
న్యూఢిల్లీ: నూతన చీఫ్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా రాష్ట్రపతి కార్యదర్శి సంజయ్ కొఠారి నియామకం కానున్నారు. ఈమేరకు బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఏర్పా టు చేసిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. అలాగే ప్రస్తుతం సమాచార కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న బిమల్ జుల్కాను కేంద్ర సమాచార కమిషన్‌లో ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) గా ఎంపికచేశారు. వీరిద్దరూ ఐఏఎస్ అధికారులుగా పదవీవిరమణ పొందినవారే. వీరి నియామకాన్ని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌధరి వ్యతిరేకించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తర్వాత ఈ నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.