న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని ప్రభుత్వం తక్షణమే పునరుద్ధరించాలని ఆ పార్టీ నేత ఆధిర్ రంజన్ ఛౌధురి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పరువు నష్టం కేసులో కోర్టు తీర్పుతో రాహుల్‌ను లోక్‌సభకు అనర్హుడిగా ప్రకటించినంత వేగంగానే సభ్యత్వాన్ని కూడా తిరిగి పునరుద్ధరించాలని స్పీకర్ ఓం బిర్లాను కోరామన్నారు. ఇందుకు అవసరమైన పత్రాలను సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే శుక్రవారం రాత్రి అందజేశామని, శనివారం ఉదయం కూడా మరికొన్నిటిని ఆయనకు పంపించామని వివరించారు.
సోమవారం లోక్‌సభ సమావేశం ప్రారంభమయ్యేటప్పటికి రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నామన్నారు. పరువు నష్టం కేసులో రాహుల్‌కు సూరత్ సెషన్స్ కోర్టు శిక్ష విధించిన 26 గంటల్లోనే ఆయన్ను ఎంపీగా అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్‌సభ నోటిఫికేషన్ ఇచ్చిందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ గుర్తు చేశారు. ఆ శిక్ష అన్యాయమంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పునకు కూడా 26 గంటలు గడిచాయన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో రాహుల్ పాల్గొంటారని ప్రభుత్వం భయపడుతోందా అని జైరాం రమేశ్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment