కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలకు ఎవరూ ఓటు వేయొద్దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ముఖ్యంగా టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఆయా పార్టీలకు ఎట్టిపరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా వేయద్దని తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ఉద్యోగాలు రద్దైన టీచర్లకు ఓ సందేశాన్ని పంపారు. హైకోర్టు తీర్పు అనంతరం తొలిసారి సీఎం మమతా స్పందించారు. ‘బీజేపీ హైకోర్టు కోర్టును కోనుగోలు చేసింది. సుప్రీం కోర్టును కాదు. నాకు ఇప్పటికే సుప్రీం కోర్టు న్యాయం లభిస్తుందని ఆశిస్తున్నా. బీజేపీ హైకోర్టును, సీబీఐ, ఎన్‌ఐఏ, బీఎస్‌ఎఫ్, సీఏపీఎస్ వంటి ప్రభుత్వం సంస్థలను కొనుగోలు చేసింది. దూరదర్శన్ ఛానెల్ కలర్ మార్చింది. ఛానెల్ వాళ్లు కేవలం బీజేపీ, మోదీ గుర్చించి మాత్రమే ప్రసారాలు చేస్తారు. దూరదర్శన్ ఛానెల్ చూడకండి. ఆ ఛానెల్‌ను బాయ్‌కాట్ చేయండి’ అని తీవ్ర ఆరోపణలు చేశారు.
మరోవైపు.. టీచర్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు.. బెంగాల్ లోక్‌సభ ఎన్నికల్లో కీలకంగా మారనుంది. ఇక.. 2019లో మొత్తం 42 స్థానాల్లో 18 సీట్లను గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక.. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీచర్లు తీవ్ర నిరసన తెలిపారు. అవినీతికి పాల్పడిన కొంతమంది వల్ల వేలాది మంది అమాయక ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన చేశారు.
2016 నాటి స్టేట్ లెవల్ సెలెక్షన్ టెస్ట్ (SLST) చట్టబద్ధం కాదని జస్టిస్ దేబాంగ్సు బాసక్, జస్టిస్ ఎండీ షబ్బార్ రషీదిలతో కూడిన బెంచ్ ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఎస్ఎల్ఎస్టీ 2016 ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలన్నింటినీ రద్దు చేయాలని, దీని కింద ఉద్యోగాలు పొందిన టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది తాము తీసుకున్న జీతాలను 4 వారాల్లో వడ్డీతో సహా తిరిగిచ్చేయాలని కూడా కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే.
ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో 9 నుంచి 12 వ తరగతులకు ఉపాధ్యాయులు, గ్రూప్ సీ, గ్రూప్ డీ ఉద్యోగాల భర్తీకి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2016లో ఎస్ఎల్ఎస్టీ ద్వారా నియామక పరీక్ష నిర్వహించింది. అయితే ఈ పరీక్షలో అవకతవకాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment