
పాక్‌లో తుపాను; 45 మంది మృతి
పెషావర్: వాయవ్య పాకిస్తాన్‌లో తుపాను, భారీ వర్షాల కారణంగా సోమవారం పెషావర్ లోయలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. 200 మంది గాయపడ్డారు. తుపాను, భీకర వర్షాల ధాటికి చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకూలాయి. ఆదివారం రాత్రి గంటకు 120కి.మీ.వేగంతో ప్రారంభమైన తుపాను ఖైబర్-పంఖ్తుంక్వా ప్రావిన్సును కుదిపేసింది. దీంతో ఒక్క పెషావర్‌లోనే 31 మంది చనిపోయారు. ఈ తుపాను దేశచరిత్రలోనే మూడో అతిపెద్ద ప్రకృతి విపత్తు అని అధికారులు చెప్పారు.