‘ఓటమి అంగీకరిస్తున్నా.. ముందుంది మరింత కష్ట కాలం’ | Adhir Chowdhury Says Hard Times Ahead After Losing Baharampur | Sakshi
Sakshi News home page

‘ఓటమి అంగీకరిస్తున్నా.. ముందుంది మరింత కష్ట కాలం’

Published Thu, Jun 6 2024 3:41 PM | Last Updated on Thu, Jun 6 2024 4:08 PM

Adhir Chowdhury Says Hard Times Ahead After Losing Baharampur

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ పీసీసీ చీఫ్‌ అధీర్‌ రంజన్‌ చౌదరీ లోక్‌సభ ఎన్నికల్లో బహరంపూర్‌ పార్లమెంట్‌ స్థానంలో ఓడియారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి యూసుఫ్‌ పఠాన్‌ చేతిలో 85000 ఓట్ల తేడాతో అధీర్‌ పరాజయం పాలయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్తు ఎలా  ఉండనుందో చెప్పలేనని తెలిపారు.

‘‘ రానున్న రోజులు చాలా కఠినమైనవి. బెంగాల్‌లో నేను టీఎంసీ ప్రభుత్వంపై పట్టుదలతో పోరాటం చేశాను. నా ఆదాయ మార్గాలను సైతం నిర్లక్ష్యం చేశాను. నాకు రాజకియాలు తప్పు మరో స్కిల్‌ తెలియదు. అయితే నేను చాలా కష్టాలు పాలుకానున్నాను. వాటిని ఎలా ఎదుర్కొవాలో కూడా నాకు తెలియటం లేదు. తర్వలో ఢిల్లీలోని ఎంపీ అధికార నివాసాన్ని ఖాళీ చేస్తాను. నాకు కూతురు చదువుకోడానికి ఈ నివాసాన్ని కొన్ని రోజులు ఉపయోగించుకునేది. త్వరలో నేను మరో ప్రాంతంలో నివాసం చూసుకుంటాను. 

.. లోక్‌ సభ ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమి చేరటాన్ని నేను వ్యతిరేకించటం లేదు. బహరంపూర్‌లో నా ఒటమి అంగీకరిస్తున్నా. గతంలోనే పీసీసీ విషయంలో నా కంటే సమర్థవంతమైన నేతను ఎన్నుకోవాలని పార్టీ నేతలను కోరారు. అయితే సోనియా గాంధీ కోరిక మేరకు నేను ఈ పదవిలో ఉండాల్సి వచ్చింది. మా నాయకుల నుంచి నాకు ఎటువంటి పిలుపురాలేదు. నాకు  అధిష్టానం నుంచి పిలుపురాగానే నేను నా వైఖరినీ పార్టీ నేతలకు తెలియజేస్తాం. 

.. రాహుల్‌ భారత్‌ జోడో  యాత్ర ముర్షిదాబాద్‌ నుంచి వెళ్లింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాల్దా సెగ్మెంట్‌కు ప్రచారానికి వచ్చారు. నా సెగ్మెంట్‌  ఎవరూ ప్రచారనికి రాలేదు. దీనిపై నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయను’’  అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కంచుకోట స్థానం బహరంపూర్‌. అయితే ఈ స్థానాన్ని కాంగ్రెస్ కోల్పోయినా.. మాల్దా దక్షిణ్‌లో గెలుపొంది. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ గెలుపొందిన సీటు మాల్దా దక్షిణ్‌ సెగ్మెంట్‌. ఇక్కడ టీఎంసీ 29 సీట్లు, బీజేపీ 12 సీట్లు గెలుచుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement