Jalpaiguri
-
బీజేపీకి 200 సీట్లు కూడా రావు
జల్పాయ్గురి: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కనీసం 200 సీట్లు కూడా రావని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఇస్తున్న గ్యారంటీలన్నీ బూటకమని కొట్టిపారేశారు. శనివారం జల్పాయ్గురిలో ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని మండిపడ్డారు. దేశాన్ని అమ్మేసే కుట్రలు సాగించారన్నారు. ప్రధాని మోదీ చెబుతున్న కల్ల»ొల్లి మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. ఆయన ఇస్తున్న గ్యారంటీల వలలో పడొద్దని సూచించారు. బెంగాల్లో 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 200కుపైగా సీట్లు గెలుచుకుంటామని బీజేపీ నేతలు గొప్పలు చెప్పారని, చివరకు 70 సీట్లే వచ్చాయని గుర్తుచేశారు. -
పశ్చిమ బెంగాల్లో తుపాను బీభత్సం.. ఐదుగురి మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో తుపాను బీభత్సం సృష్టించటంతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. సుమారు 500 మందికి గాయాలు అయ్యాయి. ఆదివారం ఈ భారీ తుపాను, వడగళ్లతో జలపాయిగురి జిల్లాలో అనేక ఇళ్లు కూలిపోయాయి. తీవ్ర తుపాను కారణంగా రోడ్లపై చెట్లు నేలకొరిగాయి. తుపాను పరిస్థితులపై సీఎం మమతా బెనర్జీ బాగ్దోగ్రా ప్రాంతంలో మీడియాతో మాట్లాడారు. తుపాను సంభవించిన ప్రాంతాల్లో బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం అందిస్తుందని సీఎం తెలిపారు. Several homes damaged, trees uprooted due to storm in West Bengal's Jalpaiguri pic.twitter.com/3wBeikxOHJ — NDTV (@ndtv) March 31, 2024 జిల్లా ఉన్నతాధికారులు బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తారని తెలిపారు. బాధితులకు వైద్యసిబ్బంది చికిత్స అందిస్తోందని సీఎం మమతా బెనర్జీ అన్నారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న చోట అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. జలపాయిగురితో పాటు పక్కనే ఉన్న అలియుపుర్‌దువార్ కూచ్ బెహార్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తుపాను, వడగళ్ల ప్రభావం స్వల్పంగా చూపిందని కానీ, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. Sad to know that sudden heavy rainfall and stormy winds brought disasters today afternoon in some Jalpaiguri-Mainaguri areas, with loss of human lives, injuries, house damages, uprooting of trees and electricity poles etc. District and block administration, police, DMG and QRT… — Mamata Banerjee (@MamataOfficial) March 31, 2024 -
జల్పాయ్ గురి జిల్లాలో విషాదం
-
జల్పాయ్గురిలో ప్రధాని మోదీకి అరుదైన స్వాగతం
-
యువతి ఫిర్యాదుతో వెలుగులోకి ‘మోమో ఛాలెంజ్’
కోల్‌కతా: సోషల్ మీడియాలో మరో ప్రాణాంతక ఛాలెంజ్ హల్చల్ చేస్తోంది. బ్లూ వేల్ తరహాలోనే ఈ ఛాలెంజ్ కూడా పలు దేశాలకు తలనొప్పిగా మారింది. గత వారం అర్జెంటీనాకు చెందిన 12 ఏళ్ల బాలిక మోమో ఛాలెంజ్ కారణంగానే ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. తాజాగా భారత్‌లో కూడా మోమో ఛాలెంజ్ ఆనవాళ్లు బయటపడ్డాయి. పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురికి చెందిన కాలేజ్ విద్యార్థిని ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ యువతి వాట్సప్‌కు మోమో ఛాలెంజ్‌కు సంబంధించి సందేశం రావడంతో ఆమె మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. తనకు ఓ గుర్తు తెలియని నంబరు నుంచి మోమో ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా సందేశం వచ్చిందని ఆమె తెలిపారు. దీంతో ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నించగా వారు తనతో మాట్లాడారని ఆమె పేర్కొన్నారు. దీంతో భయపడి ఈ విషయం తన అన్నకు తెలుపగా.. ఆయన హెచ్చరికలతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మోమో ఛాలెంజ్: గతేడాది ప్రపంచవ్యాప్తంగా వందల మంది ప్రాణాలు బలిగొన్న బ్లూ వేల్ తరహాలోనే మోమో ఛాలెంజ్ ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా పిల్లలను లక్ష్యంగా చేసుకుని వారిచేత ప్రాణాంతక టాస్క్‌లు చేయించడం ఈ గేమ్ ఉద్దేశం. ఈ ఛాలెంజ్ తొలుత ఫేస్బుక్లో ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. గుర్తు తెలియని నంబర్ నుంచి సోషల్ మీడియా ఉపయోగించే యువతను సంప్రదిస్తారు. ఒకసారి మోమో ఛాలెంజ్ స్వీకరించాక వారి చేత పలు ప్రాణాంతక టాస్కులు చేయిస్తారు. చివరి దశ ఆత్మహత్యకు పాల్పడటంతో ముగుస్తుంది. ఆ విధంగా ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్న వారిని ప్రేరేపిస్తారు. ఒకవేళ టాస్క్‌లను వ్యతిరేకిస్తే వారికి భయంకరమైన వీడియోలు, చిత్రాలు పంపుతు బెదిరింపులకు దిగుతారు. ఈ ఛాలెంజ్ విసురుతున్న కొన్ని నంబర్లను గుర్తించినప్పటికీ దీని వెనుక ఎవరు ఉన్నారు, ఎక్కడి నుంచి నిర్వహిస్తున్నారనే విషయాలు తెలియరాలేదు. సదురు నంబర్లు మాత్రం జపాన్, మెక్సికో, కొలంబియాల నుంచి ఆపరేట్ అవుతున్నట్టుగా గుర్తించారు. ఈ ఛాలెంజ్ కోసం ఒక బోమ్మ చిత్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ బొమ్మకు పెద్ద కళ్లు, వెడల్పు నోరు కలిగి ఉంటుంది. వాస్తవంగా ఈ చిత్రాన్ని జపాన్‌కు చెందిన ఓ కంపెనీ రూపొందించింది. జపాన్ ఆర్టిస్ట్ మిడోరి హయాషి దీనిని సృష్టించినప్పటికీ అతనికి ఈ గేమ్‌తో ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ గేమ్ ద్వారా వ్యక్తిగత డేటాను దొంగిలించి ఆ తర్వాత బెదిరింపులకు దిగుతారని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే వారి చర్యలను పర్యవేక్షిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. ఇటీవల వచ్చిన కికి ఛాలెంజ్ ద్వారా కూడా పలువురు ప్రమాదానికి గురయిన సంగతి తెలిసిందే. -
జల్పాయిగురిలో బాంబు పేలుడు: ఆరుగురికి గాయాలు
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జల్పాయిగురి జిల్లాలో బొరొవిశ చౌపాటి వద్ద ఈ రోజు ఉదయం బస్సులో పేలుడు సంభవించి ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని జిల్లా ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. గాయపడిన వారందరిని అలీపుర్ధర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అయితే వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. భారత్‌లోని అసోం నుంచి భూటాన్‌లోని పున్సిలింగ్ ప్రాంతానికి ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు చౌపాటి వద్ద పేలిందని తెలిపారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ప్రయాణీకులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని అధికారులు తెలిపారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పిందన్నారు. బస్సులో బాంబును ఆగంతకులు ఎవరికి కనబడకకుండా ఉంచారని చెప్పారు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.