
పశ్చిమ బెంగాల్ సీఎం మమత
జల్పాయ్‌గురి: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కనీసం 200 సీట్లు కూడా రావని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఇస్తున్న గ్యారంటీలన్నీ బూటకమని కొట్టిపారేశారు. శనివారం జల్పాయ్‌గురిలో ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు.
అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని మండిపడ్డారు. దేశాన్ని అమ్మేసే కుట్రలు సాగించారన్నారు. ప్రధాని మోదీ చెబుతున్న కల్ల»ొల్లి మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. ఆయన ఇస్తున్న గ్యారంటీల వలలో పడొద్దని సూచించారు. బెంగాల్‌లో 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 200కుపైగా సీట్లు గెలుచుకుంటామని బీజేపీ నేతలు గొప్పలు చెప్పారని, చివరకు 70 సీట్లే వచ్చాయని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment