Chief Vigilance Commissioner
-
నూతన సీవీసీగా కొఠారి
న్యూఢిల్లీ: నూతన చీఫ్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా రాష్ట్రపతి కార్యదర్శి సంజయ్ కొఠారి నియామకం కానున్నారు. ఈమేరకు బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఏర్పా టు చేసిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. అలాగే ప్రస్తుతం సమాచార కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న బిమల్ జుల్కాను కేంద్ర సమాచార కమిషన్‌లో ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) గా ఎంపికచేశారు. వీరిద్దరూ ఐఏఎస్ అధికారులుగా పదవీవిరమణ పొందినవారే. వీరి నియామకాన్ని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌధరి వ్యతిరేకించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తర్వాత ఈ నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. -
సీవీసీ ఎంపికలో పారదర్శకత ఏది?
-
సీవీసీ ఎంపికలో పారదర్శకత ఏది?
కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: చీఫ్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ), విజిలెన్స్ కమిషనర్ల ఎంపిక ప్రక్రియులో పారదర్శకత కొరవడిందని సుప్రీంకోర్టు కేంద్రాన్ని వుందలించింది. పారదర్శకత లేకపోవడం వల్ల ఆశ్రితపక్షపాతం, బంధుప్రీతి పెరిగిపోతుందని కోర్టు చురక వేసింది. ఈ పోస్టులకు కేవలం బ్యూరోక్రాట్లనే ఎందుకు ఎంపిక చేస్తున్నారని నిలదీసింది. సావూన్యులకు ఎందుకు ఈ పోస్టులను ఇవ్వడం లేదని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. సీవీసీ పోస్టుకు సంబంధించి ప్రభుత్వం ప్రవుుఖంగా ప్రకటనలు ఇవ్వకుండా నియూవుకాలు చేపడుతోందని ఆరోపిస్తూ ఒక స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిల్‌ను గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయువుూర్తి జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. దేశంలో ప్రతిభావంతులకు కొదవ లేదని, ప్రజలు పారదర్శకతను కోరుకుంటున్నారని ధర్మాసనం అభిప్రాయుపడింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వుుకుల్ రోహత్గి వాదిస్తూ, నిబంధనల ప్రకారం సావూన్యులనుంచి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించలేదని, సీవీసీ, విజిలెన్స్ కమిషనర్ల ఎంపిక ప్రక్రియును పూర్తి చేయుడానికి ఒక నెల సవుయుం పడుతుందని తెలిపారు. అక్టోబర్ 9 లోగా స్పందన తెలపాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. -
మేము చెప్పే దాకా ఎవరినీ నియమించొద్దు
న్యూఢిల్లీ: విజిలెన్స్ ప్రధాన కమిషనర్, కమిషనర్ నియామకంలో పారదర్శకత లోపించిందని సుప్రీంకోర్టు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించినట్టు కనబడడం లేదని ఆక్షేపించింది. ఈ పోస్టుల ఎంపికలో పారదర్శకత హల్ మార్క్ వంటిదని పేర్కొంది. కేసు పెండింగ్ లో ఉండడంతో విజిలెన్స్ ప్రధాన కమిషనర్ నియామకంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు అటార్నీ జనరల్ తెలిపారు. అయితే తాము చెప్పే వరకు విజిలెన్స్ ప్రధాన కమిషనర్ పదవిలో ఎవరినీ నియమించొద్దని కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు నిర్ణయం తర్వాతే నియామం జరగాలని ఆదేశించింది.