పశ్చిమ బెంగాల్‌లో తుపాను బీభత్సం.. ఐదుగురి మృతి | West Bengal: 5 dead, over 300 injured in Jalpaiguri storm - Sakshi
Sakshi News home page

పశ్చిమ బెంగాల్‌లో తుపాను బీభత్సం.. ఐదుగురి మృతి

Published Mon, Apr 1 2024 10:06 AM | Last Updated on Mon, Apr 1 2024 11:06 AM

Jalpaiguri Storm: Several Deceased And Injured - Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో తుపాను బీభత్సం సృష్టించటంతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. సుమారు 500 మందికి గాయాలు అ​య్యాయి. ఆదివారం ఈ భారీ తుపాను, వడగళ్లతో జలపాయిగురి జిల్లాలో అనేక ఇళ్లు కూలిపోయాయి. తీవ్ర తుపాను కారణంగా రోడ్లపై చెట్లు నేలకొరిగాయి. తుపాను పరిస్థితులపై సీఎం మమతా బెనర్జీ బాగ్‌దోగ్రా ప్రాం‍తంలో మీడియాతో మాట్లాడారు. తుపాను సంభవించిన ప్రాంతాల్లో బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం అందిస్తుందని సీఎం తెలిపారు.  

జిల్లా ఉన్నతాధికారులు బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తారని తెలిపారు. బాధితులకు వైద్యసిబ్బంది చికిత్స అందిస్తోందని సీఎం మమతా బెనర్జీ అన్నారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న చోట అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జలపాయిగురితో పాటు పక్కనే ఉన్న అలియుపుర్‌దువార్ కూచ్ బెహార్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తుపాను, వడగళ్ల ప్రభావం స్వల్పంగా చూపిందని కానీ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement