కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ పార్టీ మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గతంలో ఇండియా కూటమి నుంచి వైదొలిగిన టీఎంసీ.. బెంగాల్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బెంగాల్‌లో టీఎంసీతో పొత్తు.. సీట్ల సర్దుబాటుపై ఆశలు పెట్టుకుంది. ఒంటరిగా పోటీచేస్తామని అన్నట్లుగానే.. తాజాగా మొత్తం అభ్యర్థుల జాబితాను టీఎంసీ విడుదల చేయటం గమనార్హం.
టీఎంసీ అభ్యర్థులు ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ.. బీజేపీతో పోరాడాలని ఎప్పటినుంచో భావిస్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ టీఎంసీకి కౌంటర్ వేశారు. ‘పశ్చిమబెంగాల్‌లో టీఎంసీతో గౌరవప్రదమైన సీట్ల భాగస్వామ్య ఒప్పందం కలిగి ఉండాలని కాంగ్రెస్ పార్టీ పదేపదే ప్రకటిస్తూ వచ్చింది. అటువంటి ఒప్పందాన్ని చర్చల ద్వారానే ఖరారు చేయాలని.. ఏకపక్ష ప్రకటనల ద్వారా కాదని కాంగ్రెస్ ఎప్పుడూ చెబుతోంది. కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఇండియా కూటమిగి బీజేపీపై పోరాడాలని భావిస్తోంది’ అని జైరాం రమేష్ అన్నారు.
The Indian National Congress has repeatedly declared its desire to have a respectable seat-sharing agreement with the TMC in West Bengal. The Indian National Congress has always maintained that such an agreement has to be finalised through negotiations and not by unilateral…
— Jairam Ramesh (@Jairam_Ramesh) March 10, 2024
పీఎంవోకు సమాచారం...
టీఎంసీ ఎంపీ అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి విమర్శలు గుప్పించారు. ‘భారతదేశంలో ఆమె వంటి ఓ నేతను నమ్మవద్దని సీఎం మమతా బెనర్జీ ఈ రోజు నిరూపించారు. మమతా బెనర్జీ భయపడుతోంది. ఎందుకంటే ఇండియా కూటమిలో ఉంటే ప్రధాని మోదీ బాధపడతారు. ఆమె ఇండియా కూటమి నుంచి వైదొలిగిన సమయంలో పీఎంఓకు సమచారం ఇచ్చారు. తన(మమతా) వల్ల మోదీ బాధపడకూడదని.. బీజేపీ వ్యతిరేక కూటమిలో ఉండి పోరాటం చేయవద్దని ఆమె ఈ నిర్ణయం తీసుకుంది’ అని అధిర్ రంజన్ ఆరోపణలు చేశారు.
ఇక.. టీఎంసీ 9మంది సిట్టింగ్ ఎంపీలను పక్కనపెట్టడం గమనార్హం. అదే విధంగా ఎంపీ అభ్యర్థులుగా ఏడుగురు కొత్తవారికి అవకాశం కల్పించారు. ఇక.. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ ప్రాతినిధ్యం వహిసస్తున్న బహరాంపూర్ సెగ్మెంట్‌లో మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ను బరిలోకి దించింది టీఎంసీ. ఇక్కడ అధిర్ రంజన్ ఐదు సార్లు విజయం సాధించారు. ఇండియా కూటమిలో భాగంగా పశ్చిమ బెంగాల్ సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ మూడు సిట్లను డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో సిట్ల సర్దుబాటు సరిగా లేదని మమతా బెనర్జీ తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించటం గమనార్హం.
చదవండి: అభ్యర్థులను ప్రకటించిన టీఎంసీ.. బరిలో మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment