adhir ranjan chaudhury
-
కూటమిలో కీలకమైనా.. దీదీపై కాంగ్రెస్ నేత విమర్శలు
కోల్‌కతా: నీతి ఆయోగ్ సమావేశంలో తన మైక్‌ను ఆఫ్ చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు అబద్దమని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరీ ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.‘‘నీతి ఆయోగ్ సమావేశం గురించి సీఎం మమత చెసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం. ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులను మాట్లాడనివ్వకుండా అడ్డుకుంటారని మమత చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. సీఎంలను మాట్లాన్వికుండా చేస్తారని నేను నమ్మటం లేదు. మమత బెనర్జీకి అక్కడ ఏం జరుగుతుందో ముందే తెలుసు. ఆమె పక్కా స్క్రిప్ట్ ప్రకారమే నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లారు’’ అని అన్నారు. మరోవైపు.. సీఎం మమత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించి.. నీతి ఆయోగ్ సమావేశంలో ఆమె పట్ల ప్రవర్తించిన తీరును తీవ్రంగా తప్పుపట్టింది. అయితే కాంగ్రెస్ స్పందనకు భిన్నంగా అధీర్ రంజన్ చౌదరీ విమర్శలు చేయటం గమనార్హం.దీనికంటే ముందు పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రలు క్షీణిస్తూ.. అరాచక పరిస్థితులు కొనసాగుతున్నాయని అధీర్ రంజన్ చౌదరీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్ శాంతి భద్రతల పునరుద్ధరించడానికి జోక్యం చేసుకోసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. కాగా, శనివారం ప్రధానిమోదీ అధ్యక్షత జరిగిన నీతి ఆయోగ్ సమాశానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరయ్యారు. అనంతరం తానను మాట్లాడనివ్వకుండా మైక్ ఆఫ్ చేశారని ఆమె ఆరోపలు చేశారు. తర్వాత ఆమె నీతి ఆయోగ్ భేటీ నుంచి వాకౌట్ చేశారు. మరోపైపు.. లోక్‌సభ ఎన్నికల్లో అధీర్ రంజన్ చౌదరీ టీఎంసీ అభ్యర్థి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ చేతిలో ఓడిపోయారు. సీఎం మమత ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ అధీర్ రంజన్ ఆమెపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. -
వయనాడ్‌లో ప్రియాంకా గాంధీ తరఫున సీఎం మమత ప్రచారం!
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ వదలుకున్న వయనాడ్ లోక్‌సభ స్థానంలో.. ఉపఎన్నికలో భాగంగా ప్రియాంకా గాంధీ వాద్రా పోటీ చేస్తారని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రియాంకా గాంధీకి ఇదే మొదటి లోక్‌సభ ఎన్నిక కావటం గమనార్హం. అయితే ప్రియాంకా గాంధీ బరిలోకి దిగే వయనాడ్‌లో టీఎంసీ సుప్రీం నేత, సీఎం మమత ప్రచారం చేయనున్నట్లు కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది.లోక్‌సభ ఎన్నికలకు ముందు పొత్తు, సీట్ల పంపకం విషయాల్లో బెంగాల్ కాంగ్రెస్ చీఫ్‌గా ఉన్న అధీర్ రంజన్ చౌధరీకి మమతా బెనర్జీ మధ్య విభేదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ పేలవ ప్రదర్శనకు బాధ్యతగా బెంగాల్ పీసీసీ చీఫ్ పదవికి శుక్రవారం అధీర్ రంజన్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల అంతర్గత సమావేశాల్లో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక.. మమతా బెనర్జీకి తనకు వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవని, కేవలం రాజకీయంగా మాత్రమే తాను విభేదించినట్లు చూడాలని అధీర్ రంజన్ స్పష్టం చేశారు.కాగా, బెంగాల్లో సీఎం మమతను విభేదించే అధీర్ రంజన్ రాజీనామా చేయటంతో దీదీ.. ప్రియాంకా గాంధీ ప్రచారానికి సిద్ధమైనట్లు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ఇరు పార్టీల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు. ఇక.. లోక్‌సభలో ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన టీఎంసీ మొత్తం 42 స్థానాలకు గాను 29 సీట్లును గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటుకే పరిమితమైంది. ఐదుసార్లు ఎంపీగా గెలిచిన అధీర్ రంజన్ సైతం ఈసారి టీఎంసీ అభ్యర్థి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈసారీ కాంగ్రెస్.. లెఫ్ట్ పార్టీలతో కలసి బరిలోకి దిగినప్పటికీ ఆశించిన ఫలితాలు రాబట్టుకోలేకపోయింది. -
‘ఓటమి అంగీకరిస్తున్నా.. ముందుంది మరింత కష్ట కాలం’
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ పీసీసీ చీఫ్ అధీర్ రంజన్ చౌదరీ లోక్‌సభ ఎన్నికల్లో బహరంపూర్ పార్లమెంట్ స్థానంలో ఓడియారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యూసుఫ్ పఠాన్ చేతిలో 85000 ఓట్ల తేడాతో అధీర్ పరాజయం పాలయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండనుందో చెప్పలేనని తెలిపారు.‘‘ రానున్న రోజులు చాలా కఠినమైనవి. బెంగాల్లో నేను టీఎంసీ ప్రభుత్వంపై పట్టుదలతో పోరాటం చేశాను. నా ఆదాయ మార్గాలను సైతం నిర్లక్ష్యం చేశాను. నాకు రాజకియాలు తప్పు మరో స్కిల్ తెలియదు. అయితే నేను చాలా కష్టాలు పాలుకానున్నాను. వాటిని ఎలా ఎదుర్కొవాలో కూడా నాకు తెలియటం లేదు. తర్వలో ఢిల్లీలోని ఎంపీ అధికార నివాసాన్ని ఖాళీ చేస్తాను. నాకు కూతురు చదువుకోడానికి ఈ నివాసాన్ని కొన్ని రోజులు ఉపయోగించుకునేది. త్వరలో నేను మరో ప్రాంతంలో నివాసం చూసుకుంటాను. .. లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం సీఎం మమతా బెనర్జీ ఇండియా కూటమి చేరటాన్ని నేను వ్యతిరేకించటం లేదు. బహరంపూర్‌లో నా ఒటమి అంగీకరిస్తున్నా. గతంలోనే పీసీసీ విషయంలో నా కంటే సమర్థవంతమైన నేతను ఎన్నుకోవాలని పార్టీ నేతలను కోరారు. అయితే సోనియా గాంధీ కోరిక మేరకు నేను ఈ పదవిలో ఉండాల్సి వచ్చింది. మా నాయకుల నుంచి నాకు ఎటువంటి పిలుపురాలేదు. నాకు అధిష్టానం నుంచి పిలుపురాగానే నేను నా వైఖరినీ పార్టీ నేతలకు తెలియజేస్తాం. .. రాహుల్ భారత్ జోడో యాత్ర ముర్షిదాబాద్ నుంచి వెళ్లింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాల్దా సెగ్మెంట్‌కు ప్రచారానికి వచ్చారు. నా సెగ్మెంట్ ఎవరూ ప్రచారనికి రాలేదు. దీనిపై నేను ఎటువంటి వ్యాఖ్యలు చేయను’’ అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోట స్థానం బహరంపూర్. అయితే ఈ స్థానాన్ని కాంగ్రెస్ కోల్పోయినా.. మాల్దా దక్షిణ్‌లో గెలుపొంది. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ గెలుపొందిన సీటు మాల్దా దక్షిణ్ సెగ్మెంట్. ఇక్కడ టీఎంసీ 29 సీట్లు, బీజేపీ 12 సీట్లు గెలుచుకుంది. -
చీప్ ఎలక్షన్ కమిషన్‌కు అధీర్ చౌదరి లేఖ
సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్, బహరంపూర్ లోక్‌సభ అభ్యర్థి 'అధీర్ రంజన్ చౌదరి' ప్రధాన ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్‌కు రెండు పేజీల లేఖ రాశారు.చౌదరి రాసిన లేఖలో బహరంపూర్‌లోని పోలీసు అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఉద్దేశ్యపూరితంగానే వారు కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందిపెడుతున్నట్లు వెల్లడించారు. వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.పోలీసులు తీసుకుంటున్న చర్యలు పార్టీ కార్యకర్తలను నిరుత్సాహపరుస్తాయని అన్నారు. నా ఎన్నికల ప్రచారానికి ఆటంకం కలిగించడానికి ఇది ప్రణాళిక అని కూడా అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం న్యాయం కాదని పేర్కొన్నారు. తన కార్యకర్తలను మాత్రమే కాకుండా సన్నిహితులను కూడా పోలీసు అధికారులు వేధిస్తున్నారని అన్నారు.'అధీర్ రంజన్ చౌదరి' కంచుకోట అయిన బహరంపూర్ నియోజకవర్గం నుంచి మళ్ళీ బలిలోకి దిగారు. ఈయనకు ప్రత్యర్థిగా టీఎంసీ 'యూసఫ్ పఠాన్'ను ఎంపిక చేసింది. దీంతో ఇప్పటికే బహరంపూర్ నుంచి ఐదుసార్లు గెలిచిన చౌదరితో.. యూసఫ్ పఠాన్ తలపడనున్నారు. -
‘మోదీ కలత చెందొద్దని.. భయపడ్డ మమతా’ టీఎంసీపై కాంగ్రెస్ విమర్శలు
కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీ మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గతంలో ఇండియా కూటమి నుంచి వైదొలిగిన టీఎంసీ.. బెంగాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో టీఎంసీతో పొత్తు.. సీట్ల సర్దుబాటుపై ఆశలు పెట్టుకుంది. ఒంటరిగా పోటీచేస్తామని అన్నట్లుగానే.. తాజాగా మొత్తం అభ్యర్థుల జాబితాను టీఎంసీ విడుదల చేయటం గమనార్హం. టీఎంసీ అభ్యర్థులు ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ.. బీజేపీతో పోరాడాలని ఎప్పటినుంచో భావిస్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ టీఎంసీకి కౌంటర్ వేశారు. ‘పశ్చిమబెంగాల్లో టీఎంసీతో గౌరవప్రదమైన సీట్ల భాగస్వామ్య ఒప్పందం కలిగి ఉండాలని కాంగ్రెస్ పార్టీ పదేపదే ప్రకటిస్తూ వచ్చింది. అటువంటి ఒప్పందాన్ని చర్చల ద్వారానే ఖరారు చేయాలని.. ఏకపక్ష ప్రకటనల ద్వారా కాదని కాంగ్రెస్ ఎప్పుడూ చెబుతోంది. కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఇండియా కూటమిగి బీజేపీపై పోరాడాలని భావిస్తోంది’ అని జైరాం రమేష్ అన్నారు. The Indian National Congress has repeatedly declared its desire to have a respectable seat-sharing agreement with the TMC in West Bengal. The Indian National Congress has always maintained that such an agreement has to be finalised through negotiations and not by unilateral… — Jairam Ramesh (@Jairam_Ramesh) March 10, 2024 పీఎంవోకు సమాచారం... టీఎంసీ ఎంపీ అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి విమర్శలు గుప్పించారు. ‘భారతదేశంలో ఆమె వంటి ఓ నేతను నమ్మవద్దని సీఎం మమతా బెనర్జీ ఈ రోజు నిరూపించారు. మమతా బెనర్జీ భయపడుతోంది. ఎందుకంటే ఇండియా కూటమిలో ఉంటే ప్రధాని మోదీ బాధపడతారు. ఆమె ఇండియా కూటమి నుంచి వైదొలిగిన సమయంలో పీఎంఓకు సమచారం ఇచ్చారు. తన(మమతా) వల్ల మోదీ బాధపడకూడదని.. బీజేపీ వ్యతిరేక కూటమిలో ఉండి పోరాటం చేయవద్దని ఆమె ఈ నిర్ణయం తీసుకుంది’ అని అధిర్ రంజన్ ఆరోపణలు చేశారు. ఇక.. టీఎంసీ 9మంది సిట్టింగ్ ఎంపీలను పక్కనపెట్టడం గమనార్హం. అదే విధంగా ఎంపీ అభ్యర్థులుగా ఏడుగురు కొత్తవారికి అవకాశం కల్పించారు. ఇక.. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ ప్రాతినిధ్యం వహిసస్తున్న బహరాంపూర్ సెగ్మెంట్లో మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ను బరిలోకి దించింది టీఎంసీ. ఇక్కడ అధిర్ రంజన్ ఐదు సార్లు విజయం సాధించారు. ఇండియా కూటమిలో భాగంగా పశ్చిమ బెంగాల్ సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ మూడు సిట్లను డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సిట్ల సర్దుబాటు సరిగా లేదని మమతా బెనర్జీ తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించటం గమనార్హం. చదవండి: అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ.. బరిలో మాజీ క్రికెటర్ -
‘బీజేపీకి మమతా బెనర్జీ భయపడుతున్నారు’
టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలకు బెంగాల్ రాష్ట పీసీసీ చీఫ్, ఎంపీ అధీర్ రంజన్ చౌధరీ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్‌కు పార్లమెంట్లో ఎన్నికల్లో కనీసం 40 సీట్లు కూడా వసస్తాయో? రావో? అనుమానమని చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. ‘బీజేపీ, మమతా బెనర్జీకి కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించడం ఇష్టం లేదు. ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీ టీఎంసీకి అధినేత్రి అయి ఉండి ఇలా ఉండటం దురదృష్టకరం. మమతా బెనర్జీ తనకు తానుగా ప్రతిపక్ష ఇండియా కూటమిలో చేరారు. మమతా బీజేపీకి భయడుతోంది. మరీ ఎందుకు ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నారు’ అని అధీర్ రంజన్ మండిపడ్డారు. ‘కాంగ్రెస్ పార్టీ ఖతం అవుతుంది. కాంగ్రెస్‌తో ఏం కాదని బీజేపీ అంటోంది. మమతా బెనర్జీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లు గెలవటం అనుమానం అంటున్నారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకియాలు చేస్తోందని బీజేపీ, మోదీ అంటున్నారు. మమతా కూడా అవే మాటాలు వ్యాఖ్యాస్తున్నారు’అని దుయ్యబట్టారు. బీజేపీ, మమతా ఎందుకు ఒకే రాగం పడుతున్నారో? చెప్పాలని నిలదీశారు. మమతాకు ఎప్పుడూ రాష్ట్రం తరువాతేనని విమర్శించారు. కానీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ముందు దేశం ప్రాధాన్యత అని.. ఆ తర్వాతే ఏదైనా అని తెలిపారు. చదవండి: కాంగ్రెస్‌కు మమతా బెనర్జీ సవాల్.. అక్కడ గెలిచే దమ్ముందా! -
‘రాహుల్ యాత్రకు బెంగాల్లో కూడా అడ్డంకులు’
కోల్‌కతా: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’కు సంబంధించిన మీటింగ్‌లకు పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(TMC) ప్రభుత్వం అనుమతి ఇవ్వటంలేదని రాష్ట్ర కాంగెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి మండిపడ్డారు. ‘కొన్నిచోట్ల ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ కావాలని రోడ్డు అడ్డగింపు వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. బహిరంగ సమావేశాలకు కొన్ని ప్రాంతాల్లో అనుమతి లభించటం లేదు. అస్సాంతో సహా.. ఈశాన్య భారతంలో ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ పలు సమస్యలను ఎదుర్కొటోంది. ప్రస్తుతం టీఎంసీ ప్రభుత్వం ఉన్న పశ్చిమ బెంగాల్లో కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాం’ అని బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి అన్నారు. అయితే తాము పశ్చిమ బెంగాల్ కొన్ని చోట్ల రాహుల్ యాత్రకు మినహాయింపులు లభిస్తాయని భావిస్తున్నామని తెలిపారు. అయితే అధికార యంత్రాంగం మాత్రం అనుమతి ఇవ్వటం లేదని విమర్శించారు. అధీర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలను టీఎంసీ ఎంపీ శంతను సేన్ తీవ్రంగా ఖండించారు. పశ్చిమ బెంగాల్‌లోని అధికార యంత్రాంగం రాజకీయ ప్రలోభాలకు లోనుకాకుండా వ్యవహరిస్తోందని కౌంటర్ ఇచ్చారు. ‘బెంగాల్లో ‘ఇండియా కూటమి’ ఉనికి కోల్పోవటానికి అధీర్ రంజన్ బాధ్యత వహించాలి. అన్ని ప్రతిపక్ష పార్టీలు బెంగాల్లో సమావేశాలు నిర్వహించుకున్నా..ఎవరికీ ఇబ్బందులు కలగవు. విద్యార్థుల పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వం యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది’ అని శంతను సేన్ అన్నారు. ఇక.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేయటానికి కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ కారణమని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అధీర్ రంజన్.. బీజేపీ వారిలా మాట్లాడేవారని మండిపడ్డారు. రాహుల్ యాత్ర గురువారం అస్సాం నుంచి బెంగాల్‌లోని కూచ్‌బెహర్ జిల్లాలోకి ప్రవేశించింది. అక్కడి కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అయితే రోడ్డు షోలో పాల్గొన్న అనంతరం ఆయన మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం, శనివారం ఆయన తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక.. 28వ తేదీన మళ్లీ యాత్ర ప్రారంభంకానుంది. మరుసటి రోజు రాహుల్ యాత్ర బిహార్‌లో ప్రవేశించనుంది. అటుపై 31న పశ్చిమ బెంగాల్లోకి వెళ్లనుంది. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాహుల్.. పశ్చిమ బెంగాల్ వెళ్లటం ఇదే తొలిసారి. అందుకే రాహుల్ యాత్రపై టీఎంసీ అడ్డంకులు సృష్టించనుందని అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చదవండి: ‘ఇండియా కూటమిలో ఉంటే నితీష్ కుమారే ప్రధాని!’ -
రాయని డైరీ.. అధీర్ రంజన్
‘‘ఆవిడ అహంకారం గమనించారా ఖర్గేజీ?! అందుకే ఆవిడకు నేను జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదు...’’ అన్నాను ఖర్గేజీతో. ఆ మాటకు ఖర్గేజీ నవ్వారు! ‘‘ఆవిడకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదన్న స్పృహ మీలో ఇప్పటికీ ఉందంటే అందరికన్నా ముందు మీరే ఆవిడకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినట్లు రంజన్‌జీ. ఆవిడ పుట్టిన రోజు వచ్చి పోయి కూడా ఇరవై నాలుగు గంటలు అవడం లేదా...’’ అన్నారు. ఆయన వైపు దిగాలుగా చూశాను. ‘‘రంజన్‌జీ... ఆవిడ ఆల్రెడీ ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోయారు కనుక పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన మీరు గానీ, ఆలిండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన నేను గానీ, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్‌కు ఉన్న ఇద్దరంటే ఇద్దరే లోక్‌సభ ఎంపీలలో ఒకరైన మన అబూ హసేమ్ ఖాన్ సాబ్ గానీ ఆవిడకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం, చెప్పకపోవడం అన్నవి ఆవిడ పట్టించుకునేంత ప్రాముఖ్యం ఉన్న విషయాలైతే కావు. మనకే ఆ పట్టింపు..’’ అన్నారు ఖర్గేజీ... అదే నవ్వుతో! ‘‘ఆవిడ అంటే మమతాజీనే కదా...’’ అన్నారు ఖాన్ సాబ్. ‘‘ఆ.. ఆవిడే..’’ అన్నాను. ఖాన్ సాబ్, నేను, ఖర్గేజీ... ముగ్గురం ఢిల్లీ ఆఫీస్‌లో ఉన్నాం. వచ్చే ఎన్నికల సీట్ షేరింగ్‌లో మాల్దా సౌత్, బెర్హంపూర్.. ఈ రెండూ కాంగ్రెస్‌కు ఇస్తాం అంటున్నారు మమత! మాల్దాకు ఖాన్ సాబ్, బెర్హంపూర్‌కి నేను సిట్టింగ్ ఎంపీలం. ‘‘మన సీట్లు మనకు ఇవ్వడం సీట్ షేరింగ్ ఎలా అవుతుంది ఖర్గేజీ... అహంకారం అవుతుంది కానీ..’’ అన్నాను, ఢిల్లీ పార్టీ ఆఫీస్ మెట్లెక్కి పైకి వెళ్లగానే. వెంటనే ఆయనేమీ మాట్లాడలేదు. ‘‘ముందు అలా ప్రశాంతంగా కూర్చోండి రంజన్‌జీ...’’అన్నారు! ‘‘అసలు కూటమి నుంచే బయటికి వచ్చేద్దాం ఖర్గేజీ. కాంగ్రెస్‌కి ఏం తక్కువైంది. తృణమూల్‌కి ఏం ఎక్కువైంది?’’ అన్నాను తీవ్రమైన ఆగ్రహంతో. ఖర్గేజీ నవ్వుతూ చూశారు. ‘‘ఈ రెండు సీట్ల షేరింగ్ నాకు చికాకు తెప్పిస్తోంది ఖర్గేజీ. పైగా ఆవిడ ఏమంటున్నారో విన్నారు కదా.. బెంగాల్లో బీజేపీ సంగతి తనొక్కరే చూసుకుంటారట, మిగతా స్టేట్లన్నిటిలో మనం చూసుకోవాలట! అంటే.. బెంగాల్లో మొత్తం 42 సీట్లూ తృణమూల్‌కి వదిలేయమనే కదా! ఎక్కడి నుంచి వస్తుంది అంత అహంకారం ఖర్గేజీ!! మనం తక్కువన్న ఫీలింగా? లేక, తను ఎక్కువన్న ఫీలింగా?!’’ అన్నాను. ‘‘తను ఎక్కువన్న ఫీలింగే కావచ్చు...’’ అన్నారు ఖాన్ సాబ్! ‘‘ఎలా చెప్పగలరు?!’’ అన్నాను. ‘‘అవతలి వాళ్లను తక్కువగా చూడగలినప్పుడు మనం ఎక్కువ అనే ఫీలింగ్ కలుగుతుంది. బహుశా మమతాజీ కూడా అలా మనల్ని తక్కువగా చూడగలగడం ద్వారా తను ఎక్కువ అనే భావనను కల్పించుకుంటున్నా రేమో...’’ అన్నారు ఖాన్ సాబ్. ‘‘లోక్‌సభలో 22 సీట్లు మాత్రమే ఉన్న తృణమూల్ పార్టీ, 48 సీట్లున్న కాంగ్రెస్ పార్టీని తక్కువగా చూడగలుగుతోందంటే... కూటమిలో భాగస్వామి కనుక మన 48 సీట్లు కూడా తనవే అని తృణమూల్ అనుకుంటూ ఉండాలి. లేదా, తనసలు కూటమిలోనే లేనని అనుకుంటూ ఉండాలి...’’ అన్నాను. ఆ మాటకు పెద్దగా నవ్వారు ఖాన్ సాబ్. ఖర్గేజీ నవ్వలేదు! ‘‘మనమూ కూటమిలో లేమనే అనుకోవాలి రంజన్‌జీ. ఇప్పుడున్నది కాదు కూటమి. ఎన్నికలు జరిగి, ఫలితాలు వచ్చాక కుదిరేదే అసలైన కూటమి...’’ అన్నారు! ‘‘మరిప్పుడేం చేద్దాం ఖర్గేజీ?’’ అన్నాను. ‘‘బిలేటెడ్గానైనా ముందు మీరు మమతాజీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పండి రంజన్‌జీ... ఆవిడ పట్టించుకున్నా, పట్టించు కోకున్నా... ’’ అన్నారాయన!! -మాధవ్.. శింగరాజు -
ప్రధానిని కించపరచలేదు
న్యూఢిల్లీ: మణిపూర్ హింసపై లోక్‌సభలో మాట్లాడనందుకే నీరవ్ అనే మాటను వాడాను తప్ప, ఆయన్ను కించపరచడానికి కాదని కాంగ్రెస్ ఎంపీ ఆధిర్ రంజన్ చౌదరి చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మణిపూర్ హింసపై ప్రధానమంత్రి మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. ప్రధాని మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయే సరికి ‘నీరవ్’అనే మాటను వాడానే తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు. నీరవ్‌కు నిశ్శబ్దం అనే అర్థం ఉందన్నారు. పార్లమెంట్లో ఎవరినైనా అగౌరవపరచాలనే ఆలోచన తనకు లేశ మాత్రమైనా లేదని చెప్పారు. ఏదైనా మాట అన్ పార్లమెంటరీగా అనిపిస్తే తొలగించేందుకు నిబంధనల ప్రకారం స్పీకర్‌కు అధికారముందని చౌదరి తెలిపారు. ఒకరి ప్రతీకార, అహంకార వైఖరికి తానెందుకు క్షమాపణ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్లో ప్రతిపక్షం గళం వినిపించకుండా చేసేందుకే బీజేపీ నేతలు పథకం ప్రకారం అనుచిత విధానాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు. తన సస్పెన్షన్‌ను తిరోగమన చర్యగా ఆయన అభివర్ణించారు. ఉరితీసిన తర్వాత విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో తనను ఉంచారంటూ వ్యాఖ్యానించారు. సస్పెన్షన్‌పై చట్టపరంగా ముందుకెళ్లేందుకు గల అవకాశాలను పరిశీలిస్తానన్నారు. అనుచిత ప్రవర్తన కారణంతో అధిర్ రంజన్ చౌదరిని గురువారం లోకసభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆయనపై సభా హక్కుల కమిటీ నివేదిక ఇచ్చేవరకు సస్పెన్షన్ కొనసాగనుంది. భారత్, ఇండియా ఒక్కటే అయినప్పుడు ప్రధాని మోదీ మాత్రం ప్రతిపక్ష ‘ఇండియా’కూటమి పేరును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదని ఆధిర్ రంజన్ చౌదరి అన్నారు. ‘అంత శక్తిమంతుడైన మోదీకి ఇండియా పదంతో వచ్చిన ఇబ్బందేమిటి? భారత్, ఇండియా రెండూ ఒక్కటేనని రాజ్యాంగం కూడా చెప్పింది. అయినా బీజేపీ నేతలు రెండింటి మధ్య తేడాలు చూపిస్తున్నారు’అని అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఘర్షణలకు మణిపూర్ పరిణామాలకు పోలిక లేదని, అక్కడ మానవీయ సంక్షోభం నెలకొని ఉందని చెప్పారు. మణిపూర్‌లో పరిస్థితులు దేశంపై ప్రభావం చూపుతున్నాయని కేంద్రం భావిస్తే పరిష్కరించేందుకు మరింతగా కృషి చేయాలని సూచించారు. -
రాహుల్ గాంధీ దరఖాస్తు చేసుకోవాల్సిందే!
ఢిల్లీ: జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే తీర్పుతో రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ అయ్యింది. ఇవాళ(సోమవారం) సభకు లోక్‌సభకు హాజరైన ఆయన హుషారుగా కనిపించారు కూడా. రేపు పార్లమెంట్లో అవిశ్వాసంపై చర్చ ఉండనుంది. మణిపూర్ అంశం కావడం.. పైగా అక్కడ ఆయన పర్యటించి ఉండడంతో.. వాస్తవాల ఆధారంగా కేంద్రాన్ని ఆయన నిలదీస్తారంటూ కాంగ్రెస్ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ మరో ఆసక్తికరమైన ఘటన జరిగింది. అనర్హత వేటు తర్వాత తుగ్లక్ లేన్‌లోని తన అధికారిక బంగ్లాను ఆయన ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు ఆయనకు అండగా నిలిచి.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. అయితే రాహుల్ మాత్రం నిబంధనలకు అనుగుణంగా బంగ్లా ఖాళీ చేసి అధికారులకు అప్పగించారు. ఆ తర్వాత 10 జన్‌పథ్ రోడ్‌లోని తల్లి సోనియా గాంధీ నివాసానికి మారిపోయారాయన. అయితే దానిని మరొకరికి ఇంకా కేటాయించలేదు. దీంతో ఇప్పుడు తన బంగ్లాను తానే చేజిక్కుంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారాయన. ఈ క్రమంలో.. ఇవాళ ఉదయం లోక్ సభ హౌసింగ్ కమిటీ ముందు ఈ అంశాన్ని లేవనెత్తారు కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి. రాహుల్ తరపున తాను దరఖాస్తు చేస్తానని చెప్పారు. అయితే నిబంధనల ప్రకారం అలా కుదరదని హౌజింగ్కమిటీ తేల్చి చెప్పింది. రాహుల్ గాంధీ స్వయంగా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో రేపు రాహుల్ గాంధీ తన బంగ్లాను తనకు కేటాయించాలని కోరే అవకాశం ఉంది. -
రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరించాలని ఆ పార్టీ నేత ఆధిర్ రంజన్ ఛౌధురి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పరువు నష్టం కేసులో కోర్టు తీర్పుతో రాహుల్‌ను లోక్‌సభకు అనర్హుడిగా ప్రకటించినంత వేగంగానే సభ్యత్వాన్ని కూడా తిరిగి పునరుద్ధరించాలని స్పీకర్ ఓం బిర్లాను కోరామన్నారు. ఇందుకు అవసరమైన పత్రాలను సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే శుక్రవారం రాత్రి అందజేశామని, శనివారం ఉదయం కూడా మరికొన్నిటిని ఆయనకు పంపించామని వివరించారు. సోమవారం లోక్‌సభ సమావేశం ప్రారంభమయ్యేటప్పటికి రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నామన్నారు. పరువు నష్టం కేసులో రాహుల్‌కు సూరత్ సెషన్స్ కోర్టు శిక్ష విధించిన 26 గంటల్లోనే ఆయన్ను ఎంపీగా అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్‌సభ నోటిఫికేషన్ ఇచ్చిందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ గుర్తు చేశారు. ఆ శిక్ష అన్యాయమంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పునకు కూడా 26 గంటలు గడిచాయన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో రాహుల్ పాల్గొంటారని ప్రభుత్వం భయపడుతోందా అని జైరాం రమేశ్ ప్రశ్నించారు. -
Adhir Ranjan Chowdhury: రాష్ట్రపతిని క్షమాపణలు కోరిన కాంగ్రెస్ నేత
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ లోక్‌సభాపక్షనేత అధిర్ రంజన్ చౌదరి ఆమెకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఈమేరకు రాష్ట్రపతికి లేఖ రాసి క్షమాపణలు కోరారు. పొరపాటుగా నోరుజారడం వల్లే ఆ పదం మాట్లాడినట్లు పేర్కొన్నారు. తన తప్పును క్షమిస్తారని ఆశిస్తున్నట్లు లేఖలో రాసుకొచ్చారు. పార్లమెంటులో గురువారం మాట్లాడుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును 'రాష్ట్రపత్ని' అని అన్నారు అధిర్ రంజన్ చౌదరి. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అధిర్ రంజన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, రాష్ట్రపతి అయిన గిరిజన బిడ్డను అవమానించేలా ఆయన మాట్లాడారని బీజేపీ నేతలు ఆందోళనకు దిగ్గారు. దీంతో సభలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చదవండి: ‘రాష్ట్రపతి కాదు.. రాష్ట్రపత్ని’.. కాంగ్రెస్ నేత కామెంట్లపై దద్దరిల్లిన లోక్‌సభ -
కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేతగా అధిర్ రంజన్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఉభయసభల్లో పార్టీ గళం వినిపించడానికి లోక్‌సభ, రాజ్యసభల నేతలను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ పునర్ నియమించారు. లోక్‌సభలో పార్టీ నేతగా అధిర్ రంజన్ చౌధురి, ఉపనేతగా గౌరవ్‌గొగోయ్, చీఫ్ విప్‌గా కె.సురేశ్, విప్‌లుగా రవ్నీత్ సింగ్ బిట్టు, మాణిక్కం ఠాగూర్, ఇంకా మనీష్ తివారి, శశిథరూర్‌లను నియమించారు. రాజ్యసభలో నేతగా మల్లికార్జున ఖర్గే, ఉపనేతగా ఆనంద శర్మ, చీఫ్ విప్‌గా జైరాం రమేశ్‌లను నియమించారు. ఇంకా సీనియర్ నేతలు అంబికా సోని, పి.చిదంబరం, దిగ్విజయ్ సింగ్, కేసీ వేణుగోపాల్లను నియమించారు. ఆయా నేతలు ఎప్పటికప్పుడు సమావేశమై సభల్లో లేవనెత్తాల్సిన అంశాలను చర్చించాలని సోనియా గాంధీ ఆదేశించారు. ఉభయసభల నేతలు సమావేశమైనప్పుడు మల్లికార్జున ఖర్గే సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. -
దేశాన్ని నలుగురు నడిపిస్తున్నారు: రాహుల్
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వంపై దాడిని కాంగ్రెస్ తీవ్రం చేసింది. ఈ చట్టాలతో దేశ ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని, ఇవి రైతుల వెన్నెముకను విరిచేస్తాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ దేశాన్ని నలుగురు వ్యక్తులే నడిపిస్తున్నారని, వారెవరో అందరికీ తెలుసని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో గురువారం బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. తన ప్రసంగంలో వ్యవసాయ చట్టాలను విమర్శించేందుకే ప్రాధాన్యతనిచ్చారు. ‘విపక్ష సభ్యులెవరూ వ్యవసాయ చట్టాల్లోని విషయాలపై, వాటి ఉద్దేశాలపై మాట్లాడలేదని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడు ఆ చట్టాల ఉద్దేశాలపై, అందులోని విషయాలపై నేను మాట్లాడుతాను. ఈ చట్టాల సాయంతో కార్పొరేట్లు భారీ మొత్తంలో ఆహార ధాన్యాలను కొనుగోలు చేసి, ఇష్టమొచ్చినంత కాలం నిల్వ చేసి, దేశ ఆహార భద్రతను నాశనం చేస్తారు. అదే ఆ చట్టాల ప్రధాన ఉద్దేశం’అని రాహుల్ విమర్శించారు. కుటుంబ నియంత్రణ ప్రచార నినాదమైన ‘మనం ఇద్దరం.. మనకు ఇద్దరు’స్ఫూర్తితో ఈ దేశాన్ని నలుగురు వ్యక్తులు మాత్రమే నడిపిస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కొత్త సాగు చట్టాలతో వ్యవసాయ మార్కెట్లు కనుమరుగవుతాయని, నిత్యావసర వస్తువుల చట్టం ప్రాధాన్యత కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆహార భద్రత వ్యవస్థను, గ్రామీణ ఆర్థిక రంగాన్ని కొత్త సాగు చట్టాలు నాశనం చేస్తాయి. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు రైతులు విశ్రమించబోరు’అన్నారు. ‘నిజమే.. ఈ చట్టాలు రైతులకు ఎంచుకునే అవకాశం ఇచ్చాయి. అవి ఆకలి, నిరుద్యోగం, ఆత్మహత్యలను ఎంచుకునే అవకాశం’అని మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు మాత్రమే ఉద్యమించడం లేదని, దేశమంతా వారి వెనుక ఉందని, ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కు తీసుకోక తప్పదని స్పష్టం చేశారు. ఉద్యమంలో 200 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, అయినా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. రైతుల మృతికి నివాళిగా కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ సభ్యులతో కలిసి సభలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ‘సాగు చట్టాలపై ప్రత్యేక చర్చ కావాలని కోరాం. ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకే, నిరసనగా, నేను ఈ రోజు రైతుల విషయంపైనే మాట్లాడుతాను’అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వ్యవసాయం కూడా బడ్జెట్లో భాగమేనని, అదీకాక, బడ్జెట్‌పై చర్చల్లో పాల్గొన్న సభ్యుడు సాధారణ అంశాలపై కూడా మాట్లాడవచ్చని నిబంధనల్లోనే ఉందని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి పేర్కొన్నారు. -
కాంగ్రెస్ పార్టీని వదిలిపోండి.
న్యూఢిల్లీ: సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ మాటలు కాంగ్రెస్ పార్టీలో మంటలు రేపుతున్నాయి. పార్టీకి పూర్వవైభవం రావాలంటే నాయకత్వ మార్పు అవసరమన్న సిబల్పై లోక్‌సభ కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిబల్‌కు అంత ప్రగతిశీల భావాలు ఉంటే కాంగ్రెస్ పార్టీని వీడి పోవచ్చని, లేదంటే వేరే పార్టీలో చేరవచ్చని సూచించారు. పార్టీలో ఉంటూ కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడుస్తున్నారని, విశ్వసనీయతను దెబ్బ తీస్తున్నారని విమర్శించారు. సోనియా గాంధీ, రాహూల్ గాంధీ సీనియర్లకు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే అవకాశం ఇచ్చారని, అయినప్పటికి బహిరంగంగా చెప్పటం మంచి సాంప్రదాయం కాదని హితవు పలికారు. సరైన వేదికపై తమ సూచనలు చెప్పే అవకాశం ఉన్నప్పటికీ పార్టీని ప్రజల్లో చులకన అయ్యేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. బిహార్ ఎన్నికల సమయంలో ఈ నాయకులు ఎక్కడ ఉన్నారని చౌదరి ప్రశ్నించారు. "అటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించడం పట్ల అంత తపన ఉంటే, వారు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. బిహార్ ఎన్నికల సందర్భంగా వారు పార్టీ గెలుపు కోసం పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారా" అని ఆయన అడిగారు. సోమవారం, కపిల్ సిబల్ ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కాంగ్రెస్ క్షీణించిందని, ఆత్మపరిశీలన చేసుకునే సమయం సైతం లేదని సొంత పార్టీపై విమర్శలు సంధించడం తెలిసిందే. (చదవండి: కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయ శక్తిగా గుర్తించడం లేదు) -
నూతన సీవీసీగా కొఠారి
న్యూఢిల్లీ: నూతన చీఫ్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా రాష్ట్రపతి కార్యదర్శి సంజయ్ కొఠారి నియామకం కానున్నారు. ఈమేరకు బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఏర్పా టు చేసిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. అలాగే ప్రస్తుతం సమాచార కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న బిమల్ జుల్కాను కేంద్ర సమాచార కమిషన్‌లో ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) గా ఎంపికచేశారు. వీరిద్దరూ ఐఏఎస్ అధికారులుగా పదవీవిరమణ పొందినవారే. వీరి నియామకాన్ని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌధరి వ్యతిరేకించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తర్వాత ఈ నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. -
ఇది రాజీవ్ ఫిరోజ్ ఖాన్ సర్కార్ కాదు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో కొనసాగుతున్న పౌరసత్వ సవరణ చట్ట(సీఏఏ) వ్యతిరేక నిరసనలపై, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సోమవారం నాటి లోక్‌సభ సమావేశాలు దద్ధరిల్లాయి. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే కాంగ్రెస్, డీఎంకే సభ్యులు సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నారీల వ్యతిరేక నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. బుల్లెట్లతో ప్రజల గొంతుకను అణచేయలేరని కాంగ్రెస్ సభ్యుడు ఆధిర్ రంజన్ చౌధరి వ్యాఖ్యానించారు. ‘మీరు నకిలీ హిందువులు’ అని అధికార పక్షాన్ని ఉద్దేశించి పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో సీఏఏ వ్యతిరేక నిరసనకారులను ఉద్దేశించి ‘ద్రోహులను కాల్చి చంపండి’ అని మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు మండిపడ్డారు. ‘మీ తూటాలెక్కడ?’ అని ప్రశ్నించారు. సప్లిమెంటరీ ప్రశ్నలకు జవాబిచ్చేందుకు ఠాకూర్ ప్రయత్నించిన ప్రతీసారి నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను ప్రారంభించేందుకు బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ లేచినపుడు.. ‘సిగ్గు పడు’ అని విపక్ష సభ్యులు గట్టిగా నినాదాలు చేశారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. ‘సీఏఏ నిరసనకారులు మీ ఇళ్లల్లోకి వచ్చి, మీ మహిళలపై అత్యాచారం చేస్తారు’ అని వర్మ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు వర్మ ప్రసంగం ప్రారంభించగానే.. నిరసనగా కాంగ్రెస్, డీఎంకే సహా విపక్ష పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం వర్మ మాట్లాడుతూ.. సీఏఏను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని, అది దేశ సమగ్రతకు సంబంధించిన విషయమని తేల్చిచెప్పారు. ‘ఇది రాజీవ్ ఫిరోజ్ ఖాన్ ప్రభుత్వం కాదు.. ఇది మోదీ ప్రభుత్వం’ అని ఇందిరా గాంధీ కుటుంబం ముస్లింలేనని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘షహీన్‌బాగ్ నిరసనలు సీఏఏను వ్యతిరేకిస్తూ చేస్తున్నవి కావు. అక్కడి నిరసనకారులు పాకిస్తాన్ జిందాబాద్ అని, కశ్మీర్‌ను, అస్సాంను భారత్ నుంచి విడగొట్టాలి అని అంటున్నారు’ అని వర్మ పేర్కొన్నారు. మానవత్వ సందేశం ఇచ్చిన రాముడికి కాంగ్రెస్ మతం రంగు పులిమిందని విమర్శించారు. ‘ఇప్పటికైనా ప్రతిపక్ష సభ్యులు జై శ్రీరాం అని నినదిస్తే వారి పాపాలు తొలగిపోతాయి’ అన్నారు. రాజ్యాంగం తొలి ప్రతుల నుంచి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడి చిత్రాలను కాంగ్రెస్ తొలగించిందని ఆయన ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ఆర్టికల్ 370 లాంటి సమస్యలను కాంగ్రెస్ పెంచి పోషించిందన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే అనధికార కాలనీల ప్రజలకు పక్కా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. వర్మ ప్రసంగంపై టీఎంసీ స్పందిస్తూ.. అది ఢిల్లీ ఎన్నికల ప్రచార ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేసింది. ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. జామియా మిలియా యూనివర్సిటీలో సీఏఏ నిరసనకారులను దారుణంగా కొట్టారని గుర్తు చేశారు. ఒక విద్యార్థిని తన కన్ను కూడా కోల్పోయిందన్నారు. ‘అమ్మాయిలను దారుణంగా కొట్టారు. పిల్లలపై తూటాలు ప్రయోగించారు. ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలోనూ... పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)లపై చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు సోమవారం రాజ్యసభ కార్యకలాపాలను అడ్డుకున్నారు. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విపక్ష సభ్యుల ఆందోళనలతో సభ పలుమార్లు వాయిదా పడింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండా బీజేపీ సభ్యుడు భూపేందర్ యాదవ్‌ను అడ్డుకున్నారు. సీఏఏ వ్యతిరేక నిరసనలపై కాల్పులు జరిపిన ఘటనలను కాంగ్రెస్, సీపీఎం, టీఎంసీ తదితర విపక్ష పార్టీల సభ్యులు తీవ్రంగా ఖండించారు. సభ్యులను శాంతపర్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో డెప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. -
పౌరసత్వ రగడ: మరో కశ్మీర్‌లా ఈశాన్యం!
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ తాజాగా ఆమోదించిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అస్సాంలో ఆందోళనలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గడిచిన వారం రోజులుగా అస్సాంతో పాటు ఈశాన్యంలో ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడి పరిస్థితులపై విపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రశాంతంగా ఉండే అస్సాంను బీజేపీ ప్రభుత్వం మరో కశ్మీర్‌గా మార్చుతోందని కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాదస్పద బిల్లుతో ఈశాన్య ప్రాంతమంతా రావణకాష్టంగా తయారైందని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పౌరసత్వ బిల్లుతో బెంగాల్ కూడా హింసాత్మకంగా మారిందని కేంద్రంపై విమర్శలు చేశారు. బెంగాల్లో పరిస్థితిని సాధారణ స్థితికి చేర్చేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి లేఖ రాసినట్లు రంజన్ తెలిపారు. పౌరసత్వ వివాదానికి కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరే కారణమని ఆరోపించారు. (ఇంటర్నెట్ నిలిపివేత) కాగా వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుతో ఈశాన్యంలో యుద్ధ వాతావరణం కనిపించింది. కర్ఫ్యూను సైతం లెక్కచేయకుండా రోడ్ల దిగ్బంధం, గృహ దహనాలు, దుకాణాల లూటీకి పాల్పడుతుండటంతో పోలీసులు లాఠీచార్జి, కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ఆరుగురు ఆందోళనకారులు మృతి చెందారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విద్యా, వాణిజ్య సంస్థలు పని చేయడంలేదు.రవాణా వ్యవస్థ స్తంభించింది. అధికారులు ముందు జాగ్రత్తగా త్రిపుర, అసోంలకు రైలు సర్వీసులను రద్దు చేశారు. విమాన సర్వీసులను సైతం పలు ప్రాంతాలకు రద్దు చేశారు. సైనికులు ఫ్లాగ్ మార్చ్ చేపడుతున్నారు. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు కొనసాగనున్నాయి. ఆందోళనల దృష్ట్యా అస్సాం, త్రిపుర వైపు వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ఇదివరకే వెల్లడించింది. ఆందోళనల కారణంగా ప్రయాణికులు పలు ప్రాంతాల్లో చిక్కుకు పోయారు. -
అధిర్ వ్యాఖ్యలపై రభస
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలను చొరబాటుదారులంటూ కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌధురి చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ స్తంభించింది. ఇలాంటి వాఖ్యలను సహించబోమని, అధిర్ వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ‘కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ చొరబాటుదారు. అందుకే ఆ పార్టీకి ఇతరులు కూడా చొరబాటుదారులు మాదిరిగానే కనిపిస్తున్నారు’అంటూ మండిపడింది. అధిర్ వ్యాఖ్యలపై సోమవారం లోక్‌సభలో అధికార ప్రతిపక్షం మధ్య వాదోపవాదాలు జరిగాయి. ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడేందుకు అధిర్ ప్రయత్నించగా చొరబాటుదారు అంటూ బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. ‘అవును. నేను చొరబాటుదారునే. మోదీ, అమిత్ షా, ఎల్కే అడ్వాణీ కూడా చొరబాటుదారులే’అంటూ అధిర్ బదులిచ్చారు. దీనిపై బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అధిర్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. క్షమాపణ చెప్పేందుకు సిద్ధమేనని తెలిపినా బీజేపీ సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు. సోమవారం రాజ్యసభ సమావేశమైన వెంటనే బీజేపీ సభ్యుడు భూపేందర్ యాదవ్ అధిర్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘ప్రధాని, హోం మంత్రిపై చొరబాటుదారులు వంటి మాటలను వాడే హక్కు ఏ పార్టీ నేతకైనా ఉందా? ఇది దేశ పార్లమెంటరీ ప్రజాసామ్యాన్ని కించపరచడం కాదా?’అని అన్నారు. అధిర్ వ్యాఖ్యలను సభ ఖండించాలని కోరారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. -
మోదీ.. ఓ మురికి కాలువ!
న్యూఢిల్లీ: లోక్‌సభలో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య సోమవారం మాటలయుద్ధం నడిచింది. కేంద్ర పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రి ప్రతాప్ చంద్ర సారంగి లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ అత్యంత అరుదైన రాజకీయ నేత అని, స్వామి వివేకానందుడి వంటివారని కితాబిచ్చారు. దీన్ని పలువురు కాంగ్రెస్ ఎంపీలు తప్పుపట్టారు. ఈ సందర్భంగా సహనం కోల్పోయిన కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరీ ప్రధాని మోదీని ‘మురికి కాలువ’గా అభివర్ణించారు. తుకడే తుకడే గ్యాంగ్‌లను సహించబోం.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి సారంగి లోక్‌సభలో మాట్లాడుతూ.. ‘నాటి యూపీఏ సర్కారు ప్రభుత్వ వైఫల్యానికి పర్యాయపదంగా మారింది. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి ఎంతలా సాగిలపడిపోయిందంటే ప్రధానిని కూడా యాక్సిడెంటల్ అని పిలిచేవారు’ అని మాజీ ప్రధాని మన్మోహన్‌ను ప్రస్తావించారు. ‘ఎవరైతే వందేమాతరం గేయాన్ని ఆలపించరో, వారికి భారత్‌లో ఉండే హక్కు ఉందా? దేశాన్ని ముక్కలుముక్కలుగా విభజించాలనుకునే తుకడే– తుకడే గ్యాంగ్‌లను సహించబోం. ప్రధాని మోదీని దూషించడం అంటే హిమాలయాలను తలతో ఢీకొట్టడమే. కొందరు ప్రతిపక్ష నేతలు పాకిస్తాన్‌లోని బాలాకోట్ ఉగ్రస్థావరాలపై చేసిన దాడులకు సాక్ష్యాలను అడుగుతున్నారు. ‘నీ తండ్రి ఇతనే’ అని తల్లి చెబితే అందుకు ఎవరైనా సాక్ష్యాలు చూపించమని అడుగుతారా?’ అని వ్యాఖ్యానించారు. ఇందిర ఎక్కడ.. మోదీ ఎక్కడ?: కాంగ్రెస్ మోదీ భజనలో తరించిన సారంగి అన్ని హద్దులు దాటేశారని కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత అధిర్ రంజన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘బీజేపీ ప్రభుత్వం ‘పొలిటికల్ ప్లాగరిజం సిండ్రోమ్’ అనే వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి ఉన్నవాళ్లు గత ప్రభుత్వం ఏమీ చేయలేదనీ, అన్నీ తామే చేశామని భ్రమపడుతుంటారు. హరిత విప్లవం(వ్యవసాయం), శ్వేత విప్లవం(పాల దిగుబడి పెంపు), టెక్నాలజీ విప్లవం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయి. ఓఎన్జీసీ, ఐవోసీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ, హాల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు మా హయాంలోనే ఏర్పడ్డాయి. చివరికి బీజేపీ ప్రభుత్వం పాక్‌పై ప్రయోగించిన క్షిపణులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తయారయ్యాయి. మన ప్రధాని పెద్ద సేల్స్‌మ్యాన్. మేం మా ఉత్పత్తులను సరిగ్గా మార్కెట్ చేసుకోలేకపోయాం. అందుకే సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయాం’’ అని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ జోక్యం చేసుకుంటూ..‘మేం ఇందిరానే ఇండియా.. ఇండియానే ఇందిర’ అనేంతగా దిగజారిపోలేదు అని విమర్శించారు. దీంతో సహనం కోల్పోయిన రంజన్ చౌదరి ‘గంగామాత ఎక్కడ? మురికికాలువ ఎక్కడ?’ అని వ్యాఖ్యానించి సభలో ఒక్కసారిగా దుమారం రేపారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఖండించారు. 125 కోట్ల మంది ప్రజలెన్నుకున్న ప్రధానిని కాంగ్రెస్ అవమానించిందనీ, ఈ అహంకారమే ఆ పార్టీని అంతం చేస్తుందని హెచ్చరించారు. దీంతో చివరికి అధిర్ స్పందిస్తూ..‘నాకు హిందీ మరీ అంత బాగా రాదు. భారీ గంగానది ఎక్కడ? మామూలు కాలువ ఎక్కడ?’ అని మాత్రమే నేను చెప్పబోయా. ఒకవేళ నా మాటలకు ప్రధాని నొచ్చు కుని ఉంటే క్షమాపణలు కోరుతున్నా’ అని వివరణ ఇచ్చారు. నవభారతాన్ని మీరే తీసుకోండి రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ పక్షనేత గులాంనబీ ఆజాద్ కేంద్ర ప్రభుత్వంపై సునిశిత విమర్శలు చేశారు. నవభారతంలో మనుషులు అడవిని చూసి కాకుండా తోటి మనుషుల్ని చూసి భయపడుతున్నారనీ, గాంధీజీ హంతకులను బీజేపీ ఎంపీ ప్రశంసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మోదీ నవభారతంలో చిన్నారులపై అత్యాచారాలు ఆమాంతం పెరిగాయి. నిరుద్యోగం ఆల్‌టైం గరిష్టానికి చేరింది. కాబట్టి మీ నవభారతాన్ని(బీజేపీ ఎన్నికల నినాదం) మీరే ఉంచుకోండి. ప్రేమ, ఆప్యాయతలకు నిలయమైన మా ఇండియాను మాకు తిరిగిచ్చేయండి’ అని వ్యాఖ్యానించారు. -
మోదీ ‘మురికి కాల్వ’ అంటూ.. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలు లోక్‌సభలో దుమారం రేపాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ- నరేంద్రమోదీ మధ్య పోలిక తెస్తూ.. ‘ఎక్కడ గంగామాత.. ఎక్కడ మురికి కాల్వ’ (కహా మా గంగా.. కహా గందీనాలీ) అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని మురికి కాల్వ అంటూ ఆయన వ్యాఖ్యానించడంతో బీజేపీ సభ్యులు భగ్గుమన్నారు. ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని అవమానిస్తారా అని విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ లక్ష్యంగా అధిర్ రంజన్ చౌదరి విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే, తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఆయన వివరణ ఇచ్చారు. నాలి అనే పదాన్ని తన ప్రసంగంలో ఎక్కడా ఉపయోగించలేదన్నారు. తనకు హిందీ సరిగ్గా రాదని, ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని, ప్రధానికి ఇబ్బంది కలిగి ఉంటే క్షమాపణలు కోరుతున్నా అని తెలిపారు. అసహనం నిండిన మీ నవభారతం మాకొద్దు! ద్వేషం, అసహనం నిండిన మీ నవభారతం తమకొద్దని... మీ దగ్గరే పెట్టుకోండని కేంద్రానికి రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా పెద్దలసభలో ఆయన ప్రసంగించారు. ప్రధాని చెబుతున్న సబ్కా సాథ్ సబ్ కా వికాస్ ఎక్కడా కనిపించడంలేదని మండిపడ్డారు. జార్ఖండ్‌లో మైనార్టీ యువకుడిపై దాడి ఘటనను ప్రస్తావించిన అజాద్... మూకదాడులకు ఆ రాష్ట్రం ఫ్యాక్టరీలా మారిందని ఫైర్ అయ్యారు. ఇదేనా న్యూ ఇండియా అంటూ కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రేమసామరస్యాలతో కూడిన పాత భారతదేశాన్ని తిరిగివ్వమని డిమాండ్ చేశారు. -
'కాస్త మర్యాదగా ఉండటం నేర్చుకోండి'
కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌధురికి వరుసగా మొట్టికాయలు తగులుతూనే ఉన్నాయి. కాస్త మర్యాదగా ఉండటం నేర్చుకోవాలని సుప్రీంకోర్టు ఆయనకు తలంటింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. గత నాలుగేళ్లుగా ఆయన ఉన్న ఇంట్లోంచి సామాన్లను గత వారం అధికారులు బయటకు తీసుకెళ్లిపోయారు. ఆయనను బంగ్లా ఖాళీ చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో అధికారులు గట్టిగా చేయి చేసుకోవాల్సి వచ్చింది. దీన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 'ఇంకా ఎవరైనా వచ్చి మీకు ఇల్లు ఖాళీ చేయాలని చెప్పాలా' అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ ప్రశ్నించారు. అంతకుముందు హైకోర్టుకు వెళ్లినా కూడా బంగ్లా ఖాళీ చేసి తీరాల్సిందేనని అక్కడ సైతం అధిర్ పిటిషన్‌ను తిరస్కరించారు. పశ్చిమబెంగాల్ నుంచి నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికై, గతంలో మంత్రిగా కూడా పనిచేసిన చౌధురి.. బంగ్లా ఖాళీ చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. సరిగ్గా ఏడాది క్రితం కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత అధిర్ రంజన్ చౌధురికి వేరే ఇల్లు కేటాయించారు. కానీ, ఉంటున్న బంగ్లాను ఖాళీ చేయడానికి ఆయన నిరాకరించారు. మరో మూడు ఇళ్లు చూపించినా ససేమిరా అన్నారు. దాంతో చివరకు చేసేదేమీ లేక.. అధికారులు బంగ్లాకు విద్యుత్, నీటి సరఫరాలను నిలిపివేశారు. ఆ తర్వాత ఆయన ఇంట్లోని సోఫా, టేబుళ్లు, కుర్చీలు, ఫొటోలు.. అన్నింటినీ అక్కడి నుంచి తరలించేశారు. దీంతో తన ఆత్మాభిమానం తీవ్రంగా దెబ్బతిందంటూ అధిర్ రంజన్ చౌధురి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు లేఖ రాశారు. ఏం చేసినా ఫలితం లేకుండా పోయింది.