మేము చెప్పే దాకా ఎవరినీ నియమించొద్దు
న్యూఢిల్లీ: విజిలెన్స్ ప్రధాన కమిషనర్, కమిషనర్ నియామకంలో పారదర్శకత లోపించిందని సుప్రీంకోర్టు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించినట్టు కనబడడం లేదని ఆక్షేపించింది. ఈ పోస్టుల ఎంపికలో పారదర్శకత హల్ మార్క్ వంటిదని పేర్కొంది.
కేసు పెండింగ్ లో ఉండడంతో విజిలెన్స్ ప్రధాన కమిషనర్ నియామకంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు అటార్నీ జనరల్ తెలిపారు. అయితే తాము చెప్పే వరకు విజిలెన్స్ ప్రధాన కమిషనర్ పదవిలో ఎవరినీ నియమించొద్దని కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు నిర్ణయం తర్వాతే నియామం జరగాలని ఆదేశించింది.