగా పుంజుకోలేకపోతోందన్న ప్రశ్నకు ఈ రాష్ట్రాల్లో కూడా పార్టీ ఉందని, పార్టీ పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథం ఉందన్నారు. వారంతా స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటున్నారని, దీనిని పార్టీ కార్యకర్తలు బలంగా ఉపయోగించుకోవాలన్నారు. కేంద్రమంత్రికి స్వాగతం పలికిన వారిలో బీజేఎల్పీ నేత డా.కె.లక్ష్మణ్, పార్టీ నేతలు ప్రకాష్‌రెడ్డి, హనీఫ్ అలీ, ఎం. చంద్రయ్య తదితరులున్నారు. -
పెరుగుతున్న చలి
తాండూరు: కొద్ది రోజులుగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఇటీవల తుపాను నేపథ్యంలో మరింత ఎక్కువైంది. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండటంతో ‘చలిపులి’ విజృంభిస్తోంది. దీంతో జనాలు వణికిపోతున్నారు. ఉదయం వేళలో చలిగాలులతోపాటు మంచు ప్రభావం కూడా కనిపిస్తోంది. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు తటస్థంగా ఉన్నప్పటికీ ఐదురోజులుగా రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలు నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 16.5 డిగ్రీలు నమోదైంది. ఈ నెల 24వ తేదీన గరిష్టం 32.5, కనిష్టం 17.9, 25న 25.3- 21.8, 26న 22.5-19, 27న 25.2-19.2, మంగళవారం గరిష్టంగా 29 డిగ్రీలు, కనిష్టంగా 16.5 డిగ్రీలు నమోదయ్యా యని తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డా.సి.సుధాకర్ పేర్కొన్నారు. ఐదు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతుండటం వల్లే చలి పెరిగిందని తెలిపారు.