కోల్‌కతా: నీతి ఆయోగ్ సమావేశంలో తన మైక్‌ను ఆఫ్ చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు అబద్దమని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరీ ఆరోపించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
‘‘నీతి ఆయోగ్ సమావేశం గురించి సీఎం మమత చెసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం. ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులను మాట్లాడనివ్వకుండా అడ్డుకుంటారని మమత చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. సీఎంలను మాట్లాన్వికుండా చేస్తారని నేను నమ్మటం లేదు. మమత బెనర్జీకి అక్కడ ఏం జరుగుతుందో ముందే తెలుసు. ఆమె పక్కా స్క్రిప్ట్ ప్రకారమే నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లారు’’ అని అన్నారు.
మరోవైపు.. సీఎం మమత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించి.. నీతి ఆయోగ్ సమావేశంలో ఆమె పట్ల ప్రవర్తించిన తీరును తీవ్రంగా తప్పుపట్టింది. అయితే కాంగ్రెస్ స్పందనకు భిన్నంగా అధీర్ రంజన్ చౌదరీ విమర్శలు చేయటం గమనార్హం.
దీనికంటే ముందు పశ్చిమ బెంగాల్‌లో శాంతి భద్రలు క్షీణిస్తూ.. అరాచక పరిస్థితులు కొనసాగుతున్నాయని అధీర్ రంజన్ చౌదరీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్ శాంతి భద్రతల పునరుద్ధరించడానికి జోక్యం చేసుకోసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. కాగా, శనివారం ప్రధానిమోదీ అధ్యక్షత జరిగిన నీతి ఆయోగ్ సమాశానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరయ్యారు. అనంతరం తానను మాట్లాడనివ్వకుండా మైక్ ఆఫ్ చేశారని ఆమె ఆరోపలు చేశారు. తర్వాత ఆమె నీతి ఆయోగ్ భేటీ నుంచి వాకౌట్ చేశారు.
మరోపైపు.. లోక్‌సభ ఎన్నికల్లో అధీర్ రంజన్ చౌదరీ టీఎంసీ అభ్యర్థి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ చేతిలో ఓడిపోయారు. సీఎం మమత ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ అధీర్ రంజన్ ఆమెపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment