ఈవీఎం ట్యాంపరింగ్‌పై స్పందించిన ఈసీ | TMC claim on EVM tampering EVMs with BJP tag | Sakshi
Sakshi News home page

ఈవీఎం ట్యాంపరింగ్‌పై స్పందించిన ఈసీ

Published Sat, May 25 2024 11:42 AM | Last Updated on Sat, May 25 2024 2:33 PM

TMC claim on EVM tampering EVMs with BJP tag

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యలో శనివారం టీఎంసీ బీజేపీపై ఈవీఎం ట్యాంపరింగ్‌ ఆరోపణలు చేసింది. బెంగాల్‌ రఘునాథపూర్‌లోని బంకురాలో బీజేపీ ఈవీఎం ట్యాపరింగ్‌కు పాల్పడినట్లు టీఎంసీ మండిపడింది. దీనికి సంబంధించిన ఫోటోను ‘ఎక్స్’లో పోస్ట్‌ చేసింది. 

ఐదు ఈవీఎం మిషన్లకు బీజేపీ ట్యాగ్‌లు ఉండటం ఆ ఫోటో గమనించవచ్చు. ఈ వ్యవహరంలో బీజేపీపై వెంటనే కఠిన చర్యలు తీసు​కోవాలని సీఎం మమత నేతృత్వంలోని టీఎంసీ కేం‍ద్ర ఎన్నికల కమిషన్‌ను కోరింది.

 

‘‘బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగి చేసి రిగ్గింగ్‌కు పాల్పడుతోంది. ఈ రోజు రఘునాథ్‌పూర్‌లో ఐదు ఈవీఎంకు బీజేపీ ట్యాగ్‌లు ఉండటం మా దృష్టకి  వచ్చింది. ఎన్నికల సంఘం తక్షణ చర్యలు తీసుకోవాలి’’ అని టీఎంసీ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ ​చేసింది.

ఈవీఎంలు ట్యాంపరింగ్‌ చేయటం బీజేపీకి ఇది తొలిసారి కాదని టీఎంసీ విమర్శలు చేసింది. ఇప్పటివరకు జరిగిన పోలింగ్‌లో కూడా బీజేపీ ట్యాంపరింగ్‌కు పాల్పడిందని, ఒట్లర్లపై సైతం దాడి చేశారని సీఎం మమతా తీవ్ర విమర్శలు చేశారు.

స్పందించిన బెంగాల్‌ ఎన్నికల సంఘం:
టీఎంసీ ఆరోపణలపై  బెంగాల్‌ ఎన్నికల సంఘం స్పందించింది. ‘‘ పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలను పెట్టినప్పుడు కామన్‌ అడ్రస్‌ ట్యాగ్‌లను ఇస్తుంటాం. వాటిపై అభ్యర్థులు, వారి ఏజెంట్ల సంతకాలు తీసుకుంటాం. టీఎంసీ పేర్కొన్న కేంద్రాల్లో ఈవీఎం, వీవీప్యాట్లను పెట్టిన సమయంలో కేవలం బీజేపీ అభ్యర్థికి చెందిన ఏజెంట్‌ మాత్రమే అందుబాటులో ఉన్నారు.

 

.. అందుకే ఆ ఏజెంట్‌ సంతకం మాత్రమే తీసుకున్నాం. ఇక.. ఆ తర్వాత పోలింగ్‌ జరుగుతున్న సమయంలో మిగతా ఏజెంట్ల సంతకాలు కూడా వాటిపై పెట్టించాం. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ఏర్పాటు సమయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాం. ఈ ప్రక్రియనంతా వీడియో తీశాం. సీసీటీవీల్లోనూ రికార్డ్‌ అవుతుంది’’ అని ఈసీ స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement